Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్‌ఫార్మెన్స్‌కి పర్యాయపదం ఆమె! | Priyamani: Her Glamor, Performance In The Movie Role | Sakshi
Sakshi News home page

Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్‌ఫార్మెన్స్‌కి పర్యాయపదం ఆమె!

Published Sun, Mar 10 2024 8:44 AM | Last Updated on Sun, Mar 10 2024 8:44 AM

Priyamani: Her Glamor, Performance In The Movie Role - Sakshi

ఫండే, సినిమా

'ప్రస్తుతం కమ్‌బ్యాక్‌ హీరోయిన్స్‌ హవా నడుస్తోంది. ఆ లిస్ట్‌లో ప్రియమణి మస్ట్‌! గ్లామర్‌ అండ్‌ పెర్‌ఫార్మెన్స్‌కి పర్యాయపదం ఆమె! సినీప్రియులు.. వెబ్‌ వీక్షకులకు సుపరిచితురాలు. కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు వెబ్‌స్క్రీన్‌ మీదా షైనింగ్‌ స్టారే! ప్రియమణి పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి బ్రీఫ్‌గా..'

  • ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవన్‌ మణి అయ్యర్‌. అమె తండ్రి వాసుదేవన్‌ మణి అయ్యర్‌ .. బిజినెస్‌మేన్, తల్లి లతా మణి అయ్యర్‌.. జాతీయ స్థాయి మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి.
  • చదువుకునే రోజుల్లోనే ప్రియమణి పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ మోడల్‌గా మారింది. అలా ఆమె తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడింది. చిత్రసీమకు పరిచయం అయింది.
  • ఆమె కెరీర్‌ తమిళ చిత్రం ‘కంగలాల్‌ కైదు సెయి’ తో ప్రారంభమైనప్పటికీ, మొదట విడుదలైంది మాత్రం ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు సినిమానే.
  • ఆ తర్వాత ‘సత్యం’ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టింది. చేసిన సినిమాలన్నీ విజయవంతమవడంతో టైట్‌ స్కెడ్యూల్స్‌తో బిజీ అయిపోయింది.
  • ‘యమదొంగ’ , ‘శంభో శివ శంభో’, ‘రక్త చరిత్ర 2’,  ‘రగడ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే ‘క్షేత్రం’, ‘చారులత’ వంటి చిత్రాలతో నటిగా నిరూపించుకుంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో షారుఖ్‌ ఖాన్‌తో ఒక పాటలో నటించి బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.
  • కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకుంది. సినిమాల నుంచి కొన్నాళ్లు బ్రేక్‌ తీసుకుంది. తిరిగి రియాల్టీ షోస్, వెబ్‌ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైంది.
  • సెకండ్‌ ఇన్నింగ్స్‌లో దేశ వ్యాప్తంగా ఆమె ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచిన సిరీస్‌ ‘ద ఫ్యామిలీ మేన్‌’.
  • ఆమె నటించిన వెబ్‌ మూవీస్‌ ‘భామా కలాపం’, ‘భామా కలాపం 2’ రెండూ ఆహాలో స్ట్రీమింగ్‌లో ఉన్నాయి.

పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉండాలన్న ఆలోచన నాకు లేదు. భార్య వంటింటికే పరిమితమనే మనస్తత్వం నా భర్తకు లేదు. నన్ను చాలా సపోర్ట్‌ చేస్తారాయన! – ప్రియమణి.

ఇవి చదవండి: Sharmila Yadav: డ్రోన్‌ దీదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement