సాక్షి, హిమాయత్‌నగర్: సిటీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. మహిళల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఒకరోజు నేను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బంజారాహిల్స్ వస్తుండగా.. రోడ్డు పక్కన ఒక్క టాయ్‌లెట్ కూడా కనిపించలేదు. దీంతో నేను ఎంతో సఫరయ్యాను. నాలాగే చాలామంది మహిళలు టాయ్‌లెట్స్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మనకు ఒక అవకాశం వచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మహిళలను ప్రగతిపథంలో నడిపించే వారిని గుర్తించి, షీ టాయ్‌లెట్స్‌ని ఏర్పాటు చేసే వారికి ఓటు వేద్దాం. అదే విధంగా చెత్త గార్బేజ్ విషయంలో కూడా మార్పులు రావాలి. దీంతో సిటీని మరింత ఆకర్షణీయంగా తీర్చేదిద్దే వారిని మన ఓటు ద్వారా ఎన్నుకుందాం. – నందిని రాయ్, సినీనటి
చదవండి : బెస్ట్ సిటీగా మార్చుకుందాం: ఈషా రెబ్బ
ఓటర్లలో రావాలి చైతన్యం..
ఓటుహక్కు అన్నది బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా, దొరక్కపోయినా లీడర్స్‌కి మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడం. ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్‌లో ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్‌వాటర్‌ని ఎక్కువగా తోడేస్తున్నాం.. అంతేకాదు.. భారీ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టడం, ఎక్కడ చూసినా సిమెంటు రోడ్లు వేసేస్తున్నాం.. హైదరాబాద్‌లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనిపై ముఖ్యంగా ప్రజల్లో అవగాహన ఉండాలి.. చైతన్యం రావాలి. – అడివి శేష్
Comments
Please login to add a commentAdd a comment