సాక్షి, బెంగళూరు: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ దర్యాప్తుపై సీపీ దయానంద కీలక విషయాలు వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు నటులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అలాగే, అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఎఫ్ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు.
కాగా, సీపీ దయానంద మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు రేవ్ పార్టీ కేసును ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ చేయడం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. రేవ్ పార్టీలో 150 మంది పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపుల్స్ స్వీకరించాము. ఎఫ్ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాము. డ్రగ్స్ కొనుగోలుపై ప్రత్యేక చట్టల ద్వారా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాము.
బెంగళూరు రేవ్ పార్టీలో ఇద్దరు నటులు దొరికారు. ఇద్దరు నటుల రక్త నమునాలు తీసుకున్నాము. ఈ ఈవెంట్‌లో రాజకీయ ప్రముఖులెవరూ పాల్గొనలేదు. పోలీసులు వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. డ్రగ్స్ తెచ్చిన పెడ్లర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నారు. ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment