టీవీక్షణం: అసలు సిసలు ఆటగాడు!
సెలెబ్రిటీలు పాల్గొనే ఏ కార్యక్రమం అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక వాళ్లు సినిమాల్లో మాదిరి స్టంట్స్ చేస్తూ, సాహసాన్ని ప్రదర్శిస్తుంటే చూడటం మరీ మజాగా ఉంటుంది. ‘ఖత్రోంకే ఖిలాడీ’ సక్సెస్ కావడానికి కారణం అదే. ఈ ప్రోగ్రామ్ ఐదో సిరీస్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రముఖ మోడల్, నటుడు రజనీష్ దుగ్గల్ విజేతగా నిలిచాడు.
2003లో మిస్టర్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న రజనీష్... రేమండ్, కిట్‌క్యాట్, మాంటెకార్లో, వేగనార్, యమహా, వీడియోకాన్, క్లినిక్ ఆల్‌క్లియర్ లాంటి ఉత్పత్తులకు మోడల్‌గా చేసి, ‘1920’ చిత్రంతో నటుడిగానూ పరిచయమయ్యాడు. ఇప్పుడీ షోలో విజేత కావడంతో మరింత ఫేమస్ అయిపోయాడు. ఇందులో గెలిచినందుకుగాను ఒక కారు, పాతిక లక్షల రూపాయలను గెలుచుకున్నాడు రజనీష్. గురుమీత్ చౌదరి, సల్మాన్ లాంటి బలమైన పోటీదారులను వెనక్కి నెట్టి గెలుపొందాలంటే చాలా స్టామినా ఉండాలి. అది ఉంది కాబట్టే రజనీష్ విజయం సాధించాడు. అసలు సిసలు అటగాడిగా నిరూపించుకుటన్నాడు!