నాతో సినిమా చేసేందుకు ఆ స్టార్‌ హీరోయిన్‌ ఒప్పుకోలేదు: హీరో | Rajneesh Duggal: Priyanka Chopra Refused to Share Screen Space With Me | Sakshi
Sakshi News home page

రెండున్నర నెలల కష్టం.. ఆ హీరోయిన్‌ వద్దనగానే నిర్దాక్షిణ్యంగా తీసేశారు: హీరో

Published Sun, May 26 2024 6:04 PM | Last Updated on Sun, May 26 2024 6:13 PM

Rajneesh Duggal: Priyanka Chopra Refused to Share Screen Space With Me

మోడలింగ్‌ నుంచి సినిమా రంగంలోకి వచ్చినవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా ఉన్నారు. రజనీశ్‌ దుగ్గల్‌ ఇదే కోవలోకి వస్తాడు. మిస్టర్‌ ఇండియా, మిస్టర్‌ ఇంటర్నేషనల్‌ టైటిల్స్‌ గెలుచుకున్న ఇతడు 1920 హారర్‌ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. నిజానికి దీని కంటే ముందు అతడికి యాకీన్‌ (2005) సినిమా ఆఫర్‌ వచ్చిందట! అయితే తనతో నటించేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా అస్సలు ఒప్పుకోలేదంటున్నాడు రజనీష్‌. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

మూడు సినిమాలకు సంతకం
రజనీష్‌ మాట్లాడుతూ.. 'యాకీన్‌ సినిమా కోసం ఫస్ట్‌ నన్నే హీరోగా అనుకున్నారు. ఆ ప్రాజెక్టుకు సంతకం కూడా చేశాను. ఆ చిత్రం కోసం కసరత్తులు కూడా మొదలుపెట్టాను. డైరెక్టర్‌ గిరీశ్‌ ధమిజ దగ్గర ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాను. పైగా వాళ్లు ఒకేసారి నాతో మూడు సినిమాలకు సంతకం చేయించుకున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఉన్న సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. నన్ను జుహులోని ఓ పెంట్‌హౌస్‌లో ఉంచారు. ఒక కారు, డ్రైవర్‌ను ఇచ్చారు. ఒక్క ఫోన్‌ చేస్తే నాకు గదిలోకి ఫుడ్‌ తీసుకొచ్చేవాళ్లు. 

సడన్‌గా ఫోన్‌ చేసి..
దాదాపు రెండున్నర నెలలపాటు ట్రైనింగ్‌ తీసుకున్నాను. కేవలం సినిమా కోసం బ్రాండ్‌ ప్రమోషన్స్‌, యాడ్స్‌లో కనిపించడం కూడా మానేశాను. సడన్‌గా ఒక రోజు రాత్రి నిర్మాత సుజిత్‌ కుమార్‌ ఫోన్‌ చేసి తన ఆఫీస్‌కు రమ్మన్నారు. ప్రియాంక ఎంత పెద్ద హీరోయినో తెలుసు కదా.. తనకు ఆల్‌రెడీ చాలా డబ్బు ఇచ్చేశాం. కానీ ఆమె కొత్త వ్యక్తితో పని చేయనంటోంది అన్నాడు. అప్పుడు నాకేమనిపించిందంటే.. నాకోసం అంత ఖర్చు పెట్టారు కాబట్టి హీరోయిన్‌ను మారిస్తే అయిపోతుందిగా అనుకున్నాను.

నాతో సినిమా చేయనంది
అప్పుడు సినిమా బిజినెస్‌ గురించి నాకంత అవగాహన లేదు. ప్రియాంక నాతో సినిమా చేయనందని చెప్పారు.. నాకు తెలిసి మాత్రం తన మేనేజర్‌ లేదా ఆమె చుట్టుపక్కల ఉన్నవారు ఈ మాట చెప్పించారనిపించింది. ఆమెను తప్పు పట్టడం లేదు కానీ నేను సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు తను చేయగలడు, తనతో నటించడానికి నాకే అభ్యంతరమూ లేదు అని చెప్పి ఉంటే బాగుండేది' అని రజనీష్‌ అభిప్రాయపడ్డాడు.

చదవండి: ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్‌? సితార ఫన్నీ ఆన్సర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement