Rajneesh Duggal
-
నాతో సినిమా చేసేందుకు ఆ స్టార్ హీరోయిన్ ఒప్పుకోలేదు: హీరో
మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి వచ్చినవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా ఉన్నారు. రజనీశ్ దుగ్గల్ ఇదే కోవలోకి వస్తాడు. మిస్టర్ ఇండియా, మిస్టర్ ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలుచుకున్న ఇతడు 1920 హారర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. నిజానికి దీని కంటే ముందు అతడికి యాకీన్ (2005) సినిమా ఆఫర్ వచ్చిందట! అయితే తనతో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అస్సలు ఒప్పుకోలేదంటున్నాడు రజనీష్. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.మూడు సినిమాలకు సంతకంరజనీష్ మాట్లాడుతూ.. 'యాకీన్ సినిమా కోసం ఫస్ట్ నన్నే హీరోగా అనుకున్నారు. ఆ ప్రాజెక్టుకు సంతకం కూడా చేశాను. ఆ చిత్రం కోసం కసరత్తులు కూడా మొదలుపెట్టాను. డైరెక్టర్ గిరీశ్ ధమిజ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. పైగా వాళ్లు ఒకేసారి నాతో మూడు సినిమాలకు సంతకం చేయించుకున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా ఉన్న సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. నన్ను జుహులోని ఓ పెంట్‌హౌస్‌లో ఉంచారు. ఒక కారు, డ్రైవర్‌ను ఇచ్చారు. ఒక్క ఫోన్ చేస్తే నాకు గదిలోకి ఫుడ్ తీసుకొచ్చేవాళ్లు. సడన్‌గా ఫోన్ చేసి..దాదాపు రెండున్నర నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్నాను. కేవలం సినిమా కోసం బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్‌లో కనిపించడం కూడా మానేశాను. సడన్‌గా ఒక రోజు రాత్రి నిర్మాత సుజిత్ కుమార్ ఫోన్ చేసి తన ఆఫీస్‌కు రమ్మన్నారు. ప్రియాంక ఎంత పెద్ద హీరోయినో తెలుసు కదా.. తనకు ఆల్రెడీ చాలా డబ్బు ఇచ్చేశాం. కానీ ఆమె కొత్త వ్యక్తితో పని చేయనంటోంది అన్నాడు. అప్పుడు నాకేమనిపించిందంటే.. నాకోసం అంత ఖర్చు పెట్టారు కాబట్టి హీరోయిన్ను మారిస్తే అయిపోతుందిగా అనుకున్నాను.నాతో సినిమా చేయనందిఅప్పుడు సినిమా బిజినెస్ గురించి నాకంత అవగాహన లేదు. ప్రియాంక నాతో సినిమా చేయనందని చెప్పారు.. నాకు తెలిసి మాత్రం తన మేనేజర్ లేదా ఆమె చుట్టుపక్కల ఉన్నవారు ఈ మాట చెప్పించారనిపించింది. ఆమెను తప్పు పట్టడం లేదు కానీ నేను సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు తను చేయగలడు, తనతో నటించడానికి నాకే అభ్యంతరమూ లేదు అని చెప్పి ఉంటే బాగుండేది' అని రజనీష్ అభిప్రాయపడ్డాడు.చదవండి: ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్ -
టీవీక్షణం: అసలు సిసలు ఆటగాడు!
సెలెబ్రిటీలు పాల్గొనే ఏ కార్యక్రమం అయినా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక వాళ్లు సినిమాల్లో మాదిరి స్టంట్స్ చేస్తూ, సాహసాన్ని ప్రదర్శిస్తుంటే చూడటం మరీ మజాగా ఉంటుంది. ‘ఖత్రోంకే ఖిలాడీ’ సక్సెస్ కావడానికి కారణం అదే. ఈ ప్రోగ్రామ్ ఐదో సిరీస్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రముఖ మోడల్, నటుడు రజనీష్ దుగ్గల్ విజేతగా నిలిచాడు. 2003లో మిస్టర్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న రజనీష్... రేమండ్, కిట్‌క్యాట్, మాంటెకార్లో, వేగనార్, యమహా, వీడియోకాన్, క్లినిక్ ఆల్‌క్లియర్ లాంటి ఉత్పత్తులకు మోడల్‌గా చేసి, ‘1920’ చిత్రంతో నటుడిగానూ పరిచయమయ్యాడు. ఇప్పుడీ షోలో విజేత కావడంతో మరింత ఫేమస్ అయిపోయాడు. ఇందులో గెలిచినందుకుగాను ఒక కారు, పాతిక లక్షల రూపాయలను గెలుచుకున్నాడు రజనీష్. గురుమీత్ చౌదరి, సల్మాన్ లాంటి బలమైన పోటీదారులను వెనక్కి నెట్టి గెలుపొందాలంటే చాలా స్టామినా ఉండాలి. అది ఉంది కాబట్టే రజనీష్ విజయం సాధించాడు. అసలు సిసలు అటగాడిగా నిరూపించుకుటన్నాడు!