
ముంబై: హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే లాజిస్టిక్స్ సంస్థ క్రౌన్ వరల్డ్‌వైడ్ గ్రూప్ భారత్‌లో 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 223 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ఈ విషయం వెల్లడించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ సర్వీసులను అందించేందుకు డిజిటల్ సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు క్రౌన్ పేర్కొంది. 1996లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన క్రౌన్‌కు హైదరాబాద్ సహా చెన్నై, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ తదితర 11 నగరాల్లో కార్యాలయాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment