సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఆదివారం కేబినెట్ మీటింగ్ జరిగింది. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ కేబినెట్.. 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం, 500 గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు, టీఎస్‌ను టీజీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ఉద్యోగ పోస్టులకు మరో 160 అదనపు పోస్టులు కలిపి రీ-నోటిఫికేషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
- ఈ నెల 8 తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం
- గవర్నర్ స్పీచ్కు ఆమోదం తెలిపాం
- పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలను ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రారంభిస్తాం
- కులగణన చేయాలని కేబినెట్ నిర్ణయించింది
- తెలంగాణ తల్లి అంటే ఓక వ్యక్తి గుర్తుంచ్చేలా చేసారు.. మేము తెలంగాణ తల్లిలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించాం
- ఇక నుంచి అన్ని రకాల వ్యవహారాలు టీఎస్‌కు బదులుగా టీజీగా జరుగుతాయి
- జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం మారుస్తూ కేబినెట్ ఆమోదం
- రాష్ట్ర చిహ్నం రాచరిక పాలనకు ప్రతీకగా ఉండొద్దని.. రాష్ట్ర చిహ్నం మార్చాలని కేబినెట్ నిర్ణయించింది
Comments
Please login to add a commentAdd a comment