చంద్రబాబు కేబినెట్‌ తొలి భేటీ ముహూర్తం ఖరారు | AP Latest News: Chandrababu First Cabinet Meeting Date Fixed | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కేబినెట్‌ తొలి భేటీ ముహూర్తం ఖరారు

Published Wed, Jun 19 2024 12:28 PM | Last Updated on Wed, Jun 19 2024 1:08 PM

AP Latest News: Chandrababu Cabinet First Meeting Date Fixed

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కొలువు దీరిన కొత్త మంత్రి వర్గ తొలి సమావేశానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీన ఉదయం సచివాలయం మొదటి బ్లాకులో  సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. కేబినెట్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇక కొత్త మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరిస్తూ వస్తున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన శాసన సభ సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్‌-డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక కోసం 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. బుధవారం శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.

ఇదీ చదవండి: డిప్యూటీ సీఎంగా పవన్‌, తొలి సంతకం దేని మీద అంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement