
సాక్షి, అమరావతి: సచివాలయంలో మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా తల్లికి వందనం, కొత్త ఇసుక, ఎక్సైజ్ పాలసీకి సంబంధించి నూతన విధానాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపైనా చర్చిస్తారని తెలిసింది.
ఉదయం 10:45 గంటలకు సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో సచివాలయానికి చేరుకుంటారు. 11 గంటలకు మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3:45 గంటలకు సచివాలయం నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళ్తారు.