ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు | Key decisions in AP Cabinet Meeting | Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

Published Fri, Dec 15 2023 4:34 PM | Last Updated on Fri, Dec 15 2023 6:54 PM

Key decisions in AP Cabinet Meeting - Sakshi

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్‌..  పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

సామాజిక పెన్షన్‌ను రూ. 2,750 నుంచి రూ. 3,000 పెంపునకు ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఏపీ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు.  వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంపునకు ఆమోదం తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం తెలిపారు. జనవరిలో వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత పథకాల అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌  ఇచ్చారు.

  • సామాజిక పెన్షన్‌లను రూ. 2,750 నుంచి రూ. 3,000 వేలకు పెంపునకు కేబినెట్‌ ఆమోదం
  • ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కెబినెట్ నిర్ణయం
  • 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు
  • ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ
  • విశాఖలో లైట్‌మెట్రో రేల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం
  • వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగామన కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశం
  • ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బున్న వాళ్లను జల్లెడ వేసి పట్టాం
  • ఆరోగ్యశ్రీ అవగాహన.. ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు
  • ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణ ఖర్చుల కింద రూ. 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.
  • ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరీ చేస్తాం.
  • వైద్యారోగ్య రంగంలో వివిధ స్ఖాయిల్లో పోస్టుల భర్తికీ కెబినెట్ ఆమోదం
  • ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు నిర్ణయం.
  • శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స
  • జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్‌ ఆమోదం
  • కుల, ఆదాయ ధ్రువీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్‌ ఆమోదం
  • కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు గ్రామ సచివాలయంలో పొందవచ్చు
  • 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ
  • కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్‌ చెల్లింపు
  • యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌లో పనిచేసే టీమ్స్‌కు 15శాతం అలవెన్స్‌ పెంపు
  • 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది రిజిస్ట్రేషన్‌
  • ఆడుదాం ఆంధ్రా బ్రాండ్‌ అంబాసిడర్‌గా అంబటి రాయుడు
  • కేబినెట్‌ సబ్‌కమిటీ, స్టీరింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ఆమోదం
  • పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా  8వ తరగతి విద్యార్థులకు  ట్యాబుల పంపిణీ
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  టూల్ కూడా పంపిణీ  జరుగుతుంది.
  • జనవరి 10 నుంచి 23  వరకు మహిళలకు  ఆసరా  నాలుగో విడత  కార్యక్రమానికి కేబినెట్  ఆమోదం.
  • జనవరి చివరి నుంచి  చేయూత కార్యక్రమం ఉంటుంది.
  • 45 నుంచి 60 ఏళ్లలోపు  ఉన్న మహిళలకు ఆర్ధిక  సహాయం చేయడానికి  కేబినెట్ ఆమోదం  
  • ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు కెబినెట్ నిర్ణయం
  • ఇకపై ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం మెరిటైం బోర్డు పరిధిలోకి తెస్తూ కెబినెట్ నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement