అమరావతి, సాక్షి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. మంగళవారం సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా చర్చించినట్లు సమాచారం.
నేటి మంత్రి మండలి భేటీలో కొత్త ఇసుక విధానానికి అమోదం తెలిపిన కేబినెట్.. ఇసుక పాలసీ విధివిధానాల రూపకల్పనపై మాత్రం ఎటూ తేల్చలేకపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. పౌర సరఫరాల శాఖ ద్వారా 2 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇక.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, అలాగే సీఎం చంద్రబాబు ఇటీవల ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చించాలనే కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment