సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు.
ముందుగా సీఎంగా సెక్రటేరియట్‌లో బాధ్యతలను రేవంత్‌రెడ్డి స్వీకరించారు. సీఎంగా సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయన ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సచివాలయం లోపల రేవంత్‌కు వేదపండితులు స్వాగతం పలికారు
కాగా, గురువారం మధ్యాహ్నం.. తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ సీఎంగా ఆరు గ్యారంటీల తొలిఫైల్‌పై రేవంత్ సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై సీఎం అందజేశారు.
ఇదీ చదవండి: సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment