నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ | Telangana State Cabinet Meeting on December 16 | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

Published Mon, Dec 16 2024 5:35 AM | Last Updated on Mon, Dec 16 2024 5:35 AM

Telangana State Cabinet Meeting on December 16

ఆర్‌ఓఆర్, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులపై చర్చ 

రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశంకానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో... కొత్త రెవెన్యూ చట్టం ‘రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌)’బిల్లు, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం ఈ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.

 ఇక రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి విధివిధానాలను మంత్రివర్గం ఖరారు చేయనుంది. వీటిపై శాసనసభలో చర్చ నిర్వహించనుంది. మరోవైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌ కమిషన్‌ సమరి్పంచిన విచారణ నివేదికను సైతం కేబినెట్‌ పరిశీలించి శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించనుంది. ‘ఫార్ములా–ఈ’రేసింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్‌ అనుమతించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

సీఎంతో మంత్రి పొంగులేటి భేటీ.. 
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఆర్‌ఓఆర్‌ బిల్లు తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఇక ధరణిపై ఏర్పాటైన కమిటీ సభ్యులు కోదండరెడ్డి, ప్రొఫెసర్‌ సునీల్‌ ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలసి బిల్లులోని అంశాలను వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement