![India China border dispute on PM Modi calls for all-party meeting on June 19 - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/18/all.jpg.webp?itok=x7XbJU--)
చైనా ఆర్మీ దాడిలో కల్నల్ సహా 20 మంది భారతీయ సైనికులు మరణించడం, తదనంతర పరిణామాలపై సమాచారం పంచుకునేందుకు ప్రధాని శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఆ భేటీలో విపక్ష, మిత్రపక్ష నేతలకు వివరించనున్నారు. ‘చైనా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని చర్చించేందుకు జూన్ 19 సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమవనున్నారు’ అని పీఎంఓ ట్వీట్ చేసింది. గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దు వివాదానికి సంబంధించి దేశమంతా ప్రభుత్వం వెనుక ఉందని, ఘర్షణలకు సంబంధించిన అన్ని వాస్తవాలను వెల్లడించాలని రాహుల్ గాంధీ బుధవారం డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment