ప్రధాని రాజీనామా వార్తలు నిరాధారం | Manmohan Singh to address media on January 3, PMO rules out he's quitting | Sakshi
Sakshi News home page

ప్రధాని రాజీనామా వార్తలు నిరాధారం

Published Tue, Dec 31 2013 10:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

ప్రధాని రాజీనామా వార్తలు నిరాధారం

ప్రధాని రాజీనామా వార్తలు నిరాధారం

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ రాజీనామా చేశారని వచ్చిన వార్తలు నిరాధారామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మరోవైపు మూడోసారి ప్రధాని పదవి రేసులో తను లేనని ప్రకటించేందుకు మన్మోహన్‌ సింగ్‌ కొత్త ఏడాది, వచ్చేనెల 3వతేదీ ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలిసింది. 2014 ఎన్నికలకు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ప్రధాని మార్గం సుగమం చేస్తారు. అటు జనవరి 17న ఏఐసీసీ సమావేశాలు జరగనుండటంతో ప్రధాని అభ్యర్ధిని ప్రకటించాలనే డిమాండ్‌ ఊపందుకుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం కూడా కాంగ్రెస్‌ తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇంజనీర్‌ అంకమ్మరావు కథ సుఖాంతమైయ్యింది. ఈ తెల్లవారుజామున... నాలుగు గంటలకు బోడో తీవ్రవాదులు ఆయన్ని విడుదల చేశారు. తాను క్షేమంగా వున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పారు అంకమ్మరావు. ఈ నెల 22న అసోంలోని ఆమ్‌గురిలో అంకమ్మరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన అంకమ్మరావు అస్సోంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అంకమ్మరావు విడుదలతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement