
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంతత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ విద్యుత్ సరఫరా సంస్థ షాక్ ఇచ్చింది. ఇస్లామాబాద్‌లోని పీఎంవో కార్యాలయానికి సంబంధించి పేరుకుపోయిన విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే వెంటనే కరెంట్ సరఫరా నిలిపేస్తామని హెచ్చరించింది. పీఎంవో సెక్రటేరియెట్‌కు ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ (ఇస్కో) ఈ మేరకు నోటీసులిచ్చింది. పీఎంవో కార్యాలయం రూ.41 లక్షల బిల్లు చెల్లించకుండా బకాయి పడిందని.. అంతేగాక గత నెలలో చెల్లించాల్సిన రూ.35 లక్షల బకాయిలు అలానే ఉన్నాయని పేర్కొంది. అక్కడ వరుసగా రెండు నెలల కరెంట్ బిల్లులు చెల్లించని పక్షంలో హెచ్చరికలు జారీ చేసి విద్యుత్ సరఫరా నిలిపేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment