ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం | Minor fire reported at PMO, fire tenders rushed | Sakshi
Sakshi News home page

ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం

Apr 29 2014 8:15 AM | Updated on Sep 2 2017 6:42 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. దాంతో ఆరుఅగ్నిమాపక శకటాలు హుటాహుటిన పీఎంఓకు చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి.

 

ఆ ఘటనపై సమాచారం అందుకున్న న్యూఢిల్లీ నగర ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులంతా అగమేఘాల మీద సౌత్ బ్లాక్లోని పీఎంఓకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి వచ్చాయిని.... అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పీఎంఓ అగ్నిప్రమాదంపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement