South Block
-
రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ కార్యదర్శిగా నియమితులైన రాజేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ సౌత్ బ్లాకులో శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కేరళ కేడర్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆర్కే సింగ్ ఈ ఏడాది ఆగస్టు 20న రక్షణశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో)గా బాధ్యతలు చేపట్టారు. కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ఆర్కే సింగ్ నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించారు. ‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర జవానుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్‌ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’అని రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు. అంతకు ముందు, ఆయన 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. కాగా రక్షణ కార్యదర్శిగా గురువారం పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమానే స్థానంలో ఆ పదవిని ఆర్కే సింగ్ చేపట్టారు. -
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రైతుల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని వ్యాఖ్యానించింది. మానవతా దృక్పథంతో స్పందించాలని సుప్రీంకోర్టు సూచించింది. రైతుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది. కాగా దాదాపు నెల రోజులుగా కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. తమ డిమాండ్ల కోసం ఆందోళన జరుపుతున్న అన్నదాతలు కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు ప్రతిరోజూ వినూత్నరీతిలో ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. రుణమాఫీపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రైతులు గురువారం అరగుండ్లుతో నిరసన తెలిపారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించిన రైతులు నిన్న ఒంటిపై రాతలతో తమ నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. -
ప్రధాని కార్యాలయం ఎదుట నగ్నంగా ఆందోళన!
వినూత్న ఆందోళనలతో హోరెత్తిస్తున్న తమిళ రైతులు న్యూఢిల్లీ: తమ గోడును కేంద్రానికి వినిపించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. తాజాగా రైతులు సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. పీఎంవో సహా కీలక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండే సౌత్‌బ్లాక్ ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దాదాపు నెలరోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు వినూత్నరీతిలో అన్నదాతలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం
-
ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. దాంతో ఆరుఅగ్నిమాపక శకటాలు హుటాహుటిన పీఎంఓకు చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. ఆ ఘటనపై సమాచారం అందుకున్న న్యూఢిల్లీ నగర ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులంతా అగమేఘాల మీద సౌత్ బ్లాక్‌లోని పీఎంఓకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి వచ్చాయిని.... అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పీఎంఓ అగ్నిప్రమాదంపై మరింత సమాచారం అందవలసి ఉంది.