మోదీ ఆఫీసుకు మూడో తరగతి విద్యార్థి లేఖ | Boy mails PMO on incomplete bridge delaying drive to school | Sakshi
Sakshi News home page

మోదీ ఆఫీసుకు మూడో తరగతి విద్యార్థి లేఖ

Published Wed, Oct 14 2015 9:57 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీ ఆఫీసుకు మూడో తరగతి విద్యార్థి లేఖ - Sakshi

మోదీ ఆఫీసుకు మూడో తరగతి విద్యార్థి లేఖ

అక్కడ ఓ ఫ్లైఓవర్ పనులు చాలాకాలంగా సా...గుతున్నాయి. అటు వైపు రాకపోకలు సాగడం లేదు. ఈ సమస్యతో చాలా కాలంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎవరూ ఏమీ చేయలేదు. మూడో తరగతి చదువుతున్న అభినవ్ (8) అనే కుర్రాడికి ఇది ఇబ్బందిగా అనిపించింది. దాంతో వెంటనే బెంగళూరు వాయవ్య ప్రాంతంలో ఉన్న ఈ సమస్య గురించి, అక్కడి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రధానమంత్రి కార్యాలయానికి వెంటనే ఒక లేఖ రాశాడు.

అతడి ఇంటి నుంచి యశ్వంత్పూర్లో ఉన్న స్కూలుకు 3 కిలోమీటర్ల దూరమే అయినా, వెళ్లడానికి 45 నిమిషాలు పడుతోంది. అక్కడ రైల్వేక్రాసింగ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఈ విషయాన్ని అతడు తన ఈమెయిల్లో వివరంగా రాశాడు. ఈ ఫ్లై ఓవర్ పనులు ఆగిపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తన చదువు కూడా దెబ్బతింటోందని అతడు ఆ లేఖలో రాశాడు. దాంతో ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే రైల్వేశాఖకు ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సూచించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement