‘షరతుల విరాళాలను అనుమతించలేం’ | PMO rejects conditional donation of Rs one lakh for poorest man | Sakshi
Sakshi News home page

‘షరతుల విరాళాలను అనుమతించలేం’

Published Mon, Aug 15 2016 7:28 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

PMO rejects conditional donation of Rs one lakh for poorest man

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి సహాయ నిధికి వచ్చే విరాళాల్లో షరతులను అనుమతించలేమని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఓ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాథూర్‌కు ఇచ్చిన జవాబులో పీఎంవో ఈ విషయాన్ని తెలిపింది. ఢిల్లీకి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త దీప్‌చంద్ర శర్మ గతేడాదిలో పీఎంవోకి రూ.లక్ష చెక్కుని విరాళంగా ఇచ్చారు.

తాను పంపిన రూ.లక్ష చెక్కుని దేశంలోనే అత్యంత పేదవాడికి ఇవ్వాలని లేని పక్షంలో తనకే ఆ చెక్కుని తిరిగి ఇవ్వాలని కోరాడు. తన చెక్కుని ఎవరికి ఉపయోగించారో తెలపాలని కోరుతూ ఆయన గత జూన్‌లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. దీనిపై స్పందించిన పీఎంవో ప్రధానమంత్రి సహాయనిధికి వచ్చే విరాళాల్లో షరతులను అనుమతించరంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement