‘షరతుల విరాళాలను అనుమతించలేం’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి సహాయ నిధికి వచ్చే విరాళాల్లో షరతులను అనుమతించలేమని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఓ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాథూర్కు ఇచ్చిన జవాబులో పీఎంవో ఈ విషయాన్ని తెలిపింది. ఢిల్లీకి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త దీప్చంద్ర శర్మ గతేడాదిలో పీఎంవోకి రూ.లక్ష చెక్కుని విరాళంగా ఇచ్చారు.
తాను పంపిన రూ.లక్ష చెక్కుని దేశంలోనే అత్యంత పేదవాడికి ఇవ్వాలని లేని పక్షంలో తనకే ఆ చెక్కుని తిరిగి ఇవ్వాలని కోరాడు. తన చెక్కుని ఎవరికి ఉపయోగించారో తెలపాలని కోరుతూ ఆయన గత జూన్లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. దీనిపై స్పందించిన పీఎంవో ప్రధానమంత్రి సహాయనిధికి వచ్చే విరాళాల్లో షరతులను అనుమతించరంది.