జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) సిబ్బంది, అధికారులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) సిబ్బంది, అధికారులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఒక రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి అప్పగించాలని సిబ్బంది, అధికారులు నిర్ణయించినట్టు పీఎంవో గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరు దశాబ్దాల కాలంలో ఎన్నడూ కనివినీ ఎరుగనిరీతిలో జమ్మూకాశ్మీర్‌ను వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకూ 215 మంది మృత్యువాతపడగా.. లక్షలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.