నాలుగేళ్ల క్రితమే ఊహించారు! | Four years ago, predicted! | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల క్రితమే ఊహించారు!

Published Thu, Sep 11 2014 1:51 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

నాలుగేళ్ల క్రితమే ఊహించారు! - Sakshi

నాలుగేళ్ల క్రితమే ఊహించారు!

శ్రీనగర్: కాశ్మీర్‌ను వణికిస్తున్న ఈ వరద బీభత్సాన్ని నాలుగేళ్ల క్రితమే ఆ రాష్ట్ర ‘వరద నియంత్రణ విభాగం’ అంచనా వేసిందని గ్రేటర్ కాశ్మీర్ అనే స్థానిక ఇంగ్లీష్ దినపత్రిక బుధవారం వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి భారీ వరద ముప్పు ఉందని, ఆ వరదల్లో శ్రీనగర్- జమ్మూ హైవే కొట్టుకుపోతుందని, కాశ్మీర్ లోయకు సంబంధాలు తెగిపోతాయని ఆ విభాగం ఒక నివేదికలో హెచ్చరించింది. ఆ నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు పంపించింది. దాంతోపాటు రాష్ట్రంలో వరదల్ని ఎదుర్కొనేలా మౌలిక వసతులఅభివృద్ధి కోసం రూ. 2200 కోట్ల ప్రాజెక్టు ప్రతిపాదనలనూ పంపించింది.వాతావరణ మార్పుల వల్లనే: వాతావరణ మార్పు వల్లనే కాశ్మీర్ వరదల వంటి ఉత్పాతాలు చోటు చేసుకుంటున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ పేర్కొంది.

తెలుగువారిని రక్షించండి

 న్యూఢిల్లీ: కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారికి తగిన సహాయం అందించడంతో పాటు, అక్కడ నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై బుధవారం ఢిల్లీలో ప్రధాని కార్యాలయ వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్‌ను కలుసుకున్నట్టు కంభంపాటి చెప్పారు. వరదల్లో చిక్కుకున్న 60 మంది తెలుగు విద్యార్థులను కాపాడాలని జమ్ము కాశ్మీర్ అధికారులకు ఫోన్‌లో విజ్ఞప్తి చేసామన్నారు. బాధితుల సమాచారాన్ని తెలిపేం దుకు ఏపీభవన్‌లో 011-23384188 నంబర్‌తో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement