నరేంద్ర మోడీ చూస్తున్నాడు జాగ్రత్త!!
ప్రధానమంత్రి కాగానే నరేంద్ర మోడీ సోషల్ మీడియాపై దృష్టి పెట్టారు. మంత్రులందరూ ట్విట్టర్, ఫేస్ బుక్ లను వాడాలని ఆయన ఆదేశించారు. అంతే కాదు. సామాన్యులకు అర్థం అయ్యేలా హిందీని వాడాలని చెప్పారు.
మరో అడుగు ముందుకేసి ప్రతి 8 గంటలకు ఒక సారి సోషల్ మీడియా పోకడలపై రిపోర్టులు ఇవ్వాలని తన కార్యాలయ సిబ్బందిని ఆయన అదేశించారు. దీని కోసం 20 మందితో ఒక టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ ఏ మంత్రులు ఏం ట్వీట్ చేశారు, ఫేస్ బుక్ లో ఏం అప్ లోడ్ చేశారు, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఏం ట్రెండ్ అవుతున్నాయి వంటి అంశాలపై విశ్లేషణలు అందించాలని మోడీ ఆదేశించారు. దీని ద్వారా ప్రజల ఆలోచన, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుంటుంది.
దీంతో తన సిబ్బందిలో ఎవరేం చేస్తున్నారో నరేంద్ర మోడీ, మంత్రివర్గ సహచరులు ఏం చేస్తున్నారో మోడీ తెలుసుకుంటారు. తన కొత్త ఎంపీలకు కూడా సోషల్ మీడియా విషయంలో ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పేందుకు ఒక వర్క్ షాప్ ను త్వరలో మోడీ నిర్వహించబోతున్నారు.