పాత పెద్ద నోట్ల రద్దుపై ఏ అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారో సమాచారం లేదని పీఎంవో తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు.. ఏ అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారో సమాచారం లేదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ‘ఈ కార్యాలయం రికార్డుల్లో దరఖాస్తుదారు అడిగిన సమాచారం లేదు’ అని పేర్కొంది.
పెద్ద నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న ఆకస్మికంగా చేసిన ప్రకటనకు ముందు కేంద్ర ఆర్థికమంత్రి, అలాగే ప్రధాన ఆర్థిక సలహాదారు అభిప్రాయాలు తీసుకున్నారా? అన్న ప్రశ్నకు జవాబిచ్చేందుకు కూడా పీఎంవో నిరాకరించింది. ఆర్టీఐ చట్టంలోని ‘సమాచారం’ నిర్వచన పరిధిలోకి ఈ ప్రశ్నలు రావని పేర్కొంది.