rti act
-
కామెంట్లు చేయడం వాళ్లకో ఫ్యాషన్ అయ్యింది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: జడ్జీల నియామకాల విషయంలో తాము ఎంతో పారదర్శకంగా ఉన్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించుకుంది. న్యాయమూర్తుల నియామక వ్యవస్థ పట్టాలు తప్పకూడదు. అందుకోసం ఉన్న న్యాయమూర్తుల కొలీజియం అత్యంత పారదర్శకంగా పని చేస్తోంది. దానిని అలా పని చేయనివ్వండి అంటూ శుక్రవారం ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పని చేస్తున్న వ్యవస్థను(కొలీజియంను ఉద్దేశించి) నిర్వీర్యం చేయవద్దు. దాని పనిని దాన్ని చేయనివ్వండి. మాది అత్యంత పారదర్శకమైన సంస్థ. కొలీజియం మాజీ సభ్యులకు.. నిర్ణయాలపై కామెంట్లు చేయడం ఓ ఫ్యాషన్‌గా మారింది అంటూ జస్టిస్ షా, జస్టిస్ రవికుమార్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు కొలీజియం వివాదాస్పద-2018 సమావేశం వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరుతూ.. ప్రముఖ కార్యకర్త అంజలి భరద్వాజ్ దాఖలు చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. సమావేశం అజెండా, తీర్మానం తదితర వివరాల కోసం ఆమె జులైలో కోర్టులో అప్పీల్ పిటిషన్ వేయగా.. కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. శుక్రవారం వాదనల సందర్భంగా.. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ‘కొలీజియం నిర్ణయాలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయా? తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు లేదా?’ అని బెంచ్‌ను కోరారు. ‘‘ఆర్టీఐ ప్రాథమిక హక్కు అని కోర్టు స్వయంగా చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వెనక్కి తగ్గింది. ప్రధాన న్యాయమూర్తి- ప్రభుత్వం మధ్య జరిగే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది’’ అని ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. దీంతో కలుగుజేసుకున్న జస్టిస్ షా.. ఆ కొలీజియం సమావేశంలో ఎలాంటి తీర్మానం ఆమోదించలేదు. మాజీ సభ్యులు చేసిన దేనిపైనా మేము వ్యాఖ్యానించదలచుకోలేదు. కొలీజియం మాజీ సభ్యులు.. ఇక్కడి నిర్ణయాలపై వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది. మేం చాలా పాదదర్శకంగా పని చేస్తున్నాం. ఎందులోనూ మేము వెనక్కి తగ్గడం లేదు. పలు మౌఖిక నిర్ణయాలు తీసుకున్నాం అంటూ.. ఈ పిటిషన్‌పై ఆదేశాలను రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం 2018, డిసెంబర్ 12వ తేదీ నిర్వహించిన సమావేశం వివరాలను ఆర్టీఐ ద్వారా కోరుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అంజలి భరద్వాజ్. అంతకు ముందు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్(CIC) ద్వారా ఆమె చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో.. ఆమె సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ ఆటోబయోగ్రఫీ ‘జస్టిస్ ఫర్ ది జడ్జి’లో.. డిసెంబర్ 2018 సమావేశం గురించి ఆసక్తికర ప్రస్తావన ఉంది. ఆ సమావేశంలో ఆనాడు రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ రాజేంద్ర మీనన్‌లను.. సుప్రీం కోర్టు జడ్జిలుగా ప్రతిపాదించాలని నిర్ణయించింది కొలీజియం. అయితే.. వాళ్ల నియామకాలకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కడంతో.. జనవరి 10వ తేదీ 2109లో కొత్త కొలీజియం వాళ్లిద్దరి పేర్లను ఆమోదించలేదు. ఈ విషయాన్నే ప్రముఖంగా తన పిటిషన్లో ప్రస్తావించారు అంజలి భరద్వాజ్. ఇదీ చదవండి: మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. -
RTI Act: సామాన్యుడి వజ్రాయుధం
ఎన్నో ఏళ్ళ ఉద్యమాల ఫలితంగా 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం భారత్‌లో అమలులోకి వచ్చింది. ప్రభుత్వాలు ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండటానికీ, పౌరులకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికీ ఈ చట్టం రూపొందింది. తెలంగాణ సమాచార కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2017 సెప్టెంబర్ 9న వేరయింది. ఈ సమయంలో బదిలీ అయిన పిటీషన్లు 6,825 కలుపుకొని... తెలంగాణ రాష్ట్రంలో దాఖలైన మొత్తం దరఖాస్తులు 38,000. అందులో ఇప్పటివరకూ 32,000 పరిష్కారం అయ్యాయి. పెండింగ్‌లో ఉన్నవి కేవలం 6,000 మాత్రమే. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు కూడా కొంతకాలం టెలిఫోన్ ద్వారా కేసులు విచారించి, పరిష్కరించిన చరిత్ర మన కమిషన్‌ది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక బోర్డు ఏర్పాటై ఉంటుంది. దాని మీద ప్రజా సమాచార అధికారి ఫోన్ నంబర్ ఉంటుంది. తమకు కావలసిన సమాచారం కోసం ఆ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి 10 రూపాయలు చెల్లించి లేక తెల్ల రేషన్ కార్డు ఉంటే ఒక జిరాక్స్ పెట్టి సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేసుకుంటే చాలు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అయితే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మండల స్థాయిలో రూ. 5, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలలో రూ. 10 రుసుం చెల్లించాలి. (క్లిక్ చేయండి: జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?) మీరు దరఖాస్తు చేసుకున్న నాటినుంచి సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో అందులో కోరిన సమాచారం ఇవ్వాలి. 8, 9 సెక్షన్ల కింద మినహాయింపు పొందిన సమాచారం తప్ప... మిగతా సమా చారాన్ని ఇవ్వాలి. సమాచారాన్ని నిరాకరిస్తే మొదటి అప్పిలేట్ అధికారికి సెక్షన్ 19 (1) కింద దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ కూడా సమాచారం నిరాకరిస్తే సెక్షన్ 19 (3), సెక్షన్ 18(1) కింద సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మొత్తం మీద సమాచార హక్కు చట్టాన్ని సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగా చెప్పవచ్చు. – డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్, తెలంగాణ సమాచార కమిషనర్ (అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు) -
పంజాబ్ ‘ఫ్యామిలీమ్యాన్’... వెలికి తీశాడు భారీ స్కాం
వెబ్‌డెస్క్ :ఇండియన్ జేమ్స్‌బాండ్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ తరహాలో ఇటీవల ఫ్యామిలీమ్యాన్ వెబ్‌సిరీస్ పేరు తెచ్చుకుంది. అందులో హీరో సామాన్యుడిలా కనిపిస్తూనే చిన్న చిన్న క్లూల సాయంతో ఉగ్రవాదుల కుట్రలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ దేశ భద్రతకు భరోసాగా ఉంటాడు. అచ్చంగా ఫ్యామిలీమ్యాన్ తరమాలోనే కోట్ల రూపాయల స్కామ్‌ని వెలుగులోకి తెచ్చాడు పంజాబ్‌కి ఓ సామాన్య ఎల్ఐసీ ఏజెంట్. ఎక్కడో పంజాబ్‌లో ఉంటూ ఇంకెక్కడో ఉన్న హరిద్వార్‌లో జరిగిన ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కాంని చాకచక్యంగా వెలికి తీశాడు. కేవలం ఒక ఫోన్ మేసేజ్ ఆధారంగా కోట్ల రూపాయల కుంభకోణం గుట్టురట్టు చేశారు. ఎస్సెమ్మెస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న హరిద్వార్ కుంభమేళా ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కామ్‌ను బయటపెట్టింది ఓ సాధారణ ఎల్ఐసీ ఏజెంట్. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో విపన్ మిట్టల్ ఓ సాధారణ ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. 2021 ఏప్రిల్ 22న అతని ఫోన్‌కి ఓ మేసేజ్ వచ్చింది. అందులో ‘ మీ కరోనా నిర్థారణ పరీక్షా ఫలితాలు నెగటివ్‌గా వచ్చాయి’ అంటూ సందేశం ఉంది. అయితే కరోనా పరీక్షలకు శాంపిల్స్ ఇవ్వకుండానే ఫలితాలు రావడమేంటని ఆశ్యర్యపోయాడు విపన్ మిట్టల్. వెళ్లవయ్యా.. వెళ్లూ... ఎక్కడో, ఏదో జరుగుతోందని అనుమానించిన విపన్ వెంటనే కలెక్టర్ కార్యాలయం చేరుకుని తనకు జరిగిన అనుభవం చెప్పాడు. అయితే కలెక్టరేట్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా విపన్ని కసిరారు. విషయాన్ని అక్కడితో వదిలేయకుండా తన ఫోన్‌కి మేసేజ్ రావడం, తాను టెస్ట్ చేయించుకోకపోవడం తదితర విషయాలన్నీ పూస గుచ్చినట్టు వివరిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐపీఎంఆర్)కి ఈ మెయిల చేశాడు. తగు చర్యలు తీసుకుంటామంటూ అక్కడి నుంచి రిప్లై వచ్చినా... వాస్తవంలో ఏం జరగలేదు. పట్టువదలక తనకు కావాల్సిన సమాచారం ఎంతకీ రాకపోవడంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఆర్టీఐ చట్టం కింద విపన్ మిట్టల్ దరఖాస్తు చేశాడు . అందులో హరిద్వార్‌లో విపన్కి కరోనా నిర్థారణ పరీక్షలు జరిపినట్టు తేలింది. ఫరీద్‌కోట్‌లో ఉన్న వ్యక్తికి హరిద్వార్‌లో కరోనా టెస్ట్ నిర్వహించినట్టు రిజల్ట్ రావడం ఏంటీ ? .. అసలేం జరిగిందనే ప్రశ్నలు ప్రభుత్వ అధికారులకు తలెత్తాయి...... చివరకు ఫేక్ కరోనా టెస్ట్ స్కాం వెలుగు చూసింది. హరిద్వార్ ఆరోగ్యశాఖ అధికారులు కుంభమేళ సందర్భంగా నాలుగు లక్షల టెస్టులు చేయగా... అందులో లక్ష వరకు ఫేక్ అని తేలుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫ్యామిలీమ్యాన్ ఎక్కడ? ఇండియాలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కాం ని వెలికి తీసిన విపన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది తెలియనివ్వడం లేదు అధికారులు. విపన్ భద్రత దృష్ట్యా అతని వివరాలు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. -
స.హ.చట్టం.. అధికారులే అడ్డుగోడలు..
సాక్షి, సిరికొండ: పాలనలో పారదర్శకతకు బాటలేయాలి.. అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించాలి.. అవినీతిని కాగడపెట్టి తరిమేయాలి.. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పరిరక్షించాలి.. అనే సంకల్పంతో అమలులోకి వచ్చిన ఏకైక చట్టం సమాచార హక్కు చట్టం. కానీ దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో స.హ చట్టం అమలుకోసం ఏర్పడిన సమాచార కమిషన్ సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానాలు విధిస్తున్నా తీరు మారడం లేదు. సాధారణ సమాచారం అయితే ఇస్తున్నారు కానీ అవినీతి గల సమాచారం లోపాలు గల సమాచారం ఇవ్వడం లేదు. స.హ చట్టం దరఖాస్తుదారుడు తమకు శత్రువైనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పాలన పారదర్శకత కొరవడి ప్రజలకు న్యాయం జరగడం లేదనేది నగ్నసత్యం. చదవండి: (నిఘా నీరసిస్తే ‘సమాచారం’ సమాధే!) ఉమ్మడి జిల్లాలో రూ.68,500 జరిమానా.. సమాచారం తెలుసుకోవడం పౌరుల హక్కు, కానీ స.హ.చట్టం కింద రుసుములు చెల్లించి సమాచారం అడిగే వారికి సెక్షన్ 7(1) ప్రకారం నిర్ణీత గడువులో సమాచారం ఇవ్వడం లేదు. మొదటి అప్పీలు చేసిన స్పందన లేకపోవడంతో సమాచార కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. సదరు అధికారులకు కమిషన్ నోటీసులు పంపించి విచారించి దురుద్దేశ్యపూర్వకంగా సమాచారం ఇవ్వకపోతే జరిమానాలు విధిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి గత ఎనిమిదేండ్లలో 1131అప్పీళ్లు, 773ఫిర్యాదులు అందగా.. 983అప్పీళ్లు, 599 ఫిర్యాదులు పరిష్కరించి 20మంది అధికారులకు రూ. 68,500 జరిమానాలు విధించారు. మున్సిపాల్టీలు, విద్యాశాఖ, నిజామాబాద్ నగరపాలక సంస్థ, జిల్లా పంచాయతీ కార్యాలయాలకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వస్తున్న సమాచారం ఇవ్వడం లేదు. అధికారులే అడ్డుగోడలు.. స.హ.చట్టం సెక్షన్7(1) ప్రకారం 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం కోసం అధికారులు కుంటిసాకులు వెతుక్కుంటున్నారు. అవగాహన లేమితో సహాయ నిరాకరణ చేస్తున్నారు. తమ కార్యాలయంలో సమాచారం లేకపోతే సెక్షన్ 6(3) కింద ఆ దరఖాస్తును 5రోజుల్లో సమాచారం గల కార్యాలయానికి పంపాలి. కాని తీరిగ్గా 30 రోజుల తరువాత దరఖాస్తును బదిలీ చేస్తున్నారు. మరికొందరు ప్రజా సమాచార అధికారులకు దరఖాస్తు చేస్తే ఇది సెక్షన్ 2(ఊ) ప్రకారం సమాచారం కిందకు రాదని దరఖాస్తును తిరిగి పంపిస్తున్నారు. సదరు జిల్లా పంచాయతీ అధికారులు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. మరికొందరు అధికారులు సమాచారం కావాలంటే అధిక మొత్తంలో రుసుములు కట్టాలని ఆదేశిస్తున్నారు. కొందరు అధికారులు సమాచారం కోసం దరఖాస్తు చేస్తే నెలలు గడుస్తున్న సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. మరికొందరు అధికారులు ఒక అడుగు ముందుకేసి మొదటి అప్పీలు వేసిన తరువాత రుసుములు కట్టమని అడుగుతున్నారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 4(1) బి ప్రకారం 17అంశాల సమాచారం ప్రతి ఏడాది అప్డేట్ చేసి ఉంచాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో స.హ.చట్టం అమలు తీరు నామమాత్రంగా మారింది. ప్రభుత్వ కమిటీలు ఎక్కడ?.. ఉమ్మడి జిల్లా పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమాచార కమిషన్ ఆదేశాల మేరకు ఉత్తర్వు నెంబరు 1185 అనుసరించి ప్రభుత్వ అధికారులు, ఇద్దరు ఉద్యమకారులతో కలిసి స.హ. చట్టం అమలు కోసం ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేయాలి. కానీ నూతన జిల్లాలు ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కమిటీలను ఏర్పాటు చేయలేదు. నిజామాబాద్ జిల్లాలో కమిటీ కాలపరిమితి 2014 నవంబర్‌లో ముగిసిన ఇంతవరకు కొత్త కమిటీ ఏర్పడలేదు. -
ఎన్నో సందేశాలు–కొన్ని సందేహాలు
న్యాయ పాలనలో పారదర్శకత న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగకరమేమి కాదని రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్య కీలకం. పలువురు భావిస్తున్నట్టు ఈ తీర్పు ద్వారా భారత ప్రధానన్యాయమూర్తి/కార్యాలయాన్ని సమాచార హక్కు చట్ట పరిధిలోకి కొత్తగా తీసుకురాలేదు. ఆర్టీఐ–2005 చట్టంలో ఉన్న విషయాన్నే సందేహాలకు అతీతంగా ధర్మాసనం ఇప్పుడు ధ్రువీకరించింది. ఈ దేశంలో గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలు, తాము సమాచార హక్కు చట్ట పరిధిలోకి రామని భీష్మించుకొని వివాదం సృష్టించాయి. ఇన్నాళ్లూ సుప్రీం సీజే కార్యాలయం చేసినట్టే! తాము ప్రజాసంస్థలు (పీఏ) కామని, అందుకే ఆర్టీఐ పరిధిలోకి రాబోమని కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ(ఎం)లు బదు లిచ్చాయి. బీజేపీ, బహుజన సమాజ్ పార్టీలు మొదట స్పందించనే లేదు. తమ సిద్థాంత వైరుధ్యాలకతీతంగా అన్ని పార్టీలూ ఒక్కటయ్యాయి. ఒక తీర్పు.... అనేక సందేశాలు. కొండొకచో సందేహాలు! తనకే సంబంధించి దాదాపు పదేళ్లుగా నలుగుతున్న ఓ వివాదాన్ని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చింది. పారదర్శకత–న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తి పరస్పర విరుద్ధాంశాలు కావని, రెండూ చెయ్యిచెయ్యి జోడించి సాగాల్సిందేనని తేటతెల్లం చేసింది. న్యాయ పాలనలో పారదర్శకత న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగకర మేమి కాదని రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్య కీలకం. పలువురు భావిస్తున్నట్టు ఈ తీర్పు ద్వారా భారత ప్రధానన్యాయమూర్తి/కార్యా లయాన్ని సమాచార హక్కు చట్ట పరిధిలోకి కొత్తగా తీసుకురాలేదు. ఆర్టీఐ–2005 చట్టంలో ఉన్న విషయాన్నే సందేహాలకతీతంగా ధర్మా సనం ఇప్పుడు ధ్రువీకరించింది. ఈ వివాదంపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, అదే కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం లోగడ వెలువరించిన తీర్పులను సమర్థిస్తూ, దాన్ని విభేదించిన సుప్రీంకోర్టు కార్యాలయ వాదనను తోసిపుచ్చింది. కానీ, అదే సమయంలో... ధర్మాసనం తన తీర్పులో అక్కడక్కడ చేసిన కొన్ని వ్యాఖ్యలు సమాచారం ఇచ్చే వెసులుబాటు కన్నా ఇవ్వకూడని ఆంక్షల పరిధిని పెంచినట్టు ధ్వనిస్తున్నాయి. ఇది కొంత ప్రమాదకరం. ఏ కోణంలో చూసినా ఈ తీర్పు పద్నాలుగేళ్ల ఆర్టీఐ ప్రస్తానంలో కీలకమైందే! ఈ తీర్పుతో... పారదర్శకతకు సంబం ధించిన కొన్ని మౌలికాంశాలపై అటు శాసన వ్యవస్థ ఇటు కార్యనిర్వా హక వ్యవస్థకు గట్టి సందేశం పంపినట్టయింది. ఇంతకాలం తన మైదానంలో స్తబ్దుగా ఉన్న బంతిని శాసనవ్యవస్థ మైదానంలోకి సుప్రీంకోర్టు నెట్టినట్టే భావించాలి. ఎందుకంటే, ఈ దేశంలో గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలు, తాము సమాచార హక్కు చట్ట పరిధిలోకి రామని భీష్మించుకొని వివాదం సృష్టించాయి. ఇన్నాళ్లూ సుప్రీం సీజే కార్యాలయం చేసినట్టే! ‘కాదు, మీరు ప్రజా సంస్థలే, సమాచారం ఇచ్చి తీరాల్సిందే...’ అని సీఐసీ ఇచ్చిన ఆదేశాల్ని అవి బేఖాతరంటున్నాయి. తాజా తీర్పు దరిమిలా ఈ వివాదం కూడా తేలాల్సిన సమయం ఆసన్నమైంది! సుప్రీం తీర్పు పరోక్షంగా రాజ కీయ వ్యవస్థపై ఒత్తిడి పెండచం ఖాయం. ఈ వివాదమూ ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ పరిధిలోనే ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) నోటీసులు ఇచ్చి ఉంది. రాజకీయ పార్టీలే కాకుండా కొన్ని ప్రయివేటు సంస్థలు, ట్రస్టులు, విద్యాసంస్థలు, పబ్లిక్–ప్రయివేట్ భాగస్వామ్య సంస్థలు ఇన్నాళ్లుగా ఇదే మొండి వైఖరితో ఉన్నాయి. సమాచారం నిరాకరిస్తున్నాయి. ఆర్టీఐ–2005 చట్ట నిర్వచనం (సెక్షన్ 2 హెచ్) ప్రకారం పబ్లిక్ అథారిటీస్ (పీఏ) అయిన సంస్థలు కూడా తామీ చట్ట పరిధిలోకి రామని తప్పించుకుంటున్నాయి. వాటి విషయంలో బాధి తులైన వారో, ఆర్టీఐ కార్యకర్తలో ఎక్కడికక్కడ న్యాయస్థానాలను సం ప్రదించి, ఈతాజా తీర్పును ఉటంకించడానికి మార్గం సుగమమైంది. వివాదమే దురదృష్టకరం! దేశంలోని ఎందరెందరో మేధావులు, సామాజికవేత్తలు, హక్కుల కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నట్టు ‘ఎవరూ చట్టానికి అతీతులు కారు’ అన్న బలమైన సందేశం తాజా తీర్పులో ఉంది. అస్పష్టత లేకపో యినా, సందేహం సృష్టించి వక్రమార్గంలో చట్టాన్ని అన్వ యించడానికి ఇక వీల్లేకుండా పోవాలి. భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు అనే సంస్థలోని అవిభాజ్య అంగమే తప్ప స్వతంత్ర సంస్థ కాదనీ ఈ తీర్పులో పేర్కొన్నారు. అసలు వివాదం అక్కడే మొదలయింది. సుప్రీం కోర్టు 1997లో చేసిన ఒక తీర్మానపు ప్రతిని సమాచారంగా ఇవ్వాలని హక్కుల కార్యకర్త 2007లో పెట్టుకున్న వినతిని సుప్రీంకోర్టు కార్యాలయం నిరాకరించడమే ఈ వివాదానికి బీజం. ప్రతి న్యాయమూర్తీ తన ఆస్తుల్ని వెల్లడించాలన్నది సదరు తీర్మానం. కొందరు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం –కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన పరస్పర సంప్ర దింపుల వివరాలనూ ఆ కార్యకర్త విడిగా కోరారు. కొన్ని అవి నీతి ఆరోపణలకు సంబంధించి మద్రాసు హైకోర్టు న్యాయ మూర్తికి–సుప్రీంకోర్టుకి మధ్య జరిగిన సంప్రదింపుల సమాచారాన్నీ మరో దరఖాస్తులో కోరారు. ఈ సమాచారమేదీ ఇవ్వబోమని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం రాజ్యాంగపరమైన సంస్థ కనుక ఆర్టీఐ చట్ట పరిధిలోకి రాదంటూ దరఖాస్తుల్ని తిరస్కరించారు. దరఖాస్తు దారు సీఐసీని సంప్రదించినపుడు చీఫ్ జస్టిస్ కార్యాలయం (సీజేఐ) ఆర్టీఐ చట్ట పరిధిలోకి వస్తుందని, న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన వ్యక్తిగత గోప్య సమాచారమేమీ కానందున సమాచారం ఇవ్వాల్సిం దేనని సీఐసీ రెండు వేర్వేరు కేసుల్లోనూ తన నిర్ణయం ప్రక టించింది. సీజేఐ కార్యాలయం దాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. విచారణ తర్వాత అక్కడ న్యాయమూర్తి (సింగిల్ జడ్జి), ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం (2009లో, 2010లో)కూడా సీఐసీ నిర్ణయాన్ని సమర్థించాయి. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కార్యాలయమే సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఇంతటి సుదీర్ఘ విచారణ, తాజా తీర్పు అని వార్యమైంది. ఈ కేసు సాగతీతలో సుప్రీం కార్యాల యమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది–శిక్షణ విభాగం(డీవోపీటీ) పాత్ర కూడా ఉంది. రాజకీయ పార్టీలు అతీతమా? నిత్యం ప్రజలతో మమేకమై, ప్రజల కొరకు ప్రజలనే ఆసరా చేసుకొని ప్రజా వ్యవహారాలు నడిపే రాజకీయ పార్టీలు తాము ప్రజా సంస్థలు (పబ్లిక్ అథారిటీ) కామని ప్రకటించుకుంటున్నాయి. పారదర్శకంగా ఉండనవసరం లేదని, పౌరులు కోరిన సమాచారం ఇవ్వబోమని వాదిస్తున్నాయి. పార్లమెంటు ద్వారా తామే తయారుచేసి, అమలు పరుస్తున్న ఓ చట్టాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగారుస్తున్నాయి. పిడివాదంతో, ఆరేళ్ల కింద సీఐసీ ఇచ్చిన ఉత్త ర్వుల్ని ఇంకా వ్యతిరేకిస్తున్నాయి. పోనీ, సీఐసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి వెళ్తున్నారా అంటే, అదీ లేదు. ఇది న్యాయ ధిక్కారమే! ఓ హక్కుల కార్యకర్త, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను కొంత సమాచారం కోరుతూ పెట్టిన ఆర్టీఐ దరఖాస్తులకు తిరస్కరణ ఎదురవడంతో వారు సీఐసీని సంప్రదించారు. సీఐసీ ఇచ్చిన నోటీ సులకు ముందు సానుకూలంగా స్పందించిన సీపీఐ తర్వాత తన వైఖరి మార్చుకుంది. తాము ప్రజాసంస్థలు (పీఏ) కామని, అందుకే ఆర్టీఐ పరిధిలోకి రాబోమని కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ(ఎం)లు బదులిచ్చాయి. బీజేపీ, బహుజన సమాజ్ పార్టీలు మొదట స్పందించనే లేదు. తమ సిద్ధాంత వైరుధ్యాలకతీతంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ మరోమారు ఒక్కటయ్యాయి. ఎన్నికల సంస్కరణల్లో భాగం గా క్రిమినల్ కేసులు–పోటీ అనర్హత విషయమై లోగడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కూడా రాజకీయ పార్టీలన్నీ ఇలా ఒక్కట య్యాయి. తాము ఆర్టీఐ పరిధిలోకి రాబోమనే వాదనతో ఇప్పుడూ పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయి. రాజకీయ పక్షాలకు లభించే విరాళాల వివరాలు, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య అవసరాల దృష్ట్యా వారి నిర్ణాయక వ్యవస్థ సమాచారం ప్రజలకు తెలియాలని సామాజిక కార్యకర్తలంటున్నారు. విరాళాల గోప్యత వల్ల ఎన్నికల అనంతరం అధికార వ్యవస్థకు–ఆశ్రిత వర్గాలకు మధ్య పరస్పర ప్రయోజన వైరుధ్యత (కాన్ల్ఫిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఉంటుందనేది వారి వాదన. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, ఆర్టీఐ చట్ట నిర్వచనం ప్రకారం రాజకీయ పార్టీలు ప్రజా సంస్థ(పీఏ)లేనని, పౌరులు అడిగిన సమా చారం ఇవ్వాల్సిందేనని 2013 జూన్‌లో సీఐసీ నిర్ణయించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, సెక్షన్ 29ఎ కింద గుర్తింపు పొందిన పార్టీలన్నిం టినీ ఆర్టీఐ చట్టప్రకారం పీఏ లుగా ప్రకటించాలని కోరుతూ కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడంతో గత మార్చిలో సుప్రీంకోర్టు సంబంధితులకు నోటీసులిచ్చింది. తుదితీర్పు రావాల్సి ఉంది. చట్టం పటిష్టతే శ్రీరామరక్ష సమచార హక్కు చట్టం–2005 గొప్పదనమంతా ఆ చట్టం కూర్పులో ఉంది. నిర్వచనాలైనా, నిబంధనలైనా పాలకుల పక్షంలో కాక నిఖా ర్సుగా ప్రజాహితంలో ఉన్నాయి. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలే తేల్చినా, సదరు జాగ్రత్తల్ని ఆర్టీఐ చట్టంలో పద్నాలుగేళ్ల కిందటే పొందుపరిచారు. ఏయే సంద ర్భాల్లో సమాచారం ఇవ్వనవసరం లేదో సెక్షన్ 8 (మిన హాయింపులు) విస్పష్టంగా చెబుతోంది. పౌరులు కోరిన సమాచారం ఇచ్చేప్పుడు న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని దృష్టిలో ఉంచు కోవాలని తాజా తీర్పులో ధర్మాసనం వ్యాఖ్య చేసింది. దాపరికం వల్ల వ్యక్తిగత గోప్యతకు లభించే రక్షణ కన్నా వెల్లడి ద్వారా విస్తృత ప్రజా ప్రయోజనాలున్నపుడే సమాచారం వెల్లడించాలని వ్యాఖ్య చేసింది. నిజా నికి ఇటువంటి చాలా విషయాల్లో చట్టంలోనే స్పష్టత ఉంది. పలు కీలకాంశాల్లో అస్పష్టతకు తావులేని విధంగా చట్టాన్ని రూపొం దించారు. వాటిని తిరిగి పార్లమెంటు వేదికగా సవరించనంత కాలం అవే చెల్లుబాటవుతాయి. అలా కాక ఇతరేతర ప్రయో జనాలనాశించే వారు తాజా తీర్పులోని వ్యాఖ్యల్ని ఇష్టానుసారం అన్వయించి, చట్టం స్ఫూర్తికి గండికొడితే ప్రమాదం! పెనంలోంచి పోయ్యిలో పడ్డట్టే! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
పారదర్శకతకు పట్టాభిషేకం
ఎవరికి వారు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) తమకు వర్తించదంటూ మొరాయిస్తున్న వేళ...ఆ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సైతం ఆర్టీఐ పరిధిలోనికే వస్తుందని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. ఈ విషయంలో దాదాపు పదేళ్లక్రితం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనంటూ సమర్థించింది. ఈ దేశంలో ఎంత శక్తిమంతులైనా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారైనా రాజ్యాంగ చట్టం వారికంటే అత్యున్నతమైనదని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చాటిచెప్పింది. పారదర్శకతకు పట్టాభిషేకం చేస్తూ, తెలుసుకోవడం పౌరులకుండే తిరుగులేని హక్కని నిర్ధారిస్తూ ఎన్నో సందర్భాల్లో తీర్పులు వెలువరించింది. తాజా తీర్పు ద్వారా ఇది తనకు కూడా వర్తిస్తుందని తెలియజేసి ఆ చట్ట పరిధిని విస్తృతం చేసింది. పారదర్శకత అంశంలో రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు మూడు వేర్వేరు తీర్పులు ఇచ్చినా... ఆ మూడూ ఏకాభిప్రాయంతో ఉండటం గమనించదగ్గది. అయితే న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకోవాలని, పారదర్శకత అన్నది దాని స్వతంత్రతకు భంగకరంగా మారకూడదని వ్యాఖ్యానించింది. ఇందులో పరస్పర విరు ద్ధతేమీ లేదు. స్వతంత్రంగా పనిచేయాల్సిన సుప్రీంకోర్టు వంటి వ్యవస్థకు కొన్ని అంశాల్లో గోప్యత అవసరమవుతుంది. ఏది పారదర్శకత పరిధిలోనికొస్తుందో, ఏది గోప్యత ఉండకతప్పనిదో ఆయా సందర్భాల్లో అది తేల్చుకుంటుంది. వాటిల్లోని సహేతుకతపై ఎటూ చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఈ చరిత్రాత్మక తీర్పునివ్వడానికి దారితీసిన పరిణామాలను ఒక్కసారి గమనించాలి. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికీ, సుప్రీంకోర్టు కొలీజియానికీ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల సమాచారాన్నివ్వాలని...న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు అందజేయాలని ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇదంతా మొదలైంది. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయన కేంద్ర సమాచార కమి షన్(సీఐసీ)ముందు పిటిషన్ వేశారు. అక్కడ ఆయనకు అనుకూలమైన నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసి అప్పట్లో అందరినీ విస్మయపరిచింది. అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని ధర్మాసనం సుప్రీంకోర్టు వాదనను తోసిపుచ్చి సీఐసీ నిర్ణయాన్ని సమర్థించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత న్యాయమూర్తికుండే వ్యక్తిగత విశేషాధికారం కాదనీ, అది న్యాయమూర్తి గురుత బాధ్యతని ఆ సందర్భంగా తేల్చి చెప్పింది. దాంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సుప్రీంకోర్టునే ఆశ్రయించింది. అది తొలుత ద్విసభ్య ధర్మాసనానికి, ఆ తర్వాత త్రిసభ్య ధర్మాసనానికి వెళ్లింది. ఇందులో కీలకమైన రాజ్యాంగపరమైన అంశాలున్నాయని భావించడంతో వివాదం రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చింది. ఆర్టీఐ చట్టం విషయంలో భిన్న సందర్భాల్లో ఎవరెలా మాట్లాడుతున్నారో ప్రజలకు తేటతెల్లం అవుతూనే ఉంది. మాకు ఈ చట్టం వర్తించబోదని మొరాయించేవారి జాబితా తక్కువేమీ లేదు. చట్టం వచ్చినప్పుడే పాలనా పరంగా రహస్యాలు పాటించడం తప్పనిసరంటూ కొన్ని వ్యవస్థలకు మినహాయింపునిచ్చారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ తదితర 22 సంస్థలు అందులో ఉన్నాయి. కొన్నిటిని అనం తరకాలంలో చేర్చారు. తమ కార్యకలాపాలు కూడా దీని పరిధిలోనికి రావని వాదించిన సంస్థలూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు సరేసరి. ఇవి ప్రభుత్వాల నుంచి రాయితీలు, మినహాయింపులు పొందడం దగ్గరనుంచి వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాల సేకరణ వరకూ ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతున్నాయి. ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి. అయినా ఆర్టీఐ చట్టం తమకు వర్తించబోదంటూ తర్కిస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు చూశాకైనా ఇలాంటి వాదనలు తగ్గితే మంచిదే. ప్రభుత్వంతోసహా వివిధ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునే హక్కు పౌరులకు ఉండటం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది. వ్యవస్థలన్నీ పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రజా స్వామ్యం వర్థిల్లుతుంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే కొలీజియం వ్యవస్థపై ఎప్పటినుంచో ఫిర్యాదులున్నాయి. న్యాయమూర్తుల ఎంపిక కోసం అది అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో వెల్లడికావడం లేదని, ఎవరు ఎందుకు ఎంపికవుతున్నారో, ఎందుకు కావడం లేదో తెలుసుకోవడం పౌరసమాజం హక్కు అని ఎప్పటినుంచో వాదనలున్నాయి. ఈ వ్యవస్థకు ఆద్యుడైన జస్టిస్ జేఎస్ వర్మ సైతం కొలీజియం నిర్ణయాలు పారదర్శకంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కానీ ఈ అంశంలో సమాచార హక్కు చట్టం పరిధి తనకు వర్తించబోదని సుప్రీంకోర్టు వాదించింది. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం అలాంటి వాదన సరికాదని స్పష్టం చేయడం హర్షించదగ్గది. న్యాయమూర్తుల పదవులకు కొలీజియం సిఫార్సు చేసినవారి పేర్లేమిటో వెల్లడించవచ్చు తప్ప అందుకు గల కారణాలు వెల్లడించాల్సిన అవసరం లేదని తాజా తీర్పు చెబుతోంది. అయితే అందరి విషయంలోనూ కారణాలు చెప్పకపోయినా, ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని భావించినవారికి అభ్యంతరం లేనప్పుడు ఏయే కారణాలరీత్యా తిరస్కరించవలసి వచ్చిందో వెల్లడించడమే సరైంది. ఏదేమైనా అవసరమైన గోప్యతను పాటిస్తూనే పారదర్శకంగా ఉండటం, అదే సమయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటం ఒక సవాలే. దీన్ని మన సర్వోన్నత న్యాయస్థానం ఎంత సమర్థవంతంగా నిర్వర్తిస్తుందో చూడాల్సి ఉంది. -
సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం మరో సంచలన తీర్పును వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం కూడా సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందంటూ చరిత్రాత్మక ఆదేశాలు ఇచ్చింది. సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనని, అది కూడా పారదర్శకత చట్టమైన ఆర్టీఐ కిందకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే, పారదర్శకత పేరిట న్యాయవ్యవస్థ స్వతంత్రను తక్కువ చేయలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపి..ఈ ఏడాది ఏప్రిల్ 4న తన తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. చదవండి: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు -
రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసి, దాన్ని రెండు ముక్కలుగా విభజించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఓ రాష్ట్రం హక్కులను హరించి వేసిందని, తద్వారా ప్రభుత్వ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచిదంటూ కొందరు రాజ్యాంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలైనా తీవ్రంగా పరిగణించకపోతే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క కశ్మీరే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను క్రమేణ హరించి వేస్తోంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తీసుకొచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ చట్టాన్ని సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును జూలై 15వ తేదీన లోక్‌సభ, ఆ తర్వాత రెండు రోజులకు రాజ్యసభ ఆమోదించింది. ఇంతవరకు టెర్రర్ కేసుల దర్యాప్తునకు మాత్రమే పరిమితమైన ఈ సంస్థకు మానవులు అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, నిషేధిత ఆయుధాల తయారీ, అమ్మకాలు, సైబర్ టెర్రరిజమ్తోపాటు 1908 పేలుడు పదార్థాల చట్టం పరిధిలోకి వచ్చే కేసులను దర్యాప్తు జరిపే అధికారాన్ని చట్ట సవరణ ద్వారా ఎన్ఐకేకు కట్టబెట్టారు. అంతేకాకుండా చట్టంలోని మూడవ సెక్షన్‌ను సవరించడం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసులకు పరిమితమైన విధులు, బాధ్యతలు, ప్రత్యేకాధికారాలు ఎన్ఐఏకు దఖలు పరిచారు. అంటే వారు ఏ రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేయాలకున్నా ఏ రాష్ట్ర అధికారి అనుమతి లేకుండా నేరుగా అరెస్ట్ చేయవచ్చు. ఈ బిల్లును కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ముందుగా తీవ్రంగా వ్యతిరేకించాయి. దీని వల్ల రాష్ట్రాలు హక్కులు కోల్పోవాల్సి వస్తోందని, సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని అధిక్షేపించాల్సిన ఆ పార్టీలు ఎన్ఐఏకు తిరుగులేని అధికారాలు సంక్రమించడం వల్ల అన్యాయంగా ముస్లింలు టార్గెట్ అవుతారని ఆరోపించాయి. చివరకు బిల్లుకు అనుకూలంగానే ఓటు వేశాయి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ‘అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివేన్షన్ యాక్ట్’ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించిన వారం రోజులకు, అంటే ఆగస్టు రెండవ తేదీన లోక్‌సభ ఆమోదించింది. ఇంతకుముందు ఈ చట్టం టెర్రరిస్టు సంస్థలకు మాత్రమే టెర్రరిస్టు స్వభావం ఉంటుందని పరిగణించేది. ఇప్పుడు సవరణ ద్వారా వ్యక్తులకు కూడా టెర్రరిస్టు స్వభావం ఉంటుందని, వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు అవకాశం ఇచ్చింది. అనుమానిత టెర్రరిస్టులను అరెస్ట్ చేయాలన్నా, వారి ఆస్తులను జప్తు చేయాలన్న ఇంతకుముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్సుడు దీన్ని సవరించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏ అనుమానితుడినైనా అరెస్ట్ చేయవచ్చు, అతని ఆస్తులను నేరుగా జప్తు చేయవచ్చు. ఈ చట్టం కింద విరసం సభ్యుడు వరవరరావు సహా లాయర్లు, రచయితలైన పలువురు సామాజిక కార్యకర్తలను కేంద్రం అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ చట్టం కింద ఎవరినైనా బెయిల్ రాకుండా ఏళ్లపాటు నిర్బంధించవచ్చు. భూమి అనే అంశం రాష్ట్రం పరిధిలోకి వస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలంటూ కొన్ని ప్రతిపక్షాలు వాదించాయి. అయితే టెర్రరిస్టులకు సామాన్యంగా తానుంటున్న రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే ఆస్తులు ఉంటున్నాయంటూ ప్రభుత్వం చేసిన వాదనతో చివరకు ఆ పక్షాలు వేధించాయి. ఆర్టీఐ చట్టం సవరణ కూడా.. పార్లమెంట్ గత వారం ఆమోదించిన సమాచార హక్కు సవరణ చట్టం విషయంలోను అదే జరిగింది. ఇంతకుముందు వీరి పదవీ కాలం నిర్దిష్టంగా ఐదేళ్లు, గరిష్టంగా 65 ఏళ్ల వయస్సు ఉండగా, సవరణ ద్వారా వారి పదవీకాలం, వాళ్ల జీతభత్యాలకు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వమే ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. రాష్ట్ర సమాచార కమిషనర్ ఎవరిని నియమించడం అన్నా, తొలగించడం అన్న కేంద్రం పరిధిలోనే ఉంటుంది. డ్యామ్‌లు భద్రతా బిల్లు రాజ్యాంగం ప్రకారం జలాల అంశం రాష్ట్రం పరిధిలోకి వస్తోంది. దీన్ని క్రమంగా కేంద్రం పరిధిలోకి తీసుకురావాలనే సంకల్పంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జూలై 29వ తేదీన ‘డ్యామ్ సేఫ్టీ బిల్’ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తమిళనాడు పాలకపక్షం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో బిల్లును ఇంకా ఓటింగ్‌కు తీసుకరాలేదు. దేశంలోని అన్ని డ్యామ్‌ల భద్రత కోసం ‘నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ’ని ఏర్పాటు చేయాలని బిల్లు సూచిస్తోంది. ఈ కమిటీ డ్యామ్‌ల నిర్వహణ, భద్రత పర్యవేక్షిస్తోంది. ఈ పేరట రాష్ట్రానికి చెందిన జలాల హక్కులను కూడా కేంద్రం లాగేసుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కేంద్రానికి లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉండడంతో ఏకపక్షంగా ఇలాంటి బిల్లులను తీసుకొస్తోంది. తద్వారా రాష్ట్రాల హక్కులు హరించుకుపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నిఘా నీరసిస్తే ‘సమాచారం’ సమాధే!
పార్లమెంటు ఆమోదించిన తాజా సవరణ ద్వారా సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చి పారదర్శకతకు సర్కారు పాతరేయ జూస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన ‘పౌరులు తెలుసుకునే’ ప్రాథమిక హక్కుకే ఇది భంగం. సమాచార హక్కు అమలు సాకారానికి లభించిన చట్టభద్రతకి ఇక గండి పడనుంది. డెబ్బయ్యేళ్ల స్వతంత్ర చరిత్రలో, దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పోరు తర్వాత ఆర్టీఐ రూపంలో దేశ ప్రజలకు దక్కిన అరుదైన వ్యవస్థకు తూట్లు మొదలయినట్టే! చట్టం అమల్లోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలవు తున్న తరుణంలో ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. పలువురు సందేహిస్తున్నట్టు ప్రస్తుత సవరణ ఈ చట్టాన్ని బలహీనపరచకూడదు. బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు, పాలకపక్ష పెద్దలిచ్చే సంకే తాల్ని బట్టే చట్టాలు అమలవుతాయి, అధికార యంత్రాంగం పనిచేస్తుంది. పౌరులాశించిన పరిపాలనా ఫలాలు లభిస్తాయి. సంకేతాలే మాత్రం భిన్నంగా ఉన్నా, ఫలితం సున్నా, ఇక అంతే సంగతులు! యుగాలుగా ఇది నడుస్తున్న చరిత్ర అవటం వల్లే సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం అమలు పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఎన్నో సందేహాలు! పార్లమెంటు ఆమోదించిన తాజా సవరణ ద్వారా ఈ చట్టాన్ని నీరుగార్చి పారదర్శకతకు సర్కారు పాతరేయ జూస్తోందన్న విమర్శ. రాజ్యాంగం ప్రసాదించిన ‘పౌరులు తెలుసుకునే’ ప్రాథమిక హక్కుకే ఇది భంగం. హక్కు అమలు సాకారానికి లభించిన చట్టభద్రతకిక గండి పడనుంది. డెబ్బయ్యేళ్ల స్వతంత్ర చరిత్రలో, దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పోరు తర్వాత ఆర్టీఐ రూపంలో దేశ ప్రజలకు దక్కిన అరుదైన వ్యవస్థకు తూట్లు మొదలయినట్టే! చట్టం అమల్లోకి వచ్చి దాదాపు ఒకటిన్నర దశాబ్దాలవుతున్న తరుణంలో ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రస్తుత చట్ట సవరణ ఏ కోణంలో చూసినా, సమాచార వెల్లువను పటిష్ట పరచకపోగా ఈ ప్రక్రియను పలుచన చేయడానికే ఆస్కారముంది. చట్టం అమల్లోకి వచ్చిన కొత్తలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్టీఐ అమలుకు అనువైన భూమికను సిద్ధం చేశారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాకు చెప్పి అధికారులకు, పౌర సంఘాల కార్యకర్తలకు, జర్నలిస్టులకు ప్రత్యేకంగా చట్టంపై శిక్షణ ఇప్పించారు. పౌరుల్లో అవగా హనకు ప్రత్యేక నిధులతో ప్రచార సామాగ్రి రూపొందించి, సదస్సులు పెట్టించారు. జాప్యం లేకుండా కమిషన్ ఏర్పరచి అమలు ప్రారంభిం చారు. ఒక సందర్భంలో ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టుపై విపక్ష సభ్యులు రభస చేస్తే, ‘... రాజకీయం చేయకండి, నిజంగా సమాచారం తెలుసు కోవడమే మీ ఉద్దేశమైతే, పది రూపాయలు వెచ్చించి ఆర్టీఐ దరఖాస్తు చేసినా మీకు సమాచారం లభిస్తుంద’ని శాసనసభావేదిక నుంచి భరోసా ఇచ్చారు. మొత్తం అధికార వ్యవస్థకే ఆ మాట ఒక బలమైన సంకేతమైంది. అడ్డుకున్నా ఆగని తొలి సవరణ సమాచార హక్కు చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఇటీవలే ఆమో దించింది. ఉభయసభల్లోనూ ఈ సమావేశాల్లోనే బిల్లుకు ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి ముద్రపడి, గెజెట్‌లో ప్రచురితమవడంతో చట్ట సవరణ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రధానంగా ఈ చట్ట సవరణ... కేంద్రంలో, రాష్ట్రంలో ఉండే సమాచార కమిషనర్ల హోదా, పదవీకాలం, వేతనాల మార్పులకు సంబంధించింది. అవన్నీ అధికంగా ఉన్నాయని, ప్రస్తుత సవరణ ద్వారా వాటిని హేతుబద్ధం చేసేందుకేనని బిల్లు ముసా యిదా లక్ష్యాలు–ఉద్దేశాల్లో కేంద్రం వెల్లడించింది. కానీ, అది సహేతు కంగా లేదు. ‘తాడిచెట్టెందుకెక్కావు?’ అంటే ‘దూడ గడ్డికోసం’అని తడు ముకుంటూ చెప్పే జవాబంత అసంబద్ధంగా ఉంది. 2005లో ఏర్పడ్డ నాటినుంచి ఆర్టీఐ చట్టానికి ఇదే తొలి సవరణ. ఇంతకు ముందు మూడు, నాలుగు మార్లు వేర్వేరు విషయాల్లో సవరణకు జరిగిన యత్నాలు ఫలించలేదు. పాలనలో కీలకమైన ‘నోట్‌ఫైల్స్’ను ఈ చట్టపరిధి నుంచి తప్పించే విఫల యత్నమూ జరిగింది. చట్టాన్ని మార్చ డానికి ఆయా సందర్భాల్లో కేంద్రంలోని ప్రభుత్వాలు చేసిన ప్రయ త్నాలను పౌరసమాజం ఎప్పటికప్పుడు ప్రతిఘటించింది. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే నిరాహార దీక్షకు దిగి ఇటువంటి ఓ ప్రతి పాదనను లోగడ అడ్డుకున్నారు. ప్రతిసారీ చట్ట సవరణకు చేసిన ప్రతిపాదనలు ఏదో రూపంలో చట్టాన్ని బలహీనపరచి, పారదర్శకతకు భంగం కలిగిస్తాయని పౌర సమాజం కలవరపడింది. సవరణ వద్దని వివిధ స్థాయిల్లో ఉద్యమించింది. అందువల్ల, కేంద్రం చేసిన ఏ సవరణ ప్రయత్నమూ ఇంతకాలం ఫలించలేదు. ఒకసారైతే, కేంద్ర మంత్రివర్గం ఆమోదించినా జనాగ్రహానికి జడిసి, సవరణ బిల్లు ముసాయిదాను పార్లమెంటుకు తెచ్చే సాహసం చేయలేకపోయింది ప్రభుత్వం. ఈ సారి కూడా చట్టాన్ని సవరించకూడదని, తద్వారా సమాచార కమిషన్లు బలహీనపడి, చట్టం అమలు నీరుగారిపోతుందని ప్రజాసంఘాలు వ్యతిరేకించినా చట్ట సవరణ ప్రక్రియ ఆగలేదు. పార్లమెంటులో విపక్షం వ్యతిరేకించినా ప్రభుత్వ పట్టుదల వల్ల ఉభయసభల ఆమోదంతో ఆర్టీఐ చట్ట సవరణ జరిగిపోయింది. సమాన హోదాలతో సమస్యేమిటి? చట్ట ప్రకారం అఖిల భారతస్థాయి కేంద్ర సమాచార కమిషన్‌లోని ముఖ్య సమాచార కమిషనర్ హోదాను కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ హోదాతో సమానంగా నిర్ణయించి, అమలు చేస్తున్నారు. ఆయా ప్రభు త్వాలు రూపొందించే రూల్స్‌లో కాకుండా ఈ అంశాల్ని మౌలికమైన చట్టంలోనే పొందుపరిచారు. ఇది 2005 నుంచి ఇలాగే ఉంది. మిగతా కేంద్ర సమాచార కమిషనర్ల హోదాను ఇతర ఎన్నికల కమిషనర్లతో సమంగా నిర్ణయించి, వేతనాలు, భత్యాలూ అదే లెక్కన చెల్లిస్తున్నారు. ఇంకొక లెక్క ప్రకారం... కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానం. దాని వల్ల, ఆర్టీఐ కేంద్ర సమా చార ముఖ్య కమిషనర్ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాతో సమానమౌతోందని, ఇది సముచితం కాదనేది కేంద్ర ప్రభుత్వ వాదన. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ కాగా ఆర్టీఐ కమిషన్ చట్టబద్ధ సంస్థ మాత్రమే అని కేంద్రం అంటోంది. అదే విధంగా రాష్ట్రాల్లోని ఆర్టీఐ ముఖ్య సమాచార కమిషనర్లకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమాన మైన, రాష్ట్రాల్లోని ఆర్టీఐ కమిషనర్లకు రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో సమానమైన హోదాను, జీత భత్యాలను ఇప్పటి వరకున్న చట్టం కల్పించింది. పైగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లు గాని, 65 ఏళ్ల వయసు వచ్చే వరకు గానీ, ఏది ముంద యితే అప్పటివరకు కేంద్ర–రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్లు పదవిలో ఉంటారు. చట్టం వచ్చిన కొత్తలో ఆదరాబాదరాగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నా రని, ఇది సరికాదంటూ కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని ప్రస్తుత సవరణ తెచ్చింది. ఈ సవరణతో ఇప్పుడు... ఆయా కమిషనర్ల హోదాలు, జీత భత్యాలు, పదవీ కాలం వంటివి నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వా నికి దఖలవుతోంది. ఇకపై రాష్ట్రాల సమాచార కమిషనర్లకు సంబంధిం చిన హోదా, పదవీకాలం, జీత భత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణ యిస్తుంది. కమిషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకాలు, వాటి నడక, నిర్వహణ... అంతా కూడా ఇకపై కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లోకి వచ్చి నట్టే! ఇక్కడే వివాదం తలెత్తుతోంది. ప్రస్తుత సవరణల వల్ల చట్టం అమ లుకు, పారదర్శకతకు వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదని, పైగా నష్టం జరుగుతుందనేది చట్ట సవరణ వ్యతిరేకిస్తున్న వారి వాదన. అటు వంటిదేమీ ఉండదని, అనవసర హోదాలు, అస్పష్టతలు తొలగి మరింత పకడ్బందిగా చట్టం అమలుకు ఈ సవరణ పనికొస్తుందనే డొల్ల వాద నను కేంద్ర వర్గాలు వినిపించాయి. రాజ్యాంగ సంస్థ హోదాలను చట్ట బద్ద సంస్థల్లోని వారికి కల్పించకూడదనే నిషిద్ధం కూడా ఎక్కడా లేదు. ఇప్పటికే కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) వంటి రాజ్యాంగ సంస్థలే కాకుండా జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ), జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), లోక్‌పాల్ వంటి చట్టబద్ధ సంస్థల ఛైర్మన్లు, సభ్యులకు కూడా రాజ్యాంగ సంస్థల్లోని వారితో సమాన హోదాలు న్నాయి. ఇలా చట్టబద్ద పదవులకు కూడా రాజ్యాంగ హోదాలతో సమాన స్థాయి కల్పించి, ఏ ఇబ్బందీ లేకుండా దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఉదా హరణలు కోకొల్లలు. మరి వాటన్నిటినీ ఇప్పుడు మారుస్తారా? ఇక్కడ మాత్రమే ఎందుకీ మార్పు? ఇవి సహజమైన ప్రశ్నలు. నిఘా, నిర్వహణ ఇక నిర్వీర్యమే! దేశంలో ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అంటే, ఈ పద్నాలుగేళ్ల కాలంలో పాలనా వ్యవస్థల్లో పారదర్శకత పెరిగింది. ఆశించిన స్థాయి ఫలితాలు అందకున్నా... ప్రభుత్వంలోని చాలా విభాగాల నుంచి పౌరులు సమాచారం పొందగలుగుతున్నారు. ఇదివరలో సమాచారం లభించడం దుర్లభమైన విభాగాల్లో కూడా నేడు పౌరులు ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు పెట్టి కోరిన సమాచారం తెచ్చుకోగలుగుతున్నారు. ఇందుకు, చట్టంలో పొందుపరచిన ప్రజాసానుకూల అంశాలే కారణం. చట్టం అమలు నిఘా–నియంత్రణ సంస్థలుగా కమిషన్లు స్వేచ్చగా–స్వతం త్రంగా వ్యవహరించే వెసలుబాటు మరో బలమైన కారణం. ప్రభుత్వాల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా కమిషనర్ల హోదాలు, పదవీ కాలం, జీతభత్యాలు ఇన్నాళ్లు చట్టం నిర్దేశించినట్టు హూందాగా, నిలకడగా ఉంటూ వచ్చాయి! దాని వల్ల కమిషనర్లు... ప్రభుత్వాలకు, వారి ప్రలో భాలు–ఒత్తిళ్లకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా స్వేచ్ఛగా పనిచేయగలిగే వారు. ముఖ్యంగా ఆర్టీఐ కమిషనర్లకు ఎన్నికల కమి షనర్ల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి హోదాలుండటం వల్ల ఉన్నత స్థాయి ఐఏఎస్. ఐపీఎస్ అధికారులు కూడా కమిషన్ల ఆదేశాలు పాటించే వారు. ఇక ఇప్పుడు అన్నీ కేంద్ర ప్రభుత్వం అదుపాజ్ఞల్లోకి రావడం, హోదాలు తగ్గడం వల్ల ఆర్టీఐ కమిషన్ల పనితీరు చప్పబడి పోతుంది. ప్రస్తుత సవరణ పరోక్షంగా కమిషన్ల స్వేచ్ఛను, స్వతంత్రతను దెబ్బతీయడమే అన్న విమర్శ తలెత్తుతోంది. దీనికి పాలక బీజేపీ నుంచి సరైన సమాధానం లేదు. నిజానికి 2005లో ఈ చట్టం తెచ్చినపుడు, కమి షనర్లకు తక్కువ హోదాలతో నాటి యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రతి పాదనల్ని విపక్ష బీజేపీ వ్యతిరేకించింది. కమిషనర్లకు పెద్ద హోదాలతో, బలమైన కమిషన్లు ఉండాలని వాదించింది. నాటి పార్లమెంట్ స్థాయి సంఘంలో ఉన్న అయిదారుగురు బీజేపీ ఎంపీల్లో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఉన్నారు. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వాదించింది. ఏ వాదనలెలా ఉన్నా, అంతిమ పరిణామాలను కాలమే నిర్ణయిస్తుంది. పౌరుల తెలుసుకునే హక్కు, పాలనలో పారదర్శకత విషయంలో ఆర్టీఐ ఒక విప్లవాత్మక చట్టం. మనకున్న మంచి చట్టాల్లో ఒకటైన ఆర్టీఐ పటిష్టంగా అమలుజరగాలనే ఎవరైనా కోరుకుంటారు. పలువురు సందేహిస్తున్నట్టు ప్రస్తుత సవరణ ఈ చట్టాన్ని బలహీనపరచ కూడదు. తాజా సవరణ, తద్వారా రాగల పరిణామాలన్నీ ఆర్టీఐ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడాలనే ఎవరమైనా కోరుకుంటాం, కోరుకోవాలి కూడా! వ్యాసకర్త :దిలీప్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు పూర్వ కమిషనర్ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఇతర వ్యవస్థలపైనా ‘ఆర్టీఐ’ ప్రభావం!
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు సవరణ చట్టం బిల్లును పార్లమెంట్ గురువారం నాడు ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య మూజువాణి ఓటుతో ఆమోదించిన విషయం తెల్సిందే. బిల్లులో ఎలాంటి సవరణలు చోటు చేసుకున్నాయి ? ఆ సవరణలను ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వాటి వల్ల ప్రమాదకర పరిణామాలు ఏమైనా ఉంటాయా? అసలు మాజీ సమాచార కమిషనర్లు దీనిపై ఏమంటున్నారు? ప్రభుత్వ కార్యకలాపాలు, విధుల నిర్వహణకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేందుకు 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. సమాచార కమిషనర్ల ఆదేశం మేరకు సంబంధిత ప్రభుత్వ శాఖ, విభాగం ప్రజలు అడిగిన సమాచారాన్ని విధిగా అందించాలి. సమాచార కమిషనర్లు ప్రభుత్వానికి లొంగకుండా తటస్థ వైఖరిని అవలంబించాలనే ఉద్దేశంతో సమాచార కమిషనర్లకు భారత ఎన్నికల కమిషన్‌లోని కమిషనర్లకు ఇచ్చినంత జీతభత్యాలను ఇవ్వాలని చట్టంలోనే నిర్దేషించింది. వారికి ఐదేళ్ల కాల పరిమితిని కూడా నిర్ణయించింది. ఇప్పుడు ఈ నిబంధనలను ఎత్తివేస్తూ జీతభత్యాలను, పదవీ కాలాన్నీ ప్రభుత్వమే నిర్ణయించే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. దీంతో సమాచారా కమిషనర్ల వ్యవస్థతో పారదర్శకత లోపిస్తుందని, ప్రభుత్వం ఒత్తిడి వారు లొంగిపోయే అవకాశం ఉందంటూ విపక్షాలు గొడవ చేశాయి. అలా జరగదని, ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగం ప్రకారం వచ్చిందని, రాజ్యాంగ సవరణల ద్వారానే అందులో మార్పులు, చేర్పులు చేసుకున్నాయని, అదే సమాచార చట్టాన్ని పార్లమెంటరీ చట్టం ద్వారా తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. ఎన్నో వ్యవస్థలపై ప్రభావం ప్రభుత్వ వాదనను ప్రమాణంగా తీసుకుంటే పార్లమెంటరీ చట్టం కింద ప్రత్యేక స్వయం ప్రతిపత్తిగల సంస్థలైన సుప్రీం కోర్టు, హైకోర్టులు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లోక్‌పాల్, జాతీయ మానవ హక్కుల కమిషన్లను సవరించాల్సి ఉంటుందని, అలా చేస్తే వాటి స్వయం ప్రతిపత్తి కూడా దెబ్బతింటాయని మాజీ సమాచార కమిషనర్లు అభిప్రాయపడుతున్నారు. -
పారదర్శకత పేరిట నాశనం చేయలేరు
న్యూఢిల్లీ: దాపరికంతో కూడిన వ్యవస్థను ఎవరూ కోరుకోరని, అదే సమయంలో పారదర్శకత పేరిట న్యాయ వ్యవస్థను నాశనం చేయలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందని గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ గురువారం పైవిధంగా స్పందించింది. సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి 2010లో ఈ పిటిషన్లు వేశారు. తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, ఆర్టీఐ కార్యకర్త అగ్రావాల్ తరఫున లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. సీజే జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును నిలుపుదలలో ఉంచింది. ఎవరూ అజ్ఞాతంలో ఉండాలని కోరుకోరని, సమాచారం ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వకూడదనే విషయంలో స్పష్టమైన రేఖ గీసుకోవాలని బెంచ్ సూచించింది. ఆర్టీఐ కింద న్యాయ వ్యవస్థ సమాచారం బహిర్గతం చేయకపోవడం విచారకరమని, జడ్జీలు ఏమైనా వేరే విశ్వంలో నివసిస్తున్నారా అని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ విభాగాలు పారదర్శకతతో వ్యవహరించాలని సూచించిన సుప్రీంకోర్టు తన విషయం వచ్చే సరికి వెనకడుగు వేస్తోందని అన్నారు. -
సమాచార హక్కు చట్టం వీటికి వర్తించదు
-
సింగపూర్‌తో ఒప్పందాలు చాలా రహస్యం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి సంబంధించి సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రహస్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని గోప్యంగా ఉంచాలన్న సింగపూర్ ప్రైవేట్ కంపెనీల సూచనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సింగపూర్ కంపెనీలతో సీఆర్డీఏ కుదుర్చుకున్న షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ వివరాలను అందచేయాలంటూ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గత ఏడాది సెప్టెంబర్ 28, అక్టోబర్ 4వ తేదీన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వచ్చాయి. దీనిపై అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ ప్రైవేట్ లిమెటెడ్ (ఏడీపీపీఎల్) బోర్డు సమావేశంలో ఇటీవల చర్చించారు. ఏడీపీపీఎల్ చైర్మన్‌గా ఉన్న సింగపూర్‌కు చెందిన తీన్ చుయ్ చింగ్ నినా అధ్యక్షతన సమావేశమై ఈ ఒప్పందాలకు సమాచార హక్కు చట్టం వర్తించదని తేల్చారు. బోర్డు తీర్మానానికి సర్కారు సరే.. రాజధానిలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు 1,691 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానంలో అప్పగించిన విషయం తెలిసిందే. ఇందులో అభివృద్ధి చేసిన ప్లాట్లను సింగపూర్ సంస్థలు మూడో పార్టీకి విక్రయించుకునేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇందుకోసం అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. దీనికి సింగపూర్‌కు చెందిన వ్యక్తి చైర్మన్‌గా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష్మీపార్ధసారధి డైరెక్టర్‌గా ఉన్నారు. షేర్ హోల్డర్ల అగ్రిమెంట్‌ను రహస్యంగా ఉంచాలని, సమాచార హక్కు చట్టం కింద దీన్ని వెల్లడించరాదని ఇటీవల బోర్డు సమావేశంలో తీర్మానించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తలూపింది. గోల్మాల్ జరిగినందునే గుట్టుగా.. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు, సీఆర్డీఏ మధ్య జరిగిన షేర్ హోల్డర్ల అగ్రిమెంట్‌ను గోప్యంగా ఉంచాలని నిర్ణయించడాన్ని బట్టి ఇందులో గోల్మాల్ జరిగిందనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏకంగా సమాచార హక్కు చట్టం కింద కూడా వివరాలు ఇవ్వడానికి వీల్లేదని నిర్ణయం తీసుకోవడం అంటే సింగపూర్ కంపెనీలకు చట్టం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వమే వంత పాడుతున్నట్లుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నట్లు తేటతెల్లమవుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆర్థికశాఖకూ వివరాలు తెలియవు.. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన 1,691 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించాలనే షరతుకు సర్కారు అంగీకరించడం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిదశలో రూ.350 కోట్లను విడుదల చేయాలని సీఆర్డీఏ ఇటీవల ఆర్థిక శాఖను కోరింది. దీనిపై ఆర్థికశాఖ స్పందిస్తూ సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను అందచేయాలని కోరింది. సీఆర్డీఏ ఇప్పటి వరకు ఒప్పందాలను కనీసం ఆర్థికశాఖకు కూడా వెల్లడించలేదంటే కచ్చితంగా ఏదో మతలబు ఉందని పేర్కొంటున్నారు. పారదర్శకంగా అంటూ అన్నీ ఉన్నత స్థాయిలోనే.. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామంటూ నిత్యం చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని విషయంలో మాత్రం అంతా గోప్యత పాటిస్తున్నారని, కనీసం సీఆర్డీఏ అథారిటీ సమావేశాల తీర్మానాలు కూడా అందుబాటులో లేకుండా రహస్యంగా ఉంచుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాజధానికి సంబంధించి ఏ విషయంలోనూ బిజినెస్ నిబంధనల మేరకు ఫైళ్లను పంపకుండా పైస్థాయిలోనే అన్నీ చక్కబెడుతున్నారని తెలిపాయి. సీఎం అధ్యక్షత వహించే సీఆర్డీఏ సమావేశాల్లో ఆయన నిర్ణయాలు తీసేసుకున్న తరువాత ఫైళ్లు పంపిస్తే ఆర్థిక శాఖ ఏం చేస్తుందని ఓ ఉన్నతాధికారి ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయ పనుల్లోనూ ఇదే తీరు తాత్కాలిక సచివాలయ నిర్మాణం టెండర్లను భారీ ఎక్సెస్‌కు కట్టబెట్టారని, రాజధానిలో చేపట్టే ఏ ప్రాజెక్టుకైనా తొలుతే పెద్ద ఎత్తున అంచనాలను పెంచేసి టెండర్లను ఆహ్వానిస్తున్నారని, రహదారుల విషయంలోనూ ఇదే జరిగిందని, బిల్లుల చెల్లింపుల్లో కూడా నిబంధనలను పాటించడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాజధాని స్టార్టప్ ప్రాజెక్టుపై సింగపూర్ సంస్థతో చేసుకున్న ఒప్పందాల్లో భారీ అవతవకలు ఉన్నట్లు తేలడం వల్లే ఆర్థికశాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర తాను ఏడీపీపీఎల్లో సభ్యుడిగా ఉండలేనని తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఆ దేవస్థానాలు.. చర్చిలు.. మసీదులు ఆర్టీఐ పరిధిలోకి రావు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం పొందని దేవస్థానాలు, చర్చిలు, మసీదులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రావని ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి దేవాదాయ చట్టం కింద కమిషనర్ లేదా ఇతర ఏ అధికారి అయినా కూడా ఆర్టీఐ పరిధిలోకి రాని దేవస్థానాల సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాల్సిన అవసరం లేదంది. అయితే తమకు నిర్దిష్టంగా తెలిసిన సమాచారాన్ని మాత్రం వారు ఆర్టీఐ కింద ఇవ్వాలని, ఆ చట్టం కింద వారు పబ్లిక్ అథారిటీ కిందకు వస్తారంది.మతపరమైన సంస్థలు ప్రస్తుతం వివిధ మార్గాల నుంచి విరాళాల రూపంలో భారీ మొత్తాలను అందుకుంటున్న నేపథ్యంలో ఆ నిధుల వినియోగం పారదర్శకంగా జరిగేందుకు, సమాచార హక్కు చట్టం లక్ష్యాలను సాధించేందుకు కనీసం రిజిష్టర్ అయిన దేవస్థానాలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చట్ట సవరణ తేవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల తీర్పునిచ్చారు. సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు ఇవ్వాలంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఉభయ రాష్ట్రాలకు చెందిన పలు మతపరమైన సంస్థలు, ధార్మిక సంస్థలు, ధర్మకర్తలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు.ఇలా 2007 నుంచి ఈ ఏడాది వరకు దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారించిన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల వీటన్నింటినీ కలిపి ఉమ్మడి తీర్పునిచ్చారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2 (హెచ్) ప్రకారం దేవస్థానాలు, ధార్మిక సంస్థలు పబ్లిక్ అథారిటీ నిర్వచన పరిధిలోకి రావన్నారు. కాబట్టి దేవస్థానాల ధర్మకర్తలు, పాలకమండళ్లు, చైర్పర్సన్లు ఆయా దేవస్థానాల సమాచారాన్ని ఆర్టీఐ చట్టం కింద అందించాల్సిన అవసరం లేదన్నారు. కేరళ హైకోర్టు సైతం హిందూ ధార్మిక సంస్థలు, దేవస్థానాలు ఆర్టీఐ చట్టం కింద పబ్లిక్ అథారిటీ నిర్వచనం పరిధిలోకి రావని తీర్పునిచ్చిన విషయాన్ని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. దేవస్థానాల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నప్పటికీ, వారు ఆర్టీఐ చట్టం కింద పబ్లిక్ అథారిటీ పరిధిలోకి రారన్నారు. దేవస్థానాల కార్యకలాపాల నిర్వహణను చూస్తున్నంత మాత్రాన వాటిని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలుగా, ప్రభుత్వ సాయం అందుతున్న దేవస్థానాలుగా పరిగణించటం సాధ్యం కాదని స్పష్టం చేశారు.సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు అందచేయాలంటూ పలు దేవాలయాల ఈవోలు, ట్రస్టీలు తదితరులను ఆదేశిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. -
‘సమాచార హక్కు’కు బాబు ముసుగు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘‘ప్రజలకు సమాధానం చెప్పకుండా, జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే.. చేయకూడని పనులేవో చేస్తున్నట్లే. అన్ని విషయాలను ప్రజలు తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) వచ్చింది. ఏపీలో స.హ చట్టం అమలు నిర్వీర్యం అయ్యింది. దరఖాస్తుదారులకు సమాధానం లభించడం లేదు. ఆర్టీఐ చట్టానికి ఏపీ సీఎం చంద్రబాబు ముసుగు కప్పారు. ఏడాదిన్నర కాలం ఆర్టీఐ కమిషనర్లు లేకపోవడం, రెగ్యులర్ చీఫ్ కమిషనర్‌ను ఇప్పటికీ నియమించకపోవడాన్ని బట్టి ఏపీలో ఏం జరుగుతుందో, ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అంచనాకు రావచ్చు’’ అని ఢిల్లీకి చెందిన ప్రముఖ సమాచార హక్కు చట్టం ఉద్యమకారిణి, నేషనల్ కాంపెయిన్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఎన్సీపీఆర్ఐ) జాతీయ కో కన్వీనర్ అంజలి భరద్వాజ్ పేర్కొన్నారు. ఇటీవల విశాఖపట్నంలో సహ చట్టం అమలుకు సంబంధించిన ప్రజావేదికలో జాతీయ ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్‌పీఏఎం) సలహా మండలి సభ్యులు బి.రామకృష్ణంరాజు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ, జాతీయ ఉద్యమకారులు అమిత్రా జోహ్రి, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కాంపెయిన్ సీనియర్ కార్యకర్తలు చక్రదర్ బుద్ధ, ఇమ్మానుయేల్ దాసరి తదితరులు పాల్గొన్నారు. అంజలి భరద్వాజ్ బృందం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స.హ చట్టం అమలు తీరుతెన్నులపై భరద్వాజ్ ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబువన్నీ ప్రగల్భాలే... ప్రజలకు సమాచారాన్ని ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం దాస్తోంది. ప్రజలు తమ బాధలను చెప్పుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి అవకాశం లేకుండా చేసింది. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఉద్ధేశంతోనే ఏపీ సర్కారు ఆర్టీఐ చట్టాన్ని అమలు చేయకుండా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఆర్టీఐ అమలు తీరును ఎన్సీపీఆర్ఐ పరిశీలించి సమగ్ర నివేదిక తయారు చేసింది. దానిలో అత్యంత శోచనీయమైన అంశం ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో ఉండటం. ఆర్టీఐ చట్టం సక్రమ అమలుకు ఏపీ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలో కల్లా ముందంజలో ఉన్నానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ సైట్లలో ఏ విధమైన సమగ్ర సమాచారం పొందుపరచలేదు. కొన్ని విభాగాల సమాచారంలో ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఉంది. ఏటా 60 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు... దేశవ్యాప్తంగా 60 లక్షల మంది ఏటా ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. దీన్నిబట్టి ఈ చట్టానికి ఎంత ప్రాధాన్యత, అవసరం ఉందో అంచనా వేయవచ్చు. జాతీయ స్థాయిలో 11 మంది కమిషనర్లకు గాను నాలుగు ఖాళీలు ఉన్నాయి. ఈ డిసెంబరులో మరో నాలుగు పోస్టులు ఖాళీ కానున్నాయి. వేలాది దరఖాస్తుల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కేంద్రం ఈ చట్టానికి సవరణలకు ప్రయత్నిస్తోంది. కమిషనర్ల కాలపరిమితి, జీతభత్యాలను నియంత్రించేందుకు యోచిస్తోంది. వీటిని అడ్డుకునేందుకు డిసెంబర్లో ఎన్సీపీఆర్ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళనలు చేయనున్నాం. దరఖాస్తులకు స్పందన లేదు విశాఖలో ఇటీవల యూఎఫ్ఆర్టీఐ, ఎన్సీపీఆర్ఐ సంయుక్తంగా నిర్వహించిన ప్రజావేదికలో అన్ని జిల్లాల నుంచి ఆర్టీఐ దరఖాస్తుదారులు పాల్గొన్నారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పారు. విశాఖ భూకుంభకోణంపై సిట్ నివేదికను, సీఎం చంద్రబాబు, అయన కుమారుడు లోకేశ్, మంత్రులు, ఇతర అధికారుల పర్యటనల ఖర్చుల వివరాలు, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం, అమరావతి ఖర్చులు, రాజధానిలో వ్యవహారాలను స.హ చట్టం కింద అడిగితే ఇవ్వడంలేదని వారు వివరించారు. ఇక ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయన్నారు. విశాఖ ప్రజావేదిక నివేదికను సుప్రీం కోర్టుకు పిల్ ద్వారా తెలియజేస్తాం. ఈ రిపోర్టును ఏపీ ప్రభుత్వానికి, సీఎస్‌కు పంపుతాం. జాతీయస్థాయిలో మీడియా ద్వారా వెల్లడిస్తాం. -
నాకు తెలియాలి
సిటీ కార్పోరేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్నిటికీ సరోజమ్ దరఖాస్తు పెట్టింది.. ‘‘నా దుకాణం కూలగొట్టమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని. ‘‘నేను ఇచ్చిన కంప్లయింట్ స్టేటస్ ఏంటి? దర్యాప్తు చేయడానికి పురమాయించారా? ఒకవేళ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ కాపీ చూపించండి. దర్యాప్తు కోసం నియమించిన ఆఫీసర్ ఎవరు? దర్యాప్తు జరిగి ఉంటే దానికి సంబంధించిన రిపోర్ట్ కాపీని సంబంధిత అధికారికి అందచేశారా?..ఈ ప్రశ్నలతో దరఖాస్తు అందగానే ఆగమేఘాల మీద కదిలారు పోలీసులు ఆ కేస్ ఇన్వెస్టిగేషన్‌కు.ఈ ప్రశ్నలు సంధించిన వ్యక్తి పేరు సరోజమ్. ఓ సగటు మహిళ. షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన వ్యక్తి. ఏ విషయం పట్ల ఆ ఆగ్రహం? మామూలు ఆగ్రహం కాదు ధర్మాగ్రహం! మొదట పట్టించుకోలేదు సరోజమ్.. తిరువనంతపురం నివాసి. 20 ఏళ్లుగా అక్కడే ఎమ్ఎస్కె నగర్లో అట్టుకల్ దేవీ గుడి దగ్గర పాత ఇనుప సామాన్ల దుకాణం నడిపిస్తూ ఉంది. 2014 అక్టోబర్ 11న సిటీ కార్పొరేషన్‌కు చెందిన కొంతమంది మనుషులు వచ్చి ఆమె దుకాణాన్ని కూలగొట్టారు. అందులో ఉన్న వస్తువులన్నిటినీ ఊడ్చుకెళ్లారు. ఎందుకలా చేస్తున్నారు అని ఆ సరోజమ్ అడిగితే.. ఆ దుకాణం పక్కనే ఉన్న చెరువును శుభ్రం చేయమని ఆర్డర్స్ వచ్చాయని.. చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ క్లీన్ చేయమన్నారని.. పైగా ఆమె దుకాణం పోరంబోకు భూమిలో ఉంది కాబట్టి దాన్నీ తీసేశామని చెప్పారనీ అన్నారు. వెంటనే ఆమె భర్త నాగరాజన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, వాళ్లపై కంప్లయింట్ ఇచ్చాడు. ఎప్పటిలాగే పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ నెల అయినా వ్యవహారం అంగుళం ముందుకు సాగలేదు. ఈసారి సరోజమ్ వెళ్లి ఇంకోసారి కంప్లయింట్ ఇచ్చింది. రిసీట్ ఇవ్వమనీ డిమాండ్ చేసింది. అయినా పోలీసులు స్పందించలేదు. తరచుగా పోలీస్ స్టేషన్ వెళ్తూనే ఉంది. దాదాపు పదినెలలు గడిచాయి. బతుకు దెరువు పోయింది. చేతిలో ఇంకో పనిలేదు. పోలీసుల తీరులో మార్పులేదు. తర్వాత పరుగులు తీశారు సరోజమ్ వాళ్లుండే ప్రాంతంలో ‘ది సేవా’ (సెల్ఫ్ ఎంప్లాయ్డ్ విమెన్స్ అసోసియేషన్) ఆర్టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) మీద అవగాహనా తరగతులను నిర్వహించింది. దానికి సరోజమ్ కూడా వెళ్లింది. అంతా విని తన సమస్య గురించి తను ఇచ్చిన పోలీస్ కంప్లయింట్ కథాకమామీషు కూడా ఈ ఆర్టీఐ ద్వారా తెలుసుకోవచ్చా? అని నిర్వాహకులను అడిగింది. తెలుసుకోవచ్చని చెప్పారు. ఎలాగో కూడా వివరించారు. అలా వాళ్ల సలహా ప్రకారం తను ఇచ్చిన కంప్లయింట్‌కు సంబంధించి పైన ప్రశ్నలతో పోలీస్‌స్టేషన్‌లో ఆర్టీఐ దరఖాస్తును ఫైల్ చేసింది. మీడియా వాళ్లొచ్చారు ఆ రోజు వరకు ఎప్పుడు సరోజమ్ వెళ్లినా.. అసలు ఎమ్ఎస్కె నగర్లో.. అట్టుకల్ దేవీ గుడి దగ్గరున్న చెరువు ఒడ్డున పాత ఇనుప సామాన్ల షాపే లేదని.. అదంతా పోరంబోకు ల్యాండ్ అని సరోజమ్‌ను బెదిరించి పంపిన పోలీసులు ఆమె ఆర్టీఐ దరఖాస్తు చూసి అంతకుమించిన బెదురుతో హుటాహుటిన కదిలారు.. కేస్ సాల్వ్ చేయడానికి! దాంతో అప్పటిదాకా నిద్రాణంగా ఉన్న ఆ కేస్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నిరుపేదల, షెడ్యూల్డ్ కులాల ప్రజల అజ్ఞానాన్ని ప్రభుత్వోద్యోగులు ఎలా ఆసరాగా మలచుకుంటున్నారో సరోజమ్ కేసుతో ప్రజలకు చూపించింది స్థానిక మీడియా. పదినెలలుగా సరోజమ్ కుటుంబం పడ్డ అవస్థ వార్తగా వైరల్ అయింది. వార్తా చానెళ్లు కెమెరా, మైక్‌లతో ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. కూల్చినవాళ్లే కట్టించారు సిటీ కార్పొరేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్నిటికీ సరోజమ్ దరఖాస్తు పెట్టింది.. ‘‘నా దుకాణం కూలగొట్టమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని. ‘‘సరోజమ్ దుకాణం కూల్చివేతతో మాకు ఎలాంటి సంబంధం లేదని, మేమెలాంటి ఆర్డర్స్నూ పాస్ చేయలేదు’’ అని కార్పొరేషన్, జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. మరెవరు ఆదేశాలు ఇచ్చారో తెలపమని సంబంధిత ప్రభుత్వ శాఖలకు నోటీసివ్వమని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌కు మరో దరఖాస్తు పెట్టుకుంది సరోజమ్. చెరువును శుభ్రం చేయమనే ఉత్తర్వు షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ శాఖ నుంచి వచ్చినట్టు తేలింది. ‘‘స్వయం పర్యాప్త గ్రామం’ (సెల్ప్ సఫీషియెంట్ విలేజ్) ప్రాజెక్ట్ కింద చెరువును శుభ్రం చేసే పనిని చేపట్టాం తప్ప, ఒడ్డున ఉన్న షాప్‌ను కూల్చమనే ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు’’ అని వివరణ ఇచ్చాడు ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇక్కడి నుంచి కథ ఇంకా చకచకా కదలడం మొదలైంది. ఎవరు కూల్చమన్నారు? ఎందుకు కూల్చారు నుంచి అసలు ఎమ్ఎస్కె నగర్ స్వరూప స్వభావాల మీద అధ్యయనం దాకా వెళ్లింది వ్యవహారం. చివరికి ఈ ఏడాది ముప్పయ్ అంటే ముప్పయ్ రోజుల్లో.. సరోజమ్ ఆర్టీఐ దరఖాస్తుతో ఆమె దుకాణాన్ని ఎక్కడైతే కూల్చారో.. అక్కడే కొత్త దుకాణాన్ని కట్టి ఇచ్చారు. ఎమ్ఎస్కె నగర్‌ను కూడా అత్యవసర సదుపాయాలతో కొత్తగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ కాలనీ వాసులంతా సరోజమ్‌ను విజేతగా.. నేతగా అభిమానిస్తున్నారు. – శరాది -
ఫైళ్ల దొంగను పట్టుకునేదెవరు?
విశ్లేషణ విజేంద్రసింగ్ జఫా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. తప్పుచేసిన వాడు తన బాస్ అయినా సరే జఫా బాణం గురి తప్పేది కాదు. అవినీతిపరుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నవభారతంలో ఇలాంటి అధికారికి ఎదురయ్యే కష్టాలు ఊహించ వచ్చు. తనను కొందరు ఇబ్బందుల పాలు చేసే తప్పుడు ఆరోపణలు కల్పించి, విచా రణ పేరుతో వేధిస్తూ నిందలు మోపారని, వాటి సంగతేమిటో చెప్పాలని ఆర్టీఐ కింద జఫా అడిగారు. రిటైరై 23 ఏళ్లయినా ఈ నిందల సంగతి తేల్చడం లేదని, ప్రశాంతంగా బతక నీయడం లేదనీ జఫా అన్నారు. సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖను విభజిం చడానికి ముందు దానితో ఉన్న విజిలెన్స్ విభాగాన్ని అడగాలని ఓ సీపీఐఓ జవాబిచ్చారు. సామాజిక న్యాయ శాఖ నుంచి ఆదివాసీల మంత్రిత్వ శాఖను 1999లో విభజించారని, కాని ఈ దస్తావేజులు తమకు బదిలీ చేయలేదని ఆ సీపీఐఓ జవాబి చ్చారు. ఎంత వెతికినా 1995 నాటి కాగితాలు కనిపించలేదని విజి లెన్స్ వారు చెప్పారు. ఆయన రెండో అప్పీలు వేయక తప్పలేదు. ఫైళ్లు కనిపించడం లేదంటూ ప్రజాసమాచార అధికారులు చెబు తున్నారు. అమాయకులను రక్షించడానికి, అవినీతి తిమింగలాలను శిక్షించడానికి రికార్డులు, ఫైళ్లు అవసరం. 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది కనుక జనం అడుగుతున్నారు. జారిపోతున్న ఫైళ్లు, పారిపోతున్న నేరగాళ్ల గురించి నిలదీస్తున్నారు. నిజానికి ఆర్టీఐ చట్టాన్ని ఎడాపెడా వాడుకుంటున్నవారు మామూలు జనం కాదు, అధికారులు, ఉద్యోగులు, రిటైరైన వారు, సస్పెండు అయిన వారు, విచారణకు గురైనవారు, ప్రమోషన్ ఎందుకు రాలేదనే అసంతృప్తితో ఉండే ఉద్యోగులు. అంతేగాని నిరుద్యోగులు కాదు. ఆర్టీఐని దుర్విని యోగం చేసేది కూడా ఈ ఉద్యోగులే. మామూలు జనం అడిగితే కలి సికట్టుగా నిలబడి సమాచారాన్ని నిరాకరించేది కూడా ఈ ఉద్యోగులే. ఈ ఆర్టీఐ దరఖాస్తును ఫుట్‌బాల్‌ను తన్నినట్టు గోల్ చేరకుండా ఆపే శాఖలన్నింటి సీపీఐఓలు సమన్వయం చేసుకుని ఫైళ్ల సంగతి తేల్చకపోవడం సమాచార నిరాకరణగా పరిగణిస్తారు. దీంతో తలా పాతికవేల జరిమానా విధించక తప్పదని నోటీసులు జారీ చేసింది సమాచార కమిషన్. ఫైళ్లు మాయమైతే అధికారులు, కార్యాలయాలు చేయవలసిన విధి విధానాల్ని ఖరారు చేయాలని, ప్రమాణాలు నిర్ధారించి, శిక్షలు నిర్ణయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. పోయిన కాగితాలు వెతకకుండా, కేవలం పోయాయని చెప్పడం నిర్లక్ష్యంగా భావించి అందుకు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా నియ మాలు రూపొందించాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. పాతికవేల జరిమానా భయం పనిచేసింది. ‘ఆర్టీఐ దరఖాస్తులో ఇచ్చిన ఫైలు నంబరు ఆధారంగా వెతికితే ఏదీ దొరకలేదు. కానీ నంబరును వదిలేసి అన్ని ఫైళ్లూ బాగా వెతికాం. అప్పుడు ఈ ఫైలు దొరికింది’అని íసీపీఐఓలు జవాబిచ్చారు. జఫాకు అన్ని కాగితాల ధ్రువీకరణ ప్రతులు పంపించేశామని వివరించారు. ‘మేము ఏ ఆర్టీఐ దరఖాస్తును తిరస్కరించడం లేదు. కేవలం ఫైళ్లు దొరకలేదని వెతుకు తున్నామని మాత్రమే వివరణ ఇస్తాం’ అని వారు చెబుతున్నారు. చివ రిరోజున శత్రు మిత్రుల నకిలీ ఆరోపణలు, వేధింపు చార్జిషీట్లు, ఆ తరువాత ఏమయ్యాయో చెప్పకపోవడం కుర్చీ బాబుల క్రూర చర్య. కుర్చీ దిగిన వెంటనే ఆ వ్యక్తిని, అదే కుర్చీలో కూర్చున్న అధికారి వేధించడానికి అధికారాన్ని దుర్వినియోగం చేయడం. పగబట్టి, లేదా రాజకీయ నాయకులను ఆశ్రయించే వెన్నెముకలేని దుర్మార్గపు అధికా రులు వాడుకునే ఆయుధం. రిటైర్మెంట్ నాడు ఆరోపణలు చేయడం, తరువాత చెప్పక పోవడం. ఆ తర్వాత కుర్చీ దిగిపోయిన అధికారు లకు దిక్కుండదు. మంచి అధికారైనా అవినీతిపరుడైనా ఆయనను పలకరించే వారు కూడా కరువైపోతారు. ఆయన కార్యాలయానికి రాలేడు. ఉత్తరాలు రాస్తే జవాబివ్వరు. తన మీద మచ్చ తొలగిపోయే పత్రాలు చివరి దశలోనైనా దొరికినందుకు జఫా సంతోషించారని సీపీ ఐఓలు విన్నవించారు. ఇండియాలో ఫైళ్ల దొంగను దేవుడు మాత్రం ఏం చేయగలడు? (విజేంద్రసింగ్ జఫా కేసు ఇఐఇ/MౖSఒఉ/అ/ 2017/181342లో సీఐసీ తీర్పు ఆధారంగా) వ్యాసకర్త మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఏది గోప్యత? ఏది సమాచారం?
నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీలో 2001 నుంచి 2007 వరకు మీరెంత మంది యువతీ యువకులను సీనియర్, జూనియర్ స్కాలర్లు, ఫెలోషిప్ స్థానాల కోసం ఎంపిక చేశారు? వారి పేర్లేమిటి? ఏఏ పరిశోధనాంశాల్లో వారు అధ్యయనం చేస్తున్నారు? నిర్ణీత కాలాన్ని మించి పరిశోధన కొనసాగించిన వారు ఎంతమంది? వారెవరు? పరిశోధనా కాలాన్ని కొనసాగించే నియ మం ఉందా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేశారు? పరిశోధన విజయవంతంగా పూర్తిచేసిన వారికి చివరి వేతన చెల్లింపు సర్టిఫికెట్లు ఎప్పుడిచ్చారు? అని సమా చార హక్కు కింద 2017 సెప్టెంబర్ 20న దరఖాస్తు పెట్టుకున్నారు. దీనిపై సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా, ఈ అంశాలన్నింటినీ వ్యక్తిగత సమాచారమని వర్గీకరించారు. ఈ దరఖాస్తుపై 30 రోజులు గడిచినా ఏమీ చెప్పలేదు. ‘మా పరిపాలనాధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమాచారాన్ని నిరాక రించాం’ అని రెండో అప్పీలులో పీఐఓ చెప్పారు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(జే) ప్రకారం ఆ సమా చారం ఇవ్వవలసిన పని లేదని అనుకున్నారు. తాను ఇటీవలే పీఐఓగా చేరానని, అంతకుముందు అజిత్ కుమార్ ఈ సమాధానాన్ని 2018 మే 3న చెప్పారని కొత్త పీఐఓ వివరించారు. రెండో అప్పీలు దాఖలైన తర్వాత 2018 జులై 11న అడ్మినిస్ట్రేటివ్ అధికారి కుమారి నిధి శ్రీవాస్తవ సమాధానం ఇచ్చారు. స్కాలర్ల పేర్లు కూడా వారి వ్యక్తిగత సమాచారం ఎట్లా అవుతుందో వివరించాలని అడిగితే జవాబు లేదు. పై అధికారులను ఒక్కోసారి పీఐఓలు సమా చారం కోసం అడుగుతుంటారు. వారు తమ అధికార హోదాతో ఒక్క నిమిషంలో ఏ సమాచారమూ ఇవ్వ ద్దని తేల్చి పారేస్తారు. నెలరోజులైనా ఏ జవాబూ ఇవ్వకపోవడం సమాచారాన్ని నిరాకరించడమే. కొందరు మొదటి దశలో, మొదటి అప్పీలు దశలో కూడా సమాచారం ఇవ్వరు. రెండో అప్పీలు వేసినా పట్టించుకోరు. కాని ఫలానా కమిషనర్ ముందుకు కేసు వచ్చిందని, విచారణ నోటీసు కూడా వచ్చిందని తెలిశాకే స్పందిస్తారు. ‘‘పీఐఓ మారితే నా కన్నా ముందు అధికారి నిరాకరిస్తే నేనెందుకు ఇవ్వాలి? కమిషనర్ కూడా ఆయనకే నోటీసు ఇస్తాడు కదా. అతను బాధపడితే పడనీ’’ అనుకుంటారు. సమాచారం ఇవ్వకుండానే కమిషన్ ముందు విచా రణకు వస్తారు. కొత్త పీఐఓ ఎప్పుడు చేరారో అడిగి, ఆ తేదీ నాటికి పెండింగ్‌లో ఉన్న సమాచార దర ఖాస్తులు ఎందుకు చూడలేదని అడిగే అవకాశం ఉండాలి. నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీ మౌలికమైన పని గ్రంథాలయ నిర్వహణతో పాటు, పరిశోధకులకు సాయం చేయడం. ఎవరికి స్కాలర్ షిప్ ఇచ్చారు? ఎంతకాలం పరిశోధన జరిగింది? అనే ప్రశ్నలు సామాన్యమైన సమాచార అభ్యర్థన అంశాలు. వాటిని ఏదో ఒక నెపంతో నిరాకరించడం న్యాయసమ్మతం కాదు. చట్టసమ్మతం కూడా కాదు. ఈ పనిచేసింది మొదట సీఐఓ అజిత్ కుమార్. దాంతో పాటు వారి పాలనాధికారి లోపం కూడా ఇందులో భాగం. అజిత్ కుమార్‌కు తప్పుడు ఆదే శాలు ఇవ్వడమే కాకుండా, మొదటి అప్పీలు అధికారి బాధ్యతలను మరొకరికి ఇవ్వకుండా పీఐఓ అయిన అజిత్ కుమార్‌కే అప్పగించడం చట్టవిరుద్ధం. ఇందు వల్ల సమాచార అభ్యర్థి తనకు జరిగిన చట్ట వ్యతిరేక నిరాకరణను ప్రశ్నించే అవకాశం కోల్పోయాడు. ఈ రెండు తప్పులకు ఆనాటి పాలనాధినాధికారి నిధి శ్రీ వాస్తవ బాధ్యులు కావలసి వస్తుంది. ఆర్టీఐ చట్టంలో ఉన్న బాధ్యతలను నిర్వహించడానికి పీఐఓకు మిగి లిన అధికారులు అందరూ సహకరించాలి. పై అధికా రులు, కింది ఉద్యోగులు కూడా ఈ ఉన్న తాధికారికి సాయం చేయాలి. పీఐఓ అడిగినపుడు సాయం చేయని మరొక ఉద్యోగి పైఅధికారి అయినా, కింది అధికారి అయినా సరే నిరాకరించిన పీఐఓగా ఆయ నను పరిగణించి ఆయనపై చర్యలు తీసుకునే అధి కారం ఉంది. కనుక సమాచార కమిషన్ పీఐఓ అజిత్ కుమార్‌కు, సమాచారం ఇవ్వడంలో సహాయం నిరా కరించిన నిధి శ్రీవాస్తవకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పబ్లిక్ అథారిటీలు, పీఐఓలు అడుగడుగునా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ కేసునే ఉదాహరణగా తీసుకుంటే, చట్టం వచ్చిన 120 రోజులలోగా తమంత తామే 17 రకాల సమాచారాన్ని సెక్షన్ 4(1) (బీ) కింద ఇవ్వాలి. ఈ కేసులో కోరిన నెహ్రూ స్మారక మ్యూజియం, లైబ్రరీకి సంబంధించిన స్కాల ర్షిప్ వివరాల సమాచారం తమంత తామే ఇవ్వవలసి నది. 30 రోజుల్లో జవాబివ్వలేదు. మొదటి అప్పీలు అవకాశం తొలగించారు. తర్వాత తప్పుడు కారణా లపై ఈ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఇవన్నీ చట్ట వ్యతిరేక చర్యలు. అంతేకాదు 8(1)(జే) దుర్వినియోగం. (డాక్టర్ కమల్ చంద్ర తివారీ వర్సెస్ నెహ్రూ మెమో రియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, CIC/NMMA L/A/2018/616896 కేసులో ఆగస్టు 10న ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
అడిగిన పత్రాల ధ్వంసం నేరమే
తనకు పోస్ట్ చేసిన 37 ఉత్తరాలు ఎక్కడినుంచి వచ్చాయి, ఎవరు బట్వాడా చేశారు, అవి ఏరోజు గమ్యస్థానం చేరాయి, చేరిన రుజు వులు ఏవి అని ఒక పౌరుడు పోస్టాఫీసు అధికారులను అడిగాడు. ఒకటి నుంచి 21 వరకు రికార్డు లేదని, గడువు తీరిందని తొలగించామని చెప్పారు, మిగిలిన చీటీలు ఇచ్చారు. ఆర్టీఐ దరఖాస్తు చేసినప్పుడు మొదటి అప్పీలు నాటికి ఉన్నా వాటిని తొలగించడం కోసం వేరు చేసి కుప్పలో పడేశారని వివరించారు. కాగితాలు ఉన్నప్పటికీ వాటిని ధ్వంసం చేసి పౌరుడికి ఇవ్వకపోవడం ఆర్టీఐ చట్టం సెక్షన్ 20 కింద జరి మానా విధించదగిన నేరమే అవుతుందని కమిషన్ నోటీసు జారీ చేసింది. ఆర్టీఐ దరఖాస్తు దాఖలయ్యేనాటికి దస్తావేజులు ఉండి ఉంటే, ఆనాటికే నిలిపే గడువు దాటిపోయినా వాటిని తొలగించకుండా అడిగిన పౌరుడికి ఇవ్వాలనే విధానం ప్రవేశపెట్టాలి. ఊరికే ధ్వంసం చేసే బదులు, అడిగిన వారికి లేదా వాటి సొంతదారులకు ఎందుకు ఇవ్వరో అర్థం కాదు. ఆ సమాచారం కోసం ఒకవైపు చట్టం ప్రకారం అడుగుతూ ఉంటే, మరోవైపు వాటిని ధ్వంసం చేసి రికార్డులు లేవు పొమ్మనడం సమంజసం కాదు. దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించి కమిషన్ తమిళనాడు ఈరోడ్ డివిజన్ తపాలాశాఖ ప్రజాసమాచార అధికారికి గరిష్ఠ జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలపాలనే లేఖ జారీచేసింది. దానికి అధికారి జవాబిస్తూ 37 తపాలా లేఖల డెలివరీ చిట్టీలు ఇవ్వాలన్న ఆర్టీఐ దరఖాస్తు తమకు 22.8.2017న చేరిందని, 22నుంచి 37 వరకు చిట్టీలు ఇవ్వడానికి 54 రూపాయలు పంపాలని 11.9. 2017న అడిగామని, అతను ఆ సొమ్ము చెల్లించగానే ప్రతులు 3.10.2017న ఇచ్చామని తెలిపారు. 1 నుంచి 21కి సంబంధించిన చిట్టీలు తొలగించామని చెప్పారు. మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా పాత దస్తావేజుల తొలగింపునకు సంబంధించిన రుజువు ఇవ్వాలని కోరారు. వాటిని వేరు చేసి ఆ తరువాత విధి విధానాల ప్రకారం తొలగించామని మాత్రం అధికారి జవాబు చెప్పారు. మీరు ఎక్కడ ఆ దస్తావేజు లను కుప్పపోశారో చూపితే తానే తన కాగితాలను వెతుక్కుంటానని కూడా ఆయన మరొక దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ అందుకు అంగీకరించలేదు. తపాలాశాఖ నియమాల ప్రకారం దేశీయ ఉత్తరాల పంపిణీ పత్రాలను 18 నెలలు, స్పీడ్ పోస్టు ఉత్తరాల పత్రాలు ఆరు నెలలు దాస్తామని 11.9.2017న ఆర్టీఐ దరఖాస్తు వేసే నాటికే ఆ రికార్డులను పాత కాగితాలలో కుమ్మరించామన్నారు. అప్పీలు నాటికి పాత కాగితాలు నిజంగా నిర్మూలించకపోయినా కట్టలుకట్టి కుమ్మరించామని, బయటకుతీసే అవకాశం లేదని చెప్పారు. ఆర్టీఐ చట్టంలో కుమ్మరించిన కాగితాల కుప్పనుంచి వెలికి తీయాలనే నియమం లేదని, కనుక తాము ఇవ్వలేదని, తన నిర్ణయాన్ని మొదటి అప్పీలు అధికారి కూడా అంగీకరించారని, తాము కేవలం డిపార్ట్మెంట్ నియమాలను అనుసరించి మాత్రమే వ్యవహరించామని, కనుక తమపై జరిమానా విధిం చకూడదని పీఐఓ వాదించారు. మొదటి అప్పీలు అధికారి పారేసిన కుప్పనుంచి దరఖాస్తుదారు కోరిన కాగితాలు వెతకాలని ఆదేశించలేదని, కనుక తాము ఆ ప్రయత్నం చేయలేదని కూడా వివరించారు. ఆ కుప్పను మార్చి 2018 నాటికి పూర్తిగా తొలగించామని చెప్పారు. ఆర్టీఐ చట్టం రికార్డు దాచే నియమాలను నిర్ధారించలేదని అన్నారు. ఈ దరఖాస్తుదారు ఏడు సార్లు కాగితాల ప్రతులు కోరితే తాము ఇచ్చామని 6.6.2018న జరిగిన అప్పీలు విచారణలో అతను హాజరు కాలేదని అంటే ఆయన దీనికి తగిన ప్రాధాన్యం ఇవ్వనట్టేనని వాదించారు. ఈ కారణాల వల్ల సీఐసీ ఆదేశాన్ని పాటించలేక పోయామని, అడిగిన ప్రతులు ఇవ్వలేకపోయామని వివరించారు. 2017 ఆగస్టు నుంచి దరఖాస్తుదారు తన పత్రాల గురించి పోరాడుతూ ఉంటే తపాలా కార్యాలయం వారు 2018 మార్చిలో రికార్డులను తొలగించారని తేలింది. సెక్షన్ 2(ఎఫ్) 2(జె)లో నిర్వచనాల ప్రకారం సమాచారం అంటే తమ వద్ద ఉన్న కాగితాలు అని స్పష్టంగా ఉంది. ఆర్టీఐ దరఖాస్తు చేసిన నాటికి ఉన్న పత్రాలను అప్పీలు విచారణ దశలో ధ్వంసంచేయడం, సెక్షన్ 20లో చెప్పినట్టు తెలిసి తొలగించడం కిందికి వస్తుందని, దురుద్దేశం లేకపోయినా తెలిసి తొలగించడం నిరాకరణే అవుతుంది. అయినా పీఐఓ వివరణను పరిగణించి గరిష్ఠ జరిమానా 25 వేలు కాకుండా 25 వందల రూపాయల జరిమానా విధించాలని కమిషన్ నిర్ణయిం చింది. ఊరికే ధ్వంసం చేసే బదులు ఆ పత్రాలు మిన హాయింపుల కిందికి రాకపోతే సంబంధిత వ్యక్తులకు ఇవ్వడం గురించి తపాలా శాఖ ఆలోచించాలని కమిషన్ సూచించింది. (CIC/POSTS/ A/2018/1194 69 టీఎస్ శివకుమార్ వర్సెస్ పీఐఓ తపాలాశాఖ కేసులో 6.8.2018న సీఐíసీ తీర్పు ఆధారంగా). వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సమాచారానికి సవరణలా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఏళ్ల పోరాటం తరువాత సాకారమైన సామాన్యుల కల సమాచార హక్కు చట్టం. పరిపాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడానికి, అవినీతిని అంతం చేయడానికి 2005, అక్టోబర్ 12న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలులోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఈ చట్టం అవినీతిపై బ్రహ్మాస్త్రంగా మారింది. దీనివల్ల దేశంలోని ఎన్నో కుంభకోణాలు వెలుగుచూశాయి. అనేక సంచలన విషయాలు లోకానికి తెలిశాయి. కానీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టంపై మొదటి నుంచి శీతకన్ను వేసిందనే విమర్శలు ఉన్నాయి. ఆర్టీఐ అమలు విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను సామాజిక ఉద్యమకారులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. చట్టం నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. సమాచార హక్కు చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలు పార్లమెంటులో ఆమోదం పొందితే.. సమాచార హక్కు చట్టం పూర్తిగా నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పౌరుల స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లేనని చెబుతున్నారు. ప్రధాన అభ్యంతరాలు ఇవే. 1. చట్టానికి సవరణలు జరిగితే.. కేంద్రం, రాష్ట్ర పరిధిలో పనిచేసే సమాచార కమిషనర్లను కేంద్రమే నియమిస్తుంది. వారి జీతభత్యాలు, పదవీకాలం కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని సామాజిక ఉద్యమకారులు వాదిస్తున్నారు. అలా జరిగితే.. సమాచార వెల్లడిలో కేంద్రం జోక్యం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2. ప్రస్తుతం సమాచార కమిషనర్ల పదవీకాలం ఐదేళ్లుగా ఉంది. లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పనిచేయవచ్చు. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కి ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రంలోని చీఫ్ సెక్రటరీ హోదాకు సమానంగా ఉంటుంది. ఇకపై వీటి ప్రకారం.. ఉండకపోవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచార కమిషనర్ల నుంచే వ్యతిరేకత..: కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలపై సమాచార కమిషనర్ల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వివాదాస్పద బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. సవరించాలనుకుంటున్న నిబంధనలు అవినీతి అధికారులకు రక్షణ కల్పించేలా ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు. ఇకపై ప్రభుత్వం చేపట్టే పనుల్లో అధికారి పనిని మూల్యాంకనం చేసేందుకు ప్రజలకున్న హక్కును కొత్త సవరణలు కాలరాస్తాయని, దీని ఆధారంగా అవినీతి అ«ధికారులు చెలరేగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా సమాజంలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాప్రయోజనం లోపిస్తాయని సమాచార కమిషనర్ మాఢభూషి శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కేంద్రం సమాచార హక్కు చట్టంలోని నిబంధనలను సవరించాలని ప్రయత్నిస్తే ఉద్యమాల ఎదుర్కొనక తప్పదని ఆర్టీఐ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. -
జనాయుధానికి జనాందోళనే రక్ష
సమకాలీనం విధాన నిర్ణయాలకు ముందు అధికారిక పత్రాల్లో సంబంధిత అధికారులు, పాలకులు రాసే వ్యాఖ్యలు (నోట్‌ఫైల్స్) ఎంతో కీలకమైనవి. అవినీతి–బంధు ప్రీతి–అక్రమాల గుట్టుమట్లను అవే బయట పెడతాయి. సమాచార హక్కు చట్టం కింద పౌరులు అవన్నీ పొందవచ్చు. ‘ఔను, మీవి ప్రజాకార్యాలయాలే, ప్రజలకు సమాచారం ఇవ్వండి, చట్టానికి కట్టుబడండి’ అని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా రాజకీయపక్షాలు పెడచెవిన పెడుతున్నాయి. ఈ క్రమంలో... కమిషన్లను నిర్వీర్యపరిచే తాజా సవరణ ప్రతిపాదన ప్రమాదకరమనే భావన ఉంది. ప్రజాప్రతిఘటనే దీనికి సరైన మందు. ప్రజలు పోరాడి సాధించు కున్న పౌర సదుపాయం, సమాచార హక్కు చట్టాన్ని పలుచన చేసే ప్రమాదం మూడో మారు ముంచు కొచ్చింది. ఆ ప్రమాదం తెస్తున్నదెవరో కాదు, స్వయానా కేంద్ర ప్రభుత్వమే! ఇదివరకు రెండు మార్లు ప్రయత్నం చేసిందీ కేంద్రమే! కాకపోతే ఇంతకు మున్ను యూపీఏ ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు చేస్తున్నది ఎన్డీయే ప్రభుత్వం. లోగడ చేసింది రెక్కలు విరిచే యత్నమైతే ఇప్పుడు చేసేది తలనరకడమే! ఈ ప్రయత్నాన్నీ అడ్డుకోవాల్సింది ప్రజలే! ఇదివరకటి రెండు యత్నాల్నీ దేశ పౌరులే సమర్థంగా అడ్డుకొని చట్ట సవరణ జరగనీకుండా తమ హక్కును కాపాడు కున్నారు. ఇక ముందైనా కాపాడుకోవడం పౌర సమాజం కర్తవ్యంగా మారింది. క్షేత్రపరంగా ఆర్టీఐ అమలును క్రమంగా గండికొట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు చట్టపరంగానూ దెబ్బకొట్టే ప్రతిపాదనను ముందుకు తోస్తున్నాయి. ఫలితంగా, సమాచారం పొందే పౌర హక్కు విషయమై రాజ్యాంగ స్ఫూర్తికే భంగం వాటిల్లు తోంది. పౌరసంఘాలతో పాటు విపక్ష రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు ముసాయిదాను రాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను గురువారం ఎజెండాలో చేర్చారు. కానీ, జరగలేదు. ఇక పార్లమెంటు లోపలా, బయటా గట్టి వ్యతిరేకత, ప్రజాందోళనలు వస్తే తప్ప ఈ సవరణ ఆగక పోవచ్చు! అదే జరిగితే ఆర్టీఐ చట్టం అమలు మరింత నీరుకారడం ఖాయం. గుండెకాయనే బలహీనపరిస్తే... సమాచార హక్కు చట్టం అమలులో అత్యంత కీలక పాత్ర సమాచార కమిషన్లది. 2005లో వచ్చిన ఈ చట్టం, ప్రభుత్వాలతో సహా మరే సంస్థలకూ ఆ బాధ్యతను అప్పగించలేదు. కేంద్ర ప్రభుత్వంలోని పౌర కార్యాలయాల్లో చట్టం అమలు బాధ్యత కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ది కాగా రాష్ట్రాల్లో ఆ బాధ్యత రాష్ట్ర కమిషన్లు (ఎస్ఐసీ) నిర్వహించాలి. ఫిర్యాదులు, అప్పీళ్లను కూడా పాక్షిక న్యాయస్థాన హోదాలో కమిషన్లే పరిష్కరించాలి. çపూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాలి. ఇప్పుడా కమిషన్లను బల హీనపరిచే ప్రక్రియకు కేంద్రం పూనుకుంది. కమి షన్లో ముఖ్యులైన కమిష నర్ల హోదా, పదవీకాలం, జీతభత్యాల విషయంలో మార్పులు ప్రతిపాదిస్తున్నారు. చట్టంలో పొందుపరచినట్టు కాకుండా నిర్ణ యాధికారాన్ని ఏక పక్షంగా కేంద్ర ప్రభుత్వానికి దఖలు పరచడమే తాజా చట్టసవరణలోని ముఖ్యాంశం. కేంద్ర సమాచార ముఖ్య కమిషనర్ (సీఐసీ) స్థాయిని ప్రస్తుత చట్టంలో కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ (సీఈసీ)కు సమాన హోదాగా పేర్కొ న్నారు. తత్సమాన జీత–భత్యాలు ఇస్తున్నారు. కేంద్ర ఇతర సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల సమాన హోదాను, జీతభత్యాలనూ కల్పించారు. రాష్ట్రాల్లోని సమాచార ముఖ్య కమిషనర్‌కు కేంద్ర ఎన్నికల కమిషనర్ హోదా, సమాచార ఇతర కమిష నర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) హోదాను చట్టం కల్పిస్తోంది. చట్టం పకడ్బందీ అమ లుకు ఇది అవసరమని అప్పట్లో భావించారు. ప్రభు త్వాలకు లొంగిఉండనవసరం లేకుండా, స్వేచ్ఛగా– స్వతంత్య్రంగా వ్యవహరించేందుకే వాటిని కల్పిం చారు. ఎవరూ మార్చడానికి వీల్లేకుండా ఈ అంశాల్ని చట్టంలో భాగం చేశారు. పార్లమెంటు స్థాయీ సంఘం (పిఎస్సీ) చొరవతోనే అప్పుడీ నిర్ణయం జరిగింది. గత పుష్కర కాలంగా అమలు పరుస్తున్నారు. ఇది సముచితం కాదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరందరికీ అయిదేళ్ల పదవీ కాలాన్ని చట్టం నిర్దేశిస్తోంది. అలా కాకుండా, ఇకపై హోదా, పదవీకాలం, జీతభత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించి, అమలుపరిచే విధంగా అధి కారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయనున్నారు. ఎన్నికల ముఖ్య కమిషనర్ అన్నది రాజ్యాంగ హోదా అని, సమాచార ముఖ్య కమిషనర్ చట్టపరమైన హోదా కనుక సమానంగా ఉండనవసరం లేదనేది తాజా వాదన. కమిషనర్ల పదవీ కాలాన్ని మొదట్లో అయిదేళ్లని పేర్కొన్నారు, అంత అవసరంలేదనే కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. ఈ మార్పులు ఏ మంచికోసమో ఎక్కడా సరైన వివరణ లేదు. ముసాయిదాలో సవరణ బిల్లు ఉద్దేశాలు–లక్ష్యాలను వెల్ల డిస్తూ, హోదాలను హేతుబద్దం చేయడానికే అని పేర్కొన్నారు. మరోపక్క ఇది ఖచ్చితంగా చట్టం అమలును నీరు కారుస్తుందని పౌర సమాజం ఆందోళన. ప్రజా సమాచార హక్కు జాతీయ ప్రచార మండలి(ఎన్సీపీఆర్ఐ), మజ్దూర్ కామ్‌గార్ శక్తి సంఘటన్ (ఎమ్కేఎస్సెస్)వంటి సంఘాలు అప్పుడే నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్రం ఇకపై సమాచార కమిషన్లను, తద్వారా వ్యవస్థను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే అన్నది విమర్శ. ప్రజా క్షేత్రంలో ఏ చర్చ జరుపకుండానే ఈ ప్రతి పాదన తెస్తున్నారు. ఈ ‘కత్తిరింపులు’, కేంద్ర గుత్తాధిపత్యం వల్ల అధికార యంత్రాంగం ఇక కమిషనర్లను, స్థూలంగా కమిషన్లను ఖాతరు చేయదనే భయ ముంది. ఫలితంగా అన్ని స్థాయిల్లోనూ సమా చార నిరాకరణ, జాప్యం సర్వసాధారణమయ్యే ప్రమా దాన్నీ ప్రజాసంఘాలు శంకిస్తున్నాయి. అప్పుడు విచక్షణతో చేసిందే! రాజ్యాంగపరమైన బాధ్యత నిర్వహించడమంటే రాజ్యాంగంలో ఆ పదవిని విధిగా ప్రస్తావించి ఉండా లనే వాదన సరికాదు. పౌరుల ఓటు హక్కుకు రక్షణ కల్పించం ఎలాంటి బాధ్యతో, పౌరులు సమాచారం తెలుసుకునే హక్కును పరిరక్షిం చడం కూడా అంతే బాధ్యతాయుతమైన కార్యం. ఈ రెండు హక్కుల మూలాలూ... భారత రాజ్యాంగం భద్రత కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ హక్కు (అధికరణం 19)లో ఒదిగి ఉన్నాయి. పాలకులుగా ఇష్టమైన వారిని ఎన్ను కోవడం ద్వారా తమ భావ ప్రకటన స్వేచ్ఛను పౌరులు వినియోగించుకున్నట్టే, వివిధ కార్యక్ర మాల్లో పాల్గొని ప్రయోజనం పొందేలా వాటి గురిం చిన సమాచారం తెలుసుకోవడం కూడా వారి ప్రాథ మిక హక్కులో భాగమే! ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో (స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రాజ్ నారాయన్–1976, ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా–1982) నొక్కి చెప్పింది. ప్రభుత్వ వ్యవస్థల నుంచి సమాచారం పొందడం పౌరుల ప్రాథమిక హక్కేనని ఐక్యరాజ్యసమితి మానవహ క్కుల సంఘం కూడా తన 2011 నివేదికలో నిర్ద్వం దంగా వెల్లడించింది. పౌరుల ప్రాథమిక హక్కు రక్షణ విధులు నిర్వర్తించే సమాచార కమిషన్లు, అందులోని కమిషనర్లు రాజ్యాంగ విహిత బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టే లెక్క. వారికి కేంద్రంలో ఎన్నికల కమి షనర్ హోదా, రాష్ట్రంలో సీఎస్ హోదా కల్పించడం నిర్దిష్ట లక్ష్యంతోనేనని, ఇదే లేకుంటే ఇంతటి వ్యవ స్థను ఏర్పాటు చేయడంలో అర్థమే లేదని పార్లమెం టరీ స్థాయి సంఘం (పీఎస్సీ) కూడా పేర్కొంది. వివిధ స్థాయిల్లో చర్చ కూడా జరిగింది. 2005 చట్టం రూపొందే క్రమంలో చేసిన బిల్లు ముసాయిదాలో ఒక ప్రతిపాదన ఉండింది. ప్రతి కమిషన్లోనూ అదనంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే డిప్యూటీ కమిషనర్లు ఉండాలన్నది ఆ ప్రతి పాదన. దానివల్ల, కేంద్రం జోక్యంతో కమిషన్ల స్వయం ప్రతి పత్తికి భంగమని పీఎస్సీనే అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకేనేమో, చట్టంలో సదరు డిప్యూటీ కమిషనర్ల వ్యవస్థకు స్థానం కల్పించలేదు. అటు వంటిది, ఇప్పుడు అందుకు భిన్నంగా కమిష నర్ల హోదా, పదవీకాలం, జీతభత్యాలంతా కేంద్రం ఇష్టా నుసారం జరగాలని చేస్తున్న ప్రతిపాదన కమిషన్ల స్వతంత్ర పనితీరుకు పూర్తి భంగకరమే. ప్రతిఘటనతోనే ఆగిన కుయుక్తులు! స్వాతంత్ర భారత చరిత్రలో వచ్చిన అతి కొద్ది మంచి చట్టాల్లో మేలైనది, జనహితమైనదిగా సమాచార హక్కు చట్టానికి పేరుంది. పాలనా వ్యవస్థల్లో ఎంతో కొంత పారదర్శకతకు, తద్వారా అధికార యంత్రాంగం జవాబుదారీతనానికి ఈ చట్టం కారణమౌ తోంది. రాజకీయ వ్యవస్థ దుందుడుకు తనాన్నీ కొంతమేర నియంత్రించగలుగుతోంది. జనాల్లో అవ గాహన పెరిగే క్రమంలోనే ఇది మరిన్ని ఫలాలు అందించి, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే ఆస్కార ముంది. కానీ, ప్రభుత్వాలు, ముఖ్యంగా పాలనా యంత్రాంగం దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు నిరంతరం సాగిస్తూనే ఉన్నాయి. కమిషన్లను రిటైర్డ్ ఉద్యోగులతో నింపడమో, అసలు నింపక ఖాళీలతో కొనసాగించడమో చేస్తున్నాయి. మరోవైపు చట్టాన్ని పలుచన చేసే ఎత్తుగడలకు వెళ్తున్నాయి. చట్టం వచ్చి ఏడాది తిరగక ముందే గండికొట్టే యత్నం జరిగింది. విధాన నిర్ణయాలకు ముందు అధికారిక పత్రాల్లో సంబంధిత అధికా రులు, పాలకులు రాసే వ్యాఖ్యలు (నోట్‌ఫైల్స్) ఎంతో కీలకమైనవి. అవినీతి–బంధు ప్రీతి–అక్రమాల గుట్టుమట్లను అవే బయట పెడ తాయి. సమాచార హక్కు చట్టం కింద పౌరులు అవన్నీ పొందవచ్చు. వాటిని ఈ చట్టపరిధి నుంచి తొలగించే యత్నం 2006 జూలైలోనే జరిగింది. ఇందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్టీఐ కార్యకర్తల చొరవతో దేశ వ్యాప్తంగా ఆందోళన జరిగింది. అన్నాహజారే దీక్షకు దిగారు. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సమాచారంలో భాగమైన ‘నోట్‌ఫైల్స్’ను నేటికీ ఏ పౌరుడైనా పొందవచ్చు. ఈ హక్కును నీరుగార్చే రెండో దాడి 2013 ఆగస్టులో జరిగింది. లోక్‌సభలో బిల్లు ముసాయిదాను కూడా ప్రవేశపెట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టం పరిధిలో ఏర్పడ్డ రాజకీయపక్షాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించేందుకు చేసిన యత్నమది. దాని క్కూడా పౌర సంస్థల నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమైంది. మినహాయింపుకోసం చట్టసవరణకు యత్నించిన వారు, పౌర కార్యాలయాలుగా రాజకీ యపక్షాలన్నీ చట్టం పరిధిలోకే వస్తాయి అంటే మాత్రం ఒప్పుకోరు! ‘ఔను, మీవి ప్రజాకార్యాల యాలే, ప్రజలకు సమాచారం ఇవ్వండి, చట్టానికి కట్టుబడండి’ అని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా రాజకీయపక్షాలు పెడచెవిన పెడుతున్నాయి. ఈ క్రమంలో... కమిషన్లను నిర్వీర్య పరిచే తాజా సవరణ ప్రతిపాదన ప్రమాదకరమనే భావన ఉంది. ప్రజాప్రతిఘటనే దీనికి సరైన మందు. ప్రజాస్వామ్య పరిపుష్ఠికి ఆయుధమైన ఆర్టీఐ చట్టాన్ని పోరాడైనా కాపాడుకోవడం పౌరసమాజ కర్తవ్యం. వ్యాసకర్త సమాచార పూర్వ కమిషనర్ దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఆర్టీఐ కమిషనర్లను నియమించరా?
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం పరిధిలోని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్రాల సమాచార కమిషన్ల(ఎస్ఐసీ)లో ఖాళీల్ని భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంపై ఈ జాప్యం ప్రభావం చూపుతుందని, ఖాళీల్ని ఎందుకు భర్తీ చేయలేదో జవాబు చెప్పాలని కేంద్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. సమాచార హక్కు కమిషనర్లను భర్తీ చేయకపోవడంతో వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ ముగ్గురు పిటిషనర్లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది. వెంటనే చర్యలు చేపట్టాలి: సుప్రీం ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఖాళీల్ని భర్తీ చేయకపోతే ఈ రాజ్యాంగ సంస్థల నిర్వహణ కష్ట సాధ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఈ విభాగాల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర చట్టబద్ధ సంస్థల్లోను ఇది అలవాటుగా మారిపోయింది. వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదు. మీరు ఏదొకటి చేయాలి’ అని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్‌కు సుప్రీం స్పష్టం చేసింది. సీఐసీలో 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదుల పెండింగ్ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్, మాజీ నేవీ అధికారి లోకేశ్ బాత్రా, అమ్రితా జోహ్రిల తరఫున న్యాయవాది కామిని జైస్వాల్ వాదిస్తూ.. ప్రస్తుతం సీఐసీలో 4 ఖాళీలున్నాయని, 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నా బ్యాక్‌ల్యాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, కేరళ, కర్ణాటక, ఒడిషా తదితర రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్లలో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా ఆర్టీఐ చట్టాన్ని కాలరాస్తున్నారు. కేంద్ర సమాచార కమిషన్ వద్ద వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016లో వచ్చిన అప్పీళ్లూ పెండింగ్‌లో ఉన్నాయి’ అని జైస్వాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్‌లో ఒక్క కమిషనర్‌ను కూడా భర్తీ చేయలేదని, ఆ రాష్ట్ర ఎస్ఐసీ ప్రస్తుతం ఎలాంటి విధులూ నిర్వర్తించడం లేదని కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర కమిషన్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయని, అక్కడ 40 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, కర్ణాటకలో ఆరు పోస్టుల ఖాళీగా ఉండగా.. 33 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.కేరళలో ఒకే ఒక్క కమిషనర్ విధుల్లో ఉన్నారని, అక్కడ 14 వేల అప్పీళ్లను పరిష్కరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, ఒడిశా, కర్ణాటక, ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. -
సీఎంగారి భార్య సంగతేంటి?
తనకు న్యాయం చేయాలంటూ అడిగిన ఓ ఉపాధ్యాయురాలిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ ఆగ్రహం వెల్లగక్కారు. మీడియా ముఖంగానే ఆమెపై అరిచి.. సస్పెండ్, అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు. సోషల్ మీడియా, జాతీయ ఛానెళ్లలో వీడియో వైరల్ కావటంతో తీవ్ర దుమారం రేగింది. అయితే ఆర్టీఐ చట్టం ద్వారా ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగు చూసింది. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ భార్య సునీత రావత్ ప్రైమరీ స్కూల్ టీచర్‌గా పని చేశారు. 1992లో పౌదీ గద్వాల్లో ఆమె తొలుత బాధ్యతలు చేపట్టారు. అయితే నాలుగేళ్లకే ఆమెను డెహ్రూడూన్‌కు బదిలీ చేశారు. ఆపై 22 ఏళ్లు ఆమె అక్కడే విధులు నిర్వహించారు. పైగా 2008లో ప్రమోషన్ కూడా దక్కింది. ఓ సామాజిక వేత్త చొరవతో ఆర్టీఐ యాక్ట్ ద్వారా విషయం వెలుగు చూసింది. ఇక సీఎం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉత్తర బహుగుణ(57) విషయానికొస్తే ఉత్తర కాశీలో 25 ఏళ్లుగా ఆమె టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2015లో భర్త చనిపోవటంతో పిల్లలు దగ్గర ఉండేందుకు డెహ్రాడూన్‌కు బదిలీ చేయాలని ఆమె గత కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ, అధికారులు మాత్రం స్పందించటం లేదు. పైగా ఆమె వంతు వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో విసిగిపోయిన ఆ పెద్దావిడ ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి జనతా దర్బార్‌కు వచ్చింది. అయితే సాయం చేయాల్సిన ముఖ్యమంత్రి కాస్తా ఆ మహిళ మీద కోపంతో విరుచుకుపడ్డారు. దాంతో బహుగుణ ముఖ్యమంత్రిని తిడుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ‘సీఎం ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు అంతరాయం కల్గించిందనే నేరం’ కింద పోలీసులు బహుగుణను అరెస్ట్ చేసి, ఆపై బెయిల్ మీద ఆమెను విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆమె తన గోడును వెల్లగక్కారు. ‘న్యాయం చేయమని నేను అక్కడికి వెళ్లాను. నాపై అరిచి ఆధిపత్యం ప్రదర్శించారు. అందుకే బదులుగా నేను అరిచాను. కానీ, కానీ, ఆయన నాపై దొంగ అనే నింద వేశారు. అది మాత్రం తట్టుకోలేకపోయా’ అంటూ బహుగుణ విలపించారు. బహుగుణ వీడియో.. ఆపై ప్రస్తుతం సునీత రావత్ బదిలీ వ్యవహారం వెలుగు చూడటంతో పలువురు సీఎం రావత్ తీరును ఎండగడుతున్నారు. -
లీజు రెన్యువల్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: తన స్థలంలో ఉన్న ప్రభుత్వ డిస్పెన్సరీ లీజు పునరుద్ధరణ(రెన్యువల్)కు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వడానికి కార్మిక శాఖ నిరాకరించడంపై ప్రధాని మోదీ ఆంటీగా చెప్పుకుంటున్న 90 ఏళ్ల మహిళ అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించింది. గుజరాత్‌లోని వాద్నగర్లో దహిబెన్ నరోత్తమ్‌దాస్ మోదీ నివసిస్తున్నారు. ఆమెకు చెందిన స్థలంలో బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ నడుస్తోంది. 1983లో రూ. 600 అద్దె ఇవ్వగా.. అనంతరం రూ.1,500కు పెంచారు. అప్పటి నుంచి అద్దె పెంచకపోవడంతో గత ఏడాది డిసెంబర్లో లీజు వివరాలు, పునరుద్ధరించక పోవడానికి కారణాలు చెప్పాలంటూ కార్మిక శాఖకు సమాచార హక్కు చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)కి దహిబెన్ ఫిర్యాదు చేశారు. గత వారం సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు వద్దకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. లీజును రెన్యువల్ చేయకపోవడంతో ఆ మొత్తంతో జీవించడం కష్టంగా మారిందని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆమె మొదట దాఖలు చేసిన పిటిషన్‌కు సరైన సమాధానం రాకపోవడంతో.. 2018 జనవరి 9న ఆమె రెండో అప్పీలు దాఖలు చేశారు. అందులో తాను ప్రధాని మోదీ ఆంటీనని, తనకు న్యాయం జరగకపోతే ప్రధానికే ఈ విషయం తెలియజేస్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో బంధుత్వం గురించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆమె అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ ఎందుకు సమాధానం ఇవ్వలేదని, ఆమె ఆర్టీఐ పిటిషన్‌ను విచారించిన అధికారులపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలపాలని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు ప్రశ్నించారు. -
నోట్ల రద్దు.. షాకింగ్ రిపోర్ట్
సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దుకు సంబంధించి దిగ్భ్రాంతికి గురిచేసే నివేదిక ఒకటి బయటపడింది. ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే వ్యక్తి సమాచార హక్కు ద్వారా ఓ పిటిషన్ దాఖలు చేయగా.. విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూశాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు చెందిన ఓ బ్యాంకులో రద్దైన నోట్లు భారీగా డిపాజిట్ అయినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి ‘ది వైర్’ పూర్తి కథనం ప్రచురించింది. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులతోపాటు, డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో రద్దైన పాత నోట్లు ఏ మేర జమ అయ్యాయో తెలపాలంటూ ముంబైకి చెందిన మనోరంజన్.. నాబార్డ్‌కు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన నాబార్డ్ పూర్తి లెక్కలతోసహా వివరాలను అందించింది. ముఖ్యంగా గుజరాత్లో రెండు పెద్ద జిల్లా సహకార బ్యాంకులు అత్యధికంగా రద్దైన నోట్లను స్వీకరించినట్లు వెల్లడైంది. అందులో ఒకటి అహ్మదాబాద్ డీసీసీబీ కాగా, రెండోది రాజ్‌కోట్ డీసీసీబీ. ఐదు రోజుల్లోనే... అహ్మదాబాద్ డీసీబీకి అమిత్ షా 2000 సంవత్సరంలో చైర్మన్‌గా వ్యవహరించారు. గతకొన్నేళ్లుగా డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. నవంబర్ 8, 2016న ప్రధాని మోదీ రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. రద్దైన నోట్లను డిపాజిట్ చేసేందుకు గడువు కూడా ఇచ్చారు. అయితే కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే రూ.745. 59 కోట్ల విలువైన నోట్లు ఏడీసీబీలో డిపాజిట్ అయ్యాయి. విషయం ఏంటంటే కొన్నిరోజులకే డీసీసీబీల ద్వారా అనేక మంది నల్లధనాన్ని వైట్‌గా మార్చుకున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో నవంబర్ 14 నుంచి కేంద్రం డీసీసీబీల్లో నోట్ల డిపాజిట్‌ను నిలిపివేసింది. అయితే అప్పటికే రికార్డు స్థాయిలో డిపాజిట్లు జరిగిపోగా... ఎలాంటి విచారణకు ప్రభుత్వం ఆదేశించలేదు కూడా. 2017 మార్చి 31 నాటికి అహ్మదాబాద్ డీసీసీబీలో మొత్తం డిపాజిట్లు రూ. 5050 కోట్లు. ఇది రాష్ట్ర సహకార బ్యాంకు కంటే చాలా రెట్లు ఎక్కువ. ఎంతలా అంటే ఎస్సీబీలో డిపాజిట్లు కేవలం రూ.1.11 కోట్లు మాత్రమే. మరోవైపు రాజ్‌కోట్ డీసీసీబీలో కూడా రూ. 693.19 కోట్ల విలువైన నోట్ల డిపాజిట్ జరిగింది. ఈ బ్యాంకు చైర్మన్ అయిన జయేష్ భాయ్ విఠల్‌భాయ్ రదాదియా.. ప్రస్తుతం గుజరాత్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు ద్వారా బడాబాబులకే లబ్ధి చేకూరిందన్నది తేటతెల్లమైందని మనోరంజన్ అంటున్నారు. -
పార్టీలకు ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ సంస్థల కిందకే వస్తాయనీ, వాటన్నింటికీ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం వర్తిస్తుందని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం స్పష్టతనిచ్చింది. జాతీయ పార్టీలను ప్రభుత్వ సంస్థలుగా ప్రకటిస్తూ, వాటికీ ఆర్టీఐ చట్టం వర్తిస్తుందని 2013 జూన్‌లోనే కేంద్ర సమాచార కమిషన్ ఆదేశాలిచ్చింది. ఈసీ మాత్రం ఇటీవల ఇందుకు విరుద్ధంగా మాట్లాడటం వివాదాస్పదమవడం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు విరాళాల ద్వారా వచ్చిన మొత్తమెంతో చెప్పాలని సహ చట్టం కింద ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా, ఆ వివరాలు తమ వద్ద లేవనీ, పార్టీలు చట్టం పరిధిలోకి రావంటూ సమాధానమిచ్చింది. ఈ విషయం సోమవారం పత్రికల్లో రావడంతో జాగ్రత్త పడిన ఈసీ తన సమాధానంపై వివరణ ఇచ్చింది. ఏకకాల ఎన్నికలపై స్పందించని పార్టీలు లోక్‌సభతోపాటు దేశంలోని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరపడంపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా న్యాయ కమిషన్ కోరగా, ఏడు జాతీయ పార్టీల్లో ఒక్కటి కూడా స్పందించలేదు. తమ అభిప్రాయాలు చెప్పిన ప్రముఖులు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మలు మాత్రమే. అభిప్రాయాలు చెప్పేందుకు మే 8 చివరి తేదీ కాగా, ఈసీ గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీల్లో ఒక్క పార్టీ కూడా తమ వైఖరిని తెలియజేయలేదు. నారాయణ స్వామి మాత్రం.. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగాన్ని సవరించి కొన్ని శాసనసభల పదవీకాలాన్ని పెంచడం లేదా తగ్గించాల్సి ఉంటుందనీ, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పినట్లు సమాచారం. -
సర్వీస్ ఛార్జీ పేరిట ఐఆర్సీటీసీ నిర్వాకం
జైపూర్: సర్వీస్ టాక్స్ పేరుతో ఐఆర్సీటీసీ చేసిన నిర్వాకం వెలుగు చూసింది. తన నుంచి రూ.35 అదనంగా వసూలు చేయటంపై రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో 9 లక్షల మంది ప్రయాణికుల నుంచి సుమారు రూ.3 కోట్లకు పైగానే ఐఆర్సీటీసీ సర్వీస్ ఛార్జీల రూపంలో వసూలు చేసినట్లు తేలింది. వివరాల్లోకి వెళ్తే... ఏప్రిల్, 2017లో కోటాకు చెందిన సుజిత్ స్వామి అనే ఇంజనీర్ కోటా నుంచి న్యూఢిల్లీ వరకు టికెట్ బుక్ చేసుకున్నాడు. జూలై 2న అతను ప్రయాణించాల్సి ఉంది. అయితే టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటంతో ఆ యువకుడు తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. దీంతో టికెట్ డబ్బులు రిఫండ్ అయ్యాయి. మొత్తం రూ. 765 టికెట్ ధరకుగానూ రూ.665 అతనికి వెనక్కి వచ్చింది. లెక్క ప్రకారం చూసుకుంటే అతనికి రూ.65 మాత్రమే ఛార్జీ చేయాల్సి ఉంది. కానీ, అదనంగా రూ. 35 వసూలు చేయటంతో అతను న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ వివరణ ప్రకారం... అదనపు ఛార్జీల వ్యవహారంపై సుజిత్ తొలుత ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశాడు. మిగతా సొమ్మును త్వరలోనే రిఫండ్ చేస్తామని ఐఆర్సీటీసీ అతనికి బదులిచ్చింది. కానీ, అది జరగలేదు. దీంతో ఆర్టీఐ కింద వివరణ కోరగా.. దానికి ఐఆర్సీటీసీ ఇచ్చిన వివరణను అతను మీడియాకు చూపించాడు. ‘రైల్వే కమర్షియల్ సర్క్ఘులర్ 43’ ప్రకారం.. జీఎస్టీ అమలు కంటే ముందే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. జీఎస్టీ అమలు(జూలై 1వ తేదీ తర్వాత)లోకి వచ్చాక టికెట్ రద్దు చేసుకుంటే వారికి కూడా సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయి. ఆ లెక్కన సుజిత్‌కు రిఫండ్ చెయ్యాల్సిన అవసరం లేదు. అందుకే సుజిత్ నుంచి రూ.100(రూ.65 క్లరికల్ ఛార్జ్+సర్వీస్ టాక్స్ రూ.35) వసూలు చేయటం జరిగింది అని తెలిపింది. అంతేకాదు ఆర్టీఐ కింద స్వామి దాఖలు చేసిన మరో లేఖలో ఆశ్చర్యానికి గురిచేసే విషయం వెలుగు చూసింది. మొత్తం 9 లక్షల ప్రయాణికుల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేశారు. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి జూలై 11 రోజుల మధ్య ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకుని.. ఆపై రద్దు చేసుకున్న వారికి ఇలాగే ఛార్జీల పేరుతో కోతలు విధించారు. ఆ సొమ్ము మొత్తం రూ.3.34 కోట్లుగా తేలింది. చాలా మంది ప్రయాణికులు ఈ విషయం తెలీకపోగా.. మరికొందరు తెలిసినా కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఆర్టీఐ వివరణలో ఉందని స్వామి చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై లోక్‌అదాలత్‌లో సుజిత్ స్వామి పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో అదాలత్.. రైల్వే బోర్డు చైర్మన్‌కి, పశ్చిమ మధ్య రైల్వే జీఎంకి, ఐఆర్సీటీసీ జీఎంకీ, కోటా డివిజినల్ రైల్వే మేనేజర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది. -
‘ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ’
సాక్షి, న్యూఢిల్లీ : బీసీసీఐని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని లా కమిషన్ బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. తమది ప్రైవేట్ సంస్థ అన్న బీసీసీఐ వాదనను లా కమిషన్ తోసిపుచ్చింది. బీసీసీఐతో పాటు దాని అనుబంధ క్రికెట్ అసోసియేషన్లను ఆర్టీఐ చట్ట పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. 2019 నుంచే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడంపై ముసాయిదా శ్వేతపత్రాన్ని లా కమిషన్ వెల్లడించిన నేపథ్యంలో తాజా ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచడం గమనార్హం. బీసీసీఐ ప్రభుత్వ తరహాలో వ్యవహరిస్తుండటంతో ఇతరులకు రాజ్యాంగం నిర్ధేశించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని లా కమిషన్ పేర్కొంది. బీసీసీఐని ఆర్టీఐ చట్టపరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై సిఫార్సు చేయాలని 2016, జులైలో సుప్రీం కోర్టు లా కమిషన్‌ను కోరింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరొందిన బీసీసీఐ తమిళనాడు సొసైటీల రిజిస్ర్టేషన్ చట్టం కింద నమోదై ప్రైవేట్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
‘సమాచారం’ మన హక్కు
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పథకాల అమలు, మంజురైన నిధులు, చేసిన పనులు తదితర వివరాల సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది. అయితే, తాము కోరిన సమాచారం పొందేందుకు ఓ చట్టం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. కేవలం రూ.10తో దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు సంబంధించిన ఏ సమాచారమైనా పొందే వీలుంది. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని ప్రతి పౌరుడు అడిగి తెసుకోవాలన్న ఉద్ధేశంతో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచైనా దరఖాస్తు చేసుకుని.. కావాల్సిన సమాచారం పొందవచ్చు. ప్రభుత్వం చేసిన పనులు, నిధుల విడుదల, వినియోగం తదితర వివరాలను సమగ్రంగా తెలుసుకోవచ్చు. ప్రతి కార్యాలయంలో వివరాలు ఉండాలి.. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, సమాచార అధికారి, అప్పిలేట్ అధికారిని నియమిస్తారు. వారి పేర్లు, ఫోన్ నంబర్లను ప్రజలకు కనిపించేలా బోర్డుపై స్పష్టంగా రాసి ఉంచాలి. తెల్లకార్డు ఉంటే ఫీజు ఉచితం తెల్లకార్డు ఉన్నవారికి దరఖాస్తు రుసుం ఉచితం. గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికి దరఖాస్తు రుసుం లేదు. మండల స్థాయిలో అయితే రూ.5, జిల్లా స్థాయిలో రూ.10 చెల్లించాలి. దీనిని నగదు, డీడీ, బ్యాంక్ చెక్కు, పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించవచ్చు. కాగా, అడిగిన సమాచారం మేరకు వివరాలు ముద్రణ రూపంలో ఇచ్చేందుకు అయ్యే ఖర్చు మాత్రం దరఖాస్తుదారుడి నుంచే వసూలు చేస్తారు. సాధారణంగా దరఖాస్తు ఫీజుతో పాటు ముద్రణ రూపంలో సమాచారం కోరితే పేజీకి రూ.2 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సీడీ ద్వారా సమాచారం కోరితే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రికార్డులు పరిశీలన విషయంలో మొదటి గంటకు ఉచితం, ఆపై ప్రతి గంటకు రూ.5 చెల్లించాలి. సమాచారం కోరే పద్ధతి.. సమాచారం కావాల్సిన వారు సంబంధిత కార్యాలయంలో సమాచార అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తెల్లకాగితంపై రాస్తే సరిపోతుంది. రాయడం తెలియకపోయినా.. సమాచారం సక్రమంగా కోరే అవగాహన లేకపోయినా.. సంబంధిత పౌర సమాచార అధికారి తగిన సహాయం చేస్తారు. కోర్టు పరిశీలనలో ఉన్న సమాచారం, కేబినేట్ మీటింగ్‌లు, రికార్డులు, మంత్రులు, వారి కార్యదర్శుల నిర్ణయాలు, వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే సమాచారం ఇచ్చేందుకు నిరాకరించవచ్చు. అయితే, అవి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవైతే తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. స.హ. చట్టంపై అవగాహన కల్పించాలి సామాన్యులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సామాన్యులు వివిధ కార్యాలయాల సమాచారం కోసం కాళ్లరిగేలా తిరిగిన సందర్భాలు అనేకం. అలాగే సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత గడువులోగా సమాచారం అందించాల్సి ఉంటుంది. – వడ్డెపల్లి మల్లేశం, ఐకాస మండల చైర్మన్, హుస్నాబాద్ నిర్ణీత సమయంలో సమాచారం అందించాలి సమాచారం హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న సమాచారాన్ని నిర్ణీత గడువులోగా దరఖాస్తుదారుడికి అందించాలి. లేని పక్షంలో సంబంధిత పౌర సమాచార అధికారులు బాధ్యుత వహించాలి. దరఖాస్తుదారుడి ఫిర్యాదు మేరకు కోర్టు చట్టరీత్యా వారిపై చర్య తీసుకునే అవకాశం ఉంది. – భీమా సాహెబ్, న్యాయవాది, హుస్నాబాద్ -
బీసీసీఐ ప్రజా సంస్థే: లా కమిషన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి మింగుడు పడని నిర్ణయాన్ని లా కమిషన్ తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఈ క్రికెట్ బోర్డు ప్రజా సంస్థ అని తేల్చింది. సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం లా కమిషన్ సిఫారసులను ఆమోదిస్తే, ఆర్టీఐ చట్టపరిధిలోకి బోర్డు వస్తే... కోర్టుల్లో ఇక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) వెల్లువెత్తుతాయి. జట్ల సెలక్షన్, ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన తీసుకున్నారని పిల్ దాఖలు చేసే అవకాశాలుంటాయి. జస్టిస్ బి.ఎస్.చౌహాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లా కమిషన్... బోర్డు, ఆటగాళ్లకు అందుతున్న పురస్కారాలను ఈ సందర్భంగా విశ్లేషించింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు తమ జెర్సీలపై త్రివర్ణాలను, హెల్మెట్లపై అశోక ధర్మచక్రాన్ని ప్రముఖంగా ధరిస్తున్నారని, వారు సాధించిన ఘనతలకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారాలను, పన్ను మినహాయింపులను, ప్రోత్సాహకాలను అందిస్తోందని... కాబట్టి దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్‌గా చూడలేమని, ప్రభుత్వ సంస్థే అవుతుందని కమిషన్ తమ సిఫారసులో పేర్కొంది. -
మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ చార్జీలు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థియేటర్లు, మల్టీప్లెక్స్ కాంప్లెక్సులు, మల్టీప్లెక్స్ థియేటర్లలోని పార్కింగ్ చార్జీల వసూళ్లకు చెక్ పడింది. పార్కింగ్ చార్జీలు వసూలు చేయరాదని గతంలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా యాజమాన్యాలు పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ కాంప్లెక్సుల్లో వస్తువుల కొనుగోలుకు వెళ్లిన వాహనదారుల నుంచి యాజమాన్యాలు ముక్కుపిండి మరీ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇక మల్టీప్లెక్స్ థియేటర్లు, సాధారణ థియేటర్లు ఇష్టం వచ్చిన రీతిలో పార్కింగ్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇవి మరింత భారంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధియేటర్ల యాజమాన్యాలు మోటారు సైకిళ్లకు రూ. 20, కార్లకు రూ. 40, ఆటోలకు రూ. 30, సైకిళ్లకు రూ.10 చొప్పున పార్కింగ్ చార్జీలుగా వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 16 మల్టీప్లెక్స్‌ల్లో 58 స్క్రీన్లు, 2,809 థియేటర్లు ఉన్నాయి. పార్కింగ్ చార్జీలు వసూలు చేయరాదనే కోర్టు తీర్పులున్న విషయం వాహనదారులకు తెలియకపోవడం, చార్జీల బాదుడును నియంత్రించాల్సిన స్థానిక సంస్థలు పట్టించుకోకపోవడంతో పార్కింగ్ వసూళ్ల దందా కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన న్యాయవాది వి.హరనాథ్‌బాబు సమాచార హక్కు చట్టం కింద పార్కింగ్ చార్జీల వివరాలు కోరుతూ రాష్ట్ర పట్టణ, ప్రణాళికశాఖ సంచాలకులకు ఈ నెల 10న అర్జీ పెట్టారు. దీనిపై ఆ శాఖకు చెందిన ప్రజా సమాచార అధికారి స్పందిస్తూ, పార్కింగ్ ఫీజులు వసూలు చేసేలా ఎటువంటి నియమ నిబంధనలు, ఉత్తర్వులు లేవంటూ హరనాథ్‌బాబుకు వివరణ ఇచ్చారు. పార్కింగ్ చార్జీలను వసూలు చేస్తున్న మల్టీప్లెక్సులు, థియేటర్లపై స్థానిక సంస్థలకు వాహనదారులు ఫిర్యాదు చేయవచ్చని ఆ లేఖలో స్పష్టం చేశారు. కాగా, పార్కింగ్ చార్జీలు వసూలు చేయరాదని 2003 మే నెలలో హైకోర్టు తీర్పు నిచ్చిందని, సీహెచ్ మదన్ మోహన్ అండ్ అదర్స్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కేసులో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, మల్టీప్లెక్స్ థియేటర్లు, సాధారణ థియేటర్లు పార్కింగ్ చార్జీలు వసూలు చేయకూడదనే తీర్పు ఉందని హరనాథ్‌బాబు స్పష్టం చేశారు. -
భద్రత సమాచారమూ ఇవ్వరా?
విశ్లేషణ రైళ్ల భద్రత ప్రాజెక్టు ఎవరి వ్యక్తిగత సమాచారం? ఇది ప్రయాణికుల, రైల్వే ఆస్తుల భద్రత. శాస్త్రవేత్తలు పరిశోధించి భద్రతకు సహకరిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ, శాస్త్రజ్ఞులు దీన్ని వ్యక్తిగత విషయం అంటారా? 1. రైళ్ల రక్షణ హెచ్చరిక వ్యవస్థ (ట్రైన్ ప్రొటెక్షన్ వార్నింగ్ సిస్టం)ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (íసీఈఎల్) 2013లో ప్రతిపాదించిన పథకానికి మంజూరు చేసిన వ్యయం ఎంత? 2. మంజూరుపత్రం కాపీ ఇవ్వండి. 3. విడుదలైన డబ్బు వినియోగించినట్టు ధృవీకరణ పత్రం నకలు ఇవ్వండి. 4. సీఈఎల్‌కు విడుదల చేసిన నిధుల వివరాలు ఇవ్వండి. 5. సీఈఎల్ పథకాన్ని పూర్తిచేసినట్టు ధృవీకరణ పత్రం నకలు ఇవ్వండి. 6. ప్రాజెక్టు పూర్తికాకపోతే కారణాలు తెలపండి, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పండి. 7. మంజూరు చేసిన వ్యయానికి లోబడి ప్రాజెక్టు పూర్తి అయిందా? కాక అదనపు ఖర్చును మంజూరు చేస్తూ జారీ చేసిన పత్రం నకలు ఇవ్వండి. 8. ఈ ప్రాజెక్టు టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలించి ఉంటుంది. వారి నివేదికలో ఆర్థిక సాంకేతిక లోపాల గురించి ప్రస్తావిస్తే ఆ వివరాలు ఇవ్వండని ఎనిమిది అంశాలమీద సమాచారాన్ని అడిగారు అస్తిత్వ అనే వ్యక్తి. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా శాఖ (డీఎస్ఐఆర్) జవాబు ఇవ్వాలి. కానీ ఇదంతా వ్యక్తిగతమట. సెక్షన్ 8(1)(జె) కింద ఇవ్వరట. అస్తిత్వ అడిగిన సమాచారం సంక్షిప్తంగానైనా ఇవ్వాలని మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. ప్రాజెక్టు వివరాలను వ్యక్తిగత సమాచారమంటూ తిరస్కరించడం తీవ్రమైన విషయం. రైళ్ల భద్రత ప్రాజెక్టు ఎవరి వ్యక్తిగత సమాచారం? ఇది ప్రయాణికుల, రైల్వే ఆస్తుల భద్రత. శాస్త్రవేత్తలు పరిశోధించి భద్రతకు సహకరిస్తారని ఎవరైనా అనుకుంటారు కానీ, శాస్త్రజ్ఞులు దీన్ని వ్యక్తిగత విషయం అంటారా? పోనీ íసీపీఐఓ భావించినట్టు ఇది వ్యక్తిగత సమాచారమని అనుకున్నా, దానికి జనహితం అనే మినహాయింపు ఉంది కదా! ఆ జనహితం కోసమైనా ఈ సమాచారం ఇవ్వవచ్చు కదా? ఆర్టీఐ దరఖాస్తు 23.5.2017న దాఖలైంది. విమల్ కుమార్ వరుణ్ ఆ దరఖాస్తును జి– విభా గం శాస్త్రజ్ఞుడు బీఎన్ సర్కార్‌కు పంపారు. సెక్షన్ 5(4) కింద అస్తిత్వగారు కోరిన సమాచారం ఇవ్వాలని కోరుతూ 25.5.2017న లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని సమాచార కమిషన్‌కు వివరణతో పాటు సమర్పించారు. అయినా బీఎన్ సర్కార్ ఇది వ్యక్తిగత సమాచారమనీ, సెక్షన్ 8(1)(జె) కింద ఇవ్వడం చెల్లదనీ జవాబిచ్చారు. మొదటి అప్పీలు అధికారి ఆదేశం తరువాత కూడా పూర్తి సమాచారం రాలేదని అస్తిత్వ కమిషన్‌కు వివరించారు. సీఇఎల్కు పరిశోధన చేయడానికి గాను తమ విభాగం (డీఎస్ఐఆర్) ఆర్థిక సాయం చేస్తుందని, మార్కెట్ అవసరాలను అనుగుణంగా కొన్ని ఉత్పత్తులు చేయడానికి సహకరించి, ఆ వస్తువులను వాణిజ్యపరంగా వినియోగిస్తుందని వివరించారు. కొన్ని ధృవపత్రాలు కూడా అస్తిత్వకు ఇచ్చామనీ, అయితే పొరబాటున వాటిని ధృవీకరించడం మరి చిపోయామనీ చెప్పారు. అయితే సీఈఎల్ అనేది కంపెనీ కనుక, వాణిజ్య వ్యవహారాలను నడుపుతుంది కనుక అడిగిన సమాచారం మొత్తం ఇస్తే అందులో వాణిజ్య రహస్యాలు ఉంటాయి కనుక ఇవ్వకూడదని సెక్షన్ 8(1)(డి) కింద మినహా యింపు వర్తిస్తుందని భావించామని, కానీ పొరబాటున సెక్షన్ 8(1)(జె) అని రాశామని కూడా సీపీఐఓ తన వివరణలో తెలియజేశారు. రికార్డు పరిశీలిస్తే డిసెంబర్ 13 (2017)న ఇచ్చిన జవాబుల్లో కూడా డీమ్డ్ పీఐఓ బీఎన్ సర్కార్ 5,6,7,8 అంశాలకు సరైన జవాబు, పూర్తి సమాచారం ఇవ్వలేదని తెలుస్తున్నది. అయిదో అంశంపైన ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అందుకు కారణాలు చెప్పలేదు. ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందో చెప్పలేదు. ఆరో ప్రశ్నకు ఆలస్యంగా ‘పరిశీలనలో ఉంది’ అని జవాబు ఇచ్చారు. ఏ పరిశీలన? ఎవరి పరిశీలన? ఏడో పాయింట్‌కు నాట్ అప్లికబుల్ అని ఊరుకున్నారు. మొత్తం ప్రాజెక్టు మంజూరైన వ్యయానికి లోబడి ఉందా లేదా అంటే వర్తించదు అని జవాబిస్తారా? ఎనిమిదో పాయింట్‌కు అటువంటి కమిటీ లేదు. కమిటీ ఏ లోపాన్నీ కనిపెట్టలేదని జవాబు. 5 నుంచి 8 వరకు పాయింట్లకు వాణిజ్య రహస్యానికి సంబంధమే లేదు. కనుక 8(1)(డి) కూడా వర్తించదు. బీఎన్ సర్కార్ గారు మళ్లీ మళ్లీ 8(1)(డి)నే వర్తిస్తుందని, పత్రాలను ధృవీకరించనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. శాస్త్రజ్ఞులు ఇవ్వాల్సిన జవాబులా ఇవి? విమల్ కుమార్ వరుణ్ సీపీఐఓ ఈ సమాచారం ఇవ్వాలని స్పష్టంగా లేఖ రాశారు. కానీ సమాచారం అధీనంలో ఉన్న శాస్త్రజ్ఞుడైన సర్కార్ నిరాకరించడం వల్ల ఇవ్వలేకపోయారు. అస్తిత్వ ఈ ప్రాజెక్టు నిర్వహణలో అనేకానేక లోపాలను వివరిస్తూ ఆడిట్ ఇచ్చిన ఒక నివేదిక భాగాలను కమిషన్‌కు సమర్పించారు. వీటికి జవాబి వ్వాలని కూడా కమిషన్ ఆదేశించింది. (అస్తిత్వ వర్సెస్ సైన్స్/టెక్నాలజీ మంత్రిత్వశాఖ CIC/DOSIR/A/2017/159662 కేసులో సీఐసీ 12 జనవరి 2018న ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాఢభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సమాచారం అడిగితే బెదిరింపా?
ఉద్యోగ నియామకాల్లో కుంభకోణాలకు సంబంధించి సమాచారం అడిగినవారిని, వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించడం ఆర్టీఐ ప్రా«థమిక సూత్రాలకే విరుద్ధం. దీని విచారణపై అలక్ష్యం మరింత నేరం. కార్మికుల బీమా కార్పొరేషన్ వారు గుమస్తాలు, ఇన్స్పెక్టర్ల నియామకంలో ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాయడానికి డబ్బు తీసుకుని వీలు కల్పించారనే అంశంపైన, సమాచార హక్కు చట్టం కింద అనేక దరఖాస్తుల ద్వారా సమాచారం అడిగారు హరీందర్ ధింగ్రా. కొంత ఇవ్వడం, మరికొంత లేదనడం, తరువాత మొదటి అప్పీలు, ఆ తరువాత రెండో అప్పీలు, ఫిర్యాదు తంతులన్నీ జరుగుతున్నాయి. సమాచార కమిషన్ కొన్ని కేసులలో ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలలో కొన్ని అంశాలు అమలు చేస్తూ కొంత సమాచారం ఇచ్చారు. రికార్డులు లేవన్నారు. సంబంధించిన సమాచారాన్ని, దస్తావేజులు చూపాలన్నారు. కుంభకోణాన్ని వెలికితీసి బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు ధింగ్రా. ఆ వ్యక్తులు శక్తులు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారాయన. ఇంటినుంచి బయటకు నడిచి వెళ్తుంటే బెదిరించడం, మోటార్ సైకిల్‌పైన ఇద్దరు వ్యక్తులు ఇదంతా ఆపేయ్ నీకు మంచిది కాదు అంటూ హెచ్చరించి జారుకోవడం జరుగుతూ వస్తున్నది. నీ కుటుంబ సభ్యులకు కూడా సమస్యలు వస్తాయని హెచ్చరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రత కల్పించాలని సమాచార కమిషన్‌ను కోరుతూ ఒక దరఖాస్తు ఇచ్చారు. సమాచార కమిషన్ ఉత్తర్వులు అమలు కాలేదనే ఫిర్యాదును అర్జెంట్‌గా స్వీకరించాలని కోరారు. సమాచార కమిషన్ వెంటనే పరిశీలనకు స్వీకరించింది. జనవరి 5న ఆయన ఫిర్యాదులను విచారించింది. ఆయన హరియాణా పోలీసులకు, కార్మిక మంత్రిత్వ శాఖకు, ఇఎస్ఐసీకి కూడా లేఖలు, వినతి పత్రాలు సమర్పించారు. డిసెంబర్ 20వ తేదీన జరిగిన రెండో అప్పీలు విచారణలో సమాచార కమిషన్ ముందు ఇఎస్ఐసీ సంస్థ అధికారులు తాము కొన్ని పత్రాలు ఇచ్చామని వివరించారు. సీబీఐలోని జాయింట్ డైరెక్టర్‌కు, చేతిరాత పరిశీలన నిపుణులకు కొన్ని పత్రాలను ఇవ్వాలని కోరుతూ 9 ఆగస్టు 2017న లేఖ రాసినట్టు తెలిపారు. ఆ లేఖ ప్రతిని హరీందర్ ధింగ్రాకు ఇచ్చారు. కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ వారికి పరీక్షించేందుకు అనుమతి ఇస్తూ సెప్టెంబర్ 8న అడిషనల్ కమిషనర్ రాసిన లేఖ ప్రతి కూడా ఇచ్చారు. దీనికి జవాబు ఇంకా రాలేదని అధికారులు చెప్పారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారని దాదాపు అందరికీ తెలిసిపోయినా ఇంకా అసలు నేరస్తులెవరో పరిశోధించడంలో ఏ ప్రగతీ లేదు. సరిగ్గా దస్తావేజులను కూడా నిర్వహించలేకపోయారనీ దీంతో తేలింది. ఈ అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్నామని, ఇప్పుడు పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ వెంట వెంటనే ఫలితాలను వెబ్సైట్లో ప్రచురిస్తున్నామని, మెరిట్ ప్రకారమే నియామకాలు జరుపుతున్న విషయం అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. అయితే ఇదివరకు జరిగిన అక్రమాలపైన దర్యాప్తు జరపడం కూడా ప్రధానమైన అంశం అని కమిషన్ భావించింది. కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ వారు సీబీఐ కోరిన విధంగా చేతిరాత నిపుణుల సేవలను ఇవ్వాలనే విషయంలో ఏ చర్యతీసుకున్నారో తెలపాలని కమిషన్ సూచించింది. పదిహేను రోజుల్లో ప్రగతి చర్యలు వివరించాలని ఆదేశించింది. దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో వివరించాలని కూడా ఆదేశించింది. హరీందర్ ధింగ్రా అవినీతి కుంభకోణాన్ని వెలి కితీసే సమాచార అభ్యర్థనలు చేయడం, దానిపై వెల్లడైన సమాచారం ప్రకారం ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారని ప్రాథమికంగా తేలడం జరి గింది కనుక బెదిరింపులు అవాస్తవాలు అనుకోవడానికి వీల్లేదు. ఇది దరఖాస్తుదారు జీవనానికి, భద్రతకు, స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం కనుక 48 గంటలలోగా ఇవ్వాలని చట్టం కూడా వివరిం చింది. ఇదివరకు సీఐసీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం ద్వారా ఈ బెదిరింపులను నిరోధించవచ్చన్న వాదంలో వాస్తవం ఉందని కమిషన్ అంగీకరించింది. ఈ ఆదేశాల వల్లనే బెదిరింపులు వస్తున్నాయని కూడా తేలింది. కమిషన్ తన ఉత్తర్వులను అమలు చేయించడానికి తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకోక తప్పదు కనుక కమిషన్ ధింగ్రా భద్రతకు భరోసా ఇవ్వాలని ఇఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ రాజ్ కుమార్‌కు సూచించింది. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవడం ద్వారా భద్రత కల్పించాలని ఇన్సూరెన్స్ కమిషనర్ అరుణ్ కుమార్‌కి ఆదేశిం చింది. హరియాణా పోలీసు డైరెక్టర్ జనరల్ బల్ జిత్ సింగ్ సాంధు వెంటనే హరీందర్ భద్రతకు కావలసిన చర్యలు తీసుకోవాలని, ఆ వివరాలను హరీందర్ ధింగ్రాకు 48 గంటల్లో ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్ 11.12.2017న ఇచ్చిన ఆదేశాలను పాటించాలని కూడా నిర్దేశించింది. (హరీం దర్ ధింగ్రా వర్సెస్ CIC/BS/A/2016/ 002028 మరో 13 కేసులలో జనవరి 5, 2018న ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆధార్‌కూ ఆర్టీఐకూ లంకేమిటి?
విశ్లేషణ ఈ బహుమతులు ఎవరికి ఇచ్చారో చెప్పడం లేదని, ఈ దాపరికాన్ని బట్టి ఈ సంస్థలో అవినీతి ఉందని అనుమానించవలసి వస్తున్నదని దరఖాస్తుదారు తరఫున ప్రతినిధి శ్రీముకుల్ జైన్ వివరించారు. ఢిల్లీలో నివాసగృహాలు, పట్టణాభివృద్ధి సంస్థ వారు కొన్న ఖరీదైన కానుకల వివరాలు (ఏమిటి, ఎక్కడ కొన్నారు, ఎవరికి ఇచ్చారు, వాటికి సంబంధించిన) ఓచర్లు, రసీదులు కావాలని, చైర్మన్– మేనేజింగ్ డైరెక్టర్ నివాసగృహానికి చేసిన మరమ్మతులు, అక్కడ నియమించిన ఇద్దరు ఉద్యోగుల వివరాలు కావాలని ఆర్టీఐ కింద విశ్వాస్ భంబూర్కర్ కోరారు. తమరు ఈ దేశపౌరులో కాదో నిరూపించేందుకు ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, లేదా పాస్‌పోర్టు గానీ చూపాలని సీపీఐఓ లేఖ రాశారు. సమాచారం ఇచ్చేదీ లేనిదీ 30 రోజు లైనా చెప్పలేదు. ఆర్టీఐ చట్టం కింద రెండు సందర్భాలలో దరఖాస్తుదారుడు రావచ్చు. ఒకటి సమాచారం ఇవ్వడంలో అన్యాయం జరిగిందనుకుంటే మొదటి అప్పీలు దాఖలు చేయాలి. అక్కడ కూడా సమాచారం దొరకకపోతే రెండో అప్పీలును సమాచార కమిషన్‌కు సమర్పించాలి. ఒకవేళ అడిగిన సమాచారం గురించి ఏమీ చెప్పకపోయినా, దరఖాస్తును ఏదోరకంగా అడ్డుకోవడానికి ప్రయత్నించినా వెంటనే దరఖాస్తుదారు కమిషన్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ మొదటి అప్పీలుతో పనిలేదు. అయితే ఫిర్యాదులో పీఐఓ తప్పు చేశాడని నిరూపించి జరిమానా విధించాలని కోరడానికి వీలుంది. కాని ఫిర్యాదులో సమాచారం అడగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఒక తీర్పులో వివరించింది. సెక్షన్లు 18, 19, 20లకు కలిపి చదివితే సమాచారం కూడా ఇవ్వ చ్చని అర్థం వస్తుంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అందువల్ల దరఖాస్తుదారు పీఐఓ తప్పు నిరూపించడానికి మాత్రమే ఫిర్యాదు దాఖలు చేసి, సమాచారం కోసం మొదటి అప్పీలు వేసి, అక్కడా సమాచారం దొరకకపోతే రెండో అప్పీలు వేసుకోవాలి. నిజానికి పీఐఓ సక్రమంగా వ్యవహరిస్తే ఈ బాధలేవీ ఉండవు. కమిషన్ ముందుకు అభ్యర్థిని పదేపదే రప్పించడం కంటే ఒకే కేసులో రెండూ పరిశీలించాలి. పదేపదే కోర్టుల చుట్టూ తిప్పే విధానం సరికాదనే నీతి గురించి న్యాయస్థానం చాలాసార్లు చెప్పింది. ఇక్కడ విశ్వాస్ అడిగింది సెక్షన్ 4 కింద హుడ్కో తనంతతానే చెప్పవలసిన సమాచారం. చెప్పలేదు. అడిగినా ఇవ్వడం లేదు. పైగా నీవు పౌరుడవని నిరూపించుకో అని సతాయిస్తున్నారు. ఒక ఫిర్యాదు, ఒక మొదటి అప్పీలు, తరువాత రెండో అప్పీలు వేశారు. ఫిర్యాదు, రెండో అప్పీలు విడివిడిగా కమిషన్‌కు చేరాయి. జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలపాలనే ఉత్తర్వును కమిషన్ జారీచేసింది. ఆనాటి సీపీఐఓ డాక్టర్ డి.కె. గుప్తాగారికి, ఆ తరువాత సీపీఐఓ గా పదవి నిర్వహిస్తున్న ఎస్.కె. గుప్తాగారికి కూడా కారణాలు తెలిపే ఉత్తర్వులు జారీ చేసింది. దానికి జవాబుగా డాక్టర్ డి.కె. గుప్త ఇచ్చిన వివరణలో ఆర్టీఐ కేవలం పౌరులకు మాత్రమే సమాచార హక్కు కల్పించిందని కనుక పౌరుడో కాదో తెలియకుండా సమాచారం ఇవ్వజాలమని, ముప్పయ్ రోజులలోగా తాము పౌరుడనని రుజువుచేసుకోవాలని ఉత్తరం పంపడం సమాధానమిచ్చినట్టే అని వాదించారు. అదీగాక ఆర్టీఐ దరఖాస్తు చాలా పొడుగ్గా ఉందని, నియమాల ప్రకారం 500 పదాలకు మించకూడదని అన్నారు. ఆపిల్ ఐ పాడ్, మోంట్ బ్లాంక్ పెన్ వంటి చాలా ఖరీదైన బహుమతులు వీరు కొన్నది నిజమే అయితే అవి ఎక్కడ కొన్నారు, ఎంతకు కొన్నారని చెప్పవలసిన బాధ్యత వారిపై ఉందని, దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ బహుమతులు ఎవరికి ఇచ్చారో చెప్పడం లేదని, ఈ దాపరికాన్ని బట్టి ఈ సంస్థలో అవి నీతి ఉందని అనుమానించవలసి వస్తున్నదని దరఖాస్తుదారు తరఫున ప్రతినిధి శ్రీముకుల్ జైన్ వివరించారు. నిజానికి అడిగిన సమాచారం ఇవ్వకుండా మినహా యింపు ఏదీ వర్తించే అవకాశం లేదు. సెక్షన్ 8 గాని 9 గానీ వర్తిస్తుందని సీపీఐఓలు కూడా వాదించడం లేదు. అసలు సమాచారం ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కారణాలు తెలిపే నోటీసుతో పాటు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి కొంత సమాచారం ఇచ్చారు గాని లేకపోతే అసలే సమాచారమూ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆధార్ కార్డు ఉండాలనడం, పాస్ పోర్టు లేకపోతే ఇవ్వబోనని చెప్పడం సమాచార హక్కు చట్టాన్ని గౌరవించడం అని పించుకోదు. నియమకాలు, నిధుల ఖర్చు రికార్డుల గురించి తమంత తాము చెప్పవలసి ఉంటే దానికి పౌరస్వత్వం ఎందుకు రుజువుచేయాలి? పేరు కూడా చెప్పకుండా సమాచారం అడిగే అవకాశం చట్టం కల్పించినప్పుడు ఈ రుజువులు కావాలని కోరే అధికారం ఈ సీపీఐఓలకు ఎక్కడినుంచి వస్తుంది? పాస్ పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డు అడగడం ద్వారా తాము సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా లేమని సీపీఐఓ డి.కె. గుప్తా నిరూపించారు. కనుక ఆయనపై కమిషన్ 25 వేల రూపాయల జరిమానా విధించింది. ఆ తరువాత సీపీఐఓను హెచ్చరించింది. (విశ్వాస్ భంబూర్కర్ వర్సెస్ హుడ్కో CIC/HUDCO/C/2017/164658 కేసులో 26.12.2017 నాటి సీఐసీ ఆదేశం ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
కనీస వేతనం పెంచినా..
లక్షలాది మంది కార్మికులను నియమించే అతి పెద్ద యజమాని రైల్వే శాఖే కనీస వేతనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇతర ప్రభుత్వ శాఖలను, ప్రైవేటు యజమానులను దాన్ని అమలు చేయమని ఏ విధంగా శాసిస్తారు? ఊడ్వడం, పరిశుభ్రం చేయడం వంటి పనులను చేస్తున్న కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం 19 జనవరి 2017న నిర్ణయం తీసుకున్నది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ ఈ ఉత్తర్వును బహిర్గతం చేసిందా, ప్రజలకు దాన్ని ఎలా తెలియజేశారు, విస్తృత ప్రచారం కల్పించారా, లేకపోతే అందుకు కారణాలు తెలియజేయండి. ఈ ఉత్తర్వులను అమ లుచేస్తే ఆ వివరాలను లేదా అమలు చేయకపోతే కారణాలను తెలపమని యశ్‌కుమార్ సమాచార హక్కు దరఖాస్తును పెట్టుకున్నారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 19.1.2017న కనీస వేతనాలు పెంచుతున్నట్టు, గరిష్టంగా రోజుకు రూ. 523కు పెంచినట్టు అసాధారణ రాజపత్ర ముద్రణ ద్వారా ప్రకటనను ప్రచురించారని తెలిపారు. ఆగస్టు 7, 2008 ప్రకటన ప్రకారం వీరి కనీస వేతనం రూ. 374. రోజుకు రూ. 523 కనీస వేతనం ఇవ్వాలని కొత్త నోటిఫికేషన్ తెలుపుతున్నది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు, కాంట్రాక్టు ద్వారా నియమితులైన ఉద్యో్గగులకు కూడా పెరిగిన వేతనా లను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రకట నకు ముందు ప్రచారం చేశామని చెబుతున్నారే తప్ప, తుది ప్రకటన తరువాత పెంచిన కనీస వేత నాల గురించి తగినంత ప్రచారం ఎందుకు చేయలే దని ప్రశ్నించారు. చాలా మంది కాంట్రాక్టర్లు పెంచిన జీతాలు ఇవ్వడం లేదని, తద్వారా కనీస వేతనాల చట్టాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలే ప్రతిరోజూ భంగపరుస్తున్నాయనీ విమర్శించారు. భారత రైల్వేలనే ఇందుకు ఉదాహరణగా చూపారు. లక్షల మంది ఊడ్చేవారు, కడిగేవారు రైల్వేలో పనిచేస్తున్నా, వారికి రూ. 523కు బదులు ఇంకా రూ. 374ల రోజుకూలీనే చెల్లిస్తున్నారు. 40 శాతం పెరిగిన జీతం ఇవ్వాలంటే హఠాత్తుగా పెరిగే ఖర్చులకు నష్టపరిహారం ఎవరిస్తారని కాంట్రాక్టర్లు అడుగుతున్నారు. ఒప్పందంలో డీఏ ఆధారంగా పెరిగే జీతాలు చెల్లించడంవల్ల అదనపు ఖర్చును భరించేందుకు ఒక షరతును చేర్చారు. కానీ అసా ధారణ నోటిఫికేషన్ ద్వారా కనీస వేతనాలను గణనీయంగా పెంచినప్పుడు పడే అదనపు భారాన్ని తామే మోయాలని చెప్పే ఏవిధమైన క్లాజూ కాంట్రాక్ట్‌లో లేదని రైల్వే వాదిస్తున్నది. 40 శాతం పెంపును భరించేంత డబ్బు తమ వద్ద లేవని ఈ ఉద్యోగుల గుత్తేదారులు అంటున్నారు. వారు రైల్వేల కోసమే నియమితులైనారు కనుక వారికి పెరిగిన జీతం ఇవ్వవలసిన బాధ్యత భారం రైల్వేనే భరించాలని వారు కోరారు. ఇది ఆర్థిక భారాన్ని మోపే నిర్ణయం కనుక బోర్డు సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని రైల్వే బోర్డు వాదిస్తున్నది. రైల్వేలో ఊడ్చే సిబ్బంది, పరిశుభ్రం చేసే పని వారు కొన్ని వేల మంది ఉంటారు. ఔట్ సోర్సింగ్ ద్వారానే 80 శాతం మందిని నియమిస్తారు. వారికి కనీస వేతనం చెల్లించడం యజమానుల బాధ్యత. యజమాని అంటే కాంట్రాక్టరు లేదా రైల్వే యాజ మాన్యం కూడా అవుతుంది. రైల్వే పాలకులను ప్రధాన నియామకులుగా చట్టం భావిస్తుంది. నౌక ర్లకు జీతాలు ఇచ్చే బాధ్యత చట్టప్రకారం ప్రధాన నియామకులదే. రైల్వే బోర్డు ఒకవేళ పెంచిన జీతా లకు అంగీకరించినా మరొక గొడవ ఉంది. అదే మంటే బోర్డు అంగీకరించిన తేదీ నుంచి కార్మికు లకు పెంచిన జీతం ఇస్తారు. అంతే. కానీ జనవరి 19 నుంచి అమలు చేయవలసిన పెంపును ఎవరి స్తారు? అనే ప్రశ్న మిగిలిపోతున్నది. ఎవరూ ఇవ్వక పోతే, కనీస వేతనాల చట్టం కింద పెంచిన జీతం ఇవ్వకపోవడం చట్ట ఉల్లంఘనే అవుతుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వెనుక తేదీ నుంచి అంటే జనవరి 19 నుంచి కార్మికులందరికీ పెంచిన జీతాలు ఇవ్వాలని తీర్మానించడం రెల్వే బోర్డు బాధ్యత. కాని వారు ఏవో కుంటి సాకులతో దీన్ని ఒక కోర్టు తగాదా కింద మార్చే ప్రయత్నాలు చేస్తు న్నారని, అసలు కారణం వ్యత్యాస వేతన భారాన్ని తప్పించుకోవడమే అని దరఖాస్తుదారుని విమర్శ. కేంద్ర ప్రభుత్వం, కార్మిక మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుని రైల్వేబోర్డుకు తగిన ఆదేశాలు జారీ చేయవలసి ఉన్నా, ఆ పని చేయడం లేదని ఆరో పణ. కనుక దీనిపై తగిన సమాధానాన్ని ఇచ్చి, ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారో, జీతాల పెంపు ఉత్తర్వులను ఏ విధంగా అమలు చేస్తారో తెలియజేయాలని ఆయన అంటున్నారు. లక్షలాది మంది కార్మికులను నియమించే అతి పెద్ద యజమాని రైల్వే శాఖే ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇతర ప్రభుత్వ శాఖలను, ప్రైవేటు యజమానులను ఏ విధంగా శాసిస్తారు? ఈ సమ స్యను ఏ విధంగా పరిష్కరిస్తారో తెలియజేయాలని చీఫ్ లేబర్ కమిషనర్, రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే మంత్రిత్వశాఖ, కేంద్ర కార్మికశాఖలను సమాచార కమిషన్ ఆదేశించింది. (యశ్‌కుమార్ వర్సెస్ కార్మిక మంత్రిత్వ శాఖ పీఐఓ కేసు CIC/MLABE/A/ 2017/606546లో నవంబర్ 30న సీఐసీ ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆర్టీఐతో వేధిస్తే నష్టపరిహారమే!
విశ్లేషణ జవాబుదారీతనాన్ని, పారదర్శకతను సాధించడానికి కాకుండా, అవినీతిని ఎదిరించాలనే లక్ష్యంతో సంబంధం లేకుండా, ఆర్టీఐ కింద ఇష్టం వచ్చిన సమాచారాన్ని విచక్షణారహితంగా డిమాండ్ చేస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయి. జేపీ సైనీ కొన్ని ఫైళ్లనుంచి పత్రాల ప్రతులు కావాలని ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకున్నారు. తన ఫిర్యాదు పైన తీసుకున్న చర్యలు, ఫలానా అధికారి మరో అధికారికి రాసిన ఉత్తరం. అవీ ఇవీ బోలెడు అడిగాడాయన. సీపీఐఓ తనకు అందుబాటులో ఉన్న అనేక పత్రాలను తీసి ఇచ్చారు. మొదటి అప్పీలు వేశారు. ఇవ్వవలసిన పత్రాలన్నీ ఇచ్చారని ఇక ఇచ్చేదేమీ లేదని ఆయన తేల్చేసారు. కానీ సైనీ అనేకానేక దరఖాస్తులు పెడుతూనే ఉన్నారు. అధికారులు జవాబులు ఇస్తూనే ఉన్నారు. కమిషన్ కూడా సైనీ అప్పీళ్లు ఎన్నో విని తీర్పులు కూడా ఇచ్చింది. అయినా కొత్త అప్పీళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇదివరకు సైనీ భివానీలో సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఒక మహిళా ఉద్యోగిపై ఈయన లైంగిక వేధింపులు చేసారన్న ఆరోపణతో శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొన్నారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించిన తరువాత సాక్ష్యాలు లేవని వదిలేశారు. మహిళా బాధితురాలు కోర్టులో కూడా కేసు వేశారు. అందులో కూడా ఆయన విడుదలైనారు. ఆ తరువాత సైనీ ప్రతిభావిశేషాలకు మెచ్చి ప్రమోషన్ కూడా ఇచ్చారు. గ్రూప్ ఎ అధికారి హోదా ఇస్తూ సహాయ పోస్ట్‌మాస్టర్ జనరల్ పదవిని కట్టబెట్టారు. 2011లో ఆయన పదవీ విరమణ చేశారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యంచెప్పిన ఒక అధికారి పైన సైనీ ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తులు పెట్టడం మొదలు పెట్టారు. ఆయన పైన ఫిర్యాదులు చేయడం, ఆ ఫిర్యాదులమీద ఏ చర్యలు తీసుకున్నారని అడగడం. ఇక వేధింపులకు అంతులేదు. తన పదవీ విరమణ సమయాన్ని దీనికే వినియోగిస్తున్నారు. మొత్తం 255 ఆర్టీఐ దరఖాస్తులు పెట్టారు. ఇంత సమయాన్ని ఇంకేదయినా మంచి పనికి కేటాయిస్తే ఎంత బాగుండేది? లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు, విచారణ, పర్యవసానాలనుంచి మచ్చ లేకుండా బయటపడడమే అదృష్టం అనుకోకుండా సాక్ష్యం చెప్పిన వారిమీద పగతీర్చుకోవడానికి ప్రయత్నించడం దురదృష్టకరం. వ్యక్తిగత కక్షలతో వేధించడానికి సమాచార చట్టాన్ని వినియోగించడాన్ని కమిషన్ అనుమతించదు. ఆర్టీఐ దరఖాస్తునుంచి రెండో అప్పీలుదాకా వేధిం పును కొనసాగించడం దుర్మార్గమైన చర్య. ఇటువంటి వ్యక్తులను, ఆర్టీఐని వారు దుర్వినియోగం చేయడాన్ని ప్రోత్సహించకూడదు. ప్రతి దరఖాస్తుపైన చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థ ప్రతిస్పందన ఇవ్వవలసి ఉంటుంది. నెలరోజుల్లో జవాబు తయారు చేసి పోస్ట్ చేయడం వంటి పనులకు ఎంతో ప్రజాసమయం, డబ్బు వినియోగం అవుతూ ఉంటుంది. తప్పుడు పనులు చేసిన ఉన్నతాధికారుల మీద ఫిర్యాదులు చేయకుండా ఈ ఆర్టీఐ దుర్వినియోగం నిరోధిస్తుంది. వేధింపులకు భయపడి ఫిర్యాదులూ చేయకపోవచ్చు. ఈ ఆరోపణలపై విచారణలో సాక్ష్యాలు చెప్పడానికి కూడా ఎవరూ ముందుకు రారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ అనేదే లేకుండా పోతుంది. తోటి ఉద్యోగుల మానవహక్కులను కూడా పరోక్షంగా రెండో అప్పీళ్లు హరిస్తాయి. ప్రభుత్వ సంస్థ పక్షాన ఈ పరిస్థితిపైన ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, సెక్షన్ 18(ఎఫ్) కింద ఇటువంటి దుర్వినియోగాల వల్ల క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు జరిపే విచారణలకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయో లేదో పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వ విభాగం ఈ దరఖాస్తుదారు దాఖలు చేసిన 251 దరఖాస్తులను విభిన్న ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసింది. ఈ పనికిరాని సమాచార దరఖాస్తులకు జవాబివ్వడానికి, వాటిని వేరే శాఖలకు బదిలీ చేయడానికి కనీసం రూ. 5,742 రూపాయలు ఖర్చయిందని సీపీఐఓ కమిషన్‌కు వివరించారు. ప్రభు త్వశాఖ అయితే దానికన్న మరెంతో ఎక్కువగా తన వనరులను వ్యయం చేయవలసి వచ్చింది. స్టేషనరీ, మానవ పని సమయాలు, డబ్బు కూడా వెచ్చించారు. సైనీ కేసులో విచారణాధికారిగా ఉన్న వికాస్ మైన్వాల్ తాను ఎన్నో కేసులలో చాలా నిష్పాక్షికంగా విచారణా నివేదికలు ఇచ్చానని, తన విచారణలో సైనీపై సాక్ష్యాలు లేవని తేలిందని, ఆ తరువాత కూడా దురుద్దేశంతో వేధింపు ఆర్టీఐ దరఖాస్తులు వేస్తున్నారని కమిషన్‌కు వివరించారు. సైనీ ఇదివరకు క్లాస్ 1 అధికారిగా అయిదారేళ్లు సీపీఐఓగా కూడా పని చేశారు. అయినా ఆర్టీఐని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారంటే ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందని వేదప్రకాశ్ తన నివేదికలో పేర్కొన్నారు. పదవీ విరమణ చేయడం వల్ల వచ్చిన ఈ సౌకర్యానికి అర్థం తనకు మరొకరిని వేధించడానికి దక్కిన హక్కు కాదని ఆయన అన్నారు. సీబీఎస్ఇ వర్సెస్ ఆదిత్య బందోపాధ్యాయ కేసులో ఇటువంటి దుర్వినియోగదారులను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఏకే పట్నాయక్, ఆర్.వి. రవీంద్రన్ దుయ్యబట్టారు. జవాబుదారీతనాన్ని, పారదర్శకతను సాధించడానికి కాకుండా, అవినీతిని ఎది రించాలనే లక్ష్యంతో సంబంధం లేకుండా, ఆర్టీఐ కింద ఇష్టం వచ్చిన సమాచారాన్ని విచక్షణారహితంగా డిమాండ్ చేస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయి. అధికారగణం పనికిరాని దరఖాస్తులకు జవాబులు ఇచ్చే పనిలో పడి అసలు పని వదిలేయవలసి వస్తుంది అని విమర్శిం చింది సుప్రీంకోర్టు. తన చెత్త దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ శాఖ పరిపాలనా సమయాన్ని వృథా చేసి, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా రు. 5,742 నష్టపరిచినందుకు గాను అంతసొమ్ము నష్టపరిహారంగా చెల్లించాలని కమిషన్ సైనీని ఆదేశించింది. ఇంకా చట్టపరమైన చర్యలు ఏవైనా తీసుకోవడానికి వీలుందేమో చూడాలని కూడా సూచించింది. (జేపీ సైనీ వర్సెస్ పోస్టు విభాగం, CIC/ POS TS/A-/2017/161735 కేసులో 21.11.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
ఆ చర్యలేవో వెల్లడించరా?
అభిప్రాయం ఇదే క్రీడామోసాల నివారణ బిల్లు. దీన్ని 2015లో మార్చారు. ఈ నివేదిక ప్రకారం, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలు ఆర్టీఐ కింద పబ్లిక్ అథారిటీలే. ఢిల్లీ సాకర్ అసోసియేషన్ (డీఎస్ఏ) పబ్లిక్ అథారిటీ అవుతుందా? ఆర్టీఐ చట్టం కింద వారు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉందా, లేదా? అన్న వివాదం సమాచార కమిషన్ ముందుకు వచ్చింది. ఈ సంఘానికి ఒక ఉపాధ్యక్షుడు ఉన్నారు. పేరు నాగేందర్ సింగ్. వారు ఆ క్రీడ ఆడే అమ్మాయిల విభాగానికి ఇన్చార్జి కూడా. తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతడి పైనే కొందరు క్రీడాకారిణులు ఫిర్యాదు చేశారు. పనిచేసే చోట లైంగిక వేధింపుల నుంచి మహిళలను రక్షించే చట్టం 2013 కింద ఆ ఫిర్యాదులపైన చర్య తీసు కోవలసిన బాధ్యత డీఎస్ఏకు ఉంటుంది. ఆ ఫిర్యాదులపైన డీఎస్ఏ ఉపాధ్యక్షుడిపైన ఏ చర్యతీసుకున్నారో తెలియజేయాలని ఫుట్‌బాల్ ఆట గాళ్ల మరొక సంఘం అధ్యక్షుడు డీకే బోస్ ఆర్టీఐ చట్టం కింద అడిగారు. దానికి సమాధానం ఇవ్వకుండా, తాము పబ్లిక్ అథారిటీ కాబోమని, ఆర్టీఐ కింద తమకు జవాబు ఇవ్వవలసిన అవసరం లేదని లేఖ రాశారు. 2013 చట్టం కింద మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు వివరాలను ఇవ్వడానికి వీల్లేదని కూడా వివరించారు. బోస్ సంఘాన్ని ఈ క్రీడాపోటీల నుంచి నిషేధించామనీ అందుకే దురుద్దేశంతో ఆర్టీఐ సమాచారాన్ని అడుగుతున్నాడనీ డీఎస్ఏ జవాబి చ్చింది. అంతటితో ఆగకుండా బోస్‌కు తాము ఇది వరకే జవాబు ఇచ్చామని కనుక ఈ రెండో అప్పీలును కొట్టి వేయాలని కోరింది. ఫుట్‌బాల్ ఆటకు ఒక అఖిల భారత సమాఖ్య ఉంది. అదే ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్– (ఏఐఎఫ్ఎఫ్). ఈ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కుషాల్‌దాస్ ఢిల్లీ సాకర్ సంఘం అధ్యక్షుడు సుభాష్ చోప్రాకు ఆగస్టు 11, 2017న రాసిన ఉత్తరంలో ‘ఢిల్లీ సంఘం ఉపాధ్యక్షుడి మీద అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మాకు కూడా ఆర్టీఐ కింద వారిపైన ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతూ అభ్యర్థన లు వస్తున్నాయి. ఇదివరకు మా సమాఖ్య మీకు మే 15, 2017న ఒక క్రీడాకారిణి తండ్రి మీ ఉపా ధ్యక్షుడిపైన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి ఫిర్యాదు చేశారు. దాన్ని మీకు పంపాం. ఇటువంటి ఫిర్యాదుల కారణంగా ఉపాధ్యక్షుడి పదవి నుంచి తొలగించిన తరువాత కూడా నాగేందర్ సింగ్ క్రీడా కారిణులతో కలసి పోటీలు జరిగే స్థలాలకు ప్రయా ణిస్తున్నాడనీ, దీనికి కారణం డీఎస్ఏ ఏ చర్యా తీసు కోకపోవ డమే అని అంటున్నారు. 2010 ఆగస్టులో ఆయనపై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణల ఫిర్యాదు ప్రతి కూడా మళ్లీ పంపాం. కానీ మీరు చర్య తీసుకున్నట్టు జవాబు ఇవ్వలేదు. ఇది తీవ్రమైన అంశ మని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఏ పరిస్థితులలో కూడా ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. త్వరగా జవాబివ్వండి’ అని కోరారు. దానికి 23.8. 2017 న డీఎస్ఏ అధ్యక్షులు జవాబిచ్చారు. ‘మేనే జింగ్ కమిటీ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరి శీలించి, వివరంగా చర్చించింది. డీఎస్ఏ సంస్థలో క్రీడాకారిణులు ఉద్యోగినులు కాదు. కనుక ఇక్కడ లైంగిక వేధింపుల ఫిర్యాదు విచారణలకు కవి ుటీ వేయాల్సిన అవసరం లేదని, కనుక తాము లైంగిక వేధింపుల నుంచి మహిళలను రక్షించే చట్టం కిందకు కూడా రాబోమని మేము జాతీయ మహిళా కమి షన్కూ, ఢిల్లీ మహిళా కమిషన్‌కూ జవాబు ఇచ్చాం’ అని వివరించారు. డీఎస్ఏ ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగానూ పరో క్షంగానూ నిధులు పొందుతున్నదని, వీరి కార్యా లయం కూడా అంబేడ్కర్ స్టేడియంలో ఉందని, ఈ స్టేడియం మునిసిపాలిటీ యాజమాన్యంలో ఉందని, ఢిల్లీ మునిసిపాలిటీ పబ్లిక్ అథారిటీ అనడంలో సందేహం లేదని బోస్ వాదించారు. జస్టిస్ ముద్గల్ కమిటీ బీసీసీఐ వ్యవహారాన్ని ఐíపీఎల్ వ్యవహారాన్ని విచారించి 2014లో ఇచ్చిన నివేదికలో ఈ క్రీడల నేరాలను ఆపడానికి, అవినీతిని నిరోధించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించింది. ఇదే క్రీడామోసాల నివారణ బిల్లు. దీన్ని 2015లో మార్చారు. ఈ నివేదిక ప్రకారం, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలు ఆర్టీఐ కింద పబ్లిక్ అథారిటీలే. క్రీడా మంత్రిత్వ శాఖ, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ల ఆదేశాలను స్వీకరిస్తూ వారి నియంత్ర ణలో డీఎస్ఏ పనిచేయాలి. ఈ క్రీడలో అక్రమాలను విచారించడానికి, ఢిల్లీలో ఫుట్‌బాల్ ఆటమీద ఈ డీఎస్ ఏకు మా త్రమే గుత్తాధిపత్యం అప్పగించారు. ఇందు వల్లనే వారికి క్రీడాపోటీలు నిర్వహించే అధికారం, క్రీడాకారులను ఎంపిక చేసే అధికారం, అందులో వాణిజ్య ప్రయోజనాలు సాధించే అవకాశం కూడా లభిస్తున్నాయి. ఇదంతా పరోక్ష ఆర్థిక సాయం కిందికి వస్తుంది. డీఎస్ఏ పబ్లిక్ అ«థారిటీ అవుతుందనడంలో ఏ సందేహమూ లేదని, ఆర్టీఐ కింద జవాబుదారీగా ఉండాలని అభ్యర్థి అడిగిన సమాచారాన్ని ఇచ్చి తీరా లని కమిషన్ ఆదేశించిం ది. (డీకే బోస్ వర్సెస్ డిఎస్ఏ CIC/MOYAS/A/2017/157090/2017/157090, కేసులో 21.11. 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సమాచారం ఎవరి సొంతం?
ప్రభుత్వ నిధులు, ఇళ్లు, ఇతర సహాయాలను ఇస్తున్నప్పుడు పూర్తి సమాచారం ఇవ్వకపోతే ఆ రహస్యాల చీకటి వెనుక అవినీతి పెరిగిపోయే వీలు ఏర్పడుతుంది. అవినీతిని నిరోధించే చట్టం సమాచార హక్కు చట్టమే. ఒక పథకం కింద ప్రభుత్వం ఎవరెవరికి ఇళ్లు ఇచ్చింది? వారు ఏ కార్యాలయాలలో పనిచేసేవారు? బ్యాంకు రుణాలు తీసుకున్నవారెవరు? బ్యాంకులతో త్రిపక్ష ఒప్పందం కుదుర్చుకుని వారికి టైటిల్ డీడ్ ఇచ్చిన వారెవరు? అని డాక్టర్ కె. వెంకటరావు గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖను అడిగారు. బ్యాంకుల సమాచారమంతా ఇవ్వడానికి వీల్లేదు కనుక, అవి సిస్టంలో అందుబాటులో సిద్ధంగా ఆ సమాచారం లేదు కనుక సెక్షన్ 8(1)(జె) ప్రకారం ఇవ్వజాలమని ప్రజా సమాచార అధికారి తిరస్కరించారు. ఆ నియమాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించడం చెల్లదంటూ వెంకటరావు సమాచార కమిషన్ ముందుకు వచ్చారు. సమాచారం అందుబాటులో లేదని అనడం కూడా విచిత్రమైన జవాబు. ఇళ్లు కేటాయించడం, వాయిదాల్లో డబ్బు వసూలు చేయడం, అప్పులు ఇవ్వడం, ఆ వివాదాలు కుదర్చడం మొదలైన వాటికి సంబంధించిన ఫైళ్లు, రికార్డులు లేకుండా ఉండడం సాధ్యమా? కొన్ని శాశ్వత రికార్డులు నిర్వహించడం అవసరం కాదా? ఆర్టీఐ కింద అడిగిన అంశాలలో ఏది వ్యక్తిగతం, ఏది ఇవ్వడానికి వీలైన అంశం అని ఆలోచించినట్టు కనిపించదు. పార్లమెంట్ లేదా శాసనసభలు అడిగితే కాదనడానికి వీల్లేని సమాచారాన్ని ఆర్టీఐ కింద అడిగితే ఇవ్వాలని సెక్షన్ 8 కింద మినహాయింపులకు వర్తించే ఒక నియమం ఉందని దాన్ని అమలు చేయాలని అనిల్ కుమార్ వర్సెస్ డీఓపీటీæ కేసులో సీఐసీ 2006లో (CIC Appeal No. 76/IC/ (A)/2006) లో వివరించింది. ఇంటికోసం వెంకటరావు కొంత అప్పు చేశారు. బ్యాంకుతో, ప్రభుత్వ సంస్థతో త్రిపక్ష ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు బ్యాంకుకు దరఖాస్తుదారు ఇంటి యాజమాన్య ధ్రువపత్రం టైటిల్ డీడ్‌ను పూచీకత్తు కింద బ్యాంకుకు ప్రభుత్వ విభాగం ఇవ్వాలి. కానీ అడ్మినిస్ట్రేటర్ బ్యాంకుకు ఆ టైటిల్ డీడ్ ఇవ్వకుండా అక్రమంగా జి. నిర్మల అనే ఒక మహిళ (తమిళనాడులోని ఏసీపీ గారి భార్య)కు ఇచ్చారని, దీని వల్ల తాను అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చిందని, తన ఇంటిని తాను సాధించడానికి నానా తంటాలు పడవలసి వచ్చిం దని వెంకటరావు వివరించారు. తనకు ఏ సమాచారమూ ఇవ్వవద్దని అధికారులమీద ఒత్తిడి తెచ్చారని, అందుకే పీఐఓ మొదటి అప్పీలు అధికారి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. దరఖాస్తుదారుడు ఈ కేసులో మొత్తం ఇళ్లు పొందిన వారి పేర్లు, వారి రుణాలు, బ్యాంకుల పేర్లు, టైటిల్ డీడ్స్ అడిగినప్పటికీ తన ఇంటి కేటాయింపు చెల్లింపులకు సంబంధించిన దస్తావేజు ఆయన పరిశీలనకు ఇచ్చినా, అందులో ఆయనకు కావలసిన పత్రాల ప్రతులను ఇచ్చినా సరిపోయేది. రెండో అప్పీలును సాధారణంగా కమిషన్ వీడియో అనుసంధానం ద్వారా విచారిస్తుంది. ఈ కేసు విషయంలో బెంగళూరులో ఉన్న అప్పీలుదారును ఢిల్లీకి రమ్మని నోటీసులు ఇచ్చారు. తాను రాలేనని, మరో తేదీన విచారించాలని, లేదా వీడియో సంధానం చేయాలని ఆయన కోరాడు. కానీ ఆ విషయం పట్టించుకోకుండా, విచారణ ముగించి కేంద్ర సమాచార కమిషన్ సమాచారం ఇవ్వరాదనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం న్యాయం కాదంటూ వెంకటరావు హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌ను స్వీకరించి, వెంకటరావు సమాచార అభ్యర్థనను పునఃపరిశీలించాలని కమిషన్‌కు పంపించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ పేరులోనే గృహ నిర్మాణ పట్టణ పేదరిక నిర్మూలన అనే సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ అని ఉంది. ఎవరెవరికి ఇళ్లు ఇచ్చారు, ఎందరు రుణాలు తీసుకున్నారు, వారి టైటిల్ డీడ్స్ బ్యాంకులకు ఇచ్చారా లేదా అనే అంశాలలో ఎవరి సొంత సమాచారం ఉందో, ఆ వివరాలు ఇస్తే ఎవరి ప్రైవసీ గుట్టు రట్టు అవుతుందో వివరించే బాధ్యత ప్రభుత్వ సమాచార అధికారిపైన ఉంది. ప్రభుత్వ నిధులు, ఇళ్లు, ఇతర సహాయాలను ఇస్తున్నప్పుడు పూర్తి సమాచారం ఇవ్వకపోతే ఆ రహస్యాల చీకటి వెనుక అవినీతి పెరిగిపోయే వీలు ఏర్పడుతుంది. అవినీతిని నిరోధించే చట్టం ఏదయినా ఉంటే అది సమాచార హక్కు చట్టమే. ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని పూర్తిగా బహిర్గతం చేస్తే అక్రమాలు జరగవనడానికి ఈ కేసే ఒక ఉదాహరణ. ఆ కేసులో జరిగిన అక్రమాలను దాచడానికే సమాచారం దాస్తున్నారనే ఆరోపణలు కూడా అప్పుడే వస్తాయి. టైటిల్ డీడ్ కూడా ప్రయివేటు పత్రం కాదు. రిజిస్టర్ చేసిన టైటిల్ ఆస్తి మార్పిడికి సాక్ష్యం. అది రహస్యంగా ఉండే అవకాశమేలేదు. ఆ సమాచారం ఇవ్వాలని, నిరాకరించినందుకు సంజాయిషీ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. (డాక్టర్ కె. వెంకటరావు, వర్సెస్ గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ CIC/KY/A/2014/901399 కేసులో 17 నవంబర్ 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
అదో బాధ...ఇదో వ్యధ
అడిగినదే అడిగే ఆర్టీఐ ప్రశ్నల వేధింపుల నుంచి రక్షించాలని అధికారులు కోరుతూ ఉంటారు. సమాచారం అందినా మళ్లీ అదే అడిగితే ఆ దరఖాస్తును తిరస్కరించినా జరిమానా విధించడానికి వీల్లేదని కమిషన్ తీర్పు చెప్పింది. ప్రభుత్వశాఖల అధికారులు కొందరు జనం అడిగిన సమా చారం ఇవ్వకుండా ఏడిపిస్తే, కొందరు అడిగిందే పదే పదే అడుగుతూ అధికారులను ఏడి పిస్తుంటారు. విపరీతంగా జాప్యం చేస్తారు. సెక్షన్ 20 ప్రకారం సమాచారం ఇవ్వక పోయినా, ఆలస్యం చేసినా, జరిమానా విధించే అధికారం సమాచార కమిషన్‌కు ఉంది. 2009లో ఇచ్చిన ఒక ఉత్తర్వును అమలు చేశారా లేదా, తనకు ఇవ్వవలసిన బకాయిలు ఇచ్చారా లేదా అని ఒక మాజీ ఉద్యోగి, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ సంస్థను ఆర్టీఐ కింద కోరాడు. తమది సెక్షన్ 24 కింద మినహాయింపు పొందిన సంస్థ అంటూ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. నిజానికి మినహాయింపు పొందిన సంస్థ కూడా సమాచార అధికారిని నియమించాలనీ, నిఘా, రహస్య విషయాలు తప్ప మిగతా సాధారణ సమా చారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టులు ఎన్నో తీర్పులు చెప్పాయి. సెక్షన్ 4 కింద తమంత తామే ఇవ్వ వలసిన సమాచారాన్ని మినహాయింపు పొందిన సంస్థలు కూడా ఇవ్వాలని కోర్టులు వివరించాయి. సాధా రణంగా సంస్థకు సంబంధించిన పాలనా సమాచారం, అధికారుల పేర్లు, పదవులు, వారి విధులు, జీత భత్యాలు బదిలీలు, పోస్టింగ్‌ల వంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఆపడానికి వీల్లేదు. మానవ హక్కుల ఉల్లంఘనలు, లంచగొండితనా నికి సంబంధించిన సమాచారాన్ని కూడా నిరాకరించడా నికి వీల్లేదని సెక్షన్ 24 మినహాయింపులు వివరిస్తు న్నాయి. నిఘా, భద్రత అంశాల గురించిన అభ్యర్థనలు తప్ప మిగిలిన సమాచారం ఇవ్వాల్సిందేనని హరి యాణా సీఐడీ వర్సెస్ సీఐసీ కేసు(2009)లో తేల్చారు. అయితే అడిగిన సమాచారం మానవ హక్కుల ఉల్లం ఘన గురించా, అవినీతికి సంబంధించినదా అని విచా రించి తేల్చే అధికారాన్ని సమాచార కమిషనర్‌కు ఇచ్చారు. 2014లో అబిద్ హుస్సేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మణిపూర్ కేసులో ఒక సంస్థకు ఆర్టీఐ నుంచి మిన హాయింపు అంటే... అసలు జవాబుదారీతనం లేకుండా ఉండటానికి లైసెన్సు కాదు, సున్నితమైన సునిశితమైన కార్యక్రమాల సమాచారం కాని హక్కుల ఉల్లంఘన, అవినీతి సమాచారం నిరాకరించడానికి వీల్లేదని తీర్పు చెప్పారు. 2015లో మణిపూర్ హైకోర్టు మరో మంచి తీర్పు ఇచ్చింది. ఎంపికలు, నియామకాలు, నియమితు లైన వారి విధులు వివరించాలని కోరితే సెక్షన్ 24 కింద ఇవ్వం అనడానికి వీల్లేదని, ఎందుకంటే ఆ అంశాలు అవినీతికి సంబంధించినవి కనుక వెల్లడించాలని మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2010లో విజి లెన్స్ అవినీతి నిరోధక శాఖ ఎస్పీ వర్సెస్ ఆర్ కార్తికే యన్ (ఏఐఆర్ 2012 మద్రాస్ 84) కేసులో వివరిం చింది. ఎస్పీ వర్సెస్ ఎం కన్నప్పన్ కేసులో మద్రాస్ హైకోర్టు 2013లో ప్రాసిక్యూషన్ కోరినది అవినీతి గురిం చిన సమాచారమే కనుక వెల్లడి చేయాలని తీర్పు చెప్పింది. అడిగిన సమాచారం సెక్షన్ 24 నుంచి తప్పిం చుకున్నా, అది సెక్షన్ 8 పరీక్షకు కూడా నిలవాల్సి ఉంటుందని స్పష్టం చెప్పింది. ఎన్టీఆర్ఓ కేసులో అడిగిన సమాచారం ఇవ్వ లేదు, సెక్షన్ 24 కింద ఇవ్వబోమన్నారు. దానిపై కేంద్ర సమాచార కమిషన్ కారణాలు తెలపాలంటూ (షోకాజ్ నోటీసు) లేఖ జారీ చేసింది. మినహాయింపు వర్తించక పోయినా సమాచారం నిరాకరించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలని కోరింది. ఏ సహే తుకమైన కారణమూ లేకుండా, పీఐఓ ఆర్టీఐ దరఖాస్తు తీసుకోవడానికి తిరస్కరించినా సెక్షన్ 7(1) కింద నెల రోజులలో సమాచారం ఇవ్వాలన్న నిబంధన ఉల్లంఘిం చినా, దురుద్దేశపూరితంగా సమాచారాన్ని నిరాకరిం చినా, తెలిసి కూడా తప్పుడు సమాచారం ఇచ్చినా, అసం పూర్ణమైన లేదా తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చినా రోజుకు రూ. 250ల చొప్పున రూ. 25,000కు మించ కుండా జరిమానా విధించి తీరాలని సెక్షన్ 20 నిర్దేశి స్తున్నది. కారణాలు తెలపాలనే లేఖకు జవాబుగా ఎన్టీఆర్ ఓ అధికారి వివరణ ఇస్తూ... దరఖాస్తుదారు ఇది వరకే అనేక ఆర్టీఐ దరఖాస్తులు వేసి ఈ సమా చారాన్ని తీసుకున్నారనీ, అయినా మొదటి రెండో అప్పీలు దాఖలు చేయడంతో కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు తాను పూర్తి సమాచారం ఇవ్వగా, అతను దానికి రసీదు కూడా ఇచ్చాడనీ, మళ్లీ మళ్లీ అదే అడుగుతుంటే ఏం చేయాలని అడిగారు. అతని బకా యికి సంబంధించిన వివాదం కూడా పరిష్కారం చేశా మని వివరించారు. పదేపదే అడిగే ఇలాంటి ప్రశ్నల వేధింపుల నుంచి రక్షించాలని ఎన్నో కేసుల్లో అధికారులు కోరుతూ ఉంటారు. ఇదివరకే సమాచారం అందినా మళ్లీ అదే అడిగిన కేసులలో ఆర్టీఐ దరఖాస్తు తిరస్క రించినా, సమాచారం ఇవ్వకపోయినా జరిమానా విధిం చడానికి వీల్లేదని కమిషన్ తీర్పు చెప్పింది. (CIC/LS/A/2012/001368 జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ National Technical Research Organisation కేసులో 14 సెప్టెంబర్ 2017 ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ప్రజా ప్రతినిధుల మాటేమిటి?
విశ్లేషణ జనం, ఆర్టీఐ కార్యకర్తలు, ప్రజాస్వామ్య ప్రియులు.. తాము రాజకీయ పార్టీల పారదర్శకతను కోరుకుంటున్నామో లేదో ముందుగా తేల్చుకోవాలి. జనం గట్టిగా కావాలనుకుంటే పార్టీల జవాబుదారీతనాన్ని సాధించగలుగుతారు. ఆరు ప్రధాన రాజకీయ పార్టీలు పబ్లిక్ అథారిటీలు అవుతాయని 2013లో లా కమిషన్ సమాచార హక్కు చట్టం కింద ప్రకటించింది. రాజకీయ పార్టీలను సమాచారం ఇమ్మని అడిగిన వారి సంఖ్య లెక్కలోకి రానంత తక్కువ. ఢిల్లీలో కొందరు అడి గినా, వారికి సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం కొన్ని ఫిర్యాదులకు సంబంధించిన కేసులు కమిషన్ ముందు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రాలలో ఎందరు ఫిర్యాదు చేశారో తెలియదు. జనం, ఆర్టీఐ కార్యకర్తలు, ఇతర ప్రజాస్వామ్య ప్రియులు, తాము రాజకీయ పార్టీల పారదర్శకతను కోరుకుంటున్నామో, లేదో ముందుగా తేల్చుకోవాల్సి ఉంది. రాజకీయ నాయకులు, పార్లమెం టరీ/శాసన సభాపక్ష పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం తాము ప్రజలకు జవాబుదారీగా ఉండాలో, వద్దో తేల్చుకోవాల్సి ఉంది. జనం గట్టిగా కావాలను కుంటే పార్టీల నుంచి జవాబుదారీతనాన్ని సాధించ గలుగుతారు. ఇతర రాజకీయ పార్టీలనన్నింటినీ ఆర్టీఐ కింద పబ్లిక్ అథారిటీలుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా వ్యాజ్యం పెండింగ్‌లో ఉంది. పార్లమెంటు/శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు/ఎమ్మెల్యేలతో ఆయా పార్టీల పార్లమెంటరీ పార్టీలు/లెజిస్లేచర్ పార్టీలు ఏర్పడతాయి. ప్రతి ఎంపీకి ఏటా రూ. 5 కోట్లు లాడ్స్ నిధులు కేటాయిస్తారు (ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్రాలనుబట్టి ఈ నిధి ఉంటోంది). ప్రజా ప్రతినిధి సూచించిన అభివృద్ధి పనులను ఆయా జిల్లా అధికా రులు అమలు చేయవలసి ఉంటుంది. ఈ నిధులను గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేస్తూ ఉంటుంది. కాని ఏ ప్రాంతంలో ఎవరి దర ఖాస్తుల ఆధారంగా ఏ అభివృద్ధి పనులను చేపట్టాలో నిర్ణయించే పూర్తి విచక్షణాధికారం ప్రజా ప్రతినిధులకే ఉంది. ఆ అభివృద్ధి పనుల పరిస్థితిని వివరించాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా ఉంది. ఈ విషయమై వారు ప్రజలకు జవాబు దారీగా ఉండటానికి ఆర్టీఐని వర్తింపచేయవలసి ఉంటుంది. పూర్తి ఆర్థిక పారదర్శకతను పాటించవలసి ఉంటుంది. ప్రతి లెజిస్లేచర్/పార్లమెంటరీ పార్టీ సమా చార అధికారిని, మొదటి అప్పీలు వినే అధికారిని ఏర్పాటు చేయాలి. ఆ తరువాత రెండో అప్పీలును కమిషన్లు వినాలి. ఎంపీ, ఎమ్మెల్యే లాడ్స్ వివరాలను వారు తమంత తామే సెక్షన్ 4(1)(బి) కింద ప్రక టించాలి. కానీ ఈ విధంగా ఎవరూ అడగడమే లేదు. విష్ణుదేవ్ భండారి అనే ఓటరు బిహార్‌లోని మధు బని జిల్లా ఖతౌనా ప్రాంతంలో ఎంపీ లాడ్స్ కింద ఏ పనులను చేపట్టారు, అవి ఏ దశలో ఉన్నాయని ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. సీపీఐఓ జవాబే ఇవ్వ లేదు. మొదటి అప్పీలూ వృథా అయింది. రెండో అప్పీలు విచారణలో పాల్గొన్న మంత్రిత్వ శాఖ అధి కారులు, నిధులు మంజూరు చేసి విడుదల చేయడం తప్ప తమకు మరెలాంటి సంబంధం లేదన్నారు. నెల రోజులకు పైగా ఏ స్పందనా లేకపోతే దాన్ని తిర స్కారంగా భావించాలని సెక్షన్ 7(2) వివరిస్తున్నది. కమిషన్, సమాచార అధికారికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని ఆదే శించింది. రాజకీయ పార్టీలు తమ పార్లమెంటరీ పార్టీల ద్వారా ఎంపీ లాడ్స్ వంటి సమాచారం వెంట వెంట ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కూడా సూచించింది. పార్లమెంటరీ పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా ఎందుకు ప్రకటించకూడదో వివరించాలని కూడా కోరింది. జిల్లా ప్రణాళికాధికారి కార్యాలయం కొంత సమాచారం సేక రించి విష్ణుదేవ్కు ఇచ్చింది. లోకసభ సచివాలయం తమకు ఈ నిధుల వినియోగంతో ఏ సంబంధమూ లేదని, మరిన్ని వివరాలకు జిల్లా అధికార యంత్రాం గాన్ని సంప్రదించాలని అంది. బిహార్ లోక్‌సభ నియోజకవర్గాల్లో రూ. 200 కోట్లకుగాను 87.5 కోట్లు ఉపయోగించారని, రాజ్యసభ నియోజకవర్గాలకు సంబంధించి రూ. 80 కోట్లలో రూ. 25 కోట్లు విడుదల చేశారని ప్రభుత్వ సమాచారం. అధికారిక వివరాలను పరిశీలిస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి నిధుల పట్ల బాధ్యతగా వ్యవ హరించడం అవసరం అనిపిస్తుంది. చాలా మంది ఎంపీలు తగు యంత్రాంగం, లాడ్స్ నిధులు ఉన్నా వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోవడం విచిత్రం. జనం కూడా పట్టించుకోకపోతే ఈ పథకం ప్రయో జనాలు నెరవేరవు. ఎన్నికైన ప్రజాప్రతినిధులున్న ప్రతి పార్టీ తన పార్లమెంటరీ పార్టీని ఆర్టీఐ కింద పబ్లిక్ అథారిటీగా భావించి, నూటికి నూరు శాతం ఎంపీ లాడ్స్ నిధులను వినియోగించడమేగాక, సమాచారాన్ని తామే స్వయంగా ఇవ్వాలి. వివరాలు కోరిన వారికి ఆర్టీఐ కింద ఇవ్వాలని కమిషన్ సూచించింది. ఏ స్పందనా లేకుండా, సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు గాను విష్ణుదేవ్ భండారికి వెయ్యి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. (CIC/MOSPI/A/2017/176195, Vishnu Dev Bhandari v. PIO, M/o Statistics&Programme Implementation కేసులో ఆక్టోబర్ 18న ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
కోట్లల్లో విరాళాలు...స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్ ఆమెదే..
-
స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్ ఆమే...
సాక్షి,న్యూఢిల్లీ: అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడనేది వెల్లడైంది. ఆర్టీఐ సమాచారం కింద వెలుగులోకి వచ్చిన ఈ అంశాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. డేరా బాబా వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అనుచరులు, డేరా మద్దతుదారులు అందించిన విరాళాలను వాడుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుర్మీత్ వ్యాపార వ్యూహాలు, సినీ, ఈవెంట్ రంగాల్లో ప్రవేశానికి హనీప్రీత్ సూచనలే కారణమని తెలిసింది. మత విశ్వాసాలు, ఆథ్యాత్మిక కార్యక్రమాల పేరిట డేరా బాబా ఏటా కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దేశవిదేశాల నుంచి వసూలు చేసేవారు. ఈ నిధులను వ్యాపార కార్యక్రమాల విస్తరణకు వినియోగించడంతో డేరా సచ్చా సౌథా కాస్తా అనతికాలంలోనే కార్పొరేట్ సామ్రాజ్యంగా విస్తరించింది. మరోవైపు సామాజిక, ఆథ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ కావడంతో డేరా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందింది. సంస్థ ఆర్థిక లావాదేవీల వివరాలను ఇచ్చేందుకు ఆదాయ పన్ను శాఖ నిరాకరించినా ఆర్టీఐ కింద సమాచారం కోరడంతో బాబా విన్యాసాలు వెలుగుచూశాయి. 2010-11లో డేరా రూ 50 కోట్ల పైగా నికర లాభం ఆర్జించింది. అంటే సంస్థ టర్నోవర్ ఏ రేంజ్లో ఉందో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఇందులో డేరా నికర లాభం 30 కోట్లు కాగా, అనుబంధ సంస్థ షా సత్నం జీ రీసెర్చి ఫౌండేషన్ 16.5 కోట్లు నికర లాభం సాధించింది.హనీప్రీత్ సింగ్ తన నెట్వర్కింగ్ నైపుణ్యాలతో సంస్థకు నిధులు, విరాళాలు సమకూర్చేదని చెబుతున్నారు. హనీప్రీత్ పాత్ర ఏంటి.. హనీప్రీత్ సలహా మేరకే గుర్మీత్ మ్యూజికల్ నైట్స్ ప్రారంభించారని డేరా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మ్యూజికల్ నైట్స్ డేరా అనుచరుల్లో క్రేజ్‌ను సంతరించుకున్నాయి. ఇవి ఎంతలా ఆదరణ పొందాయంటే ఒక్కో రాత్రికి కోట్ల రూపాయలు డేరాకు వచ్చిపడేవని తెలుస్తోంది. ఈ షోల్లో గుర్మీత్ సింగ్ తన గానకళకు పదునుపెట్టి తన పాపులర్ సాంగ్స్ లవ్ చార్జర్‌ను ఆలపిస్తూ భారీ మొత్తాలను షోలకు రాబట్టేవాడు. డేరా సినిమాలు కూడా హనీప్రీత్ ఆలోచనల్లోంచే పుట్టాయి. వీటిలో కొన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్‌లోకి చేరాయి. ఆ డబ్బు ఎక్కడ..? డేరా ఆదాయంలో విరాళాలతో పాటు మ్యూజిక్ షోలు, సినిమాలు ప్రధాన వనరులుగా చెబుతారు. నగదు విరాళాల ద్వారా ప్రధాన ఆదాయం డేరాకు సమకూరుతోంది. అయితే డేరా ప్రాంగణంలో పోలీసుల సోదాల్లో కొద్దిపాటి నగదు మాత్రమే లభ్యం కావడం పలు సందేహాలకు తావిస్తోంది. అక్రమంగా దాచిన నగదు నిల్వలను గుర్మీత్ అనుచరులు డేరా నుంచి బయటకు పంపారని భావిస్తున్నారు. హర్యానాలోని సిర్సాలో డేరా ప్రధాన కార్యాలయం నుంచి ఆగస్టు 28 రాత్రి హనీప్రీత్ రెండు పెద్ద సైజ్ ట్రావెల్ బ్యాగ్‌లతో అదృశ్యమయ్యారనే ప్రచారం సాగింది. హనీప్రీత్ ఈ సొమ్మును ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు.డేరాలో సాగుతున్న దర్యాప్తులో మనీల్యాండరింగ్ ఆరోపణలనూ విచారిస్తున్నారు. -
గత సర్జికల్ దాడుల రికార్డులు లేవు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వెల్లడి న్యూఢిల్లీ: 2016 సెప్టెంబర్ 29వ తేదీ కంటే ముందు చేపట్టిన సర్జికల్ దాడులకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) తెలిపింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ప్రశ్నకు డీజీఎంఓ సమాధానమిచ్చింది. ఇండియన్ ఆర్మీ రికార్డులో సర్జికల్ దాడులకు ఎలాంటి నిర్వచనం ఉందో తెలపాల్సిందిగా అతను దరఖాస్తులో కోరాడు. దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమధానమిస్తూ ‘ఇంటెలిజెన్స్ సమాచారంతో నిర్దేశిత లక్ష్యంపై వేగంగా, కచ్చితమైన దాడులు చేయడాన్ని’సర్జికల్ దాడులుగా పేర్కొంది. అంతేకాకుండా భారత సైన్యం చరిత్రలో 2016 సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన సర్జికల్ దాడులే మొదటిదా లేక 2004–2014 మధ్యలో ఏమైనా సర్జికల్ దాడులు జరిగాయా తెలపాలని దరఖాస్తులో కోరాడు. ఇంటిగ్రేటేడ్ హెడ్‌క్వార్టర్స్ (ఆర్మీ)కి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తును బదిలీ చేసింది. -
‘రద్దు’పై ఎవరిని సంప్రదించారో సమాచారం లేదు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు.. ఏ అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారో సమాచారం లేదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ‘ఈ కార్యాలయం రికార్డుల్లో దరఖాస్తుదారు అడిగిన సమాచారం లేదు’ అని పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న ఆకస్మికంగా చేసిన ప్రకటనకు ముందు కేంద్ర ఆర్థికమంత్రి, అలాగే ప్రధాన ఆర్థిక సలహాదారు అభిప్రాయాలు తీసుకున్నారా? అన్న ప్రశ్నకు జవాబిచ్చేందుకు కూడా పీఎంవో నిరాకరించింది. ఆర్టీఐ చట్టంలోని ‘సమాచారం’ నిర్వచన పరిధిలోకి ఈ ప్రశ్నలు రావని పేర్కొంది. -
డిగ్రీల వివరాలు రహస్యమా?
విశ్లేషణ దొంగ డిగ్రీలు ప్రబలుతున్న ఈ దేశంలో, డిగ్రీలు ఉన్నాయని చెప్పుకునేవారు అవి ఉంటేనే ఆ విషయం చెప్పుకోవాలి. నిజంగా ఉంటే వాటి వివరాలు ఇవ్వడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే డిగ్రీ ఉందో లేదో అని అనుమానించడం సహజం. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా, వ్యక్తిగత ప్రయోజనమంటూ నిరాకరిస్తున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. సగం దరఖాస్తుల గతి ఇంతే. ఏది వ్యక్తిగతం, ఏది కాదు? అని విచారించరు. ఎందుకివ్వాలి అనే మనస్తత్వం దీనికి కారణం. అలాగే ఈ వివరాలు వెల్లడైతే ఏమౌతుందోనన్న భయం కూడా వారిలో ఉంటుంది. ఎన్నో విశ్వవిద్యాలయాలూ, విద్యాసంస్థలూ మాజీ విద్యార్థుల డిగ్రీ వివరాలు అడిగితే ఇవ్వడానికి వెనుకాడు తున్నాయి. ఇవ్వకుండా ఆపాలని హైకోర్టులలో రిట్ పిటి షన్లు వేశాయి కూడా. ఉద్యోగార్థులు, పైచదువులు చదివేవారూ తమ విద్యా ర్హతలు వెల్లడించవలసిందే. బీఏ పాసైనామని లేదా ఎంఏలో ఫస్ట్ క్లాస్ అనీ లేదా డాక్టరేట్ చేశామనీ–ఇలా బయోడేటాలో చెప్పుకోవలసిందే. దరఖాస్తుతో జీవిత సంగ్రహం జతచేస్తారు. అం దులో పిల్లల పేర్లు, గుర్తింపు మచ్చలు, చిరునామా, ఫోన్, ఈ మెయిల్, ఐడీ వంటి వివరాలు వ్యక్తిగతం అనుకోవచ్చు. కాని మిగతా వివరా లన్నీ వ్యక్తిగతం కాలేవు. ఒక విశ్వవిద్యాలయంలో 1978లో బీఏ పరీక్ష రాసిన వారి నంబర్లు, పేర్లు, తండ్రి పేరు, మార్కులు, ఫలితాలు తెలియజేయాలని ఆర్టీఐ కింద కోరారు. ఇది వ్యక్తిగత సమాచారమంటూ సెక్షన్ 8(1)(జె) కింద తిరస్కరించారు. విశ్వవిద్యాలయం వారు ప్రవేశ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారిని ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, విద్య నేర్పి, పరీక్షలు నిర్వహించి, వారు రాసిన సమాధానాల మూల్యాంకనం చేసి మార్కులిచ్చి, ఫలితాలను ప్రకటి స్తారు. ప్రవేశాన్నీ, డిగ్రీనీ రిజిస్టర్ చేయడం చట్టపరమైన బాధ్యత. రిజిస్ట్రేషన్ అంటే సమాచారాన్ని అవసరమై నపుడు పరిశీలించడానికి వీలుగా నిక్షిప్తం చేయడం. అదొక గుర్తింపు వంటిది. ఒక్కS యూనివర్సిటీకి మాత్రమే డిగ్రీలు ఇచ్చే అధికారం ఉంటుంది. అదైనా చట్ట ప్రకారం గుర్తింపు లభించిన తరువాతనే. రిజిస్ట్రేషన్ అంటే సమాజానికి ఫలానా వ్యక్తి గ్రాడ్యుయేట్ అని చెప్పడం. వివాహాన్ని రిజిస్టర్ చేస్తారు. ఆ ఇద్దరు భార్యాభర్తలని ప్రకటించడం దాని ఉద్దేశం. రిజి స్ట్రేషన్ ఉంటే వివాహ బంధం ఏర్ప డిందనడానికి మరో రుజువు చూపనవసరం లేదు. అయితే రిజిస్ట్రేషన్‌ను అవసరమైతే చూపాల్సి ఉంటుంది. అదే విధంగా ఆస్తి విక్రయం కూడా. ఫలానా వ్యక్తి, ఫలానా ఆస్తిని, ఫలానా వ్యక్తికి విక్రయించడాన్ని అధికారుల పర్య వేక్షణలో పుస్తకబద్ధం చేస్తారు. అది రిజిస్ట్రేషన్. అది జనానికి నోటీసు, కోర్టుకు రుజువు. అమ్మిన, కొన్న వ్యక్తులు కాదనడానికి వీలుండదు. ఎన్నో వివాహాలు చేసుకుంటూ మోసం చేసేవారు వివాహపు రిజి స్ట్రేషన్ వివరాలు రహస్యంగా ఉంచాలనుకుంటారు. ఫలానా మహిళకు లేదా పురుషుడికి ఇదివరకే వివాహం అయిందో లేదో పరిశీలించే అవకాశం రిజిస్టర్ కల్పిస్తుంది. అందుకే ప్రతి వివాహాన్ని రిజిస్టర్ చేయడం తప్పనిసరి చేశారు. ఫలానా ఆస్తి కొనే ముందు ఆ ఆస్తిని ఇదివరకు ఎవరికైనా విక్రయించారో లేదో తెలుసుకొనే అధికారం అందరికీ ఉంది. వివాహ వివరాలు ఆస్తి రికార్డు వివరాలు వ్యక్తిగత వివరాలంటూ ఆర్టీఐ కింద ఇవ్వడానికి నిరాకరించారు. ప్రస్తుతం యూని వర్సిటీలు కొన్నిసార్లు అదే పనిచేస్తున్నాయి. కొందరి డిగ్రీ వివరాలు ఇవ్వడం లేదు. మామూలు వ్యక్తుల డిగ్రీ వివరాలు అడిగితే చెప్పేస్తున్నారు. ప్రముఖుల వివరాలు అడిగితే భయపడుతు న్నారు. మూడోవ్యక్తి సమాచారం అంటున్నారు. ప్రతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహించి బహిరంగంగా రాష్ట్ర అధినేత (గవర్నర్ /చాన్సలర్) చేత ప్రమాణం చేయించి మరీ డిగ్రీలను ప్రదానం చేస్తారు. ఈ విశ్వవిద్యాలయ సభ్యుడికి గౌరవం తెచ్చే విధంగా జీవిత కాలమంతా వ్యవహరిసా ్తమంటూ చేసే ప్రమాణమది. చదువుకున్న వారిలా వ్యవహరిస్తామనీ, మాట్లాడతామనీ ఆ ప్రమాణానికి అర్థం. ఒకవేళ స్నాతకోత్సవానికి రాకపోతే ఆ ప్రమాణాన్ని లిఖితపూర్వకంగా చేసి, సంతకం చేసిన తరువాతనే డిగ్రీ ఇస్తారు. మెరెంబమ్ పృథ్వీరాజ్ వర్సెస్ పుఖ్రెమ్ శరత్ చంద్ర సింగ్ కేసు (2016)లో ఒక మణిపూర్ ఎమ్మెల్యే తన డిగ్రీ సమాచారం విషయంలో తప్పుడు ప్రకటన చేసినందుకు సుప్రీంకోర్టు అతని ఎన్నిక చెల్లదని ప్రకటిం చింది. అతను నామినేషన్ పత్రంతో పాటు ప్రకటించిన విద్యా వివరాల ప్రమాణపత్రంలో తాను మైసూరు యూనివర్సిటీ నుంచి 2004లో ఎంబీఏ ఉత్తీర్ణుడైనట్టు రాసుకున్నాడు. ఆ నియో జకవర్గం జనం అతను ఉన్నత విద్యావంతుడని చేసిన ప్రమాణాన్ని నవl్మూరు. గెలిపించారు. అభ్యర్థి విద్యార్హతలు తెలుసుకునే హక్కు ప్రతి ఓటరుకు ఉందని సుప్రీంకోర్టు జడ్జిలు ఇద్దరు ఈ కేసులో తీర్పు చెప్పారు. ఎంబీఏ చది వినట్టు అబద్ధం చెప్పారనీ, ఇది గణనీయమైన తప్పనీ, దీని ప్రభావం వల్ల ప్రజలు ఇతను ఎంబీఏ చదివిన వ్యక్తి అని నమ్మారని, ఇప్పుడు అతనికి ఆ డిగ్రీ లేదనడంతో వారు మోసపోయారని, కనుక ఆ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని తీర్పులో వివరించారు. చదువుకున్న వ్యక్తి తన విద్యార్హత లను చాటుకుంటాడే గానీ దాచుకోజాలడని సుప్రీంకోర్టు వివరించింది. దొంగ డిగ్రీలు ప్రబలుతున్న ఈ దేశంలో, డిగ్రీలు ఉన్నాయని చెప్పుకునేవారు అవి ఉంటేనే చెప్పుకోవాలి. ఉంటే వివరాలు ఇవ్వడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే డిగ్రీ ఉందో లేదో అని అనుమానించడం సహజం. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com -
పింఛనుకూ పడరాని పాట్లా?
విశ్లేషణ పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో పొందే హక్కు పనిచేసే హక్కులో భాగం. రిటైరయిన ఉద్యోగులను వేధించకుండా వారి పింఛను ఫైళ్లను సకాలంలో పరిష్కరించాలి. లేకపోతే నష్టపరిహారాలు చెల్లించాలి. జీవితకాలమంతా పని చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పింఛను ఇవ్వడం, ఇతర ప్రయోజనాలు లెక్కగట్టి ఇవ్వడం అన్ని ప్రభుత్వ, ప్రరుువేటు కార్యాలయాలలో జరగవలసిన సాధారణ కార్యక్రమం. యాజమా న్యం కనీస ధర్మం అది. ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వారికి ఉద్యోగ విరమణ నాడు మిత్రులంతా కలిసి లాంఛనంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి సత్కరిస్తారు. కాని రిటైరరుున ఐదు, ఆరేళ్ల దాకా రావలసిన డబ్బు రాకపోతే, పింఛను లెక్కలు ఆరేడు నెలలు దాటినా తేల్చకపోతే, ఆ ఉద్యోగి గతి ఏమిటి? అతను ఏం చేయాల్సి ఉంటుంది? ఇది యాజమాన్య నిర్వహణకు సంబంధించిన విషయం. సాధారణ పాలన తీరును తెలిపే అంశం. సన్మానాలు చేయకపోరుునా రిటైరైన రోజే పింఛను, తదితర ప్రయోజనాల చెక్కు చేతికి ఇవ్వడం ఒక అవసరం అని అధికారులు గుర్తించాలి. కానీ నేడు పలు కార్యాలయాల్లో పాలనాపరమైన అసమర్థత రాజ్యం చేస్తున్నది. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి వెంటనే పింఛను ఇవ్వడం, ఆ ఖాళీలో అప్పటికే మరొక ఉద్యోగిని నియమించడం సమర్థత అనిపించుకుంటుంది. ఉద్యోగంలో చేరిన నాడే ఉద్యోగ విరమణ తేదీ తెలిసిపోతుంది. ఆ సమయానికి ఆ ఉద్యోగ ఖాళీని భర్తీ చేయకపోతే ఆ పని భారం ఎవరు వహిస్తారు? సిబ్బందిని వెనువెంటనే భర్తీ చేయకపోతే నష్టం వస్తుందని వ్యాపారులు ఆ లోటు రాకుండా చూసుకుంటారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి నుంచి ప్రభుత్వ కార్యాలయ గుమస్తా, టైపిస్టు ఉద్యోగాల వరకు వందలాది ఖాళీ లను అట్లాగే వదిలేస్తూ పోతే పాలన ఏమవుతుంది, వారి పని ఎవరు చేస్తారు? తమ పనే సరిగ్గా చేయడానికి ఇష్టపడని ఉద్యోగులు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో పక్కవాడి పని కూడా ఎవరైనా చేస్తారా? ఇది ప్రజల అవసరాల పట్ల నిర్లక్ష్యాన్ని, విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తుంది. పాలకులు ప్రజలకు జవాబుదారీ వహించేలా చేయడానికే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) రూపొం దింది. తమ ఉద్యోగుల పట్ల సైతం జవాబుదారీ తనం పాటించని అధికారులు ప్రజల పట్ల ఏ విధంగా బాధ్యతాయుతంగా ఉంటారు? రూ.10 తో చిన్నపాటి ప్రజాప్రయోజన వ్యాజ్యం (మినీ పీఐఎల్) ప్రయోజనాలను అందుకునే అవకాశాన్ని సహ చట్టం కల్పిస్తున్నది. శశికుల్ భూషణ్ శర్మ అనే ఉద్యోగి తన పదవీ విరమణ ప్రయోజనాల డబ్బులోంచి మినహారుుం పులు ఎందుకు చేశారు, కొంత డబ్బు తనకు ఎందుకు చెల్లించలేదు, ఎప్పుడు చెల్లిస్తారని ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారు. పదవీ విరమణ తరువాత కూడా ఆయన అధికార నివాస గృహంలో నివసించారని, అందుకుగాను నియమాల ప్రకారం మార్కెట్ విలువ కన్నా రెండింతలు మినహారుుంచామని ప్రజా సమాచార అధికారి (పీఐఓ) జవాబిచ్చారు. పూర్తి సమాచారం ఇవ్వలేదని మొదట దాఖలు చేసిన అప్పీలుకు జవాబు లేదు. దీంతో సమాచార కమిషన్ ముందు రెండో అప్పీలును వేశారు. విచారణకు హాజరైన అధికారి తనకు ఆ ఫైలుకు సంబంధించిన వివరాలు తెలియవని, కనుక అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేమని చెప్పారు. వివరాలు తెలి యని వారు విచారణకు హాజరై ఏం ప్రయోజనం? దరఖాస్తుదారు అడిగిన దస్తావేజులను పరిశీలించే అవకాశం కలిగించాలని, ఆయన కోరిన పత్రాల ప్రతులను ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరిగిన జాప్యం ఫిర్యాదుపై చేపట్టిన కార్యాచరణ నివేదికను ఇవ్వాలని సూచించారు. పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో పొందే హక్కు కూడా ఉద్యోగి పనిచేసే హక్కులో భాగం. ఉద్యోగ విరమణ నాటికే ఉద్యోగి రిటైర్మెంట్ వ్యవహారాలన్నిటిపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ బాధ్యతలను నిర్లక్ష్యం చేసే అధికారులు తాము కూడా ఒక నాటికి రిటైరవుతామన్న నిజాన్ని గుర్తుంచుకోవాలి. రిటైరరుున ఉద్యోగులను వేధించకుండా వారి పింఛను ఫైళ్లను సకాలంలో పరిష్కరించాలి. లేకపోతే నష్టపరిహారాలు చెల్లించవలసి వస్తుంది. ఐదేళ్లపాటు దరఖాస్తుదారుని పింఛను వ్యవహారాన్ని పెండింగులో ఉంచి, వేధించినందుకు నష్టపరిహారం ఎందుకు చెల్లించరాదో వివరించాలని కమిషన్ నోటీసు జారీ చేసింది. నష్టపరిహారాలు, ఖర్చులు చెల్లించాలని తీర్పు చెప్పే అధికారాన్ని సహ చట్టంలోని సెక్షన్ 19(8)(బి) కమిషన్ కు ఇచ్చింది. సమాచారం ఇవ్వడంలో జాప్యానికి, పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉంది. (శశికుల్ భూషణ్ శర్మ వర్సెస్ పీఐఓ, పంజాబ్ విశ్వవిద్యాలయం CIC/C-C-/A-/2015/000749 అ కేసులో 21.11.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
పారిశ్రామిక వెనకడుగు
-
పారిశ్రామిక వెనకడుగు
- రాష్ట్రంలో తిరోగమనంలో పారిశ్రామిక రంగం.. కొత్తవి రాలేదు.. పాతవి మూత - గత జనవరిలో రూ.28 కోట్లతో విశాఖలో పార్టనర్షిప్ సమ్మిట్ - రూ. 4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలంటూ ప్రచారం - ‘సన్‌రైజ్ వెలుగులు’ అంటూ ఆర్భాటం.. ఒక్క పెద్ద కంపెనీ కూడా రాలేదు - రెండేళ్ల నుంచి తగ్గుతున్న పారిశ్రామిక విద్యుత్ వినియోగం - ముఖ్యమంత్రి చంద్రబాబు 16 విదేశీ పర్యటనలు చేసినా కనిపించని ఫలితాలు - ఆర్టీఐ చట్టం ద్వారా బయటపడ్డ టీడీపీ సర్కారు ప్రచార బండారం - 2017లో మరో రూ.ఏడు లక్షల కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం! సాక్షి, అమరావతి: కొత్త పరిశ్రమలను ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గడిచిన రెండున్నర ఏళ్లలో ఒక భారీ ప్రాజెక్టును కూడా ఆకర్షించకపోగా ఉన్న పరిశ్రమలే మూతపడుతున్నాయి. రాష్ట్రంలో తగ్గుతున్న పారిశ్రామిక విద్యుత్ వినియోగమే ఇందుకు నిదర్శనం. ఈ రెండేళ్లలో విశాఖపట్నం నుంచి హెచ్ఎస్బీసీ బ్యాంక్ వెళ్లిపోగా, మన్నవరంలోని బీహెచ్ఈఎల్కు చెందిన విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రం కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. వాస్తవ పరిస్థితులిలా ఉండగా రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువంటూ ప్రభుత్వం భారీ ప్రచారానికి తెర తీస్తోంది. అబద్ధపు ప్రచారాలతో మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జనవరిలో విశాఖపట్నంలో ఆర్భాటంగా నిర్వహించిన పార్టనర్షిప్ సమ్మిట్ ఘోరంగా విఫలమైందని ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగు చూసింది. ఈ సమ్మిట్ ద్వారా రూ. 4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలు కుదుర్చుకొని ‘రాష్ట్రంలో సన్‌రైజ్ వెలుగులు’ అంటూ భారీగా ప్రచారం చేసింది. కానీ ఇదంతా కేవలం ప్రచారమేనని, వాస్తవ రూపంలో ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షులు నాదెండ్ల మనోహర్ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరితే.. పదినెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్ట్ రాలేదని ప్రభుత్వమే అధికారికంగా వివరణ ఇవ్వడం గమనార్హం. ఈ సమ్మిట్ పెద్ద బోగస్అని, దీని ద్వారా ప్రభుత్వం రూ.28 కోట్లు ప్రజాధనాన్ని వ్యయం చేసిందని మనోహర్ తెలిపారు. ఈ ఒప్పందాల వల్ల పది లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, కానీ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ఇప్పుడు ప్రభుత్వమే చెపుతోందన్నారు. ఈ ప్రచారం మరిచిపోకముందే వచ్చే ఏడాది మరో రూ.7 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఇప్పటి నుంచే భారీ ప్రచారానికి ప్రభుత్వం తెర తీయడం విశేషం. పరిశ్రమలకు తగ్గిన విద్యుత్తు వినియోగం రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు మూత పడుతున్నాయనడానికి విద్యుత్ వినియోగమే ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్రంలో గడచిన రెండేళ్ళలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 14 శాతం మేర తగ్గింది. అవిభక్త రాష్ట్రంలో (2014కు ముందు) ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 13 జిల్లాల్లో ఏటా 24,090 మిలియన్ యూనిట్ల మేర డిమాండ్ ఉండేది. 2015-16లో (మార్చి 16 నాటికి) ఇది 20,718 మిలియన్ యూనిట్లకు తగ్గింది. వాస్తవానికి 2016-17 సంవత్సరంలో పరిశ్రమలకు 31,356.22 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ఈ అంచనాలతో పోలిస్తే ప్రస్తుత వాస్తవ డిమాండ్ చాలా తక్కువగా ఉంది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల విద్యుత్ వినియోగం 2018 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. వందకుపైగా పరిశ్రమల్లో కొన్ని మూతపడగా, మరికొన్ని పాక్షికంగా పనిచేయడం మానేశాయి. గ్రానైట్ ఆధారిత పరిశ్రమల్లో 128 వరకూ మూతపడటం వల్ల ఏటా 500 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. ఫుడ్‌ప్రాసెసింగ్, ఫార్మా కంపెనీల్లో సంక్షోభం వల్ల 900 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ పడిపోయింది. దాదాపు 18 భారీ పరిశ్రమల విద్యుత్ వినియోగం తగ్గింది. దీనివల్ల మరో వెయ్యి మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. అయితే శ్రీసిటీతో పాటు విశాఖలో కొన్ని ప్రతిపాదిత పరిశ్రమల్లో స్వల్పంగా విద్యుత్ వినియోగం పెరిగింది. అయినప్పటికీ పడిపోయిన విద్యుత్ డిమాండ్‌ను చేరుకునే పరిస్థితి లేదు. 220 కేవీ పరిశ్రమలకు ఈ ఏడాది ఏడు వేల మిలియన్ యూనిట్ల వరకూ విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇది ఇప్పటివరకూ 500 ఎంయూ దాటలేదు. దీన్నిబట్టి భారీ పరిశ్రమలు ఏ ఒక్కటీ రాలేదని స్పష్టమవుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్నట్లుగా పరిశ్రమల పురోగతి ఏ మార్గంలోనూ కనిపించడంలేదని తేటతెల్లం అవుతోంది. కనీసం విమాన ఖర్చులు కూడా రాలేదు గత రెండున్నరేళ్లలో వివిధ దేశాలు, కంపెనీలతో సుమారు రూ.6 లక్షల కోట్లకు పైగా విలువైన పెట్టుబడి ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఒక్క విశాఖలో జరిగిన ‘సన్‌రైజ్ ఏపీ’ ఇన్వెస్టర్ల మీట్లోనే రూ.4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలు చేసుకుంది. మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు 16 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. 76కుపైగా పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క భారీ ప్రాజెక్టును కూడా ఆకర్షించలేక పోయారు. కనీసం ఈ విమాన ప్రయాణ ఖర్చులకు సమానమైన ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని ఒక అధికారి వ్యాఖ్యానించాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘సన్‌రైజ్ ఏపీ’ పేరిట ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సదస్సు కేవలం ప్రచారానికే పరిమితమైపోయింది. ఒప్పందాలన్నీ ప్రచార ఆర్భాటాలుగానే మిగిలిపోయినట్లు అధికారిక లెక్కలే చెపుతున్నాయి. ► రూ.30,000 కోట్ల భారీ ప్రాజెక్టు పెట్టడానికి ముందుకొచ్చిన ఆస్ట్రేలియాకి చెందిన క్వీన్స్ లాండ్ కోల్ కార్పొరేషన్ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్-వైజాగ్ స్టీల్) రూ. 38,500 కోట్ల విస్తరణ పనులకు సంబంధించి పనులు కూడా అటకెక్కాయి. ప్రస్తుతం ఉక్కు పరిశ్రమ అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో విస్తరణ పనులకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ► దక్షిణాదిలో ప్లాంట్ పెడతానన్న హీరో మోటార్ కార్ప్‌కు ఉచితంగా భూమి ఇచ్చి మరీ ఆకర్షించినా.. అది కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులకు కంపెనీలు ఎంవోయూలు చేసుకుంటున్నాయే కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా పునాదిరాళ్ల స్థాయిని కూడా దాటలేదని ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ► 2020 నాటికి ఐటీ రంగంలో రూ.40,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది 2014లో ఆర్భాటంగా విడుదల చేసిన ఐటీ పాలసీ లక్ష్యం. కానీ ఈ పాలసీ విడుదలై రెండున్నర ఏళ్లు గడుస్తున్నా చెప్పుకోవడానికి ఒక్క ప్రాజెక్టూ రాలేదు. చివరకు తెలంగాణ ‘టి హబ్’కు పోటీగా ప్రవేశపెట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఏపీలో విఫలమైంది. నో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆన్లైన్లో అన్ని అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటివి కేవలం మాటలకే పరిమితమయ్యాయని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం అన్ని అనుమతులు 21 రోజుల్లో మంజూరు చేస్తామని రాష్ట్రం ఘనంగా ప్రకటించిందని, కానీ ఈ సమయంలో కేవలం 6-7 అనుమతులు మాత్రమే వస్తున్నాయని మిగిలినవి ఆరు నెలలు దాటినా రావడం లేదని ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ ముత్తవరపు మురళీకృష్ణ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో ఘనంగా పాలసీలను ప్రకటిస్తున్నారే కానీ వీటికి సంబంధించి జీవోలు విడుదల కాకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉందన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో భారీ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనేకమార్లు టెండర్లు పిలిచినా ఒక్క విదేశీ సంస్థ కూడా ముందుకు రావడం లేదంటే పాలసీలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొత్త రాష్ట్రం కావడం వల్ల మౌలిక సదుపాయాల కల్పనలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం డెరైక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. కొత్త రాష్ట్రం కావడం వల్ల పెట్టుబడిదారులు కొంత ఆలోచించడం సహజమేనని, విదేశీ సంస్థల్లో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా రాకపోవడంతో... రాష్ట్రంలో కొత్తగా పెట్టే పరిశ్రమలకు ప్రకటించిన రాయితీలు సకాలంలో చెల్లించకపోవడం కూడా పెట్టుబడులు రాకపోవడానికి మరో కారణంగా ఉంది. రాష్ట్ర ఖజానా లోటులో ఉండటం, ఇస్తానన్న రాయితీలు చెల్లించకపోతుండటంతో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర రాయితీలతో సంబంధం లేకుండా కేంద్ర రాయితీలను చూసైనా పెట్టుబడులు వస్తాయనుకుంటే ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రత్యేక హోదా వస్తే ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్‌ట్యాక్స్, ఎక్సైజ్ సుంకాల్లో, విద్యుత్తు, రవాణాలో రాయితీలు వస్తాయన్న ఆశతో చాలామంది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ మిన్న అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాహాటంగా అంటుండటం పారిశ్రామిక వర్గాలను కుదేలయ్యేలా చేస్తున్నాయి. కేంద్రం కూడా ప్రత్యేకహోదా లేదని స్పష్టం చేయడంతో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ కూడా ఒక యూనిట్‌ను పెడదామనుకున్నామని, కానీ అది రాకపోవడంతో ఇప్పుడు గుజరాత్లో యూనిట్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రముఖ నిర్మాణ రంగ తయారీ పరిశ్రమ ప్రతినిధి చెప్పడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. అలాగే రాష్ట్రంలో భూముల ధరలు, మౌలికవసతుల లేమి పరిశ్రమల ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారాయని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా భూమిని కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదని పేరు రాయడానికి ఇష్టపడని ఒక పారిశ్రామికవేత్త చెప్పారు. అంకెల్లో పెట్టుబడుల హామీలు ► విశాఖ సీఐఐ ఇన్వెస్టర్ల మీట్లో రూ. 4.67 లక్షల కోట్ల విలువైన 328 ఒప్పందాలు ► రెండేళ్లలో 267 సంస్థలు కలసి రూ. 1.46 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నాయి ► పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇప్పటివరకు సీఎం 16 సార్లు విదేశీ పర్యటనలు ► చైనా నుంచి రూ.58,000 కోట్లు, జపాన్ నుంచి రూ.50,000 కోట్ల ఒప్పందాలు ► వచ్చే ఏడాది సీఐఐ పార్టనర్ సమ్మిట్ ద్వారా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యమంటున్న ప్రభుత్వం -
సర్వీస్ యాక్ట్ రావాలి: ఈటల
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఐ చట్టం లాగానే సర్వీస్ యాక్ట్ రావాల్సి ఉందని, అప్పుడే ఆర్టీఐ చట్టం ఉద్దేశం నెరవేరుతుందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహారాష్ట్రలోని విధానాన్ని ఇక్కడ అమలు చేయాల్సి ఉందని చెప్పారు. ఆర్టీఐ యాక్ట్‌ను సమర్థవంతంగా అమలు పర్చటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తుందని తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం వార్షిక సదస్సు (సమాచార హక్కు వారోత్సవాలు) నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సమాచార హక్కు చట్టం అమలులో సమిష్టి బాధ్యత’ అనే అంశంపై పలువురు వక్తలు ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలు తమకెందుకులే అనుకుంటే ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేదని, ప్రజలు తలచుకుంటేనే వ్యవస్థ మారుతుందని చెప్పారు. ‘తెలంగాణ ప్రజల్లో చైతన్యం ఎక్కువ. ఎవరినైనా నిలదీసి అడిగే సత్తా ఉంది’ అని అన్నారు. ఆర్టీఐ లాంటి చట్టాలు రాష్ట్రాభివృద్ధిలో భాగంకావాలని ఆకాంక్షించా రు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్టీఐ అమలులో ఇన్ఫర్మేషన్ కమిషన్‌ది ముఖ్యపాత్రని తెలిపారు. చట్టంలో పేర్కొన్న విధంగా అధికారులు, సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు సమాచార కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. గచ్చిబౌలిలో ఆర్టీఐ భవన్ నిర్మించేందుకు ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా కేసులు పరిష్కరించేమార్గం కోసం ఆలోచిస్తున్నామని తెలిపారు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా తనని నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అని, దానికి పోలీసు శాఖ గౌరవం ఇచ్చి, దరఖాస్తులకు వెంటనే సమాచారం అందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, ఆర్టీఐ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
స.హ.చట్టం పరిధిలోకి దేవాదాయశాఖ
– చట్టాలను అమలు చేసే బాధ్యత పాలకులదే – దేవాలయాల్లో ధర్మాన్ని నిలబెట్టాలి – ఈఓ ఒకరు కోట్లలో అక్రమార్జన చేస్తే స.చట్టం వర్తించదా ? మహానంది : దేవాదాయశాఖకు సమాచార హక్కు చట్టం వందశాతం వర్తిస్తుందని, ఆ శాఖ కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తుందని ఉభయ రాష్ట్రాల సమాచార హక్కుచట్టం కమిషనర్ విజయబాబు అన్నారు. అయితే, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం ఆయన మహానందికి వచ్చారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ శంకరవరప్రసాద్, ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వారికి స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీదేవీ సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలను నిర్వహించారు. అంతకు ముందు స్థానిక ఏపీ టూరిజం అతిథిగహం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవాలయాల్లో హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని, అలాగే భక్తుల మనో భావాలను పరిరక్షించాలని చెప్పారు. శ్రీశైలదేవస్థానంలో ఒక ఈఓ రూ. కోట్లలో ఆక్రమ ఆస్తులను కూడబెట్టుకోవడం, భక్తుల విరాళాలు మింగడం స.హ. చట్టం కిందికి వస్తుందన్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో కళాశాలలో, పలు ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో 108 కేసుల విచారణ చేశామని, ఈ కేసులకు సంబంధించిన వివిధ స్థాయి అధికారులైన 32 మందికి షోకాజు నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ శాఖలో ఏ ఒక్కరో అవినీతికి పాల్పడితే మొత్తం ఆ శాఖకే చెడ్డ పేరు వస్తుందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రామకష్ణుడు, వీఆర్వోలు సత్యనారాయణ, కష్ణనాయక్ పాల్గొన్నారు. -
స.హ. చట్టాన్ని నిర్వీర్యం చేయడం దారుణం
– రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ విజయమోహన్ బనగానపల్లె : సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వంలోని కొన్ని శాఖల ఉన్నతాధికారులు నిర్వీర్యం చేయడం దారుణమని సమాచార హక్కు రాష్ట్ర కమిషనర్ విజయ్‌మోహన్ అన్నారు. గురువారం రాత్రి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని పొదుపు భవనంలో పీఎసీ పౌండర్ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో జరుగుతున్న అనే కుంభకోణాలు సమాచార హక్కు చట్టం కిందనే వెలుగు చూశాయన్నారు. కొన్ని ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం చీకటి జీవోలను అమలు చేయడం మంచిది కాదన్నారు. ఈ చట్టాన్ని ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహిచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. అయితే ప్రచారం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోన్ని దేవాదాయశాఖలు సమాచార హక్కు చట్టం పరిధిలోని వస్తున్నా.. ఏపీలో మాత్రం దేవాదాయశాఖ ఈ చట్టం పరిధిలోని రాదని ఆ శాఖ అధికారులు పేర్కొనడం శోచనీయమన్నారు. ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు గ్రామీణ స్థాయిలోని వెళ్లాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పీఎసీ రాయలసీమ కో కన్వీనర్ జగన్నా«థ్ రెడ్డి ,సభ్యులు చంద్రశేఖర్, మక్బుల్, తహసీల్దార్ అనురాధ, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పీఎంవోకు సీఐసీ నోటీసులు
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002) తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల సమాచారానికి సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయం, గుజరాత్ ప్రభుత్వానికి కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) నోటీసులు జారీ చేసింది. ఆర్టీఐ చట్టం ప్రకారం మూడో వ్యక్తి అభిప్రాయం కూడా అవసరమన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను చూపుతూ నవంబర్ మొదటి వారం కేసు విచారణ సమయంలో వివరణ ఇవ్వాలంటూ నోటీసులిచ్చింది. ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ 2013, డిసెంబర్ 16న సమాచారహక్కు దరఖాస్తు దాఖలు చేశారు. మోదీ, వాజపేయి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల వివరాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అగర్వాల్ కంటే ముందు ఈ సమాచారం కోసం మరొకరు ఆర్టీఐ దరఖాస్తు పెట్టారు. అయితే ఈ సమాచారం ఇచ్చేందుకు పీఎంవో నిరాకరించింది. -
కుట్రలు బహిర్గతం
జనగామ జిల్లాను అడ్డుకుంటున్నారు కలెక్టర్ నివేదిక తప్పుల తడక మాది రెండు వారాల ఉద్యమమేనట.. కడియం శ్రీహరి సాక్షిగా ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఎక్కడ? జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి జనగామ : జనగామ జిల్లా కాకుండా అడ్డుకుంటున్న కుట్రలు సమాచార హక్కు చట్టం ద్వారా బట్ట బయలయ్యాయని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రతిపాదనపై ఆర్టీఏ చట్టం ద్వారా వివరాలు కావాలని కలెక్టర్‌ను కోరగా, 92 పేజీల నివేదిక ఇచ్చారని తెలిపారు. అయితే, అదంతా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షిగా ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య లేఖలతో పాటు మండల, గ్రామ పంచాయతీల తీర్మాన కాపీలను జూన్ 16న కలెక్టర్ వాకాటి కరుణకు అందజేశామని వివరించారు. ఇప్పుడు సమాచార హక్కు చట్టంతో అందరి కుట్రలు వెలుగు చూశాయన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఎగిసి పడుతున్న జిల్లా ఉద్యమం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లిందని స్వయాన ఎమ్మెల్యే ఒప్పుకుంటే, రెండు వారాలుగా ఉద్యమం జరుగుతోందని కలెక్టర్ నివేదికలో పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కష్టకాలంలో మొరపెట్టుకోవాల్సిన అధికారే అన్యాయం చేస్తుంటే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని దశమంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్దిపేట జిల్లాలో, బచ్చన్నపేట, నర్మెట, జనగామ రూరల్, దేవరుప్పుల, లింగాలఘణపురం మండలాలను యాదాద్రి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపించిన కలెక్టర్.. జనగామ మున్సిపాలిటీని ఎక్కడ కలుపుతారో పేర్కొనకపోవడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. జిల్లాను అడ్డుకుంటున్న అదృశ్య శక్తులు... జనగామ జిల్లా ఏర్పాటును అడ్డుకునేందుకు బలమైన అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని ఈ నివేదిక చూస్తే అర్థమవుతోందని దశమంతరెడ్డి అన్నారు. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్దిపేటలో, మిగతా మండలాలను యాదాద్రిలో కలపాలని ఎవరు ప్రతిపాదించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కాకుంటే ఎమ్మెల్యే, ఎంపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. తప్పుల తడకగా ఉన్న ఈ నివేదికలను సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సీసీఎల్ దృష్టికి తీసుకుపోతామని, కొత్త ప్రతిపాదన పంపించాలని కోరుతామని అన్నారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఉద్యమాన్ని అణచి వేయాలని చూస్తున్నారని, మరో 48 గంటల్లో ఎత్తివేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జేఏసీ నాయకులు డాక్టర్ రాజమౌళి, ఆకుల వేణు, మేడ శ్రీనివాస్, మంగళ్లపల్లి రాజు, ఆకుల సతీష్, పోకల లింగయ్య, ధర్మపురి శ్రీనివాస్, పిట్టల సత్యం, మాజీద్, తీగల సిద్దూగౌడ్, పిట్టల సురేష్, చిన్నం నర్సింహులు, రెడ్డి రత్నాకర్ రెడ్డి, వీరస్వామి, ఉడుగుల రమేష్, కిరణ్ ఉన్నారు. -
సమాచార హక్కు చట్టంపై విద్యార్థి దశలోనే అవగాహన ఉండాలి
కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ బాలాజీచెరువు (కాకినాడ) : సమాచార హక్కు చట్టంపై విద్యార్థి దశలోనే అవగాహన కలిగి ఉండాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. జిల్లా సమాచార ఐక్యప్రచార వేదిక మహిళా విభాగం ఆధ్వర్యాన ‘సమాచార హక్కు చట్టంతో మహిళా సాధికారత’ అనే అంశంపై జేఎన్టీయూకేలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం ఈ చటాన్ని రూపొందించారని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకతతోపాటు అధికారులను ప్రశ్నించే హక్కు పౌరులకు వచ్చిందన్నారు. ఈ చట్టాన్ని ప్రజాహితం కోసం వినియోగించాలని కోరారు. మహిళలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని, తద్వారా సమాచార హక్కు చట్టంలో వారికి ఉన్న హక్కులు తెలుస్తాయని చెప్పారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయబోమని ఐక్యప్రచార వేదిక సభ్యులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జేఎన్టీయూకే రిజిస్ట్రార్ ప్రసాద్‌రాజు, వేదిక మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాళం ఆండాళ్ తదితరులు పాల్గొన్నారు. -
సహచరులపై స.హ. దుర్మార్గం?
విశ్లేషణ జనహిత సమాచారం తీసుకోవడా నికే సమాచార హక్కు. చట్టబద్ధమైన హక్కులు కాపాడుకోవడానికి పనికి వచ్చే సమాచారాన్నీ కోరవచ్చు. కాని సహచరులను వేధించడానికి పుంఖా నుపుంఖాలుగా దరఖాస్తులు పెడితే అది దుర్మార్గమూ, దుర్వినియో గమూ అవుతుంది, ఆ పని చేసిన ఉద్యోగిపై దుష్ర్పవర్తన కింద యజ మానులు క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు. ఢిల్లీ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రయోగ శాలలో, గ్రంథాలయంలో పనిచేసే ఇద్దరు సహాయ ఉద్యో గులు తమకు ప్రమోషన్ ఇవ్వలేదని కళాశాల యాజమాన్యం మీద పగబ ట్టారు. కొందరు తమ ప్రమోషన్‌ను అడ్డుకుంటున్నారని వీరు భావించారు. తమపైన ఫిర్యాదు చేశారని, క్రమశిక్షణా చర్య తీసుకున్నారని, సాక్ష్యం చెప్పారని కొందరిని అనుమానించి వారి గురించి ఆర్టీఐ ప్రశ్నలు వేశారు. వారి దాడికి ప్రిన్సిపల్ కూడా గురయ్యారు. వారి రెండో అప్పీలు విచారణకు వచ్చినప్పుడు అయి దుగురు ఉద్యోగులు హాజరై, ఈ ఇద్దరు దుర్మార్గుల సమాచార అభ్యర్థనలకు అంతులేకుండా పోతున్నదని వాపోయారు. ఆఫీసులో పనిచేయకుండా పనివేళలను సమాచార ప్రశ్నలు తయారు చేయడానికి, కుట్రలు చేయడానికి వాడుకుంటు న్నారని, పాఠాలు చెప్పరని, విద్యార్థులకు సాయం చేయడం లేదనీ, వీరు అడిగే సమాచారమంతా స్వార్థం, పగ, ప్రతీకా రంతో కూడినవేనని మొరపెట్టుకున్నారు. ఒక మహిళ.. తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా వీడియో తీసి, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అతడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడని చెబుతూ ఒక ఉపా ధ్యాయిని ఒక ప్రింట్ అవుట్ సమర్పించింది. ఈ దుర్వినియోగ ఉద్యోగి ఫొటో అతని వ్యాఖ్యానాలతో సహా వీడియో చూస్తే అతనే కారకుడని తేలిపోతుంది. పని చేయకుండా సహచరుల పనులు చెడగొడుతూ, ప్రభుత్వ సంస్థను నిస్సహాయ స్థితికి తీసుకువస్తే అంతకన్నా హాని ఏముంటుందని, ఈ చట్టం వచ్చింది ఇందుకు కాదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలోని తమ సహచరు లందరూ ఈ ఇద్దరు దుర్మార్గుల దుర్వినియోగ సమాచార ప్రశ్నలకు ఫైళ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారని ఉద్యోగులు కమిషన్‌కు విన్నవించారు. లిఖిత పూర్వకంగా వీరి దుర్మా ర్గాలను వివరించారు. ప్రిన్సిపల్ తనను ఈ ఇద్దరి వేధింపుల నుంచి విముక్తులను చేయాలని కోరారు. సహచరుల వైద్య ఖర్చుల బిల్లులు, రోగాలు తదితర వ్యక్తిగత వివరాలు కోరే హక్కుపై పరిమితులున్నాయి. అన్నింటినీ వక్రీకరించి వేధిస్తున్నారని చాలా వివరంగా ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. సమస్యా పరిష్కార విభాగాన్ని కూడా వారు దుర్వినియోగం చేసారు. వారు చేసిన 36 ఫిర్యాదులు ఒకే రకమైనవి. అసలవి ఫిర్యాదులే కాదు. వేధింపు ఉత్తరాలని చెప్పి వాటిని తిరస్క రించారు. ఆ వివరాలన్నీ కమిషన్ ముందుంచారు. అంబేడ్కర్ కాలేజీ వీడియో తీసి వాట్సప్, ఫేస్బుక్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం నేరం అవుతాయి. వ్యక్తులు తమ స్థాయిలోనూ, కళాశాల యాజమాన్యం తమ స్థాయిలోనూ ఈ దుర్మార్గులపై చర్యలు తీసుకునే వీలుంది. ఆ చట్టాలను వినియోగించే అధికారం ఉందని తెలియక ఏ చర్యలూ తీసుకోకపోవడం వల్ల దుర్మార్గుల ఆటలు సాగు తున్నాయి. అంబేడ్కర్ కాలేజీలో పనిచేసే ఒక మహిళ.. తమ కళాశాలలోని సహాయ ఉద్యోగులలో ఒక వ్యక్తి తనపైన దుష్ర్ప చారం చేస్తున్నాడని ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాల స్థాయిలో నోటీసు ఇచ్చి చర్య తీసుకోవలసిన విషయ మని మహిళా కమిషన్ భావించింది. ఆ చర్య తీసుకోక పోవడం వల్ల ఈ దుర్మార్గుడికి బలం చేకూరింది. ఆ సహచర ఉద్యోగి వివరాలను, అనవసర సమాచారాన్ని, వ్యక్తిగత సమా చారాన్ని ఇవ్వాలని అతడు వేధించసాగాడు. సమాచార చట్టంపై పూర్తి అవగాహన లేని వారు, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని తెలియని వారు ఎక్కువగా ఉండడం వల్ల ఈ దుర్మార్గులు చెలరేగిపోతున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేక దేహశుద్ధి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చిన్న చిన్న సంస్థలలో జరిగే ఇలాంటి వాటిని మీడియా పట్టించుకోదు. కనుక వీరి గురించి అందరికీ తెలియదు. కాని చర్య తీసుకునే అధికారాన్ని విద్యా సంస్థల యాజమాన్యం వినియోగించుకోకపోవడం వల్ల దుర్విని యోగం పెరుగుతున్నది. మౌనంగా భరిస్తూ ఏడ్వడం వల్ల దుర్మార్గం విజృంభిస్తుంది. క్రమశిక్షణా చర్య ఒక్కటి గట్టిగా తీసుకుంటే చాలు వీరి ఆట కట్టయిపోతుంది. ప్రభుత్వ సంస్థలు కీలకమైన పనులు చేయనీయకుండా అడ్డుకునే దుర్వినియోగదారులపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని ఆయా సంస్థల అధికారులు పరిశీలించి, దానికి సమంజసమైన విధానాన్ని, ప్రక్రియను రూపొం దించాలి. క్రమశిక్షణా నియమాల్లో పారదర్శకతకు స్థానం కల్పిస్తూనే దుర్వినియోగ వ్యతిరేక చర్యలపై నియమాలను కూడా చేర్చాలి. ఇటువంటి దుర్వినియోగం వల్ల సహ చట్టం ఉనికికే ప్రమాదం వస్తుంది. మంచి పాలన కోసం ఆర్టీఐని వినియో గించాలి. సహ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ పనిచేయని, పనికిరాని ఉద్యోగులు సంస్థకు, ఈ చట్టానికి తీరని కీడు చేస్తారు. వీరిని ఉపేక్షించకూడదు. వీరిపైన క్రమశిక్షణా చర్య తీసుకోవాలి. ఒక కళాశాలలో బాగా చదువుకున్న ఒక మహిళా ఉపా ధ్యాయురాలు పాఠాలు చెప్పకుండా పక్కవారిని వేధిస్తుంటే సక్రమంగా నోటీసు ఇచ్చి విచారణ జరిపి, వారి దుర్మార్గాన్ని రుజువు చేసి ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే హక్కు ఉంది. ఆ పని చేయవచ్చు కాని పగబట్టి స్వార్థంతో ఆర్టీఐని దుర్విని యోగం చేయడానికి వీల్లేదు. పదవీ విరమణ చేసిన వృద్ధ ఉద్యోగి ఒకరు తనకు ఇరవై ఏళ్ల కిందట ప్రమోషన్ రాలేదనే కసితో వరసబెట్టి ఆర్టీఐ వాడసాగాడు. సమాచార కమిషన్ అతని దరఖాస్తులను కట్టగట్టి సమిష్టిగా విచారించి తిరస్కరించింది. ఇతని దుర్మా ర్గాన్ని దుష్ర్పవర్తనగా భావించి క్రమశిక్షణా చర్య తీసుకో వచ్చని, అందుకు సంబంధించిన నియమాలు రూపొం దించాలని కమిషన్ సూచించింది. (CIC/BS/A/2014/002319-SA, CIC/SA/A/2015/002028 కేసుల్లో సీఐసీ తీర్పు ఆధారంగా) వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆర్టీఐ పరిధికి దూరంగా న్యాయనియామకాలు
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామక ప్రక్రియను ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకువచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, దీనికి అనుకూలంగా ప్రభుత్వం సిఫారసు చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇలా చేయడంవల్ల వివిధ వర్గాలనుంచి నోట్‌ఫైల్స్, ఇతర వివరాలుకోరుతూ కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని, దీనివల్ల అనవసర చిక్కులు వచ్చే ప్రమాదముందని ప్రభుత్వం భావి స్తోంది. అయితే అత్యున్నత న్యాయస్థానాల్లో నియామకాలకు సంబంధించి పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా కొలీజియం, న్యాయమూర్తులుగా నియమించివారి విషయంలో లేదా పదోన్నతి కల్పించినవారి విషయంలో ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని తప్పనిసరిగా కార్యనిర్వాహక వ్యవస్థ దృష్టికి తీసుకురావాలన్న నిబంధనను తీసుకురానుంది. -
ఆర్టీఐ అమలుతీరుపై కమిషనర్ అసంతృప్తి
అనంతపురం: ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై ఆర్టీఐ కమిషనర్ తాంతియా కుమారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం అమలులో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆమె శుక్రవారమిక్కడ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో ఆర్టీఐ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీఆర్వో సహా 8 మంది ఎంఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు అధికారులు నోటీసులకు స్పందించకుంటే సస్పెన్షన్లకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని కమిషనర్ తాంతియా కుమారి సూచించారు. -
సహచట్టంతో పౌరుడికి సాధికారికత
విశ్లేషణ రహస్యాలు కాపాడుకుంటాం, ఇతరుల రహస్యాలు సాధించి బ్లాక్మెయిల్ చేస్తాం అనే దుర్మార్గపు ధోరణిని ప్రభుత్వంలో, ప్రభుత్వం బయట కూడా సాగించే వారు దుర్మార్గులు. అటువంటి వారిపైన పోరాటానికి సమాచార హక్కు చట్టం ఒక అస్త్రం. సమాచార హక్కు చట్టం 12 అక్టోబర్ 2005న ప్రభుత్వం అమలులోకి తెచ్చిన రోజు భారతదేశానికి మరో స్వాతం త్య్ర దినోత్సవం అని పండుగ చేసుకున్నారు. స్వాతంత్య్రం అయితే 1947లో వచ్చింది కాని, మన కార్యాలయాల్లో ఏం జరుగుతున్నదో, ఫైళ్లలో దాగిన విషయాలేమిటో తెలుసుకునే అవకాశం 2005 దాకా రాకపోవడం చాలా దురదృష్టకరమైన ఆలస్యం. 1766లో స్వీడెన్ ఇటువంటి పారదర్శకతా చట్టాన్ని తెచ్చుకున్నది. మనం స్వతంత్రం సాధించుకున్న తర వాత సమాచారంపైన హక్కు సంపాదించడానికి ఉద్య మాలు చేయవలసి వచ్చింది. 58 సంవత్సరాల తరవాత వచ్చిన ఈ హక్కు వయసు ప్రస్తుతం పదేళ్లు. ఈ హక్కును అమలు చేసుకోవడంలో విజయం సాధించామా లేక వెనుకబడి ఉన్నామా అన్నది దశాబ్ద కాలపు సమీక్షా విషయం. గొప్పగా విజయాలు సాధిం చామని చెప్పలేము గానీ పూర్తిగా పరాజయం చెందిం దని చెప్పడం అన్యాయమే అవుతుంది. ప్రజాస్వా మ్యంలో ఓటర్లకు తగిన ప్రభుత్వం వస్త్తుందంటారు. అదే విధంగా సహ చట్టం కూడా ప్రజల చైతన్యంపైన ఆధారపడి ఉంటుంది. అడిగినంత వారికి అడిగినంత సమాచారం లభిస్తుంది. దొరికిన సమాచారాన్ని ఏ విధంగా వాడుకుంటారనేది కూడా వారి అవసరాలు, ప్రజావసరాలు, సందర్భం, న్యాయాన్యాయాలపైన ఆధారపడి ఉంటుంది. ఏపీ న్యాయ విద్యాసంస్థ, జ్యుడీ షియల్ అకాడమీలో ప్రసంగిస్త్తున్నప్పుడు విరామంలో ఒక న్యాయాధికార మిత్రుడు సమాచార హక్కు చట్టం కింద లభించిన సమాచారం సాక్ష్యంగా పనికి వస్తుందా అని నన్నడిగారు. అవును అని నేనంటే ఆయన కాదన్నట్టు ఒక నవ్వు నవ్వారు. ఒకానొక అంశంపైన అధీకృత పత్రాన్ని పొందే అవకాశం సహ చట్టం కల్పిస్తున్నది. ఇది సమాచారం. సందర్భాన్ని బట్టి సాక్ష్య చట్టం నియమాలను బట్టి, కేసు అంశాలను బట్టి దాన్ని అనుమతిస్తే అది సాక్ష్యమవు తుంది. జడ్జిగారు సాక్ష్యాన్ని అనుమతించడం అనుమ తించకపోవడం, దానికి ఎంత విలువ ఇవ్వాలో నిర్ణయిం చడమనేది ఆయన వివేకానికి, విచక్షణకు వదిలేస్తారు. పౌరులు తమ హక్కులను కాపాడుకోవడానికి అవసర మైన సమాచారాన్ని కోరవచ్చు. ఆ సమాచారాన్ని అవ సరమైన రీతిలో సమంజసంగా వాడుకోవచ్చు. జీవన భృతి కోసం పోరాడుతున్న భార్య ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త వేతనం ఎంతో ఈ చట్టం కింద తెలుసు కోవచ్చు. ప్రభుత్వ అధికార సంస్థ ధృవీకృతరూపంలో ఇచ్చిన ఆ సమాచారాన్ని కోర్టులో సాక్ష్యంగా ప్రవేశ పెడు తుంది. దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత కోర్టులదే. తన కుటుంబాన్ని పోషించడం, పిల్లల్ని పెంచడం అనేది ప్రతి వాడి ధర్మం.పెళ్లి చేసుకోకపోయినా తల్లిదం డ్రులను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభు త్వోద్యోగికి సంబంధించినంత వరకు ఇది క్రమశిక్షణా పరమైన బాధ్యత. రెండు పెళ్లిళ్లు చేసుకున్నా, వరకట్నం కోసం బాధించినా శాఖాపరమైన చర్యలు తీసుకొనడం ప్రజాప్రయోజనకరమైన అంశం. ప్రభుత్వానికి ప్రాతి నిధ్యం వహించే వ్యక్తి ఎటువంటి నేరమూ చేయడానికి వీల్లేదు. సచ్ఛీలుడై ఉండాలని సర్వీసు నియమావళి వివరిస్తున్నది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన సమాచారానికి పరిశీలనా యోగ్యత ఉండడం న్యాయ మని అందరూ అర్థం చేసుకోవలసి ఉంది. ప్రయివేటు రంగంలో పనిచేసే భర్తల జీతం సమాచారం తెలుసుకో వచ్చా అని అడుగుతూ ఉంటారు. దానికి జవాబు ఢిల్లీ హైకోర్టు 2015 జనవరిలో ఇచ్చింది. కుటుంబ తగాదాల విషయంలో కోర్టుకు వచ్చే భార్యాభర్తలు తమ తమ ఆదాయ వ్యయ వివరాలు తామే ప్రమాణ పత్రం రూపంలో ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడే న్యాయంగా సత్వరంగా నిర్ణయించడం సాధ్యం అవుతుందని హైకోర్టు వివరించింది. రహస్యాలు కాపాడుకుంటాం, ఇతరుల రహ స్యాలు సాధించి బ్లాక్ మెయిల్ చేస్తాం అనే దుర్మార్గపు ధోరణిని ప్రభుత్వంలో, ప్రభుత్వం బయట కూడా సాగించే వారు దుర్మార్గులు. అటువంటి వారిపైన పోరా టానికి సమాచార హక్కు చట్టం ఒక అస్త్రం. ఈ చట్టం అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి. పరిమి తులూ ఉన్నాయి. కాని పౌరులు ఎంత జాగ్రత్తగా దీన్ని ఉపయోగించగలరు? దీని గరిష్టశక్తి ఏమిటి? అని ఇంకా పరీక్షించలేదేమో అనిపిస్తుంది. ఇంకా ప్రభుత్వం కూడా దీన్ని అర్థం చేసుకోవడం లేదు. తలనొప్పి చట్టం అని తలపోస్తున్నది. జిల్లా స్థాయి తాలూకా గ్రామస్థాయి కార్యాలయాల్లో సమాచారాన్ని అడగడం ద్వారా అవి నీతిని కనిపెట్టడానికి నిరోధించడానికి చాలా అవకాశా లున్నాయి. పెద్ద పెద్ద స్థాయిలో వేల, లక్షల కోట్ల రూపా యల అవినీతిని సమాచార హక్కు చట్టం అంతగా వెల్లడించకపోవచ్చు. కాని మీడియా భారీ అవినీతి గురించే పట్టించుకుంటుంది. చిన్న అవినీతి వారి కంటికి ఆనదు. సీబీఐ కూడా పట్టించుకోదు. పోలీసులు దర్యాప్తు చేయతగినదే అయినా ఇంత చిన్న లంచగొండి తనాన్ని పరిశోధించే సమయం వారికి ఉండదు. పౌరులు సమాచార హక్కు ద్వారా వెలికి తీసి స్వయంగా పోరాడవలసి ఉంటుంది. కొన్ని లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ప్రశ్నించే సాధనం ఈ చట్టం. ఎన్ని పరిమితులున్నా, ఎంత ఆలస్యాలు జరిగినా, జాగ్రత్తగా వాడుకుంటే సహ చట్టం కార్యాలయాల పనితీరును మార్చేస్తుంది. ప్రజాస్వా మ్యాన్ని బతికిస్తుంది. ప్రభుత్వాలు, పార్టీలు కూడా ఈ చట్టాన్ని అమలు చేయవలసి ఉంది. ప్రజలు ఈ విలువైన హక్కును కాపాడుకోవడం చాలా అవసరం. మాడభూషి శ్రీధర్(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
'చిన్న విషయానికి ఆర్టీఐ చట్టం వినియోగించొద్దు'
పాలకొల్లు సెంట్రల్: ప్రజలకు ఉపయోగపడే విషయాలకు సంబంధించిన సమాచారాన్నే సమాచార హక్కు చట్టం కింద సేకరించాలని పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ సౌమ్యలత అన్నారు. ఆదివారం పాలకొల్లులో నిర్వహించిన సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రతి చిన్న విషయానికి సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని ఆమె సూచించారు. -
వీఐపీ ఆర్టీఐ కిందకు రారా?
* ప్రియాంక గాంధీ భూమి కొనుగోలు వివరాలను బయట పెట్టాల్సిందే * హిమాచల్ సమాచార కమిషన్ ఆదేశం సిమ్లా: ప్రియాంక గాంధీ హిమాచల్‌ప్రదేశ్‌లో కొన్న భూమి వివరాలను సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. వీఐపీ అయినంత మాత్రాన ఆర్టీఐ చట్టం కిందకు రామని ఎవరూ చెప్పజాలరని పేర్కొంది. సిమ్లాకు దగ్గర్లోని ఛరాబ్రాలో ప్రియాంక భూమి కొన్నారు. వ్యవసాయేతర అవసరాలకు వ్యవసాయభూమిని కొనుగోలు చేసినపుడు కొన్ని షరతులతో అనుమతిస్తారు. ఆమెకు ఏ మినహాయింపులిచ్చారు, పెట్టిన షరతులేమిటి అని తెలుసుకోవడానికి సమాచారహక్కు కార్యకర్త దేవాశిష్ భట్టాచార్య ఆర్టీఐ కింద సమాచారం కోరారు. మాజీ ప్రధాని కూతురుగా ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) భద్రత ఉంది. ఛరాబ్రాలో భూమి కొనుగోలుకు సంబంధించి వివరాలను వెల్లడిస్తే ప్రియాంక భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎస్పీజీ లేఖ రాసిందని, అందువల్ల ఈ వివరాలను బహిర్గతం చేయలేమని మొదటి అప్పీలేట్ అథారిటీ సమాధానమిచ్చారు. దీన్ని భట్టాచార్య రాష్ట్ర సమాచార కమిషన్ ముందు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై జూన్ 29న ఆదేశాలను వెలువరిస్తూ చైర్మన్ భీమ్ సేన్, సభ్యులు కాళిదాస్లతో కూడిన బెంచ్ తీవ్రవ్యాఖ్యలు చేసింది. ఎస్పీజీ భద్రతలో ఉండే ప్రధాని సహా ఇతరులందరూ ఎన్నికల్లో తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరుస్తున్నారని పేర్కొంది. ప్రియాంక భద్రతపై ఎప్పీజీ డెరైక్టర్ రాసినట్లు చెబుతున్న లేఖ నిజమైనదో కాదో నిర్ధారించుకోకుండా అప్పిలేట్ అథారిటీ ఎలా ఆదేశాలు జారీచేస్తారని ప్రశ్నించింది. ఎప్పీజీ భద్రత కల్పిస్తోంది ప్రియాంక ప్రాణాలకేగాని ఆమె ఆస్తులకు కాదని కటువుగా వ్యాఖ్యానించింది. అసలు ఎప్పీజీకి అలా లేఖ రాసే అధికారమే లేదంది. ఆర్టీఐ దరఖాస్తుదారు కోరిన వివరాలను పది రోజుల్లోపల ఇవ్వాలని ఆదేశించింది. -
రాజసౌధాన్ని ఆక్రమించారు
వసుంధర, లలిత్మోదీలపై కాంగ్రెస్ దాడి తీవ్రం * ధోల్పూర్ ప్యాలెస్‌ను అక్రమంగా ఆక్రమించారని జైరాం రమేష్ ధ్వజం * ఆ ప్యాలెస్‌లోని హోటల్లో రాజే, ఆమె కుమారుడు దుష్యంత్, కోడలితో పాటు లలిత్మోదీకీ వాటాలు ఉన్నాయని ఆరోపణలు * రాజే ఎన్నికల అఫిడవిట్లోనే ఈ విషయం చెప్పారని వెల్లడి న్యూఢిల్లీ/జైపూర్: లలిత్ మోదీ వివాదంలో చిక్కుకున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై కాంగ్రెస్ సరికొత్త ఆరోపణలతో ఒత్తిడి తీవ్రం చేసింది. ధోల్పూర్ రాజసౌధాన్ని(ప్యాలెస్‌ను) రాజే.. లలిత్‌తో కలసి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపించింది. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్‌సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో విలేకర్లకు చెప్పారు. 1954 - 2010 మధ్య కాలానికి సంబంధించిన రెవెన్యూ శాఖ పత్రాలు కొన్ని.. ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని చూపుతున్నాయని.. కానీ ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజే, లలిత్‌లు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారని, రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని చెప్పారు. అయితే.. ఇది రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2009 సంవత్సరానికి ముందు జరగటం గమనార్హం. నియత్ హెరిటేజ్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో.. తన కుమారుడు, ఎంపీ అయిన దుష్యంత్ సింగ్, కోడలు నీహారిక, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీలతో పాటు తనకూ వాటాలు ఉన్నాయని రాజే 2013 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని రమేష్ తెలిపారు. ఆ సంస్థలో రాజేకు 3,280 షేర్లు, ఆమె కుమారుడికి 3,225 షేర్లు, కోడలికి మరో 3,225 షేర్లు, లలిత్‌కు చెందిన ఆనంద హెరిటేజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 815 షేర్లు ఉన్నాయని అఫిడవిట్ చూపుతోందన్నారు. ఇది.. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు లలిత్‌కు రాజేకు మధ్య వ్యాపార సంబంధం, భాగస్వామ్యం, పన్నుల భారం లేని ప్రాంతం నుంచి విదేశీ పెట్టుబడులు పెట్టటాన్ని నిర్ధారిస్తోందని జైరాం పేర్కొన్నారు. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు లలిత్‌మోదీ మారిషస్ మార్గాన్ని వినియోగించుకున్నారని ఆరోపించారు. లలిత్‌గేట్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనాన్ని కొనసాగించటాన్ని ఎద్దేవా చేస్తూ ఆయనను ‘స్వామి మౌనానంద బాబా’గా జైరాం అభివర్ణించారు. ప్యాలెస్ యజమాని దుష్యంత్సింగే: బీజేపీ జైరాం ఆరోపణలను.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేంద్ర రాథోడ్‌లు జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ తిరస్కరించారు. ఈ రాజసౌధాన్ని హేమంత్‌సింగ్.. వసుంధర కుమారుడు దుష్యంత్‌సింగ్‌కు అప్పగించారని స్పష్టంగా చెప్తున్నాయంటూ పలు పత్రాలను ప్రదర్శించారు. రాజే ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పది రోజులుగా ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వపు సాధారణ పరిపాలన విభాగం 1956 డిసెంబర్లో ఒక నోటిఫికేషన్లో, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో.. ధోల్పూర్ ప్యాలెస్‌కు చట్టబద్ధ వారసుడిగా మహారాజా రాణా హేమంత్‌సింగ్ (దుష్యంత్ తండ్రి)ను ప్రకటించారని వివరించారు. అనంతరం 2007లో భరత్‌పూర్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ధోల్పూర్ ప్యాలస్‌ను దుష్యంత్‌కు అనుకూలంగా నిర్ణయించిందని.. దీనికి సంబంధించి హేమంత్‌సింగ్ డిక్రీ ఇచ్చారని, అది రిజిస్టరు కూడా అయిందని తెలిపారు. మునిసిపల్ పత్రాల్లో సైతం ఆ ప్యాలెస్ యజమానిగా దుష్యంత్ పేరునే పేర్కొన్నారని చూపారు. ధోల్పూర్ ప్యాలెస్‌పై యాజమాన్య హక్కులు దుష్యంత్‌కు ఉన్నాయనేందుకు తమ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయని.. దీనికి సంబంధించి వాస్తవాలు తెలియకుండా సీఎంపై, ఆమె కుటుంబ సభ్యులపై జైరాం రమేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు. జవాబులెందుకు నిలిపేశారు?: చిదంబరం న్యూఢిల్లీ: లలిత్‌మోదీ గేట్ అంశంపై ఆర్టీఐ చట్టం కింద తాను అడిగిన ఏడు ప్రశ్నలకు సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని విదే శాంగ శాఖ జవాబులను ఎందుకు నిలిపివేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం సోమవారం ట్విటర్లో ప్రశ్నించారు. ప్రశ్నలకు సమాధానాలను నిలిపివేసిన విషయం మంత్రి సుష్మకు తెలుసా అని కూడా ఆయన ప్రశ్నించారు. లలిత్ పాస్‌పోర్టు పునరుద్ధరణ వివాదంపై సమాచారమిచ్చేందుకు విదేశాంగ శాఖ నిరాకరించిందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో చిదంబరం పై ప్రశ్నలు వేశారు. -
‘లలిత్ వీసాపై సమాచారం ఇవ్వలేం’
న్యూఢిల్లీ: ఆర్థిక నేరారోపణలున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వీసాకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద దాఖలైన దరఖాస్తును విదేశాంగ శాఖ తిరస్కరించింది. దరఖాస్తులోని 1-3 ప్రశ్నలు ఆర్టీఐ పరిధిలోకి రావని, 4-7 ప్రశ్నలకు సమాచారం తమ దగ్గర లేదంటూ సమాధానమిచ్చింది. దరఖాస్తును పాస్‌పోర్ట్ కాన్సులర్, ఆర్థిక, హోం శాఖలకు పంపిస్తామంది. హరియాణాకు చెందిన రాయో దాఖలుచేసిన ఈ దరఖాస్తులోని ప్రశ్నలు ఇవీ.. 1. లలిత్ పాస్‌పోర్టును పునరుద్ధరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లరాదని ఎవరు నిర్ణయించారు. 2. లలిత్ పోర్చుగల్ వెళ్లేందుకు మానవతా దృక్పథంతో సాయం చేయాలనుకున్న సుష్మ ఆయనను లండన్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు చేసుకోమని ఎందుకు సూచించలేదు? 3. తాత్కాలిక ట్రావెల్ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు ఆయనను భారత్‌కు తిరిగి రావాలని సుష్మ ఎందుకు షరతు విధించలేదు? 4. బ్రిటన్‌లో లలిత్ ఆశ్రయంపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందా? 5. లలిత్‌కు తాజా వీసా అందిన తర్వాత, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ జారీ చేసిన సమన్లు అందించేందుకు తీసుకున్న చర్యలేంటి? 6. పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరిన ఈడీ ఆ విషయంపై కోర్టును సంప్రదించిందా? 7. భారత్‌కు తిరిగొస్తే తన ప్రాణాలకు ముప్పుంటుందన్న లలిత్ వాదనపై ప్రభుత్వ స్పందన ఏమిటి?. -
చక్ర బంధంలో ఆర్టీఐ చట్టం
సమకాలీనం ఎంతో విప్లవాత్మకమైన సమాచార హక్కు చట్టానికి అన్నివైపుల నుంచీ ప్రమాదం ముంచుకొచ్చింది. రాజకీయ పార్టీలు, అధికార గణం, స్ఫూర్తి కొరవడ్డ కమిషనర్లు, ప్రభుత్వాలు సహా అంతా దాని అమలుకు గండికొడుతున్నారు. పార్టీలు కూడా పౌర సంస్థలేనని, అవి పౌరులు కోరే సమాచారం ఇచ్చి తీరాల్సిందేనని ఆదేశించినా బేఖాతరు చేయడం, కేంద్రం వాటికి దన్నుగా నిలవడం ఆందోళనకరం. ఏడు నెలలుగా ముఖ్య సమాచార కమిషనర్‌ను నియమించకపోవడమే కేంద్ర ప్రతికూల వైఖరికి నిదర్శనం. సమాచార హక్కు చట్టాన్ని సజీవంగా సమాధి చేసే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విప్లవాత్మకమైన ఈ చట్టాన్ని నీరుగార్చే యత్నం అన్నివైపుల నుంచీ జరగడం ఆందోళనకరం. ఇటు ప్రధాన రాజకీయ పక్షాలు, ప్రభుత్వ పెద్దల నుంచి అటు ముఖ్య అధికార యంత్రాంగం, స్ఫూర్తి కొరవడ్డ కమిషన్ల వరకు ఏక కాలంలో చట్టం అమలును గండికొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చిన దశాబ్దికే ‘ఇలా అయితే, ఈ చట్టం మనుగడ సాగిం చేనా?’ అని సందేహం తలెత్తుతోంది. పాలనా వ్యవస్థల్లో పారదర్శకతను సాధించడం ద్వారా సామాన్యునికి ప్రజాస్వామ్య ఫలాలను అందించే లక్ష్యం తో తెచ్చిన ఈ చట్టం అమలుకు తిలోదకాలిచ్చే వ్యవహార శైలి కేంద్ర ప్రభుత్వ నిర్వాకంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘ఇంత గొప్ప చట్టం మేమే తెచ్చాం’ అని జబ్బలు చరుచుకున్న యూపీయే ప్రభుత్వమే చివరి రోజుల్లో ఆర్టీఐ అమలు పట్ల నిర్లక్ష్యం వహించింది. ఈ చట్టంతో వచ్చిన పారదర్శకత వల్ల రాజకీయంగా ఎంతో లబ్ధి పొందిన నాటి విపక్ష ఎన్డీఏ, ఇప్పుడు పాలక పక్షంగా సహచట్టాన్ని నిర్వీర్యం చేసే బాధ్యత తీసుకుంది. ఏడు నెలలుగా ముఖ్య సమాచార కమిషనర్‌ను నియమించకుండా తాత్సారం చేస్తోంది. ఈ చట్టం అమలును పర్యవేక్షిస్తూ, దేశవ్యాప్తంగా సరైన సంకేతాలివ్వాల్సిన కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)నే దెబ్బతీసే చర్యలకు కేంద్రం తలపడుతోంది. ఈ చట్టపరిధిలో సీఐసీ ఫుల్‌బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఇటు పాటించకుండా ఉల్లం ఘిస్తూ, అటు న్యాయస్థానంలో సవాలైనా చేయకుండా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర కమిషన్ తామిచ్చిన ఉత్త ర్వుల్ని తామే అమలు చేయజాలమని చేతులెత్తేసి, కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ)పై ఆ భారం మోపి సహ చట్ట స్ఫూర్తిని గంగలో కలిపింది. ఇక, మొదట్నుంచీ సీఐసీపై ఆధిపత్యం కోసం పాకులాడుతున్న డీఓపీటీ... ముఖ్య కమిషనర్ లేని పరిస్థితిని అవకాశంగా తీసుకొని కమి షన్ను బలహీనపరిచే చర్యల్ని ముమ్మరం చేస్తోంది. దూడలు గట్టున మేస్తాయా...? వివిద వ్యవస్థలకు మార్గదర్శకంగా ఉండాల్సిన రాజకీయ వ్యవస్థ సహ చట్టం అమలు విషయమై తప్పుడు సంకేతాలిస్తోంది. సీఐసీ తీర్పును లక్ష్యపెట్టక ప్రధాన రాజకీయ పక్షాలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు అధికార గణానికి, కార్యనిర్వాహక వ్యవస్థకు తప్పుడు సంకేతమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిధులను పొందుతున్న స్వచ్ఛం ద సంస్థలు కూడా ఆర్టీఐ పరిధిలోకొస్తాయని ఈ చట్టం చెబుతోంది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీలు అలాంటి పౌర సంస్థలేనని, ఈ చట్టం కింద పౌరులడిగే సమాచారం ఇచ్చి తీరాల్సిందేనని సీఐసీ 2013 జూన్ లోనే ఖరాకండిగా ఆదేశించినా అవి ఖాతరు చేయడం లేదు. పోనీ, దీన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్నయినా ఆశ్రయించాయా? అంటే అదీ లేదు. పార్టీలు అనుసరిస్తున్న ఈ మొండివైఖరి ప్రజాస్వామ్యవ్యవస్థ ఉనికికే సవా లు. రాజకీయ పక్షాల్ని ఆర్టీఐ పరిధి నుంచి బయటకు తెచ్చేలా చట్టసవరణకు యూపీయే ప్రభుత్వపు చివరి రోజుల్లో ఒక బిల్లును ప్రతిపాదించారు. అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకమై పార్లమెంటు స్టాండింగ్ కమిటీలో ముసాయి దా బిల్లుకు ఏకపక్షంగా మద్దతు తెలిపాయి! ఆ బిల్లు ఆమోదం పొందకుం డానే 2015 మే నెలలో లోక్‌సభ రద్దయింది. నేటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే దోరణితో వ్యవరిస్తోంది. ఇటీవల రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమా ధానమిస్తూ, ‘పార్టీలను ఆర్టీఐ కింద పౌరసంస్థలుగా ప్రకటిస్తే వాటి పని తీరునకది భంగం కలిగిస్తుంది, ప్రత్యర్థులు వారి సమాచారాన్ని దుర్వినియో గం చేసే ప్రమాదముంది’ అని చట్ట వ్యతిరేక ప్రకటన చేసింది. గోద్రా అల్లర్ల తర్వాత నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ, ప్రధాని వాజ్‌పేయ్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాల ప్రతులు కావాలన్న దరఖాస్తుదారునికి అధికారులు మొండిచేయి చూపారు. కన్నతల్లే దయ్యమైతే...! చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్రమే ఆర్టీఐ అమలును తూట్లు పొడిచే చర్యలకు పూనుకుంటోంది. ‘కన్నతల్లే దయ్యమైతే...పసికందుకు తొట్టెల కట్టే చోటేది’ అన్నట్టుంది పరిస్థితి. గత ఆగస్టు నుంచి సీఐసీ పదవి ఖాళీగా ఉంది. కీలకమైన అప్పీళ్లు పరిష్కారానికి నోచకుండా పడి ఉన్నాయి. పీఎం కార్యా లయం, విజిలెన్స్ కమిషన్, కాగ్, సుప్రీంకోర్టు, హోమ్ సహా 34 ప్రధాన శాఖల ఆర్టీఐ అప్పీళ్లను కేంద్ర సమాచార కమిషనర్ లేనిదే సీఐసీలో విచారించడానికి లేదు. అంటే, ఆయా శాఖలు సమాచారాన్ని ఏకపక్షంగా తిరస్కరించినా దిక్కు లేదు. ఇందులో ఇంకో సాంకేతికాంశం కూడా ఉంది. అసలు సీఐసీ లేకుండా అటు కేంద్ర సమాచార కమిషన్ గానీ, ఇటు రాష్ట్రాల కమిషన్లు (ఎస్ఐసీ) గానీ పనిచేయడానికి లేదు. కమిషన్ పూర్తిస్థాయి నిర్వ హణను ఇతర కమిషనర్ల సహకారంతో ముఖ్య సమాచార కమిషనర్ మాత్ర మే చేపట్టాలని సెక్షన్ 12 (4) చెబుతోంది. లోగడ ఇలాగే కమిషనర్ లేని పరిస్థితే గుజరాత్లో తలెత్తితే, వెంటనే ముఖ్య సమాచార కమిషనర్‌ను నియమించాలని అహ్మదాబాద్ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర కమిషన్‌లో సీఐసీ నియామకానికి ఎంపిక కమిటీని ప్రధాని మోదీ డిసెంబర్ 13న నియ మించారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, విపక్ష నేత మల్లి కార్జున్ ఖర్గేలతో కూడిన ఈ త్రిసభ్య సంఘం రెండుసార్లు భేటీ అయినా నియామక ప్రక్రియ అంగుళం ముందుకు జరగలేదు. చట్టం సక్రమంగా అమలైతే పారదర్శకతపరంగా తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందనే భయం వల్లనే కేంద్రం దీన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకుంది. మొత్తంగా ఆర్టీఐపై కేంద్రం వైఖరి ఎన్డీఏ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ఉంది. అధికారులు ఆడిందే ఆట...... పాలకుల వైఖరిని బట్టే కేంద్ర అధికారులు నడుస్తుంటారు. ఆర్టీఐ విషయంలో ప్రభుత్వధోరణిని చూసే కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇష్టారాజ్యంగా సమాచా రాన్ని నిరాకరిస్తున్నాయి. పద్మ అవార్డులపై నిర్దిష్టంగా అడిగిన సమాచారాన్ని గృహమంత్రిత్వ శాఖ ఏకపక్షంగా నిరాకరించింది. ఆ దరఖాస్తు అప్పీలును విచారించాలంటే సీఐసీ ఉండాలి. కాబట్టి ఇప్పట్లో అది విచారణకు రాదు. ఇదే పరిస్థితి చాలా శాఖల్లో నెలకొని ఉంది. గత పదేళ్లుగా కొందరు చిత్తశుద్దిగల కమిషనర్లు, మరీ ముఖ్యంగా ఆర్టీఐ కార్యకర్తలు, ప్రసారమాధ్యమాలు చూపిన చొరవతో సహ చట్టంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వచ్చింది. దరఖాస్తుల సంఖ్యా పెరిగింది. బడుగు బలహీనవర్గాలు, అల్ప, మధ్యా దాయవర్గాల వారు ప్రధానంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాల కింద తమ కు దక్కాల్సిన ప్రయోజనాలకు సంబంధించే ఎక్కువగా దరఖాస్తులు చేస్తున్న ట్టు తేలింది. దశాబ్దాల నుంచి సహ చట్టం అమల్లోవున్న అమెరికాలో గత ఏడాది 35 లక్షల ఆర్టీఐ దరఖాస్తులు వస్తే, భారతదేశంలో 45 లక్షల దర ఖాస్తులు వచ్చాయి! ఇలాంటి కీలక సమయంలోనే ఆ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పాలకులలాగే కేంద్ర ప్రభుత్వ సిబ్బంది- శిక్షణ వ్యవహారాలశాఖ (డీఓపీటీ) సైతం సీఐసీని మరింతగా నిర్వీర్యం చేసేందుకు పావులు కదుపుతోంది. ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షణలోని ఈ శాఖే కేంద్ర సమాచార కమిషన్‌కు సదుపాయాలు కల్పించే సౌజన్య విభాగం. మొదట్నుంచీ డీఓపీటీకి, సీఐసీకి పడటం లేదు. సీఐసీ మొదటి ముఖ్య సమాచార కమి షనర్ వజహత్ హబీబుల్లా ఆదేశాల్ని అది సుదీర్ఘంగా అమలు చేయక, సంఘర్షణాత్మక ధోరణితో పనిచేసింది. ఫైల్ నోటింగ్స్ కూడా పౌరులకివ్వాల్సిన సమాచారంలో భాగమేనని సీఐసీ ఇచ్చిన ఆదేశా లకు విరుద్ధంగా వెబ్సైట్లో సమాచారం పెట్టి లక్షలాదిగా పౌర సమాచార అధి కారుల్ని తప్పుదోవ పట్టించింది. ముఖ్య కమిషనర్ నేతృత్వంలో కమిషన్ నిర్వహించాల్సిన బాధ్యతల్ని, ఆర్థికాధికారాల్ని క్రమంగా తాము నియమించే కమిషన్ కార్యదర్శి అయిన ఐఏఎస్ అధికారికి బదిలీ చేయడానికి చూస్తోందనే విమర్శలున్నాయి. ఈ విమర్శకు బలమిచ్చేదిగా...ఈ నెల 11న డీఓపీటీ, సీఐసీ ఆర్థి కాధికారాలన్నిటీనీ కార్యదర్శికి బదలీచేస్తూ వివాదస్పద ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తికే ఇది గొడ్డలిపెట్టు. చేతులెత్తేసే కమిషన్లు శవపేటికపై చివరి మేకులు! మేమిచ్చిన ఆదేశాల్ని మేమే అమలుపరచలేకపోతున్నామని చేతులెత్తేయడం ఇటీవలి కాలంలో కమిషనర్లకు రివాజయింది. ఇది ఆర్టీఐ కార్యకర్తల కృషిని, సామాన్యపౌరుల ఆశలను నీరుగారుస్తోంది. ఏపీ సమాచార కమిషన్ కూడా ఈ వార్షిక సదస్సులో ఇలాగే తన అశక్తతను వ్యక్తం చేసింది తమ ఆదేశాల్ని ప్రభుత్వం అమలుపరచాలని, లేకపోతే తాము చేయగలిగేదేమీ లేదని పేర్కొంది. రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా స్పష్టం చేస్తూ సీఐసీ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఆయా పార్టీలు ఖాతరు చేయకపోయినా సీఐసీ ఏం చేయలేకపోయింది. ఇదే కేసులో ఈ నెల 16న తుది తీర్పు వెలువరిస్తూ, కమిషన్ ఆదేశించినా రాజకీయ పార్టీలు ఉత్తర్వుల్ని అమలుపరచలేదని, ఈ విషయంలో ఇంతకు మించి తామేమీ చేయజాలమని ముగ్గురు కమిషనర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పార్టీలు ఉత్తర్వుల్ని అమలు పరచలేదు, సవాల్ చేస్తూ న్యాయస్థానానికి వెళ్లలేదు, చట్టసవరణ కూడా జరగలేదు... కనుక తమ ఉత్తర్వులకు కాలదోషం పట్టలేదని మాత్రం పేర్కొంది. సీఐసీ ఉత్తర్వులు అమలయ్యేలా చూసే వ్యవస్థ లేకపోవడం చట్టంలో ఉన్న లొసు గని, దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని డీఓపీటీని కోరుతున్నట్టుగా అది పేర్కొంది. నిజానికి కమిషన్ ఈ కేసు పరిష్కారంలో చట్టప్రకారం వ్యవహరించలేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. రాజకీయ పార్టీలను పబ్లిక్ అథారిటీలుగా ఆదేశాలిచ్చినపుడు, ఆయా పార్టీ లకు తానే పీఐవోలనూ నియమించే అధికారం ఆర్టీఐ సెక్షన్ 19 (8) ఎ (జీ) (జీజీ) ప్రకారం కమిషన్‌కు ఉంది. ఈ నిబంధనను వినియోగించుకొని ఆయా పార్టీల కార్యనిర్వాహక బృందంలో ఎవరినైనా పీఐవోలుగా ప్రకటించి జరిమానా విధించి ఉండాల్సిందని అలాంటి వారి వాదన. అంటే సీఐసీ కూడా సహ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినట్టయింది. ఇలా... రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వం, అధికార వ్యవస్థ, కమిషన్లు ఎవరి వంతుకు వారు ఆర్టీఐని నీరుగారుస్తుండటంతో సహజంగానే ఆర్టీఐ కార్య కర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పౌర సమాజం మరింత చైతన్యమై, సంఘటిత పోరాటం ద్వారానే ఈ చట్టాన్ని కాపాడుకోవాలి. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
'పార్టీని వదిలేసినా, వేరే పార్టీలో చేరినా పదవి పోతుంది'
-
'పార్టీని వదిలేసినా, వేరే పార్టీలో చేరినా పదవి పోతుంది'
హైదరాబాద్:ఒక పార్టీలో గెలిచిన తరువాత ఆ పార్టీని వీడినా, వేరే పార్టీలో చేరినా పదవి పోతుందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ మాడభూషి శ్రీధర్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదని ఆయన తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన శ్రీధర్.. పార్టీని వదిలేసినా, వేరే పార్టీలో చేరినా పదవి పోవడం ఖాయమన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లో స్పష్టంగా ఉన్నాయన్నారు. రాజ్యాంగలోని పార్టీని రాజకీయ పార్టీగా లేదా లెజిస్లేచర్ పార్టీగా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందులో అది గుర్తింపు పొందిన పార్టీయా? లేక గుర్తింపుపొందని పార్టీయా అన్న విషయాన్ని పేర్కొనలేదన్నారు. గుర్తింపు ఉన్నా, లేకపోయినా ఇదే నియమం వర్తిస్తుందన్నారు. ఒక పార్టీ నుంచి పోటీచేయడానికి అర్హత ఉన్నప్పుడు...ఆపార్టీని వదిలేసినప్పుడు కూడా అనర్హతలు వర్తిస్తాయన్నారు. -
స.హ.కు సంకెళ్లు?
ముంబై: సామాన్యుడి ఆయుధమైన సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)పై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో వరుసగా భవనాలు కుప్పకూలి అనేక మంది ప్రాణాలు కోల్పోయినసంగతి తెల్సిందే. దీంతో అప్రమత్తమైన సర్కార్ అక్రమ, శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై చర్యలకు ఉపక్రమించింది. కానీ ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ భవనాల వివరాలు ఆర్టీఐ కింద వెల్లడించొద్దని ఆదేశిస్తూ ఆయా ప్రభుత్వ సంస్థలకు జారీ చేసిన జీవో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఆర్టీఐ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ చట్టం కింద ప్రభుత్వ భవనాల నిర్మాణ ప్రణాళికలకు సంబంధించిన వివరాలు బయటపడితే, వాటిలోని లొసుగులు బట్టబయలవుతాయని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లోపాలు బయటపడితే దాని వెనుకున్న బిల్డర్లు, అవినీతి రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. గతంలో బిల్డర్లు నిర్మించిన భవనాల్లో నాణ్యత లోపించడం, భవన ప్రణాళిక సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల సర్కార్ ఈ చర్యకు ఉపక్రమించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సామాన్యుడి ఆయుధంగా చెప్పుకునే ఆర్టీఐపై సర్కార్ ఈ విధంగా వ్యవహరించడం అక్రమార్కులకు అండగా నిలుస్తుందనే సంకేతాలె ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని మేధావులు అంటున్నారు. సెప్టెంబర్ 26న ఆదేశాలు ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల భవనాల ప్రణాళిక, ఇతర వివరాలను ఆర్టీఐ కింద వెల్లడించవద్దని పేర్కొంటూ మహారాష్ట్ర రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రత్నాకర్ గైక్వాడ్ అన్ని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. భద్రతా కారణాల వల్ల ఈ వివరాలు గోప్యంగా ఉంచాలని సదరు జీవోలో పేర్కొన్నారు. సెక్షన్ 19 (8) (సీ), 25 (5) ఆర్టీఐ చట్టం కింద ఉన్న నిబంధనలను వృథా చేస్తున్నారని, ఈ ఏడాది సెప్టెంబర్ 26న జారీ చేసిన జీఓలో గైక్వాడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కార్యాలయాలు, హోటల్లు, ఆస్పత్రులు, మాల్‌లు, ఐటీ, వాణిజ్య భవనాలకు సంబంధించి సమాచారం ఇవ్వొద్దని సూచించారు. ఆదేశాలను వెనక్కి తీసుకోవాలి ప్రజలకు సమాచారం అంతా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అమల్లోకి తీసుకొచ్చిన ఆర్టీఐపై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపడం సరికాదని కేంద్ర సమాచార కమిషనర్‌గా పనిచేసిన శైలేష్ గాంధీ అన్నారు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవనాల పూర్తి సమాచారం వెబ్సైట్లో పొందుపరచడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, బిల్డర్ల మోసాల నుంచి బయటపడే అవకాశముంటుందని అన్నారు. అనాలోచిత నిర్ణయం గైక్వాడ్ జారీ చేసిన జీవో ప్రజల హక్కులను హరించేలా ఉందని తెలుపుతూ గవర్నర్ శంకర్ నారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ప్రధాన కార్యదర్శి జయంత్ బంటియాకు ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గలీ లేఖలు రాశారు. ఎటువంటి కసరత్తు చేయకుండా చట్ట విరుద్ధంగా ఆనాలోచిత నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ముంబై లాంటి నగరంలో 52 శాతం భవనాలకు అక్యుపేషన్ సర్టిఫికెట్లు లేవన్నారు. ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం అక్రమ బిల్డర్లు, అవినీతి రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరేలా ఉందని సదరు లేఖలో పేర్కొన్నారు. అప్రమత్తమైన టీఎంసీ అధికారులు ఠాణే: జిల్లాలోని దావా పట్టణంలో పగుళ్లు ఏర్పడిన భవనాన్ని గుర్తించిన ఠాణే మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ) సిబ్బంది రంగంలోకి దిగి అందులో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆరేళ్ల క్రితం నిర్మించిన ఐదు అంతస్తుల విష్ణు కళ భవనానికి పగుళ్లు ఏర్పడి ఎప్పుడైనా కూలిపోవచ్చని అనుమానించిన స్థానికులు కార్పొరేషన్ అధికారులకు సమాచారమందించారు. వెంటనే వారు రంగంలోకి దిగి అందులో ఉంటున్న 11 దుకాణాలను మూసివేసి, 66 మంది కిరాయిదారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు దివాలోని గణేశ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని ఏ సమయంలోనైనా కూల్చివేయవచ్చని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను సరైన సమయంలో ట్రాన్సిట్ క్యాంపుకు తరలించామన్నారు. ఠాణేలోని కల్వా పట్టణంలో సోమవారం ఓ భవనం కూలిన నేపథ్యంలో టీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అందులో ఉంటున్న నివాసులు ఖాళీ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆ భవనం కూలడంతో భారీ ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. -
తొలి మహిళా ప్రధాన సమాచార కమిషనర్‌గా దీపక్ సంధు
గత నాలుగేళ్లలో తొలిసారిగా ప్రధాన సమాచార కమిషనర్ స్థానానికి ఒక మహిళ ఎంపికయ్యారు. 1971 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిణి అయిన దీపక్ సంధు ఈ గౌరవాన్ని పొందారు. రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెతో ప్రమాణం చేయించగా, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు హాజరయ్యారు. గతంలో ఆమె ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గాను, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్‌గాను, ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్‌గాను సేవలందించారు. 2009లో సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో కేన్స్, బెర్లిన్, వెనిస్, టోక్యో నగరాల్లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివళ్లలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అలాగే పలు అంశాలపై వివిధ దేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ సదస్సులలో కూడా ఆమె దేశం తరఫున పాల్గొన్నారు. 2005 నుంచే తాను సమాచార హక్కు కోసం పోరాడానని, అప్పట్లో ఈ అంశంపై పలువురితో చర్చించానని ఆమె తెలిపారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడమే తన తొలి ప్రాధాన్యమని ఆమె చెప్పారు. అయితే, ఇప్పటికే ఆమె వయసు 64 సంవత్సరాలు కావడంతో మరో మూడునెలలు మాత్రమే ఆమెకు పదవీ కాలం ఉంది. కొత్త కమిషనర్లు నియమితులైతే పని త్వరగా జరుగుతుందని ఆమె చెప్పారు.