అభిప్రాయం
ఇదే క్రీడామోసాల నివారణ బిల్లు. దీన్ని 2015లో మార్చారు. ఈ నివేదిక ప్రకారం, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలు ఆర్టీఐ కింద పబ్లిక్ అథారిటీలే.
ఢిల్లీ సాకర్ అసోసియేషన్ (డీఎస్‌ఏ) పబ్లిక్ అథారిటీ అవుతుందా? ఆర్టీఐ చట్టం కింద వారు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉందా, లేదా? అన్న వివాదం సమాచార కమిషన్ ముందుకు వచ్చింది. ఈ సంఘానికి ఒక ఉపాధ్యక్షుడు ఉన్నారు. పేరు నాగేందర్ సింగ్. వారు ఆ క్రీడ ఆడే అమ్మాయిల విభాగానికి ఇన్‌చార్జి కూడా. తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతడి పైనే కొందరు క్రీడాకారిణులు ఫిర్యాదు చేశారు. పనిచేసే చోట లైంగిక వేధింపుల నుంచి మహిళలను రక్షించే చట్టం 2013 కింద ఆ ఫిర్యాదులపైన చర్య తీసు కోవలసిన బాధ్యత డీఎస్‌ఏకు ఉంటుంది.
ఆ ఫిర్యాదులపైన డీఎస్‌ఏ ఉపాధ్యక్షుడిపైన ఏ చర్యతీసుకున్నారో తెలియజేయాలని ఫుట్‌బాల్ ఆట గాళ్ల మరొక సంఘం అధ్యక్షుడు డీకే బోస్ ఆర్టీఐ చట్టం కింద అడిగారు. దానికి సమాధానం ఇవ్వకుండా, తాము పబ్లిక్ అథారిటీ కాబోమని, ఆర్టీఐ కింద తమకు జవాబు ఇవ్వవలసిన అవసరం లేదని లేఖ రాశారు. 2013 చట్టం కింద మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు వివరాలను ఇవ్వడానికి వీల్లేదని కూడా వివరించారు. బోస్ సంఘాన్ని ఈ క్రీడాపోటీల నుంచి నిషేధించామనీ అందుకే దురుద్దేశంతో ఆర్టీఐ సమాచారాన్ని అడుగుతున్నాడనీ డీఎస్‌ఏ జవాబి చ్చింది. అంతటితో ఆగకుండా బోస్‌కు తాము ఇది వరకే జవాబు ఇచ్చామని కనుక ఈ రెండో అప్పీలును కొట్టి వేయాలని కోరింది.
ఫుట్‌బాల్ ఆటకు ఒక అఖిల భారత సమాఖ్య ఉంది. అదే ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్– (ఏఐఎఫ్‌ఎఫ్). ఈ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కుషాల్‌దాస్ ఢిల్లీ సాకర్ సంఘం అధ్యక్షుడు సుభాష్ చోప్రాకు ఆగస్టు 11, 2017న రాసిన ఉత్తరంలో ‘ఢిల్లీ సంఘం ఉపాధ్యక్షుడి మీద అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మాకు కూడా ఆర్టీఐ కింద వారిపైన ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతూ అభ్యర్థన లు వస్తున్నాయి. ఇదివరకు మా సమాఖ్య మీకు మే 15, 2017న ఒక క్రీడాకారిణి తండ్రి మీ ఉపా ధ్యక్షుడిపైన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి ఫిర్యాదు చేశారు. దాన్ని మీకు పంపాం. ఇటువంటి ఫిర్యాదుల కారణంగా ఉపాధ్యక్షుడి పదవి నుంచి తొలగించిన తరువాత కూడా నాగేందర్ సింగ్ క్రీడా కారిణులతో కలసి పోటీలు జరిగే స్థలాలకు ప్రయా ణిస్తున్నాడనీ, దీనికి కారణం డీఎస్‌ఏ ఏ చర్యా తీసు కోకపోవ డమే అని అంటున్నారు.
2010 ఆగస్టులో ఆయనపై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణల ఫిర్యాదు ప్రతి కూడా మళ్లీ పంపాం. కానీ మీరు చర్య తీసుకున్నట్టు జవాబు ఇవ్వలేదు. ఇది తీవ్రమైన అంశ మని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఏ పరిస్థితులలో కూడా ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. త్వరగా జవాబివ్వండి’ అని కోరారు. దానికి 23.8. 2017 న డీఎస్‌ఏ అధ్యక్షులు జవాబిచ్చారు. ‘మేనే జింగ్ కమిటీ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరి శీలించి, వివరంగా చర్చించింది. డీఎస్‌ఏ సంస్థలో క్రీడాకారిణులు ఉద్యోగినులు కాదు. కనుక ఇక్కడ లైంగిక వేధింపుల ఫిర్యాదు విచారణలకు కవి ుటీ వేయాల్సిన అవసరం లేదని, కనుక తాము లైంగిక వేధింపుల నుంచి మహిళలను రక్షించే చట్టం కిందకు కూడా రాబోమని మేము జాతీయ మహిళా కమి షన్‌కూ, ఢిల్లీ మహిళా కమిషన్‌కూ జవాబు ఇచ్చాం’ అని వివరించారు.
డీఎస్‌ఏ ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగానూ పరో క్షంగానూ నిధులు పొందుతున్నదని, వీరి కార్యా లయం కూడా అంబేడ్కర్ స్టేడియంలో ఉందని, ఈ స్టేడియం మునిసిపాలిటీ యాజమాన్యంలో ఉందని, ఢిల్లీ మునిసిపాలిటీ పబ్లిక్ అథారిటీ అనడంలో సందేహం లేదని బోస్ వాదించారు. జస్టిస్ ముద్గల్ కమిటీ బీసీసీఐ వ్యవహారాన్ని ఐíపీఎల్ వ్యవహారాన్ని విచారించి 2014లో ఇచ్చిన నివేదికలో ఈ క్రీడల నేరాలను ఆపడానికి, అవినీతిని నిరోధించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించింది. ఇదే క్రీడామోసాల నివారణ బిల్లు. దీన్ని 2015లో మార్చారు. ఈ నివేదిక ప్రకారం, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలు ఆర్టీఐ కింద పబ్లిక్ అథారిటీలే.
క్రీడా మంత్రిత్వ శాఖ, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ల ఆదేశాలను స్వీకరిస్తూ వారి నియంత్ర ణలో డీఎస్‌ఏ పనిచేయాలి. ఈ క్రీడలో అక్రమాలను విచారించడానికి, ఢిల్లీలో ఫుట్‌బాల్ ఆటమీద ఈ డీఎస్ ఏకు మా త్రమే గుత్తాధిపత్యం అప్పగించారు. ఇందు వల్లనే వారికి క్రీడాపోటీలు నిర్వహించే అధికారం, క్రీడాకారులను ఎంపిక చేసే అధికారం, అందులో వాణిజ్య ప్రయోజనాలు సాధించే అవకాశం కూడా లభిస్తున్నాయి. ఇదంతా పరోక్ష ఆర్థిక సాయం కిందికి వస్తుంది. డీఎస్‌ఏ పబ్లిక్ అ«థారిటీ అవుతుందనడంలో ఏ సందేహమూ లేదని, ఆర్టీఐ కింద జవాబుదారీగా ఉండాలని అభ్యర్థి అడిగిన సమాచారాన్ని ఇచ్చి తీరా లని కమిషన్ ఆదేశించిం ది. (డీకే బోస్ వర్సెస్ డిఎస్‌ఏ CIC/MOYAS/A/2017/157090/2017/157090, కేసులో 21.11. 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా).
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment