All India Football Federation
-
హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్‌కు ఉద్వాసన పలికారు. 2026 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో టీమిండియా మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోవడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్టిమాక్ సేవలకు మంగళం పాడింది. క్రొయేషియాకు చెందిన ఈ మాజీ ఫుట్‌బాలర్‌ను 2019లో కోచ్‌గా నియమించారు. ఆయన శిక్షణలో భారత జట్టు నాలుగు మేజర్ ట్రోఫీలను సాధించింది. ఇందులో రెండు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ టైటిళ్లు కాగా, ఇంటర్కాంటినెంటల్ కప్, ముక్కోణపు సిరీస్ ఉన్నాయి. దీంతో గత అక్టోబర్‌లో ఆయనకు 2026 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే సునీల్ ఛెత్రి (ప్రస్తుతం రిటైరయ్యాడు) నేతృత్వంలోని భారత్ క్వాలిఫయర్స్‌లో ఎప్పటిలాగే రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. దీంతో జట్టు ప్రదర్శన సరిగాలేని కారణంతో గడువుకు ముందే స్టిమాక్‌ను తొలగించారు. ఒప్పందం ప్రకారం ఇలా అర్ధంతరంగా సాగనంపితే స్టిమాక్‌కు 3,60,000 డాలర్లు (రూ. 3 కోట్లు) ఏఐఎఫ్ఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తం చెల్లించేందుకు సమాఖ్య సిద్ధమైంది. హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి థోలెం శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీతేజ ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో మూడో స్థానంలో నిలిచింది.శ్రీతేజ ఓవరాల్‌గా 4136 పాయింట్లు సాధించింది. రినీ ఖాతూన్ (పశి్చమ బెంగాల్; 4357 పాయింట్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. స్నేహిత్‌కు కాంస్యం సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ గేమ్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు. రష్యాలోని కజాన్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 9–11, 8–11, 6–11తో ఓటమి చవిచూశాడు. -
AIFF: తొలిసారి అధ్యక్షుడిగా ఆటగాడు
న్యూఢిల్లీ: మైదానంలో ఆటగాళ్లు గోల్ కోసం శ్రమిస్తుంటే... కేంద్ర మంత్రి స్థాయి వారు ఫుట్‌బాల్ సంఘంలో ఏళ్ల తరబడి తిష్టవేసి రాజకీయాలు చేశారు. ఇలా ఆటకు సంబంధంలేని వారే 85 ఏళ్ల పాటు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను ఏలారు. ఏనాడూ మాజీ కెప్టెన్ కానీ, దిగ్గజ ప్లేయర్ కానీ సమాఖ్యలో అధ్యక్ష స్థానంలో లేనే లేరు. దీంతో రాజకీయాలతో మసక బారిన ఏఐఎఫ్ఎఫ్ చివరకు మన ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ఫిఫా’ నిషేధానికి గురైంది. చివరకు రోజుల వ్యవధిలోనే సడలింపుతో ఊపిరి పోసుకున్న ఏఐఎఫ్ఎఫ్కు ఇప్పుడు కొత్త జవసత్వాలు మాజీ ఆటగాడి రూపంలో వచ్చాయి. భారత మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే 85 ఏళ్ల ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో అధ్యక్షుడైన ఆటగాడిగా నిలిచారు. మాజీ కెప్టెన్, దిగ్గజం బైచుంగ్ భూటియా ఈ ఎన్నికలో ఓడినప్పటికీ మైదానంలోలాగే ఓ ఆటగాడి చేతిలోనే ఓడాడు. రాజకీయ నాయకుడి చేతిలో కాకపోవడం గొప్ప ఊరట. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 46 ఏళ్ల కల్యాణ్ చౌబే అధ్యక్షుడిగా ఏకపక్ష విజయం సాధించారు. ఆయన 33–1 ఓట్ల తేడాతో భూటియాను ఓడించారు. ఆశ్చర్యకరంగా మాజీ కెప్టెన్‌కు ఒక్క ఓటే రావడం విచిత్రం! భూటియా, ఐఎం విజయన్, లారెన్స్, హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీ ఆటగాళ్ల ప్రతినిధులుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా వ్యవహరిస్తారు. మిగతా 14 మంది ఈసీ మెంబర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ జీపీ ఫల్గుణతో పాటు అవిజీత్ పాల్, పి.అనిల్ కుమార్, వాలంక నటాష, మాలోజి రాజే ఛత్రపతి, మేన్ల ఎతెన్పా, మోహన్ లాల్, ఆరిఫ్ అలీ, కె.నీబౌ సెఖోస్, లాల్గింగ్లోవా, దీపక్ శర్మ, విజయ్ బాలి, ఇంతియాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ కొసరాజు కోశాధికారి పదవి కోసం పోటీపడి 1–32తో కిపా అజయ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతిలో ఓడారు. మంచి గోల్ కీపర్... కల్యాణ్ చౌబే మాజీ గోల్ కీపర్, మంచి గోల్‌కీపర్ కూడా. 1996లో మోహన్ బగాన్ సీనియర్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశారు. తదనంతరం ఈస్ట్ బెంగాల్, జేసీటీ, సాల్గావ్కర్ తదితర క్లబ్‌లకు 2003 ఏడాది వరకు ప్రాతినిధ్యం వహించారు. అంతకంటే ముందు జూనియర్ స్థాయిలో భారత అండర్–17, అండర్–20 జట్ల తరఫున ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 1999–2000లో ప్రి–ఒలింపిక్ క్వాలిఫికేషన్లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణాసి యా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడుసార్లు విజేతగా నిలువడంలో గోల్‌కీపర్ గా చౌబే కీలకపాత్ర పోషించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 2019లో బీజేపీ తరఫున బెంగాల్లో ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. -
భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత
భారత ఫుట్‌బాల్‌కు ఊరట లభించింది. భారత్‌పై విధించిన నిషే«ధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. నిషేధాన్ని తొలగించాలని ‘ఫిఫా’ కౌన్సిల్ బ్యూరో శుక్రవారం నిర్ణయించింది. భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేసి రోజూవారీ కార్యకలాపాలపై సమాఖ్య పరిపాలనా వర్గం పూర్తిగా పట్టు చేజిక్కించుకున్నట్లు తెలియడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ‘ఫిఫా’ ప్రకటించింది. భారత్‌లో పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటామని, ఎన్నికలను సరైన రీతిలో నిర్వహించేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్టోబర్ 11నుంచి భారత్‌లో జరగాల్సిన అండర్–17 మహిళల ప్రపంచ కప్‌ను యథావిధిగా నిర్వహించేందుకు అనుమతిచ్చింది. -
భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం.. కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిషేధం విధించిన నేపథ్యంలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై ఇవాళ (ఆగస్ట్ 17) విచారణ జరిపిన కోర్టు.. ఏఐఎఫ్ఎఫ్పై ఫిఫా సస్పెన్షన్ ఎత్తివేసేలా కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అండర్ 17 మహిళల ప్రపంచకప్‌ను భారత్‌లోనే నిర్వహించేలా చూడాలని ఆదేశించింది. FIFA suspending All India Football Federation | SG Tushar Mehta, representing Centre, tells SC that considering several factors about what can be done, y'day Centre took up the issue with FIFA, and Committee of Administrators also played a key role & there's some breaking of ice. pic.twitter.com/LTiAbDe4Zq — ANI (@ANI) August 17, 2022 కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఫిఫాతో చర్చలు జరుపుతున్నామని వివరణ ఇచ్చారు. ఈ అంశాన్ని ఆగస్టు 22న విచారించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, తృతీయ పక్షం జోక్యం కారణంగా ఏఐఎఫ్ఎఫ్పై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. చదవండి: భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు భారీ షాక్.. సస్పెన్షన్ వేటు వేసిన ఫిఫా -
భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు భారీ షాక్.. సస్పెన్షన్ వేటు వేసిన ఫిఫా
FIFA Suspends All India Football Federation: ఊహించినట్టే జరిగింది. భారత ఫుట్‌బాల్‌కు కష్టకాలం వచ్చింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిషేధం విధించింది. ఏఐఎఫ్ఎఫ్లో తృతీయ పక్షం జోక్యం సహించబోమని కొంతకాలంగా పలుమార్లు ‘ఫిఫా’ హెచ్చరించింది. కానీ ఏఐఎఫ్ఎఫ్ పట్టించుకోలేదు. దాంతో చివరకు ‘ఫిఫా’ భారత ఫుట్‌బాల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ నిషేధం విధించిది. ఏఐఎఫ్ఎఫ్ పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేయాలి. అలాకాకుండా అడ్‌హక్ కమిటీ, కోర్టులు నియమించిన పరిపాలక కమిటీ (ఇవన్నీ థర్డ్ పార్టీలు–తృతీయ పక్షం)లతో నడిచే జాతీయ ఫుట్‌బాల్ సంఘాన్ని ‘ఫిఫా’ గుర్తించదు. ఈ కారణంతోనే ఏఐఎఫ్ఎఫ్ను సస్పెండ్ చేసింది. ‘ఫిఫా నియమావళికి విరుద్ధంగా నడుస్తున్న ఏఐఎఫ్ఎఫ్పై నిషేధం విధిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ‘ఫిఫా’ బ్యూరో కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. తక్షణం పరిపాలక కమిటీ తప్పుకోవాలి. ఏఐఎఫ్ఎఫ్ కొత్త కార్యవర్గం ఎన్నికై, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కావాలి. రోజువారీ కార్యకలాపాల్ని కొత్త కార్యవర్గం నిర్వహించినపుడే నిషేధాన్ని ఎత్తేసే చర్యలు చేపడతాం’ అని ‘ఫిఫా’ ఒక ప్రకటనలో తెలిపింది. నిషేధం నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారత్‌లో జరగాల్సిన మహిళల అండర్–17 ప్రపంచకప్ కూడా షెడ్యూల్ ప్రకారం జరగదని ‘ఫిఫా’ కౌన్సిల్ స్పష్టం చేసింది. 85 ఏళ్ల ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో ఇలా సస్పెన్షన్‌కు గురవడం ఇదే తొలిసారి. అసలేం జరిగింది... దీనికంతటికీ కారణం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అగ్రనేత ప్రఫుల్ పటేల్ పదవీ వ్యామోహమే! ఆయన ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. డిసెంబర్–2020తో ఆయన పదవీకాలం ముగిసినా కోర్టు కేసులు వేస్తూ కుర్చీని మాత్రం వీడలేదు. జాతీయ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం గరిష్టంగా 12 ఏళ్లకు మించి అధ్యక్ష పదవిలో ఎవరూ కొనసాగేందుకు వీలులేదు. దీంతో మోహన్ బగాన్ క్లబ్ జట్టు మాజీ గోల్‌కీపర్ కళ్యాణ్ చౌబే సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రఫుల్ పటేల్‌ను తప్పించి పరిపాలక కమిటీ (సీఓఏ)ని నియమించింది. ‘ఫిఫా’ నిధులు బంద్ ‘ఫిఫా’ తన సభ్య దేశాల్లో ఫుట్‌బాల్ క్రీడ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏటా రూ. కోట్లలో నిధులు ఇస్తుంది. సస్పెన్షన్‌తో ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోతాయి. దీని వల్ల ఏఐఎఫ్ఎఫ్ ఈ ఏడాది సుమారు రూ. 4 కోట్లు (5 లక్షల డాలర్లు) నష్టపోతుంది. మైదానాల నిర్మాణ, నాణ్యమైన ఫుట్‌బాల్ బంతులు, జెర్సీలు, సామాగ్రిల కోసం ‘ఫిఫా’ ఆ నిధుల్ని విడుదల చేస్తుంది. కేంద్రం జోక్యం ఏఐఎఫ్ఎఫ్పై విధించిన నిషేధాన్ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు పరిధిలోని కేసును సత్వరం విచారించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బోపన్నల బెంచ్‌ను కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. బుధవారం తొలి కేసుగా ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల అంశాన్నే విచారిస్తామని ద్విసభ్య ధర్మాసనం మెహతాకు తెలిపింది. పాత నియమావళి ప్రకారమే ఎన్నికలు ఏఐఎఫ్ఎఫ్కు పాత నియమావళి ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని పరిపాలక కమిటీ స్పష్టం చేసింది. సస్పెన్షన్‌కు గురైన వెంటనే ఎన్నికల ప్రక్రియలో చలనం వచ్చింది. ‘ఫిఫా’ నిర్దేశించినట్లుగానే అనుబంధ రాష్ట్రాల సంఘాల ప్రతినిధులే ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల్లో పాల్గొంటారని, మాజీ ఆటగాళ్లతో కూడిన ఓటర్లతో నిర్వహించబోమని తేల్చిచెప్పింది. ఏఐఎఫ్ఎఫ్ నియమావళిని కాదని సీఓఏ 36 సంఘాలను విస్మరించి ఈ స్థానంలో 36 మంది మాజీ ఫుట్బాలర్లతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. దీన్ని ‘ఫిఫా’ తోసిపుచ్చడంతో పాతపద్ధతిలోనే ప్రక్రియ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆటకు ఎదురుదెబ్బ నిషేధం ప్రభావం జాతీయ జట్టుకు, భారత క్లబ్ జట్లపై తీవ్రంగా ఉంటుంది. అంతర్జాతీయ, ఫ్రెండ్లీ మ్యాచ్‌లకు అవకాశమే ఉండదు. దీంతో వచ్చే నెల 24న వియత్నాంతో, 27న సింగపూర్‌తో సునీల్ ఛెత్రీ కెప్టెన్సీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు అటకెక్కినట్లే! ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఇంటర్–జోనల్ సెమీఫైనల్స్‌లో భాగంగా సెప్టెంబర్ 7న జరగాల్సిన మోహన్ బగాన్ మ్యాచ్ కూడా కష్టమే! ఉజ్బెకిస్తాన్‌లో ఉన్న ఇండియన్ మహిళల లీగ్ చాంపియన్ ‘గోకులం కేరళ’ జట్టు మ్యాచ్‌లకు కూడా దెబ్బపడింది. అక్కడ ఏఎఫ్సీ మహిళల క్లబ్ చాంపియన్‌షిప్‌లో సొగ్దియానా క్లబ్‌తో ఈ నెల 23న, 26న ఇరాన్లో బామ్ ఖటూన్ ఎఫ్‌సీతో జరగాల్సిన మ్యాచ్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇరాక్‌లో వచ్చేనెల 14 నుంచి జరగాల్సిన ఏఎఫ్సీ అండర్–20 క్వాలిఫయర్స్‌లో కూడా భారత జట్టుకు అవకాశం ఉండదు. ఆ టోర్నీలో భారత్ 14న ఇరాక్‌తో, 16న ఆస్ట్రేలియాతో, 18న కువైట్‌తో ఆడాల్సి ఉంది. చదవండి: భారత్‌పై ఫిఫా నిషేధం.. విషయం చేయి దాటిపోయిందన్న స్టార్ ఫుట్‌బాలర్ -
‘అర్జున’ రేసులో సందేశ్, బాలాదేవి
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా భారత ఫుట్‌బాల్ జట్టు తరఫున నిలకడగా రాణిస్తోన్న పురుషుల జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్... మహిళల జట్టు స్ట్రయికర్ బాలాదేవిలను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున’కు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) నామినేట్ చేసింది. 2015లో జట్టులోకి వచ్చిన 25 ఏళ్ల చండీగఢ్ ప్లేయర్ సందేశ్ 36 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మణిపూర్‌కు చెందిన 30 ఏళ్ల బాలాదేవి ఇటీవల స్కాట్లాండ్కు చెందిన రేంజర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌తో 18 నెలల ఒప్పందాన్ని చేసుకుంది. తద్వారా విదేశీ ప్రొఫెషనల్ లీగ్‌లో ఆడిన తొలి మహిళా భారత ఫుట్‌బాలర్‌గా గుర్తింపు పొందింది. -
భారత మాజీ ఫుట్‌బాలర్ అబ్దుల్ లతీఫ్ కన్నుమూత
గువాహటి: భారత దిగ్గజ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు అబ్దుల్ లతీఫ్ కన్నుమూశారు. ఆయనకు 73 ఏళ్లు. దిగ్గజ ఆటగాడి మృతి పట్ల అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సంతాపం తెలిపింది. ‘అబ్దుల్ లతీఫ్ ఇక లేరు అనేది చాలా విచారకరం. భారత ఫుట్‌బాల్‌కు ఆయన చేసిన సేవలు మరువలేనివి’ అని ఏఐఎఫ్ఎఫ్ అ«ధ్యక్షులు ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. 1968లో బర్మాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లతీఫ్... 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. కర్ణాటకలోని మైసూర్లో జన్మించిన ఆయన జాతీయ స్థాయి టోర్నీ సంతోష్ ట్రోఫీ (1966, 1968, 1970)లో బెంగాల్‌కు ప్రాతిని«ధ్యం వహించారు. వీటితో పాటు కోల్‌కతా విఖ్యాత క్లబ్‌లు మోహన్ బగాన్, మొహమ్మదాన్ స్పోర్టింగ్ జట్లకూ తన సేవలు అందించారు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక మొహమ్మదాన్, అస్సాం జట్లకు కోచ్‌గానూ వ్యవహరించారు. ఆయన శిక్షణలో అస్సాం జట్టు ఆటలో ఎంతో పురోగతి సాధించింది. -
సునీల్ చెత్రికి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించిన 2017 వార్షిక అవార్డుల్లో భారత కెప్టెన్, సాకర్ స్టార్ సునీల్ చెత్రి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. బైచుంగ్ భూటియా తర్వాత వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడిగా ఈ స్ట్రయికర్ ఘనత వహించిన సంగతి తెలిసిందే. మహిళల కేటగిరీలో ఈ అవార్డు మణిపూర్‌కు చెందిన కమలా దేవికి దక్కింది. ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో రాణించిన అనిరుధ్ థాపా ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. -
ఆ చర్యలేవో వెల్లడించరా?
అభిప్రాయం ఇదే క్రీడామోసాల నివారణ బిల్లు. దీన్ని 2015లో మార్చారు. ఈ నివేదిక ప్రకారం, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలు ఆర్టీఐ కింద పబ్లిక్ అథారిటీలే. ఢిల్లీ సాకర్ అసోసియేషన్ (డీఎస్ఏ) పబ్లిక్ అథారిటీ అవుతుందా? ఆర్టీఐ చట్టం కింద వారు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉందా, లేదా? అన్న వివాదం సమాచార కమిషన్ ముందుకు వచ్చింది. ఈ సంఘానికి ఒక ఉపాధ్యక్షుడు ఉన్నారు. పేరు నాగేందర్ సింగ్. వారు ఆ క్రీడ ఆడే అమ్మాయిల విభాగానికి ఇన్చార్జి కూడా. తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతడి పైనే కొందరు క్రీడాకారిణులు ఫిర్యాదు చేశారు. పనిచేసే చోట లైంగిక వేధింపుల నుంచి మహిళలను రక్షించే చట్టం 2013 కింద ఆ ఫిర్యాదులపైన చర్య తీసు కోవలసిన బాధ్యత డీఎస్ఏకు ఉంటుంది. ఆ ఫిర్యాదులపైన డీఎస్ఏ ఉపాధ్యక్షుడిపైన ఏ చర్యతీసుకున్నారో తెలియజేయాలని ఫుట్‌బాల్ ఆట గాళ్ల మరొక సంఘం అధ్యక్షుడు డీకే బోస్ ఆర్టీఐ చట్టం కింద అడిగారు. దానికి సమాధానం ఇవ్వకుండా, తాము పబ్లిక్ అథారిటీ కాబోమని, ఆర్టీఐ కింద తమకు జవాబు ఇవ్వవలసిన అవసరం లేదని లేఖ రాశారు. 2013 చట్టం కింద మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు వివరాలను ఇవ్వడానికి వీల్లేదని కూడా వివరించారు. బోస్ సంఘాన్ని ఈ క్రీడాపోటీల నుంచి నిషేధించామనీ అందుకే దురుద్దేశంతో ఆర్టీఐ సమాచారాన్ని అడుగుతున్నాడనీ డీఎస్ఏ జవాబి చ్చింది. అంతటితో ఆగకుండా బోస్‌కు తాము ఇది వరకే జవాబు ఇచ్చామని కనుక ఈ రెండో అప్పీలును కొట్టి వేయాలని కోరింది. ఫుట్‌బాల్ ఆటకు ఒక అఖిల భారత సమాఖ్య ఉంది. అదే ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్– (ఏఐఎఫ్ఎఫ్). ఈ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కుషాల్‌దాస్ ఢిల్లీ సాకర్ సంఘం అధ్యక్షుడు సుభాష్ చోప్రాకు ఆగస్టు 11, 2017న రాసిన ఉత్తరంలో ‘ఢిల్లీ సంఘం ఉపాధ్యక్షుడి మీద అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మాకు కూడా ఆర్టీఐ కింద వారిపైన ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతూ అభ్యర్థన లు వస్తున్నాయి. ఇదివరకు మా సమాఖ్య మీకు మే 15, 2017న ఒక క్రీడాకారిణి తండ్రి మీ ఉపా ధ్యక్షుడిపైన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి ఫిర్యాదు చేశారు. దాన్ని మీకు పంపాం. ఇటువంటి ఫిర్యాదుల కారణంగా ఉపాధ్యక్షుడి పదవి నుంచి తొలగించిన తరువాత కూడా నాగేందర్ సింగ్ క్రీడా కారిణులతో కలసి పోటీలు జరిగే స్థలాలకు ప్రయా ణిస్తున్నాడనీ, దీనికి కారణం డీఎస్ఏ ఏ చర్యా తీసు కోకపోవ డమే అని అంటున్నారు. 2010 ఆగస్టులో ఆయనపై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణల ఫిర్యాదు ప్రతి కూడా మళ్లీ పంపాం. కానీ మీరు చర్య తీసుకున్నట్టు జవాబు ఇవ్వలేదు. ఇది తీవ్రమైన అంశ మని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఏ పరిస్థితులలో కూడా ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. త్వరగా జవాబివ్వండి’ అని కోరారు. దానికి 23.8. 2017 న డీఎస్ఏ అధ్యక్షులు జవాబిచ్చారు. ‘మేనే జింగ్ కమిటీ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరి శీలించి, వివరంగా చర్చించింది. డీఎస్ఏ సంస్థలో క్రీడాకారిణులు ఉద్యోగినులు కాదు. కనుక ఇక్కడ లైంగిక వేధింపుల ఫిర్యాదు విచారణలకు కవి ుటీ వేయాల్సిన అవసరం లేదని, కనుక తాము లైంగిక వేధింపుల నుంచి మహిళలను రక్షించే చట్టం కిందకు కూడా రాబోమని మేము జాతీయ మహిళా కమి షన్కూ, ఢిల్లీ మహిళా కమిషన్‌కూ జవాబు ఇచ్చాం’ అని వివరించారు. డీఎస్ఏ ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగానూ పరో క్షంగానూ నిధులు పొందుతున్నదని, వీరి కార్యా లయం కూడా అంబేడ్కర్ స్టేడియంలో ఉందని, ఈ స్టేడియం మునిసిపాలిటీ యాజమాన్యంలో ఉందని, ఢిల్లీ మునిసిపాలిటీ పబ్లిక్ అథారిటీ అనడంలో సందేహం లేదని బోస్ వాదించారు. జస్టిస్ ముద్గల్ కమిటీ బీసీసీఐ వ్యవహారాన్ని ఐíపీఎల్ వ్యవహారాన్ని విచారించి 2014లో ఇచ్చిన నివేదికలో ఈ క్రీడల నేరాలను ఆపడానికి, అవినీతిని నిరోధించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించింది. ఇదే క్రీడామోసాల నివారణ బిల్లు. దీన్ని 2015లో మార్చారు. ఈ నివేదిక ప్రకారం, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలు ఆర్టీఐ కింద పబ్లిక్ అథారిటీలే. క్రీడా మంత్రిత్వ శాఖ, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ల ఆదేశాలను స్వీకరిస్తూ వారి నియంత్ర ణలో డీఎస్ఏ పనిచేయాలి. ఈ క్రీడలో అక్రమాలను విచారించడానికి, ఢిల్లీలో ఫుట్‌బాల్ ఆటమీద ఈ డీఎస్ ఏకు మా త్రమే గుత్తాధిపత్యం అప్పగించారు. ఇందు వల్లనే వారికి క్రీడాపోటీలు నిర్వహించే అధికారం, క్రీడాకారులను ఎంపిక చేసే అధికారం, అందులో వాణిజ్య ప్రయోజనాలు సాధించే అవకాశం కూడా లభిస్తున్నాయి. ఇదంతా పరోక్ష ఆర్థిక సాయం కిందికి వస్తుంది. డీఎస్ఏ పబ్లిక్ అ«థారిటీ అవుతుందనడంలో ఏ సందేహమూ లేదని, ఆర్టీఐ కింద జవాబుదారీగా ఉండాలని అభ్యర్థి అడిగిన సమాచారాన్ని ఇచ్చి తీరా లని కమిషన్ ఆదేశించిం ది. (డీకే బోస్ వర్సెస్ డిఎస్ఏ CIC/MOYAS/A/2017/157090/2017/157090, కేసులో 21.11. 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
అవకాశం వదలొద్దు!
ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత ఫుట్‌బాల్ జట్టు తమ అద్వితీయ ప్రదర్శనతో మెరుపులు మెరిపించింది. అయితే కాలానుగుణంగా ఆటలో వచ్చిన మార్పులకు తగ్గట్టు భారత ఫుట్‌బాల్ రూపాంతరం చెందలేకపోయింది. ఫలితమే నేడు తమ ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. చిన్నాచితక దేశాలు కూడా పురుషుల ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుండగా... భారత్ మాత్రం ఆమడదూరంలో నిలుస్తోంది. అయితే అండర్–17 ప్రపంచకప్ ఆతిథ్యం ద్వారా ఈ ఆటకు పునరుజ్జీవం కలిగించే సదవకాశం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)కు లభించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇటు భారత కుర్రాళ్లు భవిష్యత్‌కు భరోసా కల్పించాలి. ఆతిథ్యంతోనే మురిసిపోకుండా ఈ మెగా ఈవెంట్ తర్వాత కూడా ఆటను పట్టించుకొని దేశంలో ఈ క్రీడకు పూర్వ వైభవం తెచ్చేందుకు అటు సమాఖ్య నిరంతర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి క్రీడా విభాగం : మెల్బోర్న్ (1956) ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం... 1951 న్యూఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణాలు... 1964 ఆసియా కప్‌లో రన్నరప్...కానీ ఈ ఫలితాలన్నీ గత వైభవమే. ఏనాడూ భారత్‌కు ప్రపంచకప్‌లో తమ సత్తా చాటుకునేందుకు అవకాశం రాలేదు. 87 ఏళ్ల చరిత్ర ఉన్న సీనియర్ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్ అర్హత సాధించలేదు. వివిధ వయో విభాగాల్లో (అండర్–17, అండర్–20) జరిగే ఇతర ప్రపంచకప్‌లలోనూ భారత్ ఏనాడూ బరిలోకి దిగలేదు. కానీ నాలుగేళ్ల క్రితం భారత్‌కు అండర్–17 వయో విభాగం రూపంలో తొలిసారి ప్రపంచకప్‌ను నిర్వహించే ఆతిథ్య హక్కులు లభించాయి. అనంతరం అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) భారత జట్టు ఎంపిక కోసం ప్రతిభాన్వేషణ చేపట్టడం... ఆటగాళ్లను ఎంపిక చేయడం... వారికి నిలకడగా శిబిరాలు ఏర్పాటు చేయడం... విదేశీ జట్లతో 50 కంటే ఎక్కువగా ఫ్రెండ్లీ మ్యాచ్‌లను నిర్వహించడం... మొత్తానికి సొంతగడ్డపై జరగనున్న ఈ మెగా ఈవెంట్ ద్వారా అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ అందరి దృష్టిని ఆకట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. గత రెండేళ్లలో భారత యువ జట్టుపై ఏఐఎఫ్ఎఫ్ రూ. 10 కోట్లు వెచ్చించింది. ఇటీవలే ఏఐఎఫ్ఎఫ్ 2019లో జరిగే అండర్–20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం బిడ్ కూడా దాఖలు చేసింది. ఒకవేళ అండర్–17 ప్రపంచకప్ సక్సెస్ అయితే భారత్‌కు మరో వరల్డ్ కప్ నిర్వహించే భాగ్యం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకప్పుడు అంతర్జాతీయస్థాయిలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన భారత ఫుట్‌బాల్‌కు పూర్వ వైభవం లభించే అవకాశం అండర్–17 ప్రపంచ కప్ ద్వారా లభించింది. అయితే ఏ క్రీడలోనూ రాత్రికి రాత్రే గొప్ప ఫలితాలు రావు. ఈ మెగా ఈవెంట్ ద్వారా భారత్ త్వరలోనే ఫుట్‌బాల్‌లో మేటి జట్టుగా మారుతుందని కూడా ఆశించలేం. అయితే ఈ ప్రపంచకప్ భారత ఫుట్‌బాల్ భవిష్యత్‌కు సరైన దిశానిర్దేశనం చేయగలదని భావించవచ్చు. -
భూటియాపై వేటు
కోల్‌కతా: రెండేళ్లపాటు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సలహాదారుగా పనిచేసిన భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియాను తప్పించారు. గత డిసెంబర్లోనే అతనితో ఒప్పందం గడువు పూర్తయిందని... మళ్లీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని ఏఐఎఫ్ఎఫ్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌కు సాంకేతిక సలహాదారుడిగా కూడా పనిచేసిన భూటియా... ఆ సమయంలో స్టీఫెన్ కాన్స్టాంటైన్ భారత జట్టుకు మళ్లీ కోచ్‌గా రావడంలో కీలకపాత్ర పోషించారు. ఏఐఎఫ్ఎఫ్ ప్రముఖులతో అభిప్రాయబేధాలు రావడంతోనే భూటియా కాంట్రాక్ట్‌ను పొడిగించలేదని సమాచారం. భారత అండర్–17 కోచ్‌గా నికొలాయ్ ఆడమ్‌ను తప్పించాక... ఆయన స్థానంలో కామ్ టోయల్ను కోచ్‌గా తీసుకురావాలని భూటియా సూచించాడు. అయితే భూటియా సూచనలను పట్టించుకోకుండా ఏఐఎఫ్ఎఫ్ పోర్చుగల్‌కు చెందిన లూయిస్ నార్టన్ డి మాటోస్ను అండర్–17 జట్టుకు కోచ్‌గా నియమించింది. -
మన ఫుట్‌బాల్ శయనింపు సేవ
ప్రపంచ కప్పు వల్ల రావడానికి అవకాశమున్న గుండెపోట్లు, ఉద్వేగోద్రే కం, బాధ వంటి సమస్యలకు మన అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ దివ్యమైన, అత్యంత నిలకడైన పరిష్కారాన్ని కనిపెట్టింది.క్వాలిఫై అయ్యేంత బాగా ఎప్పుడూ ఆడొద్దు, ఓటమి అనే అవమానాన్ని ఎప్పుడూ ఎదుర్కోవద్దు. కాలుష్యం అంటని, ప్రక్షాళనకు గురికాని జ్ఞాపక శక్తి ఉన్న చదువరులు పరమ పావనమైన ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్ జోంగ్ ఉన్ గురించి కొన్ని నెలల క్రితం పాశ్చాత్య మీడియా వినిపించిన ఓ మడ్డి వార్తా కథనాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. దేశభక్తిగల యువత అంతా తనలాంటి తల కట్టునే (హెయిర్ స్టైల్) అనుసరించాలని ఉన్ ప్రజాస్వామిక ఆదేశాన్ని జారీ చేసినట్టు అది తెలిపింది. ‘కిమ్ కట్’ అంటే తల చుట్టూతా చేసే ఒక విధమైన శస్త్ర చికిత్స. చెవి పై అంచును మించి కిందకు వేలాడే కేశ సంపదనంతా గొరిగి పారేయడం. సామ్రాజ్యవాదపు పెంపుడు కుక్కలుగా పార్ట్ టైమ్ విధులను నిర్వహించే పాత్రికేయుల్లో స్వాభావికంగానే ఉండే ఈర్ష్యా సూయలతో కూడిన రిపోర్టింగ్‌కు ఆ కథనం ప్రాతినిధ్యం వహిస్తుంది. బ్రెజిల్ ఫుట్‌బాల్ మైదానాల్లో ఉంచిన స్క్రీన్ల వైపు అలవోకగా ఓ చూపు చూసినాగానీ కిమ్ కట్ అంతర్జాతీయ హైర్ స్టైల్ అయిపోయిందని రుజువవుతుంది. ఈ పక్షపాతం లోతులను మీరు గుర్తించగలరనే ఆశిస్తాను. 2014 ప్రపంచ ఫుట్ బాల్ కప్ ఆటగాళ్లు ఏ బరాక్ ఒబామా నెత్తి మీదున్న ‘సాల్ట్ అండ్ పెప్పర్ డ్రిజిల్’ హెయిర్ స్టైల్‌నో (ఉప్పు, మిరియాల పొడి చల్లిన ఆహారాన్ని తీసుకుంటానని ఓప్రా విన్ఫ్రేతో ఒబామా చెప్పారు) లేదా డేవిడ్ కామెరాన్ నెత్తి మీది 20వ శతాబ్దపు స్లిక్బ్యాక్ ఎటాప్ (నున్నగా వెనక్కు దువ్విన) హెయిర్ స్టైల్‌నో లేదా గడ్డి కోత యంత్రం వేసిన పుతిన్ (బట్టతల) హెయిర్ కట్నో ఎక్కువగా ఎంచుకుని ఉంటే.... మీడియా దానికి కారకులైనవారిని ప్రశంసించడం కోసం వెర్రెత్తి పోయి ఉండేది. కానీ అది కామ్రేడ్ కిమ్ హెయిల్ స్టైల్ కాబట్టి కలసికట్టుగా మౌనం వహించింది. ఇది కచ్చితంగా అంతర్జాతీయ కుట్రేనని అంటాను. ప్రపంచ కప్పు కష్టాలతో ఎలా వ్యవహరించాలనే విషయంలో అద్భుత నాయకత్వ ప్రదర్శనను చూపిన మన దేశానికి తగు ఖ్యాతి లభించకపోవడం ఎవరికైనా విచారం కలిగిస్తుంది. ప్రపంచ కప్పు వల్ల రావడానికి అవకాశమున్న గుండెపోట్లు, ఉద్వేగోద్రేకం, బాధ వంటి సమస్యలకు మన అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ దివ్యమైన, అత్యంత నిలకడైన పరిష్కారాన్ని కనిపెట్టింది. అది తెలియక అవమానకరమైన పరాజయాలతో క్వాలిఫై కాలేక ఇంటి ముఖం పట్టినప్పుడు ఇంగ్లండ్, స్పెయిన్ వంటి రెండు స్వాభిమాన దేశాలకు అదే జరిగింది. వాళ్లు భారత్‌ను చూసి నేర్చుకోవాల్సింది. క్వాలిఫై అయ్యేంత బాగా ఎప్పుడూ ఆడొద్దు, ఓటమి అనే అవమానాన్ని ఎప్పుడూ ఎదుర్కోవద్దు. అలా ముందు దశలోనే పోటీకి దూరం కావడంలో ఇంగ్లండ్‌కు తగు మాత్రం అనుభవం లేకపోలేదు. అయినా భారత్‌ను ఉదాహరణగా తీసుకోలేనంత గర్వం దానిది. వారి అభిమానులు బహుశా బాధకు గురై సంతోషాన్ని పొందే మాసోకిస్టులై ఉండాలి. లేకపోతే టీవీ సెట్లకు అతుక్కుపోయిన వందల లక్షల మంది ముందు, అందులో అత్యధికులు కేరింతలు కొడుతుండగా అవమానానికి గురికావడాన్ని ఎలా ఆస్వాదిస్తారు? మీర సలు ఓడిపోకపోతే మీ కోచ్ లేదా కెప్టెన్ లేదా 75 ఏళ్లు పైబడిన ఆటగాళ్లంతా రాజీనామా చేయాలని ఎవరూ డిమాండ్ చేయరు. ప్రతి ఒక్కరు సురక్షితమే. ఏ ఫుట్ బాల్ అధికారి తలనో లేదా మెడనో డిమాండ్ చేయడాన్ని మీలో ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? ఎన్నడూ జరగలేదు, జరగబోదు. అంతా యథాతథంగా సాగిపోతూనే ఉంటుంది. మాంటె కార్లో లేదా రియో డి జనేరియో వంటి నైతిక నిష్టాపరత్వపు స్వర్గసీమలకు కట్టే ప్రతి జంకెట్ టూర్లోనూ వ్యక్తిగత ప్రయోజనాలను గరిష్టం చేసుకునే సృజనాత్మక పథకాల రూప కల్పనలో ప్రతి అధికారి అత్యుత్తమమైనది చేస్తూనే ఉంటాడు. పాపం, బ్రిటన్ ఫుట్‌బాల్ అభిమానులకు ఆ క్రీడంటే అవివేకమనిపిం చేటంతటి పిచ్చి ప్రేమ. ఇంగ్లండ్ ప్రపంచ కప్పును గెలుచుకోవడమే తరువాయి అమేజాన్ లోతట్టుల్లోని ఆస్తుల ధరలు అకాశాన్నంటుతాయని మధుర భాషణతో దేన్నయినా అమ్మేసే సేల్స్మెన్లు వందలాది మందిని ఒప్పించేయగలిగారని విన్నాను. వాళ్లిప్పుడు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కానీ అది మరీ అమాయకత్వం. బ్రిటన్ ఫుట్‌బాల్ అభిమానులు కూడా మన లాగే తయార వాలి. ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టీ పెట్టడంతోనే ఆశ వదిలేసుకోవాలి. వైఫల్యంపై ప్రత్యేకించి ఇంత భారీ స్థాయి వైఫల్యంపై మన వాళ్ల మక్కువ వల్ల సృజనాత్మక ‘ప్రయోజనాలు’ లేకపోలేదు. అది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ఉద్వేగభరితమైన ప్రయాసకు ఎప్పుడూ గురికాం. ఆ ప్రయాస గుండెకు ప్రమాదకరమైనదని చాలా మంది డాక్టర్ల విశ్వాసం. ఇరాన్ లేదా ఘనా ఆటగాడి గెలవాలనే సంఘర్షణ ఏ విధమైన మానసిక వేదనను కలుగజేస్తుందో చూడండి. ఇటాలియన్ కోచ్‌ను చూస్తుంటే ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చేట్టుంది. స్పానిష్ కోచ్‌ను మానసిక రుగ్మతల వార్డుకు పంపాల్సి వచ్చేలా ఉంది. కానీ మన భారత అధికారులెవరి మొహంలోనూ కనుబొమలు కదలడం ఎవరూ చూసి ఎరుగరు. తమ ఉద్యోగాలు శాశ్వతమన్న భరోసాతో వాళ్లు నిశ్చింతగా నూరేళ్లూ బతికేయగలరు. 2074 ప్రపంచ కప్పుకు టీమ్‌ను ఎలా తయారు చేయడమనేదే భారత ఫుట్‌బాల్ అధికారుల ముందున్న ఒకే ఒక్క తీవ్ర సమస్య. మిగతా ప్రపంచమం తటా అప్పటికే పోటీలు జరిగిపోయి ఉండటం వల్ల అవి ఆర్కిటిక్ ప్రాంతంలో జరగవచ్చు. భారత్ అభిమానులు ఇక ఎంతో కాలం పాటూ పట్టించుకోని ఓ శుభవార్త ఉంది. మన అధికారులు ఉభయ రంగాలకు చెందిన అత్యుత్తమమైన వాటిని సమకూర్చుకున్నారు. నిజంగా పరుగులు తీసే పనినంతటినీ టీవీ స్క్రీన్ల మీద కనిపించే విదేశీయులకు వదిలేశారు. వాళ్లిప్పుడు ఫుట్‌బాల్‌కు మెదడుకు సంబంధించిన అంశాలపైనా, వలయాకారంలో, అర్ధ చ ంద్రాకారంలో పరుగులు తీయడానికి సంబంధించిన సిద్ధాంతాలపైనా, చుక్కల గీత మీద హఠాత్తుగా తూలిపడ్డాలు, గిరిగిరా తిరగడాలపైనా దృష్టిని కేంద్రీకరించ గలుగుతారు. అందుకు ఆధారాలు డ్రాయింగ్ బోర్డులపై కనిపిస్తాయి. పేపరు, పెన్నూ, సరైన పర్యవేక్షకులతో ప్రపంచ కప్ సిద్ధాంతంపై తగు పరీక్ష నిర్వహించాలే గానీ మన వాళ్లను ఎవరూ ఓడించలేరు. మిగతా వాళ్లు ఫుట్‌బాల్‌కు కుస్తీ పోటీకి అవసరమైన నైపుణ్యం, మోసగాడికి ఉండే నైతికత, అవకాశవాదికి ఉండే అదృష్టమూ అవసరమైన నైపుణ్యాలని భావిస్తే భావించవచ్చు. మనోళ్లకు అది బంగాళా దుంపల చిప్స్ గిన్నెను అందుబాటులో ఉంచుకుని పడకపై వాలి హాయిగా వినాల్సిన స్వరసమ్మేళనం. భారతీయులు తమ అమూల్యమైన విశ్వాసాన్ని సరిగా కాళ్లు కదల్చలేని డిఫెండర్ల మీద, రెండు కళ్లను కేంద్రీకరించి చూడలేని స్ట్రైకర్ల మీద ఎందుకు వృథా చేసుకోవాలి? రెండు మాంఛెస్టర్, లివర్‌పూల్, ఆర్సెనెల్, బార్సిలోనా, మాడ్రిడ్‌లు ఉండగా, స్వారెజ్ ఇంగ్లండ్‌ను ఓడించ గలిగి, ఆపై తాను మింగ లేనిదాన్ని (శిక్షను) మింగాల్సి రావడానికి సిద్ధపడగా... కోల్‌కతా మందకొడి బాబులపై సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలి? నిజమైన నక్షత్రాలు ఆకాశంలోనే ఉండేది. ఆకాశం ఎన్నటికీ ఒక దేశానిది కాదు. మనకంటూ ఏ స్టార్లూ లేనప్పుడు అలాంటి ఉదాత్తమైన ఆలోచన చాలా అందంగా కనిపిస్తుంది. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎంజే అక్బర్