మన ఫుట్‌బాల్ శయనింపు సేవ | indian football failure story | Sakshi
Sakshi News home page

మన ఫుట్‌బాల్ శయనింపు సేవ

Published Sun, Jun 29 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

మన ఫుట్‌బాల్ శయనింపు సేవ

మన ఫుట్‌బాల్ శయనింపు సేవ

ప్రపంచ కప్పు వల్ల రావడానికి అవకాశమున్న గుండెపోట్లు, ఉద్వేగోద్రే కం, బాధ వంటి సమస్యలకు మన అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ దివ్యమైన, అత్యంత నిలకడైన పరిష్కారాన్ని కనిపెట్టింది.క్వాలిఫై అయ్యేంత బాగా ఎప్పుడూ ఆడొద్దు, ఓటమి అనే అవమానాన్ని ఎప్పుడూ ఎదుర్కోవద్దు.
 
కాలుష్యం అంటని, ప్రక్షాళనకు గురికాని జ్ఞాపక శక్తి ఉన్న చదువరులు పరమ పావనమైన ఉత్తర కొరియా సుప్రీం నేత కిమ్ జోంగ్ ఉన్ గురించి కొన్ని నెలల క్రితం పాశ్చాత్య మీడియా వినిపించిన ఓ మడ్డి వార్తా కథనాన్ని   గుర్తుకు తెచ్చుకోవాలి. దేశభక్తిగల యువత అంతా తనలాంటి తల కట్టునే (హెయిర్ స్టైల్) అనుసరించాలని ఉన్ ప్రజాస్వామిక ఆదేశాన్ని జారీ చేసినట్టు అది తెలిపింది. ‘కిమ్ కట్’ అంటే తల చుట్టూతా చేసే ఒక విధమైన శస్త్ర చికిత్స.  చెవి పై అంచును మించి కిందకు వేలాడే కేశ సంపదనంతా గొరిగి పారేయడం. సామ్రాజ్యవాదపు పెంపుడు కుక్కలుగా పార్ట్ టైమ్ విధులను నిర్వహించే పాత్రికేయుల్లో స్వాభావికంగానే ఉండే ఈర్ష్యా సూయలతో కూడిన రిపోర్టింగ్‌కు ఆ కథనం ప్రాతినిధ్యం వహిస్తుంది. బ్రెజిల్ ఫుట్‌బాల్ మైదానాల్లో ఉంచిన స్క్రీన్‌ల వైపు అలవోకగా ఓ చూపు చూసినాగానీ  కిమ్ కట్ అంతర్జాతీయ హైర్ స్టైల్ అయిపోయిందని రుజువవుతుంది.  

ఈ పక్షపాతం లోతులను మీరు గుర్తించగలరనే ఆశిస్తాను. 2014 ప్రపంచ ఫుట్ బాల్ కప్ ఆటగాళ్లు ఏ బరాక్ ఒబామా నెత్తి మీదున్న ‘సాల్ట్ అండ్ పెప్పర్ డ్రిజిల్’ హెయిర్  స్టైల్‌నో (ఉప్పు, మిరియాల పొడి చల్లిన ఆహారాన్ని తీసుకుంటానని ఓప్రా విన్‌ఫ్రేతో ఒబామా చెప్పారు) లేదా డేవిడ్ కామెరాన్ నెత్తి మీది 20వ శతాబ్దపు స్లిక్‌బ్యాక్ ఎటాప్ (నున్నగా వెనక్కు దువ్విన) హెయిర్ స్టైల్‌నో లేదా గడ్డి కోత యంత్రం వేసిన పుతిన్ (బట్టతల) హెయిర్ కట్‌నో ఎక్కువగా ఎంచుకుని ఉంటే.... మీడియా దానికి కారకులైనవారిని ప్రశంసించడం కోసం వెర్రెత్తి పోయి ఉండేది. కానీ అది కామ్రేడ్ కిమ్ హెయిల్ స్టైల్ కాబట్టి కలసికట్టుగా మౌనం వహించింది. ఇది కచ్చితంగా అంతర్జాతీయ కుట్రేనని అంటాను.

ప్రపంచ కప్పు కష్టాలతో ఎలా వ్యవహరించాలనే విషయంలో అద్భుత నాయకత్వ ప్రదర్శనను చూపిన మన దేశానికి తగు ఖ్యాతి లభించకపోవడం ఎవరికైనా విచారం కలిగిస్తుంది. ప్రపంచ కప్పు వల్ల రావడానికి అవకాశమున్న గుండెపోట్లు, ఉద్వేగోద్రేకం, బాధ వంటి సమస్యలకు మన అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ దివ్యమైన, అత్యంత నిలకడైన పరిష్కారాన్ని కనిపెట్టింది. అది తెలియక అవమానకరమైన పరాజయాలతో క్వాలిఫై కాలేక ఇంటి ముఖం పట్టినప్పుడు ఇంగ్లండ్, స్పెయిన్ వంటి రెండు స్వాభిమాన దేశాలకు అదే జరిగింది. వాళ్లు భారత్‌ను చూసి నేర్చుకోవాల్సింది. క్వాలిఫై అయ్యేంత బాగా ఎప్పుడూ ఆడొద్దు, ఓటమి అనే అవమానాన్ని ఎప్పుడూ ఎదుర్కోవద్దు.

అలా ముందు దశలోనే పోటీకి దూరం కావడంలో ఇంగ్లండ్‌కు తగు మాత్రం అనుభవం లేకపోలేదు. అయినా భారత్‌ను ఉదాహరణగా తీసుకోలేనంత గర్వం దానిది. వారి అభిమానులు బహుశా బాధకు గురై సంతోషాన్ని పొందే మాసోకిస్టులై ఉండాలి. లేకపోతే టీవీ సెట్లకు అతుక్కుపోయిన వందల లక్షల మంది ముందు, అందులో అత్యధికులు కేరింతలు కొడుతుండగా అవమానానికి గురికావడాన్ని ఎలా ఆస్వాదిస్తారు?

మీర సలు ఓడిపోకపోతే మీ కోచ్ లేదా కెప్టెన్ లేదా 75 ఏళ్లు పైబడిన ఆటగాళ్లంతా రాజీనామా చేయాలని ఎవరూ డిమాండ్ చేయరు. ప్రతి ఒక్కరు సురక్షితమే. ఏ ఫుట్ బాల్ అధికారి తలనో లేదా మెడనో డిమాండ్ చేయడాన్ని మీలో ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? ఎన్నడూ జరగలేదు, జరగబోదు. అంతా యథాతథంగా  సాగిపోతూనే ఉంటుంది. మాంటె కార్లో లేదా రియో డి జనేరియో వంటి నైతిక నిష్టాపరత్వపు స్వర్గసీమలకు కట్టే ప్రతి జంకెట్ టూర్‌లోనూ వ్యక్తిగత ప్రయోజనాలను గరిష్టం చేసుకునే సృజనాత్మక పథకాల రూప కల్పనలో ప్రతి అధికారి అత్యుత్తమమైనది చేస్తూనే ఉంటాడు.

 పాపం, బ్రిటన్ ఫుట్‌బాల్ అభిమానులకు ఆ క్రీడంటే అవివేకమనిపిం చేటంతటి పిచ్చి ప్రేమ. ఇంగ్లండ్ ప్రపంచ కప్పును గెలుచుకోవడమే తరువాయి అమేజాన్ లోతట్టుల్లోని ఆస్తుల ధరలు అకాశాన్నంటుతాయని మధుర భాషణతో దేన్నయినా అమ్మేసే సేల్స్‌మెన్లు వందలాది మందిని ఒప్పించేయగలిగారని విన్నాను. వాళ్లిప్పుడు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కానీ అది మరీ అమాయకత్వం. బ్రిటన్ ఫుట్‌బాల్ అభిమానులు కూడా మన లాగే తయార వాలి. ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టీ పెట్టడంతోనే ఆశ వదిలేసుకోవాలి.

వైఫల్యంపై ప్రత్యేకించి ఇంత భారీ స్థాయి వైఫల్యంపై మన వాళ్ల మక్కువ వల్ల సృజనాత్మక ‘ప్రయోజనాలు’ లేకపోలేదు. అది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ఉద్వేగభరితమైన ప్రయాసకు ఎప్పుడూ గురికాం. ఆ ప్రయాస గుండెకు ప్రమాదకరమైనదని చాలా మంది డాక్టర్ల విశ్వాసం. ఇరాన్ లేదా ఘనా ఆటగాడి గెలవాలనే సంఘర్షణ ఏ విధమైన మానసిక వేదనను కలుగజేస్తుందో చూడండి. ఇటాలియన్ కోచ్‌ను చూస్తుంటే ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చేట్టుంది. స్పానిష్ కోచ్‌ను మానసిక రుగ్మతల వార్డుకు పంపాల్సి వచ్చేలా ఉంది.  కానీ మన భారత అధికారులెవరి మొహంలోనూ కనుబొమలు కదలడం ఎవరూ చూసి ఎరుగరు. తమ ఉద్యోగాలు శాశ్వతమన్న భరోసాతో వాళ్లు నిశ్చింతగా నూరేళ్లూ బతికేయగలరు.  

2074 ప్రపంచ కప్పుకు టీమ్‌ను ఎలా తయారు చేయడమనేదే భారత ఫుట్‌బాల్ అధికారుల ముందున్న ఒకే ఒక్క తీవ్ర సమస్య. మిగతా ప్రపంచమం తటా అప్పటికే పోటీలు జరిగిపోయి ఉండటం వల్ల అవి ఆర్కిటిక్ ప్రాంతంలో జరగవచ్చు.

భారత్ అభిమానులు ఇక ఎంతో కాలం పాటూ పట్టించుకోని ఓ శుభవార్త ఉంది. మన అధికారులు ఉభయ రంగాలకు చెందిన అత్యుత్తమమైన వాటిని సమకూర్చుకున్నారు. నిజంగా పరుగులు తీసే పనినంతటినీ టీవీ స్క్రీన్‌ల మీద కనిపించే విదేశీయులకు వదిలేశారు. వాళ్లిప్పుడు ఫుట్‌బాల్‌కు మెదడుకు సంబంధించిన అంశాలపైనా, వలయాకారంలో, అర్ధ చ ంద్రాకారంలో  పరుగులు తీయడానికి సంబంధించిన సిద్ధాంతాలపైనా, చుక్కల గీత మీద హఠాత్తుగా తూలిపడ్డాలు, గిరిగిరా తిరగడాలపైనా దృష్టిని కేంద్రీకరించ గలుగుతారు. అందుకు ఆధారాలు డ్రాయింగ్ బోర్డులపై కనిపిస్తాయి. పేపరు, పెన్నూ, సరైన పర్యవేక్షకులతో ప్రపంచ కప్ సిద్ధాంతంపై తగు పరీక్ష నిర్వహించాలే గానీ మన వాళ్లను ఎవరూ ఓడించలేరు. మిగతా వాళ్లు ఫుట్‌బాల్‌కు కుస్తీ పోటీకి అవసరమైన నైపుణ్యం, మోసగాడికి ఉండే నైతికత, అవకాశవాదికి ఉండే అదృష్టమూ అవసరమైన నైపుణ్యాలని భావిస్తే భావించవచ్చు. మనోళ్లకు అది బంగాళా దుంపల చిప్స్ గిన్నెను అందుబాటులో ఉంచుకుని పడకపై వాలి హాయిగా వినాల్సిన స్వరసమ్మేళనం.

భారతీయులు తమ అమూల్యమైన విశ్వాసాన్ని సరిగా కాళ్లు కదల్చలేని డిఫెండర్ల మీద, రెండు కళ్లను కేంద్రీకరించి చూడలేని స్ట్రైకర్ల మీద ఎందుకు వృథా చేసుకోవాలి? రెండు మాంఛెస్టర్, లివర్‌పూల్, ఆర్సెనెల్, బార్సిలోనా, మాడ్రిడ్‌లు ఉండగా, స్వారెజ్ ఇంగ్లండ్‌ను ఓడించ గలిగి, ఆపై తాను మింగ లేనిదాన్ని (శిక్షను) మింగాల్సి రావడానికి సిద్ధపడగా... కోల్‌కతా మందకొడి బాబులపై సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవాలి?

నిజమైన నక్షత్రాలు ఆకాశంలోనే ఉండేది. ఆకాశం ఎన్నటికీ ఒక దేశానిది కాదు. మనకంటూ ఏ స్టార్‌లూ లేనప్పుడు అలాంటి ఉదాత్తమైన ఆలోచన చాలా అందంగా కనిపిస్తుంది.
         
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)  - ఎంజే అక్బర్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement