ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై ఆర్టీఐ కమిషనర్ తాంతియా కుమారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై ఆర్టీఐ కమిషనర్ తాంతియా కుమారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం అమలులో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆమె శుక్రవారమిక్కడ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో ఆర్టీఐ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీఆర్వో సహా 8 మంది ఎంఆర్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు అధికారులు నోటీసులకు స్పందించకుంటే సస్పెన్షన్లకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని కమిషనర్ తాంతియా కుమారి సూచించారు.