స.హ. చట్టాన్ని నిర్వీర్యం చేయడం దారుణం
– రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ విజయమోహన్
బనగానపల్లె : సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వంలోని కొన్ని శాఖల ఉన్నతాధికారులు నిర్వీర్యం చేయడం దారుణమని సమాచార హక్కు రాష్ట్ర కమిషనర్ విజయ్‌మోహన్ అన్నారు. గురువారం రాత్రి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని పొదుపు భవనంలో పీఎసీ పౌండర్ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో జరుగుతున్న అనే కుంభకోణాలు సమాచార హక్కు చట్టం కిందనే వెలుగు చూశాయన్నారు. కొన్ని ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం చీకటి జీవోలను అమలు చేయడం మంచిది కాదన్నారు. ఈ చట్టాన్ని ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహిచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. అయితే ప్రచారం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోన్ని దేవాదాయశాఖలు సమాచార హక్కు చట్టం పరిధిలోని వస్తున్నా.. ఏపీలో మాత్రం దేవాదాయశాఖ ఈ చట్టం పరిధిలోని రాదని ఆ శాఖ అధికారులు పేర్కొనడం శోచనీయమన్నారు. ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు గ్రామీణ స్థాయిలోని వెళ్లాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పీఎసీ రాయలసీమ కో కన్వీనర్ జగన్నా«థ్ రెడ్డి ,సభ్యులు చంద్రశేఖర్, మక్బుల్, తహసీల్దార్ అనురాధ, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.