
పింఛనుకూ పడరాని పాట్లా?
విశ్లేషణ
పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో పొందే హక్కు పనిచేసే హక్కులో భాగం. రిటైరయిన ఉద్యోగులను వేధించకుండా వారి పింఛను ఫైళ్లను సకాలంలో పరిష్కరించాలి. లేకపోతే నష్టపరిహారాలు చెల్లించాలి.
జీవితకాలమంతా పని చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పింఛను ఇవ్వడం, ఇతర ప్రయోజనాలు లెక్కగట్టి ఇవ్వడం అన్ని ప్రభుత్వ, ప్రరుువేటు కార్యాలయాలలో జరగవలసిన సాధారణ కార్యక్రమం. యాజమా న్యం కనీస ధర్మం అది. ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వారికి ఉద్యోగ విరమణ నాడు మిత్రులంతా కలిసి లాంఛనంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి సత్కరిస్తారు. కాని రిటైరరుున ఐదు, ఆరేళ్ల దాకా రావలసిన డబ్బు రాకపోతే, పింఛను లెక్కలు ఆరేడు నెలలు దాటినా తేల్చకపోతే, ఆ ఉద్యోగి గతి ఏమిటి? అతను ఏం చేయాల్సి ఉంటుంది? ఇది యాజమాన్య నిర్వహణకు సంబంధించిన విషయం. సాధారణ పాలన తీరును తెలిపే అంశం. సన్మానాలు చేయకపోరుునా రిటైరైన రోజే పింఛను, తదితర ప్రయోజనాల చెక్కు చేతికి ఇవ్వడం ఒక అవసరం అని అధికారులు గుర్తించాలి.
కానీ నేడు పలు కార్యాలయాల్లో పాలనాపరమైన అసమర్థత రాజ్యం చేస్తున్నది. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి వెంటనే పింఛను ఇవ్వడం, ఆ ఖాళీలో అప్పటికే మరొక ఉద్యోగిని నియమించడం సమర్థత అనిపించుకుంటుంది. ఉద్యోగంలో చేరిన నాడే ఉద్యోగ విరమణ తేదీ తెలిసిపోతుంది. ఆ సమయానికి ఆ ఉద్యోగ ఖాళీని భర్తీ చేయకపోతే ఆ పని భారం ఎవరు వహిస్తారు? సిబ్బందిని వెనువెంటనే భర్తీ చేయకపోతే నష్టం వస్తుందని వ్యాపారులు ఆ లోటు రాకుండా చూసుకుంటారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి నుంచి ప్రభుత్వ కార్యాలయ గుమస్తా, టైపిస్టు ఉద్యోగాల వరకు వందలాది ఖాళీ లను అట్లాగే వదిలేస్తూ పోతే పాలన ఏమవుతుంది, వారి పని ఎవరు చేస్తారు? తమ పనే సరిగ్గా చేయడానికి ఇష్టపడని ఉద్యోగులు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో పక్కవాడి పని కూడా ఎవరైనా చేస్తారా? ఇది ప్రజల అవసరాల పట్ల నిర్లక్ష్యాన్ని, విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తుంది. పాలకులు ప్రజలకు జవాబుదారీ వహించేలా చేయడానికే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) రూపొం దింది. తమ ఉద్యోగుల పట్ల సైతం జవాబుదారీ తనం పాటించని అధికారులు ప్రజల పట్ల ఏ విధంగా బాధ్యతాయుతంగా ఉంటారు? రూ.10 తో చిన్నపాటి ప్రజాప్రయోజన వ్యాజ్యం (మినీ పీఐఎల్) ప్రయోజనాలను అందుకునే అవకాశాన్ని సహ చట్టం కల్పిస్తున్నది.
శశికుల్ భూషణ్ శర్మ అనే ఉద్యోగి తన పదవీ విరమణ ప్రయోజనాల డబ్బులోంచి మినహారుుం పులు ఎందుకు చేశారు, కొంత డబ్బు తనకు ఎందుకు చెల్లించలేదు, ఎప్పుడు చెల్లిస్తారని ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారు. పదవీ విరమణ తరువాత కూడా ఆయన అధికార నివాస గృహంలో నివసించారని, అందుకుగాను నియమాల ప్రకారం మార్కెట్ విలువ కన్నా రెండింతలు మినహారుుంచామని ప్రజా సమాచార అధికారి (పీఐఓ) జవాబిచ్చారు. పూర్తి సమాచారం ఇవ్వలేదని మొదట దాఖలు చేసిన అప్పీలుకు జవాబు లేదు. దీంతో సమాచార కమిషన్ ముందు రెండో అప్పీలును వేశారు. విచారణకు హాజరైన అధికారి తనకు ఆ ఫైలుకు సంబంధించిన వివరాలు తెలియవని, కనుక అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేమని చెప్పారు. వివరాలు తెలి యని వారు విచారణకు హాజరై ఏం ప్రయోజనం? దరఖాస్తుదారు అడిగిన దస్తావేజులను పరిశీలించే అవకాశం కలిగించాలని, ఆయన కోరిన పత్రాల ప్రతులను ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరిగిన జాప్యం ఫిర్యాదుపై చేపట్టిన కార్యాచరణ నివేదికను ఇవ్వాలని సూచించారు.
పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో పొందే హక్కు కూడా ఉద్యోగి పనిచేసే హక్కులో భాగం. ఉద్యోగ విరమణ నాటికే ఉద్యోగి రిటైర్మెంట్ వ్యవహారాలన్నిటిపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ బాధ్యతలను నిర్లక్ష్యం చేసే అధికారులు తాము కూడా ఒక నాటికి రిటైరవుతామన్న నిజాన్ని గుర్తుంచుకోవాలి. రిటైరరుున ఉద్యోగులను వేధించకుండా వారి పింఛను ఫైళ్లను సకాలంలో పరిష్కరించాలి. లేకపోతే నష్టపరిహారాలు చెల్లించవలసి వస్తుంది.
ఐదేళ్లపాటు దరఖాస్తుదారుని పింఛను వ్యవహారాన్ని పెండింగులో ఉంచి, వేధించినందుకు నష్టపరిహారం ఎందుకు చెల్లించరాదో వివరించాలని కమిషన్ నోటీసు జారీ చేసింది. నష్టపరిహారాలు, ఖర్చులు చెల్లించాలని తీర్పు చెప్పే అధికారాన్ని సహ చట్టంలోని సెక్షన్ 19(8)(బి) కమిషన్ కు ఇచ్చింది. సమాచారం ఇవ్వడంలో జాప్యానికి, పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉంది.
(శశికుల్ భూషణ్ శర్మ వర్సెస్ పీఐఓ, పంజాబ్ విశ్వవిద్యాలయం CIC/C-C-/A-/2015/000749 అ కేసులో 21.11.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com