పాలకొల్లు సెంట్రల్: ప్రజలకు ఉపయోగపడే విషయాలకు సంబంధించిన సమాచారాన్నే సమాచార హక్కు చట్టం కింద సేకరించాలని పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ సౌమ్యలత అన్నారు. ఆదివారం పాలకొల్లులో నిర్వహించిన సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రతి చిన్న విషయానికి సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని ఆమె సూచించారు.