గత సర్జికల్‌ దాడుల రికార్డులు లేవు | There are no records of past surgical attacks | Sakshi
Sakshi News home page

గత సర్జికల్‌ దాడుల రికార్డులు లేవు

Published Mon, Aug 28 2017 2:31 AM | Last Updated on Tue, Sep 12 2017 1:07 AM

There are no records of past surgical attacks

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ వెల్లడి
 
న్యూఢిల్లీ: 2016 సెప్టెంబర్‌ 29వ తేదీ కంటే ముందు చేపట్టిన సర్జికల్‌ దాడులకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంఓ) తెలిపింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ప్రశ్నకు డీజీఎంఓ సమాధానమిచ్చింది. ఇండియన్‌ ఆర్మీ రికార్డులో సర్జికల్‌ దాడులకు ఎలాంటి నిర్వచనం ఉందో తెలపాల్సిందిగా అతను దరఖాస్తులో కోరాడు. దీనికి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ సమధానమిస్తూ ‘ఇంటెలిజెన్స్‌ సమాచారంతో నిర్దేశిత లక్ష్యంపై వేగంగా, కచ్చితమైన దాడులు చేయడాన్ని’సర్జికల్‌ దాడులుగా పేర్కొంది.

అంతేకాకుండా భారత సైన్యం చరిత్రలో 2016 సెప్టెంబర్‌ 29వ తేదీన జరిగిన సర్జికల్‌ దాడులే మొదటిదా లేక 2004–2014 మధ్యలో ఏమైనా సర్జికల్‌ దాడులు జరిగాయా తెలపాలని దరఖాస్తులో కోరాడు. ఇంటిగ్రేటేడ్‌ హెడ్‌క్వార్టర్స్‌ (ఆర్మీ)కి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తును బదిలీ చేసింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement