
ఆర్టీఐ పరిధికి దూరంగా న్యాయనియామకాలు
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామక ప్రక్రియను ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకువచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, దీనికి అనుకూలంగా ప్రభుత్వం సిఫారసు చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇలా చేయడంవల్ల వివిధ వర్గాలనుంచి నోట్‌ఫైల్స్, ఇతర వివరాలుకోరుతూ కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని, దీనివల్ల అనవసర చిక్కులు వచ్చే ప్రమాదముందని ప్రభుత్వం భావి స్తోంది. అయితే అత్యున్నత న్యాయస్థానాల్లో నియామకాలకు సంబంధించి పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇందులో భాగంగా కొలీజియం, న్యాయమూర్తులుగా నియమించివారి విషయంలో లేదా పదోన్నతి కల్పించినవారి విషయంలో ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని తప్పనిసరిగా కార్యనిర్వాహక వ్యవస్థ దృష్టికి తీసుకురావాలన్న నిబంధనను తీసుకురానుంది.