
అడిగినదే అడిగే ఆర్టీఐ ప్రశ్నల వేధింపుల నుంచి రక్షించాలని అధికారులు కోరుతూ ఉంటారు. సమాచారం అందినా మళ్లీ అదే అడిగితే ఆ దరఖాస్తును తిరస్కరించినా జరిమానా విధించడానికి వీల్లేదని కమిషన్ తీర్పు చెప్పింది.
ప్రభుత్వశాఖల అధికారులు కొందరు జనం అడిగిన సమా చారం ఇవ్వకుండా ఏడిపిస్తే, కొందరు అడిగిందే పదే పదే అడుగుతూ అధికారులను ఏడి పిస్తుంటారు. విపరీతంగా జాప్యం చేస్తారు. సెక్షన్ 20 ప్రకారం సమాచారం ఇవ్వక పోయినా, ఆలస్యం చేసినా, జరిమానా విధించే అధికారం సమాచార కమిషన్‌కు ఉంది. 2009లో ఇచ్చిన ఒక ఉత్తర్వును అమలు చేశారా లేదా, తనకు ఇవ్వవలసిన బకాయిలు ఇచ్చారా లేదా అని ఒక మాజీ ఉద్యోగి, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ సంస్థను ఆర్టీఐ కింద కోరాడు. తమది సెక్షన్ 24 కింద మినహాయింపు పొందిన సంస్థ అంటూ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. నిజానికి మినహాయింపు పొందిన సంస్థ కూడా సమాచార అధికారిని నియమించాలనీ, నిఘా, రహస్య విషయాలు తప్ప మిగతా సాధారణ సమా చారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టులు ఎన్నో తీర్పులు చెప్పాయి. సెక్షన్ 4 కింద తమంత తామే ఇవ్వ వలసిన సమాచారాన్ని మినహాయింపు పొందిన సంస్థలు కూడా ఇవ్వాలని కోర్టులు వివరించాయి. సాధా రణంగా సంస్థకు సంబంధించిన పాలనా సమాచారం, అధికారుల పేర్లు, పదవులు, వారి విధులు, జీత భత్యాలు బదిలీలు, పోస్టింగ్‌ల వంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఆపడానికి వీల్లేదు.
మానవ హక్కుల ఉల్లంఘనలు, లంచగొండితనా నికి సంబంధించిన సమాచారాన్ని కూడా నిరాకరించడా నికి వీల్లేదని సెక్షన్ 24 మినహాయింపులు వివరిస్తు న్నాయి. నిఘా, భద్రత అంశాల గురించిన అభ్యర్థనలు తప్ప మిగిలిన సమాచారం ఇవ్వాల్సిందేనని హరి యాణా సీఐడీ వర్సెస్ సీఐసీ కేసు(2009)లో తేల్చారు. అయితే అడిగిన సమాచారం మానవ హక్కుల ఉల్లం ఘన గురించా, అవినీతికి సంబంధించినదా అని విచా రించి తేల్చే అధికారాన్ని సమాచార కమిషనర్‌కు ఇచ్చారు. 2014లో అబిద్ హుస్సేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మణిపూర్ కేసులో ఒక సంస్థకు ఆర్టీఐ నుంచి మిన హాయింపు అంటే... అసలు జవాబుదారీతనం లేకుండా ఉండటానికి లైసెన్సు కాదు, సున్నితమైన సునిశితమైన కార్యక్రమాల సమాచారం కాని హక్కుల ఉల్లంఘన, అవినీతి సమాచారం నిరాకరించడానికి వీల్లేదని తీర్పు చెప్పారు. 2015లో మణిపూర్ హైకోర్టు మరో మంచి తీర్పు ఇచ్చింది. ఎంపికలు, నియామకాలు, నియమితు లైన వారి విధులు వివరించాలని కోరితే సెక్షన్ 24 కింద ఇవ్వం అనడానికి వీల్లేదని, ఎందుకంటే ఆ అంశాలు అవినీతికి సంబంధించినవి కనుక వెల్లడించాలని మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2010లో విజి లెన్స్ అవినీతి నిరోధక శాఖ ఎస్‌పీ వర్సెస్ ఆర్ కార్తికే యన్ (ఏఐఆర్ 2012 మద్రాస్ 84) కేసులో వివరిం చింది. ఎస్‌పీ వర్సెస్ ఎం కన్నప్పన్ కేసులో మద్రాస్ హైకోర్టు 2013లో ప్రాసిక్యూషన్ కోరినది అవినీతి గురిం చిన సమాచారమే కనుక వెల్లడి చేయాలని తీర్పు చెప్పింది. అడిగిన సమాచారం సెక్షన్ 24 నుంచి తప్పిం చుకున్నా, అది సెక్షన్ 8 పరీక్షకు కూడా నిలవాల్సి ఉంటుందని స్పష్టం చెప్పింది.
ఎన్‌టీఆర్‌ఓ కేసులో అడిగిన సమాచారం ఇవ్వ లేదు, సెక్షన్ 24 కింద ఇవ్వబోమన్నారు. దానిపై కేంద్ర సమాచార కమిషన్ కారణాలు తెలపాలంటూ (షోకాజ్ నోటీసు) లేఖ జారీ చేసింది. మినహాయింపు వర్తించక పోయినా సమాచారం నిరాకరించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలని కోరింది. ఏ సహే తుకమైన కారణమూ లేకుండా, పీఐఓ ఆర్టీఐ దరఖాస్తు తీసుకోవడానికి తిరస్కరించినా సెక్షన్ 7(1) కింద నెల రోజులలో సమాచారం ఇవ్వాలన్న నిబంధన ఉల్లంఘిం చినా, దురుద్దేశపూరితంగా సమాచారాన్ని నిరాకరిం చినా, తెలిసి కూడా తప్పుడు సమాచారం ఇచ్చినా, అసం పూర్ణమైన లేదా తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చినా రోజుకు రూ. 250ల చొప్పున రూ. 25,000కు మించ కుండా జరిమానా విధించి తీరాలని సెక్షన్ 20 నిర్దేశి స్తున్నది. కారణాలు తెలపాలనే లేఖకు జవాబుగా ఎన్‌టీఆర్ ఓ అధికారి వివరణ ఇస్తూ... దరఖాస్తుదారు ఇది వరకే అనేక ఆర్టీఐ దరఖాస్తులు వేసి ఈ సమా చారాన్ని తీసుకున్నారనీ, అయినా మొదటి రెండో అప్పీలు దాఖలు చేయడంతో కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు తాను పూర్తి సమాచారం ఇవ్వగా, అతను దానికి రసీదు కూడా ఇచ్చాడనీ, మళ్లీ మళ్లీ అదే అడుగుతుంటే ఏం చేయాలని అడిగారు. అతని బకా యికి సంబంధించిన వివాదం కూడా పరిష్కారం చేశా మని వివరించారు. పదేపదే అడిగే ఇలాంటి ప్రశ్నల వేధింపుల నుంచి రక్షించాలని ఎన్నో కేసుల్లో అధికారులు కోరుతూ ఉంటారు. ఇదివరకే సమాచారం అందినా మళ్లీ అదే అడిగిన కేసులలో ఆర్టీఐ దరఖాస్తు తిరస్క రించినా, సమాచారం ఇవ్వకపోయినా జరిమానా విధిం చడానికి వీల్లేదని కమిషన్ తీర్పు చెప్పింది.
(CIC/LS/A/2012/001368 జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ National Technical Research Organisation కేసులో 14 సెప్టెంబర్ 2017 ఇచ్చిన తీర్పు ఆధారంగా).
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment