ప్రతీకాత్మక చిత్రం
విశ్లేషణ
విజేంద్రసింగ్ జఫా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. తప్పుచేసిన వాడు తన బాస్ అయినా సరే జఫా బాణం గురి తప్పేది కాదు. అవినీతిపరుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నవభారతంలో ఇలాంటి అధికారికి ఎదురయ్యే కష్టాలు ఊహించ వచ్చు. తనను కొందరు ఇబ్బందుల పాలు చేసే తప్పుడు ఆరోపణలు కల్పించి, విచా రణ పేరుతో వేధిస్తూ నిందలు మోపారని, వాటి సంగతేమిటో చెప్పాలని ఆర్టీఐ కింద జఫా అడిగారు. రిటైరై 23 ఏళ్లయినా ఈ నిందల సంగతి తేల్చడం లేదని, ప్రశాంతంగా బతక నీయడం లేదనీ జఫా అన్నారు. సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వ శాఖను విభజిం చడానికి ముందు దానితో ఉన్న విజిలెన్స్ విభాగాన్ని అడగాలని ఓ సీపీఐఓ జవాబిచ్చారు.
సామాజిక న్యాయ శాఖ నుంచి ఆదివాసీల మంత్రిత్వ శాఖను 1999లో విభజించారని, కాని ఈ దస్తావేజులు తమకు బదిలీ చేయలేదని ఆ సీపీఐఓ జవాబి చ్చారు. ఎంత వెతికినా 1995 నాటి కాగితాలు కనిపించలేదని విజి లెన్స్ వారు చెప్పారు. ఆయన రెండో అప్పీలు వేయక తప్పలేదు. ఫైళ్లు కనిపించడం లేదంటూ ప్రజాసమాచార అధికారులు చెబు తున్నారు. అమాయకులను రక్షించడానికి, అవినీతి తిమింగలాలను శిక్షించడానికి రికార్డులు, ఫైళ్లు అవసరం. 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది కనుక జనం అడుగుతున్నారు. జారిపోతున్న ఫైళ్లు, పారిపోతున్న నేరగాళ్ల గురించి నిలదీస్తున్నారు. నిజానికి ఆర్టీఐ చట్టాన్ని ఎడాపెడా వాడుకుంటున్నవారు మామూలు జనం కాదు, అధికారులు, ఉద్యోగులు, రిటైరైన వారు, సస్పెండు అయిన వారు, విచారణకు గురైనవారు, ప్రమోషన్ ఎందుకు రాలేదనే అసంతృప్తితో ఉండే ఉద్యోగులు. అంతేగాని నిరుద్యోగులు కాదు.
ఆర్టీఐని దుర్విని యోగం చేసేది కూడా ఈ ఉద్యోగులే. మామూలు జనం అడిగితే కలి సికట్టుగా నిలబడి సమాచారాన్ని నిరాకరించేది కూడా ఈ ఉద్యోగులే. ఈ ఆర్టీఐ దరఖాస్తును ఫుట్‌బాల్‌ను తన్నినట్టు గోల్ చేరకుండా ఆపే శాఖలన్నింటి సీపీఐఓలు సమన్వయం చేసుకుని ఫైళ్ల సంగతి తేల్చకపోవడం సమాచార నిరాకరణగా పరిగణిస్తారు. దీంతో తలా పాతికవేల జరిమానా విధించక తప్పదని నోటీసులు జారీ చేసింది సమాచార కమిషన్. ఫైళ్లు మాయమైతే అధికారులు, కార్యాలయాలు చేయవలసిన విధి విధానాల్ని ఖరారు చేయాలని, ప్రమాణాలు నిర్ధారించి, శిక్షలు నిర్ణయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. పోయిన కాగితాలు వెతకకుండా, కేవలం పోయాయని చెప్పడం నిర్లక్ష్యంగా భావించి అందుకు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా నియ మాలు రూపొందించాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది.
పాతికవేల జరిమానా భయం పనిచేసింది. ‘ఆర్టీఐ దరఖాస్తులో ఇచ్చిన ఫైలు నంబరు ఆధారంగా వెతికితే ఏదీ దొరకలేదు. కానీ నంబరును వదిలేసి అన్ని ఫైళ్లూ బాగా వెతికాం. అప్పుడు ఈ ఫైలు దొరికింది’అని íసీపీఐఓలు జవాబిచ్చారు. జఫాకు అన్ని కాగితాల ధ్రువీకరణ ప్రతులు పంపించేశామని వివరించారు. ‘మేము ఏ ఆర్టీఐ దరఖాస్తును తిరస్కరించడం లేదు. కేవలం ఫైళ్లు దొరకలేదని వెతుకు తున్నామని మాత్రమే వివరణ ఇస్తాం’ అని వారు చెబుతున్నారు. చివ రిరోజున శత్రు మిత్రుల నకిలీ ఆరోపణలు, వేధింపు చార్జిషీట్లు, ఆ తరువాత ఏమయ్యాయో చెప్పకపోవడం కుర్చీ బాబుల క్రూర చర్య. కుర్చీ దిగిన వెంటనే ఆ వ్యక్తిని, అదే కుర్చీలో కూర్చున్న అధికారి వేధించడానికి అధికారాన్ని దుర్వినియోగం చేయడం.
పగబట్టి, లేదా రాజకీయ నాయకులను ఆశ్రయించే వెన్నెముకలేని దుర్మార్గపు అధికా రులు వాడుకునే ఆయుధం. రిటైర్మెంట్ నాడు ఆరోపణలు చేయడం, తరువాత చెప్పక పోవడం. ఆ తర్వాత కుర్చీ దిగిపోయిన అధికారు లకు దిక్కుండదు. మంచి అధికారైనా అవినీతిపరుడైనా ఆయనను పలకరించే వారు కూడా కరువైపోతారు. ఆయన కార్యాలయానికి రాలేడు. ఉత్తరాలు రాస్తే జవాబివ్వరు. తన మీద మచ్చ తొలగిపోయే పత్రాలు చివరి దశలోనైనా దొరికినందుకు జఫా సంతోషించారని సీపీ ఐఓలు విన్నవించారు. ఇండియాలో ఫైళ్ల దొంగను దేవుడు మాత్రం ఏం చేయగలడు? (విజేంద్రసింగ్ జఫా కేసు ఇఐఇ/MౖSఒఉ/అ/ 2017/181342లో సీఐసీ తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త
మాడభూషి శ్రీధర్
కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment