జమ్మూ వరద బాధితులకు పీఎంఓ విరాళం!
Published Thu, Sep 11 2014 3:05 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
న్యూఢిల్లీ: జమ్మూ,కాశ్మీర్ వరద బాధితులకు ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది, అధికారులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఒకరోజు జీతాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయనిధికి అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న జమ్మూ,కాశ్మీర్ ప్రజలకు తాము తోడుగా ఉన్నామనే భావన, భరోసాను కల్పించడానికి సహాయం అందించామని పీఎంఓ ఓ ప్రకటనలో వెల్లడించింది.
జమ్మూ వరద బాధితులకు వెంటనే నిత్యవసర వస్తువులను, నీరు, ఇతర సహాయాన్ని అందించాలని అధికారులును ప్రధాని మోడీ ఆదేశించారు. జమ్మూ,కాశ్మీర్ వరదల్లో 200 మంది చనిపోగా, 82 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Advertisement
Advertisement