Jammu&Kashmir
-
మంత్రి ఇంటిపై బాంబు దాడి
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీమ్ అక్తర్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి బాంబు దాడి చేశారు. నగరంలోని పర్రాయ్ పోరాలో ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసంపై పెట్రోల్ బాంబును విసిరారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది దుండగులు మంత్రి నివాసం పెట్రోల్ బాంబు విసిరి పారిపోయారని చెప్పారు. దాడిలో ఇంటి ప్రధానగేటు ధ్వంసమయినట్లు వివరించారు. దాడి జరిగిన సమయంలో మంత్రి ఇంట్లో లేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత ఏడాది పీడీపీ-బీజేపీల సంకీర్ణప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్తర్, ఆయన భార్య గుప్కర్ రోడ్డులోని హై సెక్యూరిటీ ఇంటికి మారారు. రోడ్లు, భవనాల శాఖ కార్యలయంపై కూడా పెట్రోల్ బాంబును విసిరినట్లు చెప్పారు. -
పాకిస్తాన్ జెండాలు ఎగరవేసిన అల్లరిమూకాలు
-
తెరిపిన పడ్డ కశ్మీర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కాస్త తెరిపిన పడింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురవలేదు. జీలం నది కూడా శాంతించింది. వరదల కారణంగా మరణించినవారి సంఖ్య మంగళవారం నాటికి 17కు చేరింది. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వానలు తగ్గుముఖం పట్టినా మళ్లీ కురవొచ్చన్న వాతావరణ శాఖ సూచనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో వర్షాలు పడొచ్చని అధికారులు ప్రకటించారు. బుద్గామ్ జిల్లా లాడెన్‌లో నాలుగు ఇళ్లపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో సహాయక సిబ్బంది సోమవారం రాత్రి వరకు 10 మృతదేహాలను వెలికితీయగా.. మంగళవారం మరో ఆరు వెలికితీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 16కు చేరుకుంది. ఉధంపూర్‌లో ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయి మరణించాడు. ప్రధాని ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.. వరదల తాజా పరిస్థితిపై ఢిల్లీలో మోదీకి నివేదిక అందజేశారు. -
వారంలో కొత్త ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌లో తొలగిన ప్రతిష్టంభన
వివాదాస్పద అంశాల్లో పీడీపీ-బీజేపీ మధ్య కుదిరిన అవగాహన సాయుధ దళాల చట్టం పరిధిపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం ముఖ్యమంత్రిగా ముఫ్తీ మొహమ్మద్ సయీద్ హోం, ఆర్థిక శాఖలు పీడీపీకి.. బీజేపీకి డిప్యూటీ సీఎం, పర్యాటకం... రెండు మూడు రోజుల్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న ముఫ్తీ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిష్టంభన దాదాపుగా తొలగిపోయింది. బీజేపీ-పీడీపీల సంకీర్ణ ప్రభుత్వం మరో వారం రోజుల్లోపే గద్దెనెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. కనీస ఉమ్మడి ప్రణాళికకు సంబంధించి ఆర్టికల్ 370, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం రద్దు వంటి వివాదాస్పద అంశాల్లో ఇరు పార్టీల మధ్య కీలక అవగాహన కుదిరింది. ఏ క్షణంలోనైనా కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉందని పీడీపీ నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సన్నిహితవర్గాలు వెల్లడించాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోని మొత్తం 87 స్థానాల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎవరికీ పూర్తిస్థాయి మెజారిటీ రాని నేపథ్యంలో... పీడీపీ, బీజేపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ చేసిన పలు వాగ్దానాలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఆయా వివాదాస్పద అంశాలపై కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చలతో తాజాగా పీడీపీ, బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి.. ఏయే ప్రాంతాల నుంచి దానిని ఉపసంహరించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. ఇక ఆర్టికల్ 370 అంశంపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని పీడీపీ డిమాండ్ చేసినా.. ఈ విషయంలో ఆందోళన చెందవద్దని బీజేపీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక హోం, ఆర్థిక శాఖలను పీడీపీ.. పర్యాటకం, జలవనరులు, ఆరోగ్యం, ప్రణాళికా శాఖలను బీజేపీ తీసుకోవాలని కూడా ఒప్పందానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ నేత నిర్మల్‌సింగ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో పూర్తికాలం పాటు పీడీపీ అధినేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు మరో రెండు మూడు రోజుల్లోనే ఆయన ప్రధానమంత్రి మోదీని కలుస్తారని.. ఆ వెంటనే జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. అంతకన్నా ముందు ఆదివారమే ముఫ్తీ ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతలతో భేటీకానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఉత్తరాదిని వణికిస్తోన్న చలిపులి
-
బులెట్ పై బ్యాలెట్ విజయం
-
జమ్మూ వరద బాధితులకు పీఎంఓ విరాళం!
న్యూఢిల్లీ: జమ్మూ,కాశ్మీర్ వరద బాధితులకు ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది, అధికారులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఒకరోజు జీతాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయనిధికి అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న జమ్మూ,కాశ్మీర్ ప్రజలకు తాము తోడుగా ఉన్నామనే భావన, భరోసాను కల్పించడానికి సహాయం అందించామని పీఎంఓ ఓ ప్రకటనలో వెల్లడించింది. జమ్మూ వరద బాధితులకు వెంటనే నిత్యవసర వస్తువులను, నీరు, ఇతర సహాయాన్ని అందించాలని అధికారులును ప్రధాని మోడీ ఆదేశించారు. జమ్మూ,కాశ్మీర్ వరదల్లో 200 మంది చనిపోగా, 82 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.