న్యూఢిల్లీ: ఉన్నత స్థాయి అధికారులు అధికారి విదేశీ పర్యటనలకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను కేంద్ర సచివాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేశాయి. ఈ నిబంధనల మేరకు ఉన్నతాధికారుల విదేశీ పర్యటనల ప్రతిపాదనలను ప్రధాని కార్యాలయం (పీఎంఓ), కార్యదర్శుల స్క్రీనింగ్ కమిటీ పరిశీలించవలసి ఉంటుంంది.
వారి విదేశీ పర్యటనలకు పీఎంఓ, విదేశాంగ మంత్రిత్వశాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖల అనుమతి తప్పనిసరి అవసరం. ప్రతిపాదిత పర్యటనల వివరాలు ఆయా మంత్రిత్వశాఖల వెబ్‌సైట్లలో తప్పని సరిగా పొందుపరచాలని పీఎంఓ స్పష్టం చేసింది.