procedures
-
వినాయక చవితి 2024 : మహాగణపతి పూజా విధానం
వినాయక చవితి 2024 : మహాగణపతి పూజా విధానం
-
ఇకపై.. రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు తేలిగ్గా..!
మానవ మణికట్టు ఒక పరిమితి వరకే తేలిగ్గా తిరుగుతుంది. కానీ ఓ రోబో మణికట్టు ఎటువైపైనా దాదాపు 270 డిగ్రీల వరకు తిరిగేలా రూపొందుతుంది. దాంతో అత్యంత నిశితంగా అనుకున్నంత మేరకే కోసేలా, కుట్లు వేసేలా చేసే శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబోకు ఆదేశాలిస్తూ డాక్టర్లు ‘ఆపరేట్’ చేస్తుంటారు. ఆ సర్జరీలో శస్త్రచికిత్స జరుగుతున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్‌ను) 3–డీ ఇమేజ్ తెరపై చూస్తుంటారు.మరింత సురక్షితమెందుకంటే... కోత చాలా చిన్నగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోత, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. ఇవేకాదు... శస్త్రచికిత్సకు పట్టే సమయమూ, ఇవ్వాల్సిన మత్తుమందూ, రక్తస్రావమూ అన్నీ తక్కువే. ఇవన్నీ రోబోతో జరిగే శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా మార్చేస్తాయి.ఏయే శాఖల్లో ఈ శస్త్రచికిత్సలు?మూత్ర వ్యవస్థకు సంబంధించి... మూత్రపిండాల శస్త్రచికిత్సలో:– కిడ్నీ నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం తీసుకొచ్చే పైపులైన యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఉన్నప్పుడు (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అంటారు.) చేసే ‘పైలో΄్లాస్టీప్రొíసీజర్’ అనే శస్త్రచికిత్సలో ∙కిడ్నీల్లో గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు ∙కిడ్నీ పూర్తిగా తొలగించాల్సిన కేసుల్లో (నెఫ్రెక్టమీ). ప్రోస్టెక్టమీ: ప్రోస్టేట్ గ్రంథి తొలగింపులో.గైనకాలజీలో:గర్భసంచికీ అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మ్యాలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడుఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి ∙ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్తో ఆ భాగం ఇతర శరీర భాగాలకు అతక్కుపోవడాన్ని విడదీయడానికి.యూరో–గైనకాలజీ శస్త్ర చికిత్సల్లో: – పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు మరో అవయవంలోకి చొచ్చుకునిపోయే హెర్నియా కేసుల్లో ‘సాక్రోకాల్పోపెక్సీ’ చేసేందుకు– దగ్గినప్పుడూ, ఒత్తిడికి మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ∙ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించడానికి.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి..విపుల్ ప్రొసీజర్:ప్రాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్నూ, బైల్డక్ట్ను తొలగించే ‘ప్రాంక్రియాటికో–డియోడనెక్టమీ’ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో.ప్రాంక్రియాస్, చిన్నపేగులు, గాల్‌బ్లాడర్‌లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో (ఉదా: క్రానిక్ ప్రాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో)థైరాయిడెక్టమీ: క్యాన్సర్‌కు గురైన థైరాయిడ్ గ్రంథిని తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా పడకుండా శస్త్రచికిత్స చేసేందుకు. (అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు ఇదో వరం). బ్రెయిన్ సర్జరీస్: మెదడులోని సంక్లిష్టమైన భాగాల్లోకి ఏర్పడ్డ ట్యూమర్స్‌ను సంప్రదాయ శస్త్రచికిత్సతో తొలగింపు వీలుకాని సందర్భాల్లో.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో అన్ని వర్గాల ప్రజలకూ కొద్దిరోజుల్లోనే కారు చవగ్గా రోబో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్ వి. చంద్రమోహన్, సీనియర్ రోబోటిక్ యూరో సర్జన్ -
ఎన్నికల కోడ్ ముగిసింది: ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రవర్తనావళి గడువు ముగిసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కమిషన్ గురువారం పంపిన ఒక సర్క్యులర్‌లో ఈ విషయం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఎత్తివేత నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటింది. లోక్‌సభతోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరపడంతోపాటు అధికార పార్టీలు, ప్రభుత్వాలు అధికార దుర్వినియోగాన్ని నివారించే లక్ష్యంతో దేశంలో 1960 నుంచి ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. -
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
-
ఆడిటర్లు చట్టబద్ధంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: ఆడిటర్లు నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడకుండా, విధానపరమైన ప్రక్రియను అనుసరించాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) చైర్పర్సన్ అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే సూచించారు. ఆడిటింగ్ అన్నది కేవలం టిక్ కొట్టే పని మాత్రం కాదన్నారు. పలు కంపెనీల్లో ఆడిటింగ్ లోపాలు బయటపడుతుండడం, ఈ విషయంలో ఆడిటర్లపై నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంటుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పాండే తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆడిట్ డాక్యుమెంట్లు అన్నవి సరైన విధి విధానాలను అసరించారనే దానికి సాక్ష్యాలుగా పేర్కొన్నారు. ‘‘మేము విలన్‌గా ఇక్కడ లేమని ఆడిటర్ల సమాజానికి నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు సాయం చేయడానికి, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికే మేము ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నాను’’అంటూ పాండే చెప్పారు. ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ (ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను వెల్లడించడం) వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఎన్ఎఫ్ఆర్ఏ కిందకు సుమారు 7,000 కంపెనీలు వస్తాయి. అన్‌లిస్టెడ్ కంపెనీలపైనా నియంత్రణ కలిగి ఉంది. యాజమాన్యం లేదా న్యాయ సలహాలపై ఆడిటర్లు ఎక్కువగా ఆధారపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ‘‘నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడడం, అవసరమైన విశ్లేషణ చేయకపోవడం అన్నది సరికాదు. నిపుణులు చెప్పిన అభిప్రాయానికే మీరు కూడా మొగ్గు చూపించొచ్చు. కానీ, మీరు ప్రామాణిక ఆడిట్ చేసినట్టు అక్కడ పత్రాలు చెప్పాలి. అది ముఖ్యమైనది’’అని సూచించారు. ఆడిట్‌తో మోసాలు వెలుగులోకి చట్టబద్ధమైన ఆడిటింగ్ ప్రక్రియను అనుసరించినప్పుడు మోసాలను గుర్తించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పాండే అన్నారు. ‘‘ఆడిటర్లు మోసాలను అన్ని వేళలా గుర్తిస్తారని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కానీ, మీరు తగిన విధంగా వ్యవహరిస్తే బయట పడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి’’అని చెప్పారు. కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తమ ఆడిట్ కమిటీలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సాధికారత కలి్పంచాలన్నారు. -
దివాలా పరిష్కార ప్రక్రియ సమయం కుదింపు!
న్యూఢిల్లీ: దివాలా ఆస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తగ్గించడం, తద్వారా ఆయా రుణ ఆస్తుల విలువ గణనీయమైన కోతను నిరోధించడం లక్ష్యంగా కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ దిశలో దివాలా చట్టాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దివాలా ఆస్తుల పరిష్కారానికి 2016లో అమల్లోకి వచ్చిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ)కు సవరణలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బ్యాంకర్లు, న్యాయవాదులతో సహా సంబంధిత వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, రాబోయే వారాల్లో మార్పులు ఖరారు కావచ్చని తెలిపారు. ప్రస్తుతం ఇలా... ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నుండి ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు అందిన గణాంకాల ప్రకారం, ఐబీసి కింద మొత్తం 553 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందుకు సగటు సమయం 473 రోజులు. ఒక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 57 కేసులు పరిష్కారం అయితే, ఇందుకు సగటు సమయం 679 రోజులు తీసుకుంది. 2021–22లో 143 కేసులు పరిష్కారం అయితే ఇందుకు పట్టిన సమయం 560 రోజులు. 2020–21లో 120 కేసులకు 468 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. నిజానికి రిజల్యూషన్ ప్రాసెస్ కోసం ఐబీసీ కాలపరిమితి 330 రోజులు. లిటిగేషన్లో క్లిష్టతలుసహా పలు కారణాలతో దివాలా పరిష్కార పక్రియ కాలయాపన జరుగుతోంది. ఈ లోపాలు సవరించడానికి కేంద్రం తాజాగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
ఏపీ: పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు
-
పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్ఈ సిలబస్ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. చదవండి: సాఫ్ట్వేర్ లవ్‌స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ.. -
ఐటీఆర్ దాఖలుతో పని పూర్తయినట్టు కాదు
ఆదాయపుపన్ను రిటర్నుల దాఖలు గడువు డిసెంబర్ 31 తో ముగిసింది. జూలైతోనే ముగిసిన గడువును.. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. దీంతో చాలా మంది డిసెంబర్లో రిటర్నులు దాఖలు చేశారు. రిటర్నులు దాఖలుతో బాధ్యత ముగిసిందని అనుకోవద్దు. ఆ తర్వాత తమ వైపు నుంచి దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చివరి నిమిషంలో వేయడం వల్ల అందులో తప్పులు దొర్లి ఉంటే వెంటనే రివైజ్డ్ రిటర్నులు వేసుకోవాలి. ఈ వెరిఫై చేస్తేనే వేసిన రిటర్నులు చెల్లుబాటు అవుతాయి. ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి వివరించే కథనమే ఇది.. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఐటీఆర్ దాఖలు చేయడం ప్రాథమికంగా చేయాల్సిన పని. తర్వాత ఆ రిటర్నులను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీరే దాఖలు చేశారనడానికి నిదర్శనం ఏమిటి? అందుకనే ధ్రువీకరణ ప్రక్రియ. దాంతో ఆ రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి మీరు బాధ్యత వహిస్తున్నట్టు అవుతుంది. గతేడాది కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ తీసుకురావడం తెలిసిందే. ఎన్నో సాంకేతిక సమస్యలు వెక్కిరించడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ చివరి వారంలో హడావుడిగా రిటర్నులు వేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ పత్రం లేదా ఫామ్–5 పత్రంపై (ఆదాయపన్ను శాఖ నుంచి డౌన్లోడ్ చేసుకుని) సంతకం చేసి ఆ కాపీని పోస్ట్ ద్వారా ఆదాయపన్ను శాఖ, బెంగళూరు కార్యాలయానికి పంపించాలి. కొరియర్ ద్వారా పంపకూడదు. భౌతికంగా చేసే ధ్రువీకరణ ఇది... ఇలా కాకుండా ఆన్లైన్లో ఈ వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్ ఖాతా నంబర్ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ కోడ్ లేదా ఓటీపిని ఈఫైలింగ్ పోర్టల్‌పై ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టడంతో ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. వెరిఫై చేసినట్టు సమాచారం కూడా వస్తుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించుకుని ఓటీపీ జనరేట్ చేసుకోవడం ద్వారా ఈవెరిఫై చేయవచ్చు. సదరు బ్యాంకులో ఖాతా ఉండి, ఖాతాకు పాన్ నంబర్ అనుసంధానించి ఉంటే సరిపోతుంది. సెక్షన్ 44ఏబీ కింద ఖాతాలను ఆడిట్ చేయాల్సి అవసరం ఉన్న వారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేసిన వెంటనే.. తమ డిజిటల్ సిగ్నేచర్‌ను ఉపయోగించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. పన్ను రిటర్నులు వేసిన 120 రోజులకీ వెరిఫై చేయకపోతే ముందు ఈఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి సరైన కారణాన్ని తెలియజేస్తూ జరిగిన ఆలస్యానికి క్షమాపణ తెలియజేయాలి. మీ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ మన్నిస్తే.. అప్పుడు రిటర్నులు ఈ వెరిఫై చేసుకునేందుకు అవకాశం తిరిగి లభిస్తుంది. లేదంటే మీ రిటర్నులను దాఖలు చేయనట్టుగా ఐటీ శాఖ భావిస్తుంది. అప్పుడు సకాలంలో రిటర్నులు వేయనందుకు చట్టప్రకారం అన్ని చర్యలకు బాధ్యత వహించాలి. ఆలస్యపు ఫీజు, చెల్లించాల్సిన పన్ను ఉంటే ఆ మొ త్తంపై నిర్ణీత గడువు తేదీ నుంచి వడ్డీ చెల్లించాలి. రిటర్నుల్లో తప్పులను గుర్తిస్తే..? ఐటీఆర్ దాఖలు చేశారు. ధ్రువీకరించడం కూడా ముగిసింది. కానీ ఆదాయం, మినహాయింపులను పేర్కొనడం మర్చిపోయారనుకోండి. అప్పుడు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అది కూడా రిటర్నులను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందే చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా వేరొక ఫామ్ ఉండదు. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఒరిజినల్, రివైజ్డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకుని, ముందు దాఖలు చేసిన మాదిరే మొదటి నుంచి ప్రక్రియ అనుసరించాలి. ఒరిజినల్ ఐటీఆర్ ఈ ఫైలింగ్ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందుగానే రివైజ్డ్ రిటర్నుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 2020–21 సంవత్సరానికి 2021–22 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. కనుక 2021 డిసెంబర్ 31ని గడువుగా అర్థం చేసుకోవాలి. ఆలోపే ఐటీఆర్ అసెస్మెంట్ను ఆదాయపన్ను శాఖ పూర్తి చేస్తే గడువు ముగిసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అమలవుతుంది. 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సవరించిన రిటర్నుల దాఖలు గడువును ఆదాయపన్ను శాఖ 2022 మార్చి 31 వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ గడువులతో సంబంధం లేకుండా.. మీరు దాఖలు చేసిన రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి సెక్షన్ 143(1) కింద ఇంటిమేషన్ మెయిల్ పంపినట్టయితే గడువు ముగిసిపోయినట్టుగానే పరిగణించాలి. దాంతో రిటర్నులను సవరించుకోలేరు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేసిన తర్వాత.. 10–30 రోజుల్లోపే ఆదాయపుపన్ను శాఖ ప్రాసెస్ చేసేస్తుంది. అందుకని రిటర్నులు దాఖలు చేసిన వారు ఆ తర్వాత వారం వ్యవధిలోపే మరొక్క సారి అన్నింటినీ క్షుణంగా సరిచూసుకోవడం మంచిది. రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసుకునేందుకు సాధారణంగా డిసెంబర్ 31 గడువుగా ఉంటుంది. కనుక ఆలస్యంగా రిటర్నులు వేసే వారికి రివైజ్ చేసుకునేందుకు తగినంత వ్యవధి ఉండకపోవచ్చు. ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందు ఎన్ని సార్లు అయినా రివైజ్డ్ రిటర్నులు ఫైల్ చేసుకోవచ్చు. తాజాగా దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. అవకాశం ఉంది కదా అని చాలా సార్లు రివైజ్డ్ రిటర్నులు వేశారనుకోండి.. అప్పుడు ఆదాయపన్ను శాఖ సందేహంతో మీ ఐటీఆర్‌ను స్క్రూటినీ చేయవచ్చు. రిఫండ్ సంగతిదీ.. ఆదాయపుపన్ను రిటర్నులను దాఖలు తర్వాత, ఐటీ శాఖ వాటిని ప్రాసెస్ చేసి 143 (1) ఇంటిమేషన్ ఇవ్వడం పూర్తయి, అందులో ఏ తప్పులూ లేకపోతే రిటర్నుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసినట్టే. చివరిగా ఒకవేళ చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించి ఉంటే రిఫండ్‌కు అర్హత ఉంటుంది. రిఫండ్ స్టేటస్ ఏంటన్నది ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డుపై కనిపిస్తుంది. అదనంగా ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ చెక్ చేసుకోవచ్చు. https://tin.tin. nsdl.com/oltas/refund-status.html. ఈ లింక్‌ను ఓపెన్ చేసి పాన్ వివరాలు ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫేస్‌లెస్ ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత రిఫండ్లు పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 143(1) ఇంటిమేషన్ వచ్చిన 15 రోజుల్లోపే రిఫండ్ కూడా వచ్చేస్తుంది. పలు కారణాల వల్ల ఆలస్యం అయితే, బ్యాంకు ఖాతా వివరాలు (అకౌంట్ నంబర్/ఐఎఫ్ఎస్ నంబర్ తదితర) సరిగా లేకపోవడం వల్ల పెండింగ్‌లో ఉంటే అప్పుడు నూతన ఈఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చు. రిఫండ్లు ఆలస్యమైనా ఆందోళన చెందక్కర్లేదు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నుంచి ఆ మొత్తంపై ప్రతీ నెలా 0.5 శాతం మేర వడ్డీని ఐటీ శాఖ చెల్లిస్తుంది. ఇలా అందుకునే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఈ మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. పన్ను కోసం డిమాండ్ నోటీసు వస్తే? పన్ను రిటర్నుల్లో తప్పులు, పొరపాట్లు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ రిటర్నులను ప్రాసెస్ చేసే సమయంలో అందులోని సమాచారం మధ్య అంతరాలు, పోలికల్లేమిని గుర్తిస్తుంది. ఆ వివరాలను 143(1) ఇంటిమేషన్ నోటీసులో పేర్కొంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఐటీ శాఖ పేర్కొన్న సమాచారంతో మీరు ఏకీభవిస్తే ఆ మేరకు పన్ను చెల్లించేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఏదైనా మినహాయింపును పేర్కొనడం మర్చిపోయిన కారణంగా ఆ అంతరం తలెత్తి ఉంటే? అప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయాలి. ఆదాయపన్ను శాఖ లెక్కలతో ఏకీభవించడం లేదని లేదా రిటర్నుల్లో పొరపాటు చేశానంటూ అందులో పేర్కొనాలి. పన్ను అధికారులు ఆరు నెలల్లోగా స్పందిస్తారు. నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్‌లు ఉన్నాయి. రిటర్నుల్లో సరిపోలని సమాచారం అసలు ఏంటన్న దాని ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
గుడ్‌న్యూస్: ఐఈపీఎఫ్ఏ క్లెయిమ్.. ఇప్పుడు సులభతరం
న్యూఢిల్లీ: పెట్టుబడిదారుల విద్య, రక్షణ నిధి (ఐఈపీఎఫ్ఏ) నుంచి ఇన్వెస్టర్లు క్లెయిమ్ చేసుకునే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో ఐఈపీఎఫ్ఏ పనిచేస్తోంది. ఇన్వెస్టర్లలో అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. క్లెయిమ్ చేసుకోని షేర్లు, డివిడెండ్లు, ఇతర మొత్తాలు ఐఈపీఎఫ్ఏకు బదిలీ అవుతాయి. వీటిని ఇన్వెస్టర్లు లేదా వారి వారసులు క్లెయిమ్ చేసుకుని తిరిగి పొందొచ్చు. ఈ ప్రక్రియకు సంబంధించి నిబంధనలను ప్రభుత్వం సడలించింది. నోటరీకి బదులు ఇన్వెస్టర్లు సొంతంగా అటెస్టేషన్ ఇస్తే సరిపోతుంది. రూ.5,00,000 లోపు షేర్ల విలువ ఉంటే వాటిని తిరిగి పొందేందుకు దినపత్రికలో ప్రకటన ఇవ్వాల్సి ఉండగా.. దీన్ని మినహాయించింది. చదవండి:ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త! -
మహా గణపతిం మనసా స్మరామి...
-
సుముఖః, ఏక దంతః, కపిలః, గజకర్ణికః.. 8 నామాలు తెలుసా?
మనం ఎలా ఉండాలో, ఏయే గుణాలు మనకి అవసరమో, ఆవశ్యకమో తనని పఠిస్తూండే శ్లోకంలో ఇమిడిపోయి మహాగణపతి మనకి అద్భుతంగా తెలియజేసాడు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ విశేషాలు.... సుముఖ శ్చైకదంత శ్చ కపిలో గజకర్ణికః లంబోదర శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః అష్టా వష్టౌ చ నామాని యః పఠే ఛృణుయా దపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా! సంగ్రామే సర్వకార్యేషు విఘ్న స్తస్య న జాయతే అంటూ వినాయకుని గురించి చెప్పే నామాలు 8. వినాయకునిలో నుండి గ్రహించవలసిన గుణాలని వినాయకుని రూపాన్ని వర్ణిస్తూ కళ్లలో ఆయన రూపాన్ని నిలుపుకునేలా చేసే నామాలు 8. మొత్తం 16 నామాలు పై శ్లోకంలో ఉన్నాయి. ఈ విశేషాన్ని గుర్తించవలసిందని చెప్పేందుకే అష్టౌ (8), అష్టౌ(8) చ (కలిపి) నామాన్ని అని కన్పిస్తుంది శ్లోకంలో. రూపాన్ని వర్ణిస్తూ, ఇలాంటి గుణాలని మనం ఆయననుండి నేర్చుకోవాలనే యదార్థాన్ని తెలుసుకుందాం! 1. సుముఖః: సు–ముఖః అంటే ఎవరు ఏ కోరికని తన ముందుకొచ్చి చెప్పదలిచినా, మనసులో అనుకుంటున్నా ఆ అభిప్రాయాన్ని ఎంతో సుముఖంగా ఉంటూ (వినాలనే ఆసక్తితోనూ, చెప్పేవానికి తప్పక తన పని తీరుతుందనే నమ్మకం కలిగేలానూ) ఆ విషయాన్నంతటినీ వింటాడాయన. లోకంలో కొందరి దగ్గరికి పోయి ఏదైనా చెప్పుకోదలిస్తే ఏదో పరాకుగా వింటూనో మధ్యమధ్యలో ఎవరినుండో వచ్చిన మాటల్ని వింటూనో ఆ మధ్యమధ్యలో ‘ఏం చెప్పా?’ వంటూ అడుగుతూనో వినే మనుషులుంటారు. అలాంటివాళ్ళకి వినాయకుడు చెప్పాడు... వినదలిస్తే సుముఖునిగా ఉండి విను లేదా తర్వాత వింటానని చెప్పు తప్ప వింటున్నట్టుగా వినకుండా ఉండడం సరికాదని. సు–ముఖః అనే పదంలో ముఖమనే మాటకి చక్కని నోరు కలవాడనేది కూడా అర్థం. ఇలా ముఖమనే మాటకి నోరు అనే అర్థం. వినాయకుడు చక్కని నోరు కలవాడనేది దీనర్థం. నోటితో సంభాషిస్తాం కాబట్టి ‘నొప్పించకుండా మాట్లాడేవాడు’ అనేది ఈయనకున్న మరో చక్కని గుణం. ఆ గుణం మనకి రావాలని ఆయన చెప్తున్నాడు. 2. ఏక+ దంతః: గజముఖం కలిగిన ఆయనకి నిజంగా 2 దంతాలుండాలి. వ్యాసుడంతటి వాడు భారతగ్రంథమంతనీ తన బుద్ధిలో నిల్చుకుని ‘నేను చెప్తూంటే రాయగల బుద్ధిమంతుడెవరా?’ అని బ్రహ్మను ప్రార్థిస్తే ఆయన గణపతి పేరు చెప్పాడు. గణపతిని ప్రార్థిస్తే ఆయన తప్పక రాస్తాను. అయితే నా రాతవేగానికి సరిపోయేలా నువ్వు కవిత్వాన్ని చెప్పాలనే నియమాన్ని పెట్డాడు. దాన్ని విని వ్యాసుడు మరో నియమాన్ని పెడుతూ నేను చెప్పే ప్రతి అక్షరాన్ని నువ్వూ అర్థం చేసుకున్నాక మాత్రమే రాయాలి తప్ప ఏదో యధాలాపంగా రాయకూడదన్నాడు. వ్యాసుని నియమాన్ని వింటూనే మహాగ్రంథాన్ని రాయబోతే తప్ప తనంతటి వానితో ఇలాంటి ఒప్పందాన్ని చేయనే చేయదలచడని భావించిన గణపతి ఆ రాయబోయే గ్రంథాన్ని తన చేతులతో వీక్షించడం కోసం తన దంతాన్నే పెరికి (పెకిలించి) గంటంగా చేసి మరీ రాసాడు. దీన్ని గమనిస్తూ మనమూ అర్థం చేసుకోగలగాలి. మన శరీరంలోని ఏ అవయవమైనా అవతలివానికి సహాయపడేలా చేయాలని. మరి మన స్థాయిలో మనం చేదోడు వాదోడు అంటే పనిలో సహాయపడడం... మాట సహాయం చేయడం గా ఉండగలిగితే చాలు. నిందని ఎదుటివాళ్ళమీద నెట్టేలా సముఖంలో మాట్లాడడం, చాటున చాడీలు చెప్పడం వంటివి మానేస్తే చాలు. శరీరావయవాలన్నీ ఎదుటివారికి తోడ్పడేలా చేయగలగాలి. 3. కపిలః: రెండు రంగులు కలిసిన తనాన్ని ‘కపిల’ మంటారు. ఇటు శివలక్షణమూ, అటు విష్ణువిధానమూ కలిగినవాడు కాబట్టి కపిలుడు. దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరైన నేరాన్ని చూస్తే ‘వాడు మనవాడా? మనకి ఉపయోగపడతాడా? ..’ అన్న తీరుగా లెక్కించి తప్పుచేసినా రక్షించదలిచే పని (రావణుడికి కుంభకర్ణునిలా) చేయరాదనీ, శిక్షించే తీరాలని చెప్తుంది ఒక పద్ధతి. అదేతీరుగా ధర్మబద్ధంగా పనిచేస్తూ ఉండేవాణ్ణి మెచ్చుకోవడమే కాక వానికి కొంత వెసులు బాటుని కల్పించాలని కూడా దీని భావంగా అర్థం చేసుకోవాలి. 4. గజకర్ణికః : ఏనుగు చెవులే తనకి చెవులుగా కలవాడనేది పై పదానికి అర్థం. ఏనుగుకున్న లక్షణాల్లో రెండు మరింత ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అంత ఎత్తున్న ఏనుగుకన్నా ఆ చిన్నకళ్లు నేలమీద పడ్డ బట్టలు కుట్టే సూదిని కూడా గుర్తించగలవు. అలాగే ఆ చెవులు కూడా దూరంగా పాము బుసకొడుతుంటే వినగలిగినంతటి శక్తివంతమైనవి. గజకర్ణికః నామం ద్వారా చెవులవరకే దీన్ని మనకి అన్వయించుకుంటే ఎవరు మన ప్రవర్తన గురించి తేడాగా అనుకుంటున్నారో గమనించుకుంటూ ఉండాలి. లోకం నుండి అపవాదు వస్తుందేమో అనే భయంతో మన ప్రవర్తన ఉండాలి. గణపతి చెప్పేదేమంటే, వేటిని వినాలో వేటిని వినకూడదో గమనించుకోవాలి తప్ప చెవికి చేరిన అన్నింటినీ నమ్మడం సరికాదని. అసలు చెవి దగ్గరకి ఎవరినీ చేరనీయవద్దనీ కూడ. 5. లంబోదరః: పెద్దబొజ్జ ఉన్నవాడనేది దీనిపై అర్థం. “లంబ’ మనే మాటకి వేలాడుతున్న అనేది సరైన అర్థం. బొజ్జ మరింతగా అయినప్పుడు కిందికి వేలాడుతూ ఉంటుంది. ‘నా కడుపులో ఎన్నో రహస్యాలని దాచున్నా’నంటుంది తల్లి. అలా రహస్యాలెందరు తనకొచ్చి చెప్పినా వాటిని తన పైత్యాన్ని కూడా జోడించి ప్రచారం చేయడం కాకుండా “కడుపులో దాచుకోగలగడమనే గొప్ప లక్షణాన్ని అలవర్చుకోవాలనేది గణపతి మనకి చెప్తున్నాడన్నమాట. 6. వికటః: కటకమంటే చెక్కిలి. ఏనుగురూపం అయిన కారణంగా ఏటవాలుగా అయి దృఢంగా అయిన చెక్కిలి కలవాడనేది దీనర్థం. దీన్ని మనకి అన్వయించుకుంటే చెక్కిలి అనేది వ్యక్తి చెప్పదలిచిన అభిప్రాయాన్ని చెప్పించగల ముఖ్య అవయవం ముఖంలో. ఏ పదం తర్వాత ఏ పదాన్ని పలకాలో, ఎంతగా ఊది ఏ పదాన్ని పలకాలో దేన్ని తేల్చి పలకాలో, ఏ మాటని ముందు చెప్పి తర్వాత దేన్ని పలకాలో వివరించేది ఈ నామం. మనం కూడా స్పష్టంగా నిదానించి మాట్లాడాలనే గుణాన్ని గ్రహించాలన్నమాట. 7. విఘ్నరాజః : ప్రారంభించిన పని– ఇక ఎప్పటికీ ముడిపడనే పడదన్న రీతిలో వచ్చిన అభ్యంతరాన్ని విఘ్నమంది శాస్త్రం. అలాంటి విఘ్నాలకి రాజు ఆయన అని అర్థం. రాజుకి చతురంగ బలాలు (పదాది– అశ్వ– గజ– రథ) ఉన్నట్లే విఘ్నాలని తొలగించేందుకై నాలుగు విధాలుగా ప్రయత్నించడం, నలుగురి సహాయాన్ని అర్థించడం, నాలుగు చోట్లకి వెళ్లి విచారించి ఆ విఘ్నాన్ని తొలగించుకోవాలి తప్ప విఘ్నం వచ్చిందనుకుంటూ దుఃఖిస్తూ్త ఉండిపోవడం సరికాదని గణపతి చెప్తున్నాడన్నమాట. 8. గణాధిపః: యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, విహంగ, నాగ రాక్షస, దేవ .... మొదలైన అన్ని గణాలకీ అధిపతి అనేది దీనర్థం. లోకంలో ఏ ఒక్కరూ శత్రువంటూ లేనివాళ్లుండరు. కాబట్టి ఏకగ్రీవంగా (ముక్తకంఠంతో) ఎన్నుకోవడమనేది అసాధ్యమైన అంశం. అయితే వినాయకుడు మాత్రం సర్వగణాధిపతి కాగలిగాడంటే దీనిద్వారా అందరూ మెచ్చుకునే తీరులో తన ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ నడుచుకోవాలనే గుణాన్ని మనం గ్రహించుకోవాలన్నమాట. మరో విశేషమేమంటే పై కన్పిస్తున్న అన్ని గణాలవీ ఒకే తీరు లక్షణం కలవి కావు. ఎవరి తీరు వారిది. అయితే అలాంటి భిన్న భిన్న లక్షణాలున్న అందరినీ ఒకే తీరుగా అంగీకరించేలా చేసి ఆధిపత్యాన్ని సాధించగలిగాడంటే ఆ తీరుగా అధికారి ఉండాల్సిందేనని చెప్తున్నాడన్నమాట గణపతి. – డా. మైలవరపు శ్రీనివాసరావు చదవండి: శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ -
రక్తంతో కథ రాయండి
‘నైన్.. ఎ మూవ్మెంట్’ పేరుతో మే 25న ఒక వెబ్సైట్ ప్రారంభం కాబోతోంది. గర్ల్స్.. ఇందులో మీరూ భాగస్వాములు కావచ్చు. మీ మెన్స్ట్రువల్ స్టోరీలను షేర్ చేసుకోవచ్చు. రుతుక్రమం ప్రారంభం అయ్యేనాటికి భోలీ వయసు పన్నెండేళ్లు. తొలిసారి తన ఒంట్లోంచి వచ్చిన రక్తపు చారికను చూడగానే భయపడిపోయి తల్లి దగ్గరకు పరుగు తీసింది. ‘నువ్వు పెద్దమనిషివి అయ్యావు. ఇక నుంచీ కుదురుగా ఉండాలి’ అని తల్లి చెప్పింది. భోలీ ‘హా!’ అంది. తల్లి ఆమెను గుండెలకు హత్తుకుంది. మెత్తటి ఎండు గడ్డిని తెచ్చి, పలుచటి గుడ్డలో చుట్టి ‘ఇదిగో.. దీనిని అదిమి ఉంచు. రక్తాన్ని పీల్చుకుంటుంది’ అని చెప్పింది. ‘‘ఐదు రోజులు నువ్వు ఇంట్లోకి రాకూడదు. ఆ గొడ్ల చావిడిలోనే ఉండాలి’’ అని చెప్పింది. ఇదంతా భోలీకి వింతగా తోచింది. గడ్డి.. గొడ్ల చావిడి ఆ తర్వాత మూడు నెలలు భోలీ ఇలాగే చేసింది. నెలసరి రాగానే గుడ్డలో చుట్టిన గడ్డిని అదిమి ఉంచడం, గొడ్లచావిడిలో ఉండటం! అయితే ఆ గడ్డిలోంచి ఒక పురుగు ఆమె జననాంగంలోకి వెళ్లిన సంగతి ఆమెకు తెలీదు. చివరికి ఇన్ఫెక్షన్ అయి, ఆమె గర్భసంచిని తొలగించవలసి వచ్చింది. భోలీ ఇక ఎప్పటికీ తల్లి కాలేదన్న చేదు నిజం తెలిసి, తల్లి కుదేలైపోయింది. ‘నెలసరి వయసు’లో ఉన్న బాలికలు, మహిళల సంఖ్య ఇండియాలో 35 కోట్ల 50 లక్షల మంది వరకు ఉంది. వీరిలో దాదాపు 82 శాతం మంది రుతుస్రావాన్ని ఆపడానికి పాత గుడ్డపేలికల్ని, ఇసుకను వాడుతున్నారు! చదువు లేకపోవడం, చెప్పేవాళ్లు లేకపోవడం, పేదరికం.. ఇలాంటి అనేక కారణాల వల్ల రుతుక్రమాన్ని ఆరోగ్యవంతంగా దాటడం అనే హక్కును వీళ్లు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇప్పుడు ‘నైన్’ అనే ఉద్యమం మొదలైంది. నూటికి ఎనభై మంది ఇంతే! రుతుక్రమ పరిశుద్ధత కోసం ‘18 టు 82 బ్రిడ్జ్ ది గ్యాప్’ అనే నినాదంతో ‘నైన్’ ముందుకు వస్తోంది. పైన మీరు చదివిన భోలీ అనే బాలిక కథ నైన్ విడుదల చేసిన వీడియోలోనిదే. 18 అన్నది శానిటరీ నేప్కిన్లు వాడుతున్న మహిళల శాతం. 82 అన్నది.. భోలీలా అనారోగ్యకరమైన విధానాలు పాటిస్తున్న మహిళల శాతం. దేశంలోని మహిళలందరికీ మెరుగైన రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన కల్పించి.. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ప్యాడ్లను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో అమర్ తులసియన్ అనే సోషల్ ఆంట్రప్రెన్యూర్ ‘నైన్’ అనే ఈ ఉద్యమానికి రూపకల్పన చేశారు. ‘నైన్.. ఎ మూవ్మెంట్’ పేరుతో మే 25న ఒక వెబ్సైట్ ప్రారంభం కాబోతోంది. సైట్ హోమ్ పేజీలో కనిపిస్తున్న రెండు అందమైన కళ్లను బట్టి నైన్ అనే పేరును ‘నయన’అనే అర్థంలో వాడారని తెలుస్తోంది. గర్ల్స్.. ఇందులో మీరూ భాగస్వాములు కావచ్చు. మీ మెన్స్ట్రువల్ స్టోరీలను షేర్ చేసుకోవచ్చు. రుతుక్రమ పరిశుభ్రతపై సదస్సు మే 28 ‘మెన్స్ట్రువల్ హైజీన్ అవేర్నెస్ డే’. వచ్చే ఐదేళ్లలో రుతుక్రమ పారిశుద్ధ్యంపై అవగాహన కోసం తను ఏం చేయబోతున్నది ‘నైన్’ ఆ రోజున వెల్లడిస్తుంది. ‘ప్యాడ్‌మ్యాన్’ చిత్రంతో ఇదే అంశంపై అనేక ప్రచార ఉద్యమాల్లో పాల్గొన్న అక్షయ్ కుమార్‌తో పాటు ఇతర బాలీవుడ్ ప్రముఖులు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, ప్రభుత్వ అధికారులు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు, ఎన్జీవోలు, థాట్ లీడర్లు.. అంతా ఆరోజు జరిగే భారీ సదస్సులో మెన్స్ట్రువల్ హైజీన్ పై మాట్లాడతారు. ‘పైకి మాట్లాడదాం. పాత అలవాటును మాన్పిద్దాం’ అనే థీమ్‌తో ముంబైలో ఈ సదస్సు జరగబోతోంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఇల్లు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మహిళను ఆరోగ్యంగా ఉంచే బాధ్యత ఇంటిదీ, సమాజానిదే. -
బీసీ స్వయం ఉపాధి అర్హుల ఎంపిక విధివిధానాలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల నిరుద్యోగులకు బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల్లో గ్రామ సభ, పట్టణాల్లో వార్డు సభలను నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. పథకానికి కేటాయించిన బడ్జెట్లో 50% నిధులను సాంప్రదాయ వృత్తి దారులకు, మిగతా 50% జనరల్ స్కీంలకు కేటాయించనున్నారు. ఒక కుటుంబం నుంచి ఒక అభ్యర్థినే ఎంపిక చేయాలని, గతంలో లబ్ధి పొందిన వారిని ఎంపిక చేయకూడదని నిబంధన విధించారు. లబ్ధిదారుల్లో 33% మహిళలకు కేటాయించనున్నారు. పేదలకు, దివ్యాంగులకు, సంచార జాతుల వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించరాదు. -
డెరైక్ట్ ప్లాన్ ప్రయోజనాలేంటి?
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి డెరైక్ట్ ఆప్షన్ అంటే ఏమిటి ? దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? ఇలా డెరైక్ట్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్టర్లకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? - వందన, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి రెండు విధానాలున్నాయి. ఒకటి డెరైక్ట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం. రెండోది రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఏదైనా మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, మీరు నేరుగా సదరు మ్యూచువల ఫండ్‌తోనే లావాదేవీలు చేసినట్లు లెక్క. ఇక రెగ్యులర్ ప్లాన్‌లో అయితే డిస్ట్రిబ్యూటర్/అడ్వైజర్/ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తే సదరు డిస్ట్రిబ్యూటర్/అడ్వైజర్/ఏజెంట్లకు కొంత కమీషన్‌ను మ్యూచువల్ ఫండ్ సంస్థ చెల్లిస్తుంది. ఇలాంటి కమీషన్లు మీకు వచ్చే రాబడులపై ప్రభావం చూపుతాయి. డెరైక్ట్ ప్లాన్‌లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి కమీషన్లు ఉండవు. కాబట్టి మీకు రాబడులు అధికంగా వచ్చే అవకాశాలున్నాయి. 2012, సెప్టెంబర్‌లో సెబీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి చాలా సంస్కరణలను తెచ్చింది. వాటిల్లో డెరైక్ట్ ప్లాన్లు ఒకటి. ఇప్పుడు ప్రతీ మ్యూచువల్ ఫండ్ సంస్థ డెరైక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. రెగ్యులర్ ప్లాన్‌తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్‌కు ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. ఎన్ఏవీలు కూడా డెరైక్ట్ ప్లాన్‌కు, రెగ్యులర్ ప్లాన్‌కు తేడాగా ఉంటాయి. డెరైక్ట్ ప్లాన్ అయినా, రెగ్యులర్ ప్లాన్ అయినా సదరు స్కీమ్ పోర్ట్‌ఫోలియో ఒకే విధంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం, నిధుల కేటాయింపు, మదుపు వ్యూహం, ఎగ్జిట్ లోడ్, నష్టభయ అంశాలు, ఇతర అంశాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌కు సంబంధించి డెరైక్ట్ ప్లాన్‌ల్లోనే ఇన్వెస్ట్ చేయడం సముచితంగా ఉంటుంది. అయితే సరైన ఫండ్ స్కీమ్‌ను ఎంచుకోవాలంటే కొంచెం కష్టపడక తప్పదు. డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్లకు సంబంధించి ఒక ఉదాహరణను చూస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో 2.07గా ఉండగా, డెరైక్ట్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో 1.2గా ఉంది. ఎలాంటి కమీషన్ల బెడద ఉండదు కాబట్టి డెరైక్ట ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో 42 శాతం తక్కువగా ఉంది. ఇక రాబడుల విషయానికొస్తే, రెగ్యులర్ ప్లాన్ 18 శాతం, డెరైక్ట్ ప్లాన్ 19 శాతం చొప్పున రిటర్న్‌లను ఇచ్చాయి. స్వల్పకాలానికి పెద్దగా తేడా లేకపోయినా, దీర్ఘకాలంలో మాత్రం రాబడుల్లో భారీగా వ్యత్యాసం ఉంటుందని చెప్పవచ్చు. చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థల ఈక్విటీ ఫండ్స్ ఎక్స్పెన్స్ రేషియో 2 నుంచి 3 శాతంగా ఉంటోంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రకటించే రాబడుల్లో ఈ ఎక్స్పెన్స్ రేషియోను మినహాయిస్తారా? ఉదాహరణకు ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ 22 శాతం రాబడులు వస్తాయని పేర్కొంటే, ఎక్స్పెన్స్ రేషియోను మినహాయించి మిగిలింది చెల్లిస్తారా? లేకుంటే మొత్తం 22 శాతం రాబడులను పూర్తిగా చెల్లిస్తారా? ఎన్ఏవీలో దీనిని కలిపేసే చెబుతారా? - రాజ్, గుంటూరు అన్ని చార్జీలు, వ్యయాలను మినహాయించిన తర్వాతనే ఎన్ఏవీని నిర్ణయిస్తారు. ఏదైనా ఒక ఫండ్ రాబడులు 22 శాతం వస్తాయని మ్యూచువల్ ఫండ్ సంస్థ పేర్కొంటే అంతే మొత్తం రాబడులు మీకు వస్తాయి. నేను రెండు బీమా పాలసీలు తీసుకున్నాను. ఒకటి ఎల్ఐసీ న్యూ బీమా గోల్డ్ టి179(2010లో తీసుకున్నా, 16 ఏళ్ల పాలసీ, ప్రీమియం రూ.30,000 ఏడాదికి. ఇది మనీ బ్యాక్ పాలసీ) రెండోది ఐసీఐసీఐ ప్రు లైఫ్ వెల్త్ బిల్డర్(2011లో తీసుకున్నా, 10 ఏళ్ల పాలసీ, 30 వేల ప్రీమియం ఏడాదికి). ఇక గత ఏడాది నవంబర్ నుంచి యాక్సిస్, ఐసీఐసీఐ ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) ఫండ్స్‌లో నెలకు రూ.1000 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఈ రెండు బీమా పాలసీల్లో ఒకదానిని సరెండర్ చేసి, ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచాలని ఆలోచిస్తున్నాను. దేనిని సరెండర్ చేయమంటారు? సరెండర్ చేసిన పక్షంలో ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - సతీష్, కరీంనగర్ బీమాను, మదుపును కలగలిపి ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం సరికాదు. మీరు తీసుకున్న రెండు బీమా పాలసీలు అలాంటివే. ఎల్ఐసీ న్యూ బీమా గోల్డ్ మనీ బ్యాక్ పాలసీ కాగా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ వెల్త్ బిల్డర్ యూనిట్ లింక్డ్ ప్లాన్. ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచడానికి రెండింట్లో ఏదో ఒకదానిని సరెండర్ చేయాలనేది మీ యోచన. ఎల్ఐసీ పాలసీని సరెండర్ చేస్తే మంచిది. కారణాలు రెండే, ఈ పాలసీకి సంబంధించిన వ్యయాలను సరైన రీతిలో ఎల్ఐసీ వెల్లడించడం లేదు. రెండోది పాలసీ కాలవ్యవధి(16 సంవత్సరాలు) ఎక్కువగా ఉంది. ఈ పాలసీని సరెండర్ చేస్తే మీకు బీమా రక్షణ ఉండదు. అందుకని మీరు టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. పాలసీ వ్యవధి ఇంకా ఐదేళ్లు పూర్తి కాలేదు. కాబట్టి ఈ పాలసీని సరెండర్ చేయగా వచ్చిన మొత్తాన్ని మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం పన్ను విధిస్తారు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అధికారుల విదేశీయానం కఠినతరం
న్యూఢిల్లీ: ఉన్నత స్థాయి అధికారులు అధికారి విదేశీ పర్యటనలకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను కేంద్ర సచివాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేశాయి. ఈ నిబంధనల మేరకు ఉన్నతాధికారుల విదేశీ పర్యటనల ప్రతిపాదనలను ప్రధాని కార్యాలయం (పీఎంఓ), కార్యదర్శుల స్క్రీనింగ్ కమిటీ పరిశీలించవలసి ఉంటుంంది. వారి విదేశీ పర్యటనలకు పీఎంఓ, విదేశాంగ మంత్రిత్వశాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖల అనుమతి తప్పనిసరి అవసరం. ప్రతిపాదిత పర్యటనల వివరాలు ఆయా మంత్రిత్వశాఖల వెబ్సైట్లలో తప్పని సరిగా పొందుపరచాలని పీఎంఓ స్పష్టం చేసింది.