సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల నుంచి భారత్‌లో సెకండ్ వేవ్ ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తుంది. అయితే కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. త్వరలో థర్డ్ వేవ్ రానుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లో అక్టోబర్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు పీఎంవోకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం) నిపుణుల కమిటీ నివేదిక అందజేసింది. ఇక థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఎన్‌ఐడీఎం హెచ్చరించింది. (చదవండి: 4 నెలలు.. రూ.900 కోట్ల నష్టం)
థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్యం కోసం సన్నద్ధం కావాలని ఎన్‌ఐడీఎం సూచించింది. థర్డ్‌వేవ్ సమయంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవని నివేదికలో వెల్లడించారు. ఇక చిన్న పిల్లలకు వైద్యం కోసం సిబ్బందిని పెంచాలని సూచించారు. వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాలని తెలిపారు. దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉండగా.. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం ఖాళీలు ఉన్నట్లు ఎన్‌ఐడీఎం నివేదిక తెలిపింది. థర్డ్‌వేవ్ ముప్పును దృష్టిలో పెట్టుకుని వైద్యుల కొరత, ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది.
చదవండి: పిల్లలకూ కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. ఎలా పనిచేస్తుంది?
Comments
Please login to add a commentAdd a comment