తిరుపతి: సీఎం చంద్రబాబు మార్క్ డ్రామాను చూసి తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు విన్యాసాలు చూసి వామ్మో అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే?
తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు అధికారులపై చిందులు తొక్కారు. తమాషాలు చేస్తున్నారా? అంటూ టీటీడీ ఈవోపై ఫైరయినట్లు కలరింగ్ ఇచ్చారు. మీడియా కెమెరాలు చూసుకుని మరి హైడ్రామా పండించారు. బాధ్యత తీసుకుని సమీక్ష చేయాల్సిన ముఖ్యమంత్రి మీడియా కెమెరాల ముందు చేసిన హడావిడి చూసి జనం కూడా అవాక్కయ్యారు.
ఏదైనా మంచి జరిగితే తనఖాతాలో వేసుకునే చంద్రబాబు.. ఏదైనా తప్పు జరిగితే ఇతరులపై నెట్టివేయడం చంద్రబాబు దిట్టా అంటూ చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment