
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లోని ఇంటివద్ద బన్నీని అరెస్ట్ చేసిన పోలీసులు మొదటి చిక్కడపల్లిక పీఎస్‌కు తరలించారు.

ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గాంధీ ఆస్పత్రిలో బీపీ, షుగర్, కరోనా టెస్టులు చేశారు.

అనంతరం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది.

అయితే హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు.

దీనిపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
