ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద ఘోరం జరిగింది. ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గరు మరణించగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద ఘోరం జరిగింది. ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గరు మరణించగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను వినుకొండ మండలం రామిరెడ్డి పాలేనికి చెందిన అంజిరెడ్డి, లక్ష్మణరెడ్డి, శ్రీనివాసరెడ్డిగా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన తీరును బట్టి చూసిన స్థానికులు మాత్రం దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురు మృతులతో పాటు క్షతగాత్రులను తీసుకొచ్చి కారుతో సహా సంతమాగులూరు వద్ద పడేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారును వినుకొండకు చెందినదిగా గుర్తించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.