* కేఎస్‌ఆర్టీసీ, ఇసుక టిప్పర్ ఢీ.. 14 మంది మృతి, 11 మందికి గాయాలు
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కర్ణాటక రాష్ట్ర ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో కర్ణాటక వారితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన వారూ ఉన్నారు.
కర్ణాటక రాష్ట్రం తుమ్‌కూరు డిపోకు చెందిన నం. కేఏ06-ఎఫ్-1056 బస్సు బెంగళూరు నుంచి 31 మంది ప్రయాణికులతో తిరుపతికి బయల్దేరింది. ముల్‌బాగల్ సమీపంలోని కప్పలమడుగు, శ్రీరంగపురం గ్రామాల సమీపంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా ఇసుక టిప్పర్ ఎదురుగా వచ్చి బస్సును ఢీకొంది. 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ముల్‌బాగల్ ఆస్పత్రిలో, మరోనలుగురు కోలా ర్ జాలప్ప మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతుల్లో కర్ణాటకకు చెందిన నితీష్‌కుమార్(2), అదే రాష్ట్రం కోలా రు జిల్లా గద్దేకల్లూరుకు చెందిన నాగేష్, బెంగళూరుకు చెందిన నాగమణి, భారతి బ్రహ్మచారి, నారాయణమ్మ, తుమ్‌కూరుకు చెందిన బస్సు డ్రైవర్ గంగాధరయ్య, ముల్‌బాగల్‌కు చెందిన విజయమ్మ, చిత్తూరు జిల్లా చిక్కనపల్లెకు చెందిన రాజశేఖర్, పలమనేరుకు చెందిన లిఖిత్‌కుమార్ (3), శాంతాభాయి(55), తిరుపతికి చెందిన పార్వతమ్మ ఉన్నారు. మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
కర్ణాటక సరిహద్దులో రోడ్డు ప్రమాదం
Published Tue, Sep 9 2014 2:17 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement