
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నేత ఆర్‌వీ సుభాష్ చంద్రబోష్ వైఎస్సార్‌సీపీలో చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఆర్‌వీ సుభాష్ చంద్రబోస్ శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి జాయిన్ అయ్యారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి ఆర్‌వీ సుభాష్ చంద్రబోస్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ పాల్గొన్నారు.