subhash chandrabose
-
వైఎస్సార్సీపీలోకి చేరిన పలమనేరు టీడీపీ నేత
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ నేత ఆర్వీ సుభాష్ చంద్రబోష్ వైఎస్సార్సీపీలో చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఆర్వీ సుభాష్ చంద్రబోస్ శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి జాయిన్ అయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి ఆర్వీ సుభాష్ చంద్రబోస్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ పాల్గొన్నారు. చదవండి: ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
Asha Sahay: 17 ఏళ్ల వయసులో దేశం కోసం! జపాన్‌లో పుట్టి.. నేతాజీ ఆర్మీలో
కొందరు అందరిలా ఉండరు.... ‘ఎందుకీ పక్షులు కొమ్మల్ని విడిచి పారిపోతున్నాయి ఆకాశాల బరువుల్ని మోసుకుంటూ? ఎందుకీ చెట్లు ఇలా వలస పోతున్నాయి పువ్వుల భారాన్ని మోసుకుంటూ? ఎవరైనా వాటి నేత్రాల్లో ఉన్న శోకసముద్రాలు గుర్తించారా? దేశపు గొంతులో ఉన్న ఆక్రోశం ఎవరైనా విన్నారా?’ అంటూ దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అలాంటి వారిలో ఒకరు ఆశా సహాయ్. పదిహేడు సంవత్సరాల వయసులో దేశం కోసం యుద్ధక్షేత్రాల్లోకి వెళ్లింది... జపాన్‌లోని కోబ్ నగరంలో జన్మించింది ఆశా సహాయ్. తండ్రి ఆనంద్ మోహన్ సహాయ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు రాజకీయ సలహాదారు. అంతకుముందు బాబూ రాజేంద్రప్రసాద్‌కు సెక్రెటరీగా పనిచేశాడు. బిహార్‌లోని భాగల్పూర్కు చెందిన ఆనంద్ మోహన్ ఆనాటి నిర్బంధ పరిస్థితుల్లో జపాన్‌కు వెళ్లాడు. అక్కడ బతుకుదెరువు కోసం జపాన్ పిల్లలకు ఇంగ్లీష్ బోధించేవాడు. ‘దేశానికి దూరంగా ఉన్నా, మా నుంచి దేశం ఎప్పుడూ దూరంగా లేను. నా దేశానికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు రావాలని ఆబాలగోపాలం కోరుకునే రోజులవి’ అంటున్న ఆశా సహాయ్ తల్లిదండ్రుల ద్వారా మాటలు, పాటల రూపంలో దేశభక్తిని ఆవాహన చేసుకుంది. పదిహేడు సంవత్సరాల వయసులో నేతాజీ భారత జాతీయ సైన్యంలోని రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరింది. జపాన్ నుంచి తైవాన్ అక్కడి నుంచి థాయిలాండ్ వరకు ప్రయాణించి రాణి ఝాన్సీ రెజిమెంట్‌లోకి వెళ్లింది. రైఫిల్ హ్యాండ్లింగ్ నుంచి యాంటీ–ఎయిర్ క్రాఫ్ట్గన్స్ వరకు తొమ్మిది నెలల పాటు రకరకాల విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకుంది. గెరిల్లా యుద్ధతంత్రాలలో ఆరితేరింది. సింగపూర్, మలేసియా, బర్మా... యుద్ధకేత్రాల్లో పని చేసింది. తాగడానికి నీరు, తినడానికి తిండి దొరకని ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో రోజులు బర్మా అడవుల్లో గడిపింది. తన పోరాట అనుభవాలను ఎప్పటికప్పుడు డైరీలో రాసుకునేది. ఆశా సహాయ్ని సైనిక దుస్తుల్లో చూసిన రోజు తల్లి సతీ సహాయ్... ‘నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించవద్దు. ఇప్పుడు నువ్వు మా బిడ్డవి కాదు, భరతమాత బిడ్డవు’ అని ఆశీర్వదించింది. బెంగాల్‌కు చెందిన సతీ సహాయ్ ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు చిత్తరంజన్‌దాస్‌కు సమీప బంధువు. ‘బాంబుగాయాలతో బాధ పడుతున్నా సరే వెనకడుగు వేసేవాళ్లం కాదు’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది ఆశా సహాయ్. తాను డైరీలో రాసుకున్న విషయాలను ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కోలిన్స్ తాజాగా ‘ది వార్ డైరీ ఆఫ్ ఆశా–సాన్: ఫ్రమ్ టోక్యో టు నేతాజీస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ’ పేరుతో పుస్తకంగా ప్రచురించింది. పుస్తకాన్ని ఇంగ్లిష్‌లో ప్రచురించడం ఇదే తొలిసారి. ఆశా మునిమనవరాలు తన్వీ శ్రీవాస్తవ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ‘ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఆ రోజుల్లో యువతరంలో ఉప్పొంగే దేశభక్తి భావాలు, చేసిన త్యాగాల గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన ఆశా ఏరోజూ వెనకడుగు వేయలేదు’ అంటుంది తన్వీ శ్రీవాస్తవ. ‘ఇది వ్యక్తిగత పుస్తకం కాదు. ఆ రోజుల్లోని పోరాటస్ఫూర్తికి అద్దం పట్టే పుస్తకం’ అంటున్న 94 సంవత్సరాల ఆశా సహాయ్ తన కుమారుడితో కలిసి పట్నా (బిహార్)లో నివసిస్తోంది. చదవండి: అలనాటి ఆకాశ వాణి Alpana Parida: క్షేమంగా... లాభంగా.. ఫైబర్ హెల్మెట్.. తక్కువ బరువు! -
నేతాజీ అంగరక్షకుడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాలను వదిలేసి విదేశాలకు వెళ్లి బ్రిటిష్ వాళ్లపై యుద్ధం ప్రకటించిన రోజులవి. అప్పట్లో ఆయన అంగరక్షకునిగా పనిచేసిన అచంచల దేశభక్తుడు గోపరాజు వేంకట అనంత శర్మ, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో 1920లో జన్మించిన ఆయన 1941లో బ్రిటిష్ ఇండియా ఆర్మీ (బీఐఏ)లో గుమాస్తాగా చేరారు. తరువాత ఆఫీసర్‌గా ఎంపికై శిక్షణ నిమిత్తం మలేషియాలోని కోటాబహార్‌కు వెళ్లారు. బ్రిటన్– జపాన్ల మధ్య జరిగిన యుద్ధంలో వేలాదిమంది బీఐఏ సైనికులు యుద్ధ ఖైదీలుగా జపాన్‌కు చిక్కారు. అందులో గోపరాజు ఒకరు. జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశస్థుల సాయంతో భారత మాతకు విముక్తి కలిగించాలని నేతాజీ తన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) ద్వారా ప్రయత్నించారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులైన గోపరాజు నేతాజీని బ్యాంకాక్‌లోని రత్నకోసిన్ హోటల్లో కలిసి ఐఎన్ ఏలో చేరారు. నేతాజీ అంగరక్షకులలో ఒకరుగా పనిచేశారు. ఎప్పుడూ మిలటరీ దుస్తులలో ఉండే నేతాజీని చూసి ఎంతో ప్రేరణ, గౌరవం కలిగేదని గోపరాజు అంటూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్లు ఇండియన్ నేషనల్ ఆర్మీవారిని యుద్ధఖైదీలుగా ఫిరోజ్‌పూర్ కంటోన్మెంటుకు తరలించారు. వారిలో గోపరాజు అనంత శర్మ కూడా ఉన్నారు. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) స్వాతంత్య్రోద్యమ దీప్తి నేతాజీ... కనుసన్నలలో గడిపిన మూడేళ్ల కాలం తన జీవితంలో స్వర్ణమయ సమయం అనేవారు వేంకట అనంత శర్మ. ఈయన కొంతకాలం పాటు స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రోత్సాహంతో భారతీయ రైల్వేలో ఉద్యోగిగా చేరి ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పదవీవిరమణ చేశారు. ఈమధ్య జూలై నెలలో ఐకానిక్ వారోత్సవాల వేడుకలలో అమృతోత్సవమును పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే వారు విజయవాడలో స్వాతంత్య్ర సమరవీరులైన శర్మ కుటుంబ సభ్యులను ఉచిత రీతిన గౌరవించడం ముదావహం. (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) – డాక్టర్ ధర్మాల సూర్యనారాయణ మూర్తి, చాంగీ కాండో, సింగపూర్ -
Col Nizamuddin: నేతాజీని కాపాడిన యోధుడు
నేతాజీ ఆంతరంగికులలో ఒకరు కల్నల్ షేక్ నిజాముద్దీన్. వీరి అసలు పేరు సైఫుద్దీన్. వీరు అప్పటి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్ జిల్లా ఢక్వా గ్రామంలో 1900లో జన్మించారు. 20 ఏళ్ల ప్రాయంలో బ్రిటిష్ సైన్యంలో చేరారు. కొంతకాలం తర్వాత సింగపూర్‌లో క్యాంటిన్ నడుపుతున్న తన తండ్రి ఇమాం అలీ వద్దకు 1926లో చేరారు. అనంతరం 1943లో నేతాజీ జాతీయ సైన్యాన్ని పునరుద్ధరించి ‘చలో ఢిల్లీ’ అంటూ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అందులో చేరారు. అప్పటివరకు ఉన్న సైఫుద్దీన్ పేరును నిజాముద్దీన్‌గా మార్చుకున్నారు. నేతాజీ కారు డ్రైవర్‌గా ఉండి, ఆ తరువాత అంగరక్షకుడిగా, వ్యక్తిగత సహాయకునిగా నిజాముద్దీన్ ఎదిగారు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా 1943లో జరిగిన యుద్ధంలో నేతాజీతో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో అడవిలో నేతాజీతో వెళుతుండగా తుప్పల్లోంచి నేతాజీకి గురిపెట్టిన ఒక తుపాకీ గొట్టాన్ని నిజాముద్దీన్ గమనించి ఎదురెళ్ళారు. క్షణాలలో 3 గుండ్లు ఆయన శరీరంలోకి దూసుకుని వెళ్ళి కుప్పకూలారు. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ వైద్యం చేసి నిజాముద్దీన్ శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. ఆయన త్యాగనిరతికి నేతాజీ చలించిపోయి కల్నల్ హోదాను కల్పించడంతో వీరు కల్నల్ షేక్ నిజాముద్దీన్‌గా ప్రసిద్ది చెందారు. నాటి నుండి 1945 వరకు నేతాజీ వెన్నంటి ఉన్నారు. సింగపూర్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారన్న వార్తను ఆయన ఖండించారు. ఆ ప్రమాదం జరిగిన 3 నెలల తర్వాత తాను స్వయంగా నేతాజీని బర్మా–థాయిలాండ్ సరిహద్దుల్లో గల సితంగ్‌పూర్ నదీ తీరాన తీసుకెళ్ళి విడిచిపెట్టి వచ్చానని అనేవారు. నిజాముద్దీన్ తన 117 ఏట 2017లో స్వగ్రామంలోనే కన్నుమూశారు. – షేక్ అబ్దుల్ హకీం జాని, తెనాలి (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
దృఢ భారత్.. నేతాజీకి గర్వకారణం
కోల్‌కతా/సాక్షి, న్యూఢిల్లీ: బలమైన భారతదేశం నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) నుంచి వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వరకూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగు జాడల్లో నడుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నేతాజీ ఇప్పుడు జీవించి ఉంటే అన్ని విధాలా బలోపేతమైన భారత్‌ను చూసి గర్వపడేవారని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి మనమే సొంతంగా టీకాలు అభివృద్ధి చేసుకోవడం, ఇతర దేశాలకు సైతం టీకాలను అందజేయడం, మన దేశ సార్వభౌమత్వానికి సవాలు ఎదురైనప్పుడు దీటుగా జవాబు ఇవ్వడం చూసి నేతాజీ ఎంతగానో గర్వపడేవారని పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ్ దివస్’ వేడుకలను కేంద్ర ప్రభుత్వం శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎల్ఏసీ నుంచి ఎల్ఓసీ వరకు బలమైన భారత్ రూపుదిద్దుకోవాలని నేతాజీ కలలుగన్నారని, ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నామని తెలిపారు. అజేయమైన సైనిక శక్తి మన సొంతమని చెప్పారు. తేజస్, రఫేల్ వంటి అత్యాధునిక ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకున్నామని వివరించారు. దీవికి బోస్ పేరుపెట్టడం నా అదృష్టం ఆత్మనిర్భర్ భారత్, సోనార్ బంగ్లాను(బంగారు బెంగాల్) కలగనడానికి నేతాజీ గొప్ప స్ఫూర్తి అని నరేంద్ర మోదీ కొనియాడారు. బోస్ పేరు విన్నప్పుడల్లా తాను ఎంతగానో స్ఫూర్తి పొందుతానని చెప్పారు. ఆయన స్వాతంత్య్రం కోసం అర్థించలేదని, దాని కోసం పోరాటం సాగించారని శ్లాఘించారు. 2018లో అండమాన్‌లోని ఓ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా నామకరణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బోస్‌కు సంబంధించిన ఫైళ్లను ప్రజల ముందుంచామని అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ) సభ్యులు సైతం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు బోస్‌కు రుణపడి ఉన్నాడని ఉద్ఘాటించారు. 130 కోట్ల మందిలోని ప్రతి రక్తం చుక్క బోస్‌కు రుణపడి ఉంటుందన్నారు. గృహ నిర్బంధం నుంచి తప్పించుకొనే ముందు సుభాష్ చంద్రబోస్ తన మేనల్లుడు శిశిర్ బోస్‌ను ‘నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా?’ అంటూ ప్రశ్నించారని గుర్తుచేశారు. గుండెపై చెయ్యి వేసుకొని, నేతాజీ సమక్షంలో ఉన్నట్లు ఊహించుకుంటే అదే ప్రశ్న వినిపిస్తుందన్నారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించినట్లుగానే ఆత్మనిర్భర్ భారత్‌లోనూ బెంగాల్ ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు. జైశ్రీరామ్‌లో తప్పేముంది?: బీజేపీ మమతా బెనర్జీ తీరు పట్ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జైశ్రీరామ్ నినాదంలో తప్పేముందని నిలదీశారు. జైశ్రీరామ్ అనేది రాజకీయ నినాదం కాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఈ నినాదంలో ఎలాంటి తప్పు లేదని, నేతాజీ జయంతిని రాజకీయం చేయొద్దని నేతాజీ బంధువు చంద్రకుమార్ బోస్ సూచించారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించారని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్‌రంజన్ చౌదరి ధ్వజమెత్తారు. ఒక మహిళను పది మందిలో అవమానించడం దారుణమన్నారు. ఈ ఘటన తమ రాష్ట్రానికే అవమానమని సీపీఎం సీనియర్ నేత బిమన్ బోస్ పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతుండగా నినాదాలు చేయడాన్ని టీఎంసీ ముఖ్య అధికార ప్రతినిధి డెరెక్ ఓ బ్రెయిన్ తప్పుపట్టారు. బోస్ నివాసంలో మోదీ కోల్‌కతాలో సుభాష్ చంద్రబోస్ నివాసం ‘నేతాజీ భవన్’ను ప్రధాని మోదీ సందర్శించారు. అనంతరం నేషనల్ లైబ్రరీలో నేతాజీపై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్లో పాల్గొన్నారు. అక్కడ కళాకారులు, ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. నన్ను పిలిచి అవమానిస్తారా? బెంగాల్ సీఎం మమత విక్టోరియా మెమోరియల్ హాల్లో జరిగిన నేతాజీ జయంతి కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రసంగించేందుకు ఆమె ఉద్యుక్తురాలు కాగానే కొందరు ప్రధాని సమక్షంలో జైశ్రీరామ్ అంటూ బిగ్గరగా నినదించారు. దీంతో అసహనానికి గురైన మమత ప్రసంగించేందుకు నిరాకరించారు. తనను ఈ వేడుకకు పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమే తప్ప రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ఇలాంటి చోట మర్యాద పాటించాలన్నారు. పిలిచి అవమానించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. తాను ఇక మాట్లాడబోనని, జై బంగ్లా, జైహింద్ అంటూ ముగించారు. -
ఇక ఇప్పుడు దీవుల వంతు
న్యూఢిల్లీ : ఈ మధ్య కాలంలో పలు చారిత్రక నగరాలు పేర్లు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్‌కు ఆధ్యుడిగా నిలిచారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇప్పటికే యోగి యూపీలోని ఫైజాబాద్ పేరును అయోధ్యగా, అలహబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ మూడు దీవుల పేర్లను మార్చేందుకు సిద్ధమైంది బీజేపీ ప్రభుత్వం. రోస్ ఐల్యాండ్, నేయిల్ ఐల్యాండ్, హ్యావ్లాక్ ఐలాండ్ పేర్లను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐల్యాండ్, షాహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ ఐల్యాండ్‌లుగా మార్చనున్నట్లు తెలిసింది. పోర్ట్ బ్లెయర్ పర్యటన సందర్భంగా ఈ నెల 30న మోదీ ఈ కొత్త పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫార్మాలిటీలన్ని పూర్తయ్యాయన్నారు అధికారులు. స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 30 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే ఈ మూడు అండమాన్, నికోబార్ దీవుల పేర్లను మార్చేందుకు నిర్ణయించింది. అయితే అండమాన్ దీవుల్లోకెల్లా పెద్దది.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన హ్యావ్‌లక్ దీవి పేరును మార్చలనే డిమాండ్ 2017 నుంచే ఉంది. ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా డిసెంబర్ 30 (1943) అండమాన్ దీవులకు చేరుకున్న నేతాజీ ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అండమాన్‌కు షాహీద్‌గానూ, నికోబార్‌కు స్వరాజ్‌గానూ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. -
దేశ్‌ప్రేమ్ దివస్‌గా జనవరి 23
న్యూఢిల్లీ: జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జరపాలని రాజ్యసభలో ఓ సభ్యుడు డిమాండ్ చేశారు. ఆ రోజును దేశ్ ప్రేమ్ దివస్‌గా పాటించాలని, జాతీయ సెలవుగా ప్రకటించాలంటూ రాజ్యసభలో ఇటీవల సీపీఐ(ఎం) నుంచి బహిష్కృతుడైన రితవ్రత బెనర్జీ జీరో అవర్‌లో ప్రస్తావించారు. బ్రిటిష్ పాలకులు కలకత్తాలో హౌస్ అరెస్ట్ చేస్తే వీరోచితంగా తప్పించుకుని అఫ్గానిస్తాన్ ద్వారా జర్మనీకి, అక్కడి నుంచి జర్మన్ సబ్ మెరైన్‌లో జపాన్ వెళ్లారని ఆయన హీరోయిజాన్ని కొనియాడారు. జనవరి 23ను దేశభక్తి దినంగా ప్రకటించి సెలవు ఇచ్చినట్లయితే మరుగునపడ్డ ఆ వీరుడికి నివాళి ఇచ్చినట్లవుతుందని అన్నారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు కలుగజేసుకుని దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే సెలవు కోసం చూడొద్దని సభ్యులను కోరారు. -
'జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని వైఆర్సీపీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. బుధవారం ఏపీ శాసనమండలి లో వారు మాట్లాడుతూ దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు. సబ్ ప్లాన్ చట్టం వేసినా కూడా దళితులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంపై మంత్రి రావెల కిశోర్ బాబు సమాధానం దాట వేశరన్నారు. -
వివేకానంద, బోస్‌లపై వేటా?
విశ్లేషణ కికెట్ గురించి చెప్పడానికి, బట్టల తయారీ విజ్ఞానానికి 37 పేజీలు కేటాయించి, జాతీయ యువజనులకు స్ఫూర్తి అయిన వివేకానందుని గురించి ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో కేవలం 26 పదాలు ఇవ్వడం అన్యాయం. నేతాజీ సుభాష్ చంద్ర బోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి జాతీయ విప్లవ నాయకుల జీవిత కథలు కేంద్రీయ విద్యాలయాల పాఠ్యపుస్తకాలలో ఎందుకు తగ్గించారు? కొన్నింటిని ఎందుకు తొలగించారు? మరికొందరు మహానుభా వుల జీవిత గాధలను ఎందుకు చేర్చడం లేదు? అని రాజస్థాన్‌కు చెందిన సూర్యప్రతాప్ సింగ్ రాజావత్ ఫిర్యాదు. దానికి సరైన ప్రతిస్పందనను తెలియజేయా ల్సిన బాధ్యత జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ)పైన ఉంది. ఆ విధంగా అడిగే హక్కును సమాచార హక్కు ప్రతి పౌరుడికీ ఇచ్చింది. ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకంలో స్వామి వివేకానంద జీవిత చరిత్రను 1,250 పదాల నుంచి 87 పదాలకు తగ్గించడం, 8వ తరగతి నుంచి పూర్తిగా తొలగించడం నిజమే అయితే.. క్రికెట్‌కు, బట్టల తయారీకి 37 పేజీలు కేటాయించి స్వాతంత్య్ర విప్లవ నాయకులకు తగిన స్థలం కేటాయించకపో వడం నిజమే అయితే.. 36 మంది జాతీయ నాయ కులకు పాఠ్యపుస్తకాలలో స్థానం లేకపోవడం నిజమే అయితే... అందుకు కారణాలు తెలియజేయాలి. దేశాన్ని నడిపిన కథానాయకుల జీవిత చరిత్రలను నిష్పాక్షికంగా, సైద్ధాంతిక ధోరణులకు తావులేకుండా పాఠాలుగా రూపొందించడానికి, సూర్యప్రతాప్ సింగ్ భయాందోళనలకు తావులేదని చెప్పడానికి ఏ చర్యలు తీసుకున్నారో సహ చట్టం కింద ఎన్సీఈఆర్టీ వివరించడం తప్పనిసరి. శ్రీ అరబిందో ఘోష్, అశ్ఫాక్ ఉల్లాఖాన్, బీకే దత్, బాదల్ గుప్త, భాఘాజతిన్ ముఖర్జీ, బారిందర్ ఘోష్, బాతుకేశ్వర్ దత్, బినయ్క్రిష్ణ బసు, భగత్ సింగ్, చంద్రశేఖర్, దినేశ్ గుప్త, డాక్టర్ సైపుద్దీన్ కిచ్ లెవ్, జతింద్రనాథ్ దాస్, కల్పనా దత్, కర్తార్ సింగ్, ఖుదీరామ్ బోస్, ఎంఎన్ రాయ్, బికాజీ కామా, మదన్ లాల్ ధింఘ్రా, శ్యాంజీ కృష్ణవర్మ, ఒబేదుల్లా సింధి, ప్రఫుల్లా చాకీ, ప్రీతిలతా వఢ్డేదర్, రాజా మహేంద్ర ప్రతాప్, రాంప్రసాద్ బిస్మిల్, రాణీ ైగైడిన్ లుయు, రాస్ బిహారీ బోస్, సచీంద్రనాథ్ సన్యాల్, సావర్కార్, సోహాన్‌సింగ్ భక్నా, సుఖదేవ్, సూర్య సేన్, స్వామీ వివేకానంద, ఉధ్దమ్సింగ్ వంటి మహా నాయకుల జీవితాలను ఎందుకు ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలలో చేర్చలేదని రాజస్థాన్ శ్రీ అరబిందో సొైసైటీ కన్వీనర్ సూర్యప్రతాప్ విమర్శించారు. 2007 ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఎని మిదో తరగతి పుస్తకంలో 500 పదాలు, 12వ తరగ తిలో 1250 పదాల పాఠాలు ఉండేవని, ఆ తరువాత 12వ తరగతి పాఠం 87 పదాల వ్యాసానికి తగ్గించా రని ఎనిమిదో తరగతి నుంచి పూర్తిగా నేతాజీ పాఠాన్ని ఎత్తివేసారని తెలియజేయాలని, నేతాజీ, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్ వంటి విప్లవకారులతో సహా మొత్తం 36 మంది జాతీయ నాయకులకు అన్యాయం జరిగిందని వారి జీవనగాధలను సంక్షిప్తంగా కూడా చేర్చలేదని కూడా విమర్శించారు. క్రికెట్ గురించి చెప్పడానికి, బట్టల తయారీ విజ్ఞానానికి 37 పేజీలు కేటాయించి, జాతీయ యువ జనులకు స్ఫూర్తి అయిన వివేకానందుని గురించి కేవలం 26 పదాలు ఇవ్వడం అన్యాయం అనీ, అరబిందో ఘోష్‌కు సంబంధించి ఒక వాక్యం కూడా లేదని అన్నారు. భగత్ సింగ్ బికె దత్ గురించి ప్రస్తావించినా మిగిలిన వారికి ఆ భాగ్యం కూడా దక్కలేదని అన్నారు మన భారత చరిత్రకు చెందిన ఒక మౌలిక స్వరూపాన్ని ఇవ్వవలసిన బాధ్యత ఎన్సీఈ ఆర్టీకి ఉందని వాదించారు. 2005 విధానం ప్రకారం, కష్టం గాకుండా నేర్చు కోవాలనే సూత్రం ఆధారంగా సామాజిక శాస్త్రాల సిలబస్‌ను సిలబస్ రివిజన్ కమిటీ మార్చిందని, పాఠ్యపుస్తక రచనా సంఘాలలో ఆయా అంశాలలో నిపుణులు ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులు విద్యా ర్థులు చిన్న చిన్న బృందాలలో కూర్చుని చర్చించుకు నేంత సులువుగా పాఠాలు రూపొందిస్తున్నారని ఎన్ సీఈఆర్టీ జవాబు ఇచ్చింది. విద్యార్థులకు సులువైన రీతిలో అందుబాటులోకి ఈ విషయాలను తేవాలనే ఉద్దేశంతో కమిటీలు పాఠాలను నిర్ణయిస్తున్నాయని ఎన్సీఈఆర్టీ పక్షాన ప్రొఫెసర్ నీరజా రశ్మి వివరిం చారు. అయినా అభ్యర్థి అడిగినది సమాచార హక్కు చట్టం కింద సమాచారం కిందకురాదని, అది వారి అభిప్రాయం మాత్రమే అని, దానికి ఇవ్వగలిగిన సమాచారమేదీ లేదని సమాధానం చెప్పారు. అయినా ఈ సూచనలను సంబంధిత కమిటీల ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు. సూర్య ప్రతాప్ గారి పత్రాన్ని ఫిర్యాదుల కమిటీకి కూడా పంపామని, వారి జవాబు వెబ్సైట్లో ఉందని ఆ విష యం కూడా చెప్పామని వివరించారు. వారి ఫిర్యా దును సానుకూలంగా పరిష్కరించామని అన్నారు. సూర్యప్రతాప్ సమాచార అభ్యర్థనలో ఫిర్యాదు ఉందని, దాన్ని ఫిర్యాదుగా భావించి పరిష్కారం ఏమిటో స్పష్టంగా చెప్పకుండా మీరడిగింది సమాచా రమే కాదనడం న్యాయం కాదని కమిషన్ పేర్కొంది. కనీసం ఈ అంశంపైన పరిశీలన జరిగిందా, ఏదైనా చర్య తీసుకున్నారా లేదా తెలియజేయాలని సీఐసీ ఆదేశించింది. పాఠ్యపుస్తకాలకు సంబంధించి ఎన్సీ ఈఆర్టీ తన విధానాన్ని స్వయంగా ప్రకటించ వలసిన బాధ్యత సెక్షన్ 4(1)(సి) కింద ఉందని, తమ నిర్ణయాల ద్వారా బాధితులైన వారికి కారణాలు తెలిపే బాధ్యత సెక్షన్ 4(1)(డి) కింద నిర్దేశించారు. (Suryapratap Singh Rajawat Vs. NCERT, New Delhi, ఇఐఇ/ఇఇ/అ/2014/000207 అ కేసులో 22.1.2016 నాటి తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com