సాక్షి, పలమనేరు(చిత్తూరు): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నేరం చేయకపోతే.. సీబీఐకి, ఈడీకి, తెలంగాణ పోలీసులకు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. చివరకు తెలంగాణలోని పోలీసు కానిస్టేబుల్ అన్న కూడా చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నేరగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసగించారు. ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పలమనేరులో రహదారులు కిక్కిరిసిపోయాయి. మండుటెండల్లో తన కోసం అక్కడికి వచ్చిన వారందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
విలన్ చేసే అన్ని పనులు చంద్రబాబు చేశారు..
‘చంద్రబాబు హయాంలో అవినీతి, అన్యాయాలు, అక్రమాలు పరాకాష్టకు చేరాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలన అవినీతిమయం. సినిమాలో విలన్ పాత్రలో ఉన్న వ్యక్తి చేసే అన్ని పనులను చంద్రబాబు చేశారు. గత 20 రోజులుగా చంద్రబాబు చేస్తున్న నీచమైన రాజకీయాలు చూడండి. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా చెప్పడంలో ఆయనను మించిన వారు లేరు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అవసరం వచ్చినప్పుడు మళ్లీ అదే ఎన్టీఆర్ ఫొటోకు దండేసి దండం పెడతారు. చంద్రబాబు అధికారానికి ఎవరైనా అడ్డోస్తే.. ఆ వ్యక్తిని ఏం చేయాడానికైనా ఆయన వెనకడారు. ప్రజలను, ప్రతిపక్ష నాయకుడిని ఇలా ఎరవరిని వదిలిపెట్టరు. రేపు అధికారానికి అడ్డువస్తాడని అనుకుంటే ప్రధానిని కూడా వదిలిపెట్టరు.
వ్యవస్థలను నాశనం చేశారు..
చంద్రబాబు తనకు సంబంధిన వ్యక్తులను అధికారులగా నియమించుకుని.. వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. చంద్రబాబుకు ఓటు వేయడము అంటే హత్య రాజకీయాలకు ఓటు వేయడమే. మాఫీయాకు ఓటు వేయడమే. గ్రామాల్లో ప్రజలు గెలిపించుకున్న సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు విలువలేకుండా పోయింది. ప్రస్తుతం గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫీయా నడుస్తోంది. రాష్ట్రమంతా చంద్రబాబు మాఫీయా నడుస్తోంది. చంద్రబాబు హయంలో సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అన్నట్టుగా తయారైంది.
మనిషిని పొగొట్టుకున్నది మా కుటుంబం
మా చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబే. ఈ హత్య కేసును విచారించేంది వీళ్ల పోలీసులే. హత్య కేసును తప్పుదోవ పట్టించి వక్రీకరించేది చంద్రబాబే. అందుకు అనుకూలంగా ఎల్లో మీడియాలో కథనాలు వెలువడతాయి. మనిషిని పొగొట్టుకుంది మా కుటుంబం. పైగా బాధలో ఉన్న మా కుటుంబంపై నిందలు మోపుతారు. ఇలా చేస్తే న్యాయం ఎలా జరుగుతోంది?. చంద్రబాబు నేరం చేయకపోతే ఈ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించరు?. చంద్రబాబు నేరగాడు కాకపోతే సీబీఐకి, ఈడీకి, ఐటీకి, చివరకు తెలంగాణ కానిస్టేబుల్‌కు కూడా ఎందుకు భయపడుతున్నారు?. చంద్రబాబు నేరగాడు కాకపోతే.. తనపై ఉన్న అన్ని కేసులో టెక్నికల్ కారణాలు చూపుతూ స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు?. చంద్రబాబు మించిన దుర్మార్గుడు, ద్రుష్టుడు, నీచుడు ఎవరు లేరని ఎన్టీఆర్ ఎన్నోసార్లు చెప్పారు.
హత్య రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు...
నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చిన రిషితేశ్వరి అనే విద్యార్థిని దారుణంగా చనిపోయిన కేసులో బాబురావును ఎందుకు అరెస్ట్ చేయలేదు?. ఆ వ్యక్తి చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే అతని జోలికి ఎవరూ వెళ్లలేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళ ఎమ్మార్వో వనజాక్షిని అక్కడి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని ఇడ్చుకుంటూ పోతే ఎలాంటి కేసు లేదు, ఎలాంటి అరెస్ట్ లేదు. ఆ ఎమ్మెల్యే తప్పు చేశారని కోర్టు చెప్పినా కూడా చర్యలు లేవు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అదే వ్యక్తికి టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.
విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ నడిపిన మృగాలను చంద్రబాబు కాపాడారు. కాల్‌మనీ బాధితులకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో తోటలను తగులబెట్టించారు. చివరకు దళితులపై కూడా కేసులు పెట్టారు. 2014 ఎన్నికల్లో తమ కులాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అడిగిన ప్రతి ఒక్కరిని కొట్టించి, వారిపై కేసులు పెట్టించి వేధింపులకు గురిచేశారు. పత్తికొండలో నారాయణరెడ్డిని అతి కిరాతకంగా నరికించింది చంద్రబాబు కాదా?. తాడిపత్రి ప్రభుత్వ కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్‌ను విజయ భాస్కర్‌రెడ్డిని నరికి చంపిన ఘటన నిజం కాదా?. చంద్రబాబు పాలన కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డగోలుగా చంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజకీయ నాయుడు వంగవీటి రంగ, ఐఏఎస్ అధికారి రాఘవేంద్ర రావు వీరందరు చంద్రబాబు హయంలోనే చనిపోయారు. చంద్రబాబు పాలనలో లా అండ్ ఆర్డర్ ఉందా?.
చంద్రబాబు ఇచ్చే మూడు వెలకు మోసపోకండి..
చంద్రబాబు అన్యాయాలు చేస్తారు, మోసాలు చేస్తారు.. ఎన్నికల వచ్చేసరికి రోజుకో డ్రామా, రోజుకో కథ అల్లుతారు. రాబోయే 20 రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. మనం చంద్రబాబు ఒక్కరితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేస్తున్నాం. ప్రతీ ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి.
చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. మీరంతా నాన్నగారి పాలన చూశారు. నాన్నగారి కంటే గొప్ప పరిపాలన ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాం. ఎమ్మెల్యేగా వెంకట్‌ను, ఎంపీగా రెడ్డప్పను దీవించమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదించమ’ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment